కశ్మీర్ లో ఉగ్ర మూకల దుశ్చర్య..మహారాజ్ సినిమా చూశారా!.. బ్రహ్మయ్య హత్య కేసు పై హోం మినిస్టర్ కు వినతి..దళితుల స్మశానం ఆక్రమణ.. హత్రాస్ బాధితులకు జమాతే సంస్థ ఆర్థిక సహాయం.. నల్లగుంట్లలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి ఎస్ఎఫ్ఐ…

👉 కశ్మీర్ లో ఉగ్ర మూకల దుశ్చర్య… అమరులైన ఐదుగురు జవాన్లు! కశ్మీర్ లో మరోసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి.. సైనిక వాహనంపై అకస్మికంగా దాడి చేశాయి.. కశ్మీర్ లో మరోసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయాయి.. సైనిక వాహనంపై అకస్మికంగా దాడి చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు చెబుతున్న ఈ దాడిలో… సైనిక వాహనంపైకి గ్రనేడ్ విసిరి, అనంతరం కాల్పులు జరిపి, సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అంటున్నారు. ఈ ఘటనలో 10 మందికి గాయాలవ్వగా… వారిలో ఐదుగురి పరిస్థితి విషమించి మృతి చెందారు! జమూ కశ్మీర్ లో భారత సైనికులపై ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా సైనిక వాహనంపై గ్రనేడ్ తో దాడి చేసి, కాల్పులు జరిపారు. కఠువా జిల్లాలోని మారుమూల ప్రాంతం మచేడీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మాచేడి – కిండ్లీ – మళార్ రోడ్డు మార్గంలో ట్రక్కులో వెళ్తూ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రమూకలు గ్రనైడ్ విసిరి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన 10 మందిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన అధికారులు.. అనంతరం ఆ ఐదుగురూ మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన జవాన్లకు ఆర్మీ అస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మృతిచెందిన వారిలో జూనియర్ కమీషన్డ్ అధికారి ఉన్నట్లు వెల్లడించారు.మరోపక్క ఈ కాల్పుల ఘటన అనంతరం పోలీసులు, పారామిలటరీ దళయం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగారు. దీంతో… ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో… అదనపు బలగాలకు అక్కడికి చేరుకుని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు వివరించారు. ఇక, ముగ్గురు ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని.. వారి వద్ద భారీ స్థాయిలో ఆద్యుధాలు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఈ దాడికి పాల్పడింది తామే అని పాకిస్థాన్ కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అనుబంధ ముఠా అయిన కశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది.

👉 మహరాజ్ సినిమా!!!..
చరణసేవ పేరుతో మహిళలని వంచించే దురాచారంకి వ్యతిరేకంగా సంఘ సంస్కర్త కర్సన్ దాస్ చేసిన పోరాటమే మహరాజ్ సినిమా!చాలా మంచి సినిమా !
తప్పక చూడవలసిన— రేకా చంద్ర శేఖర రావు.
(హిందీ నుండి తెలుగు డబ్బింగ్ చేయబడిన సినిమా).

