కేజ్రీవాల్ దూకుడు :డిఫెన్స్ లో బీజేపీ !..బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయి-మాజీ ఐఎఎస్ అధికారి,లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్..ఘనంగా సుందరయ్య వర్ధంతి..గొడవలు,అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు-జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్..ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్..కర్నూలులో ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి..ప్రకాశం జిల్లాలో పలుచోట్ల కార్టన్ సెర్చ్..

కేజ్రీవాల్ దూకుడు : డిఫెన్స్ లో బీజేపీ !

అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న అప్టూ డేట్ పాలిటిక్స్ తో ఎన్డీయే కూటమికి కొత్త ట్రబుల్స్ వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న అప్టూ డేట్ పాలిటిక్స్ తో ఎన్డీయే కూటమికి కొత్త ట్రబుల్స్ వస్తున్నాయి.మొదటి మూడు దశల పోలింగ్ సమయానికి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.ఆ తరువాత ఆయన ఎన్నికల ప్రచార సభలలో మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా చెలరేగిపోతున్నారు.తన అమ్ముల పొదిలో ఎన్నో అస్త్రాలను తీసుకుని వచ్చిన ఆయన ఒక్కో దానిని పాశుపతాస్త్రం చేసి బీజేపీ మీద వరసగా సంధిస్తున్నారు. ఆయన రాకతో ఆయన ప్రచార ధాటితో ఇండియా కూటమికి సరికొత్త జోష్ వచ్చింది. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఏపక్షంగా సాగించాలనుకున్న ప్రచారానికి గట్టి బ్రేకులు వేసినట్లు అయింది.కొన్ని సందర్భాల్లో బీజేపీ డిఫెన్స్ కూడా పడుతోంది. కాషాయ దళం ఎపుడూ విపక్షాన్ని డిఫెన్స్ మోడ్ లో ఉంచి తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది. విపక్షాలు ఆ వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న వేళ కాగల కార్యాన్ని బీజేపీ చక్కగా నెరవేర్చుకుంటుంది.ఈసారి మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. బీజేపీని సక్సెస్ ఫుల్ గా డిఫెన్స్ లోకి నెట్టడంలో కేజ్రీవాల్ మంచి టాలెంట్ ని చూపిస్తున్నారు.ఆయన సంధిస్తున్న ప్రశ్నలు కానీ ఆయన చూపిస్తున్న దూకుడు కానీ అధికార ఎన్డీయే కూటమికి ఇబ్బందిగానే మారుతోంది.నిజానికి 543 ఎంపీ సీట్లు ఉన్న దేశంలో ఆప్ పోటీ చేస్తున్నవి జస్ట్ 22 ఎంపీలు మాత్రమే. ఇక ఢిల్లీ పంజాబ్ లలో ఆప్ అధికారంలో ఉంది.గుజరాత్, యూపీ వంటి చోట్ల తన ప్రభావాన్ని బాగా చూపిస్తోంది. రెండేళ్ళ క్రితం జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి పోటీ చేసి ఏకంగా ఏడు శాతం ఓట్లను సాధించింది.ఈసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మోడీ అమిత్ షాల సొంత రాష్ట్రంలోనే కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారు.ఇక ఆయన ఎన్నికల ప్రచారంతో బీజేపీ ఎంతో కొంత ఆత్మ రక్షణలో పడినట్లుగా తెలుస్తోంది. మోడీ అమిత్ షాల వల్ల బీజేపీలోని సీనియర్లు ఎలా ఇబ్బందులు పడ్డారు.ఎంత మది తెర వెనక్కి నెట్టబడ్డారు అన్నది కేజ్రీవాల్ సభలలో ఏకరువు పెడుతున్న తీరుతో బీజేపీలోనూ అలజడి రేపుతున్నారు. సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషీ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.అలాగే నితిన్ గడ్కరీ,కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప సహ దేశంలోని సీనియర్ లీడర్లకు చాకచక్యంగా మోడీ షా ద్వయం పక్కన పెట్