*1860 ల కాలంలో ముంబయి ప్రాంతంలో జరిగిన కథ.
దేవాలయ ప్రధాన పూజారి మహరాజ్ అంటే విపరీతమైన ఆరాధన, భక్తి కలిగి ప్రజలు ఉండేవారు. వారి అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని యువతులలో తనకు నచ్చిన వారిని చరణ సేవకు ( పాద సేవకు) ఆహ్వానించే వాడు మహరాజ్. ఆహ్వానించిన స్త్రీలను మాయమాటలు చెప్పి వంచించి అనుభవించే వాడు. తాను చేసే చరణ సేవను చూడడం కూడా పుణ్యకార్యంగా ప్రజలు భావించి డబ్బులు చెల్లించి, అక్కడ మహరాజ్ చేసే శృంగార చర్యలను తన్మయత్వంతో చూసే వారు. తమ కుటుంబ యువతులను చరణ సేవకు పిలిచినందుకు ఆ కుటుంబ సభ్యులు పాయసం వండుకుని సంతోషంగా తినే వారు.👉కర్సన్ దాస్ అనే యువకుడు చిన్నప్పటి నుండి ప్రతిదీ ప్రశ్నించే స్వభావంతో ఎదుగుతాడు. అందరినీ మనుషులుగా చూస్తాడు. దళితుల పట్ల అనుసరిస్తున్న అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు.
ఆ కర్సన్ దాస్ కిషోరి అనే యువతి ఇద్దరూ ప్రేమించు కుంటారు. కిషోరికి దైవ భక్తి చాలా ఎక్కువ. తన దైవ భక్తి కర్సన్ దాస్ మీద ప్రేమ కన్నా ఎక్కువ అని కూడా చెబుతుంది.👉మహరాజ్ ఒక రోజు కిషోరి అందాన్ని చూసి మోజు పడి తన చరణ సేవకు ఆహ్వానిస్తాడు.ఆ విషయం ఎంతో సంతోషంగా
ఆ కుటుంబం అతని చరణ సేవకు కిషోరిని పంపుతుంది, వారు పాయసం వండుకుంటారు.
ఈ సంగతి తెలిసిన కర్సన్ దాస్ మహరాజ్ మందిరానికి వెళతాడు,అక్కడ మహరాజ్ చేస్తున్న శృంగార చేష్టలు చూసి ,కిషోరిని హెచ్చరించి బయటకు రమ్మని అరుస్తాడు కర్సన్ దాస్.కిషోరి తల ఎక్కిన మత పిచ్చితో నేను రాను , నువ్వు వెళ్ళు అంటుంది. కర్సన్ దాస్ కోపంతో , బాధతో వెళ్ళి పోతాడు.మహారాజ్ కిషోరిని నా ఇష్ట సఖిగా వుంటావా! అంటే కిషోరి ఎంతో సంతోష పడుతుంది.కర్సన్ దాస్ నీతో నాకు ఏమీ సంబంధం లేదు, అప్పటికే పెద్దలు వారి ఇద్దరికీ కుదిర్చిన
జరగవలసిన పెళ్ళిని రద్దు చేసుకుంటున్నాను అంటాడు . ఆ విషయం కర్సన్ దాసు ఇంట్లో – తన సంరక్షకుడు అయిన మేనమామతోవాగ్వాదానికి దారి తీస్తుంది.పెళ్ళి ఎందుకు రద్దు చేసుకుంటావు,ఈ ఆచారం తరతరాలుగా జరుగుతున్నదే, మీ అత్త ,మీ పెద్దమ్మ అందరూ అలా మహరాజ్ చరణ సేవ చేసిన వారే అంటాడు.ఈ విషయమై జరిగిన వాద వివాదాల ఫలితంగా కర్సన్ దాస్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి పోతాడు.
ఒక రోజు కిషోరి మహరాజ్ ఇంటికి వెళుతుంది,తలుపుల దగ్గర ఉండగానే మహరాజ్ మాటలు వినపడతాయి. “ నువ్వు నా ఇష్ట సఖిగా వుంటావా !”
అన్న మాటలు విన పడతాయి. ఆశ్చర్యంగా లోపలకు తొంగి చూస్తుంది కిషోరి. అక్కడ ఆ మాటలు మహరాజ్ అంటున్నది తన సొంత చెల్లెలుతో అని తెలిసి , కిషోరి తీవ్ర ఆగ్రహంతో తన చెల్లెలు చేయి పట్టుకుని ఈడ్చుకుని ఇంటికి తీసుకెళుతుంది.అక్కా! నేను తప్పు ఏమి చేశానని అడుగుతుంది.మహరాజ్ ఎంత మోసం చేస్తున్నాడో నీకు తెలియడం లేదు అని కిషోరి అంటుంది.
చెల్లెలుకు జరుగుతున్న మోసాన్ని అర్ధం చేయించుతుంది.
ఆ తర్వాత కర్సన్ దాస్ తిరస్కృతికి గురయిన కిషోరి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటికే కిషోరిలో పొరపాటు లేదు మహరాజ్ వంచనకు గురయిందని అర్ధం చేసుకుని ఆమెను స్వీకరించాలి అని కర్సన్ దాస్ ఆలోచిస్తుంటాడు , అప్పుడు జరిగిన కిషోరి ఆత్మహత్య సంఘటన కర్సన్ దాస్ జీవితాన్ని మార్చేసింది.
తాను మహారాజ్ మోసాలను ప్రజలకు చెప్పి చైతన్య పరచాలి అనే దృఢమైన నిర్ణయానికి కర్సన్ దాస్ వస్తాడు.👉అక్కడ నుండి కర్సన్ దాస్ మహరాజ్ కి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మహరాజ్ పెట్టిన ఎన్నో ఇబ్బందులు , కష్టాలు ఎదుర్కుని చివరకు విజయం సాధించాడు అన్న కధ సినిమాలో చూడవలసిందే!
ఆనాటి బ్రిటీషు జడ్జీలు ఎంత న్యాయబద్దంగా ఉండే వారు అనేది కూడా మనకు అర్ధం అవుతుంది. ఈ నాటి మన న్యాయ వ్యవస్త ఎంత డొల్లగా ఉంటున్నదో మనకు తెలిసినదే!కోర్టులో మహరాజ్ తరతరాలుగా మా దగ్గరకు కన్యలను పంపడం దైవ కార్యంగా ప్రజలు భావిస్తారని, పెళ్ళయిన మొదటి మూడు రోజులు వధువులను మేము అనుభవించి పంపాలని ప్రజలు కోరుకుంటారు అని చెప్పిన విషయాలు ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మనకు అర్ధం అవుతుంది. ఇది దురాచారం అని కర్సన్ దాస్ ఎలుగెత్తి చాటి తన మీద మోపిన పరువు నష్టం దావాలో గెలుస్తాడు.జడ్జీలు ఇది చాలా దురాచారం అని ఖండిస్తారు. తర్వాత కాలంలో ఇలాటిదురాచారాన్ని రద్దు చేస్తూ చట్టం చేస్తారు.కోర్టు విచారణలో విశృంఖల వ్యభిచారి అయిన కారణంగా ప్రధాన పూజారి మహరాజ్ కి సిఫిలిస్ వ్యాధి అని బయటపడుతుంది.
ఈ సినిమా చిత్రీకరణ చాలా సహజంగా ఉంది.
150 సంవత్సరాల నాటి ముంబయి వాతావరణాన్ని సినిమాలో చూపించారు. మహరాజ్, కర్సన్ దాస్, కిషోరిల పాత్రలు చేసిన వారి నటన చాలా బావుంది. తక్కువ పాత్రలతో మంచి సినిమా తీశారు.
దీనిని Net flix లో చూడవచ్చును.
150 సంవత్సరాల నాడు ఎలాటి దురాచారాలు ఉండేవి, వాటిని రూపుమాపటానికి సంఘ సంస్కర్తలు ఎంత శ్రమకోర్చి కష్టపడ్డారు అనే విషయాలు ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తాయి.

👉కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య హత్య జరిగి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ 8వ తేదీన వెలగపూడి లోని సచివాలయంలో హోమ్ మినిస్టర్ అనితను దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక కలసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది
ఈ సందర్భంగా హోంమినిస్టర్ అనిత మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్టు చేసే వైపుగా చర్యలు తీసుకుంటామని ఐక్యవేదికకు హామీ ఇవ్వడం జరిగినది.కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులైన బహుజన డెమొక్రటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు డెన్నిస్ రాయ, భీమ్ భారత్ రాష్ట్ర కార్యదర్శి పాగళ్ల ప్రకాష్ ,భారత్ బచావో రాష్ట్ర నాయకులు సమతా సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు రాష్ట్ర నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు బీసీ నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు బీసీ మహిళా సంఘం నాయకురాలు విజయలక్ష్మి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వేల్పురి నరసింహ రావు చారువాక యూత్ రాష్ట్ర నాయకులు డేవిడ్ విలియమ్స్ తోపుడుబండ్ల సంఘ నాయకులు తన్నీరు సాంబయ్య బహుజన సామాజిక విశ్లేషకులు సాగు మాల్యాద్రి నాదెండ్ల బ్రహ్మయ్య సతీమణి సామ్రాజ్యం భీమ్ సేన రాష్ట్ర నాయకులు నీలాంబరం అలాగే దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ న్యాయవాది సికా సురేష్ బీసీ మహాజన సభ నాయకులు ఉగ్గం సాంబశివరావు ప్రజా పోరు నాయకులు దేవా తదితర నాయకులు పాల్గొనడం జరిగినది.

👉ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన హిందూ భక్తుల కుటుంబాలకు 10000,గాయపడిన వారికి 5000 ఆర్థికసహాయం చేసిన జామియత్ ఉలమాయే హింద్.
ఈ కార్యక్రమాన్ని మనసులను కలిపే కార్యక్రమంగా మౌలానా అర్షద్ మదని తెలిపారు.
👉డబ్బులిస్తామని కిడ్నీ మాయం..
విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగుచూశాయి..ఆర్థిక కష్టాల్లో ఉన్న మధుబాబుకు భాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు..
కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని ఒప్పందం చేసుకున్నాడు..ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు,అయితే కేవలం రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు..మిగిలిన డబ్బు గురించి అడిగితే
బెదిరింపులకు దిగారని గుంటూరులోని ఎస్.పి
కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు..

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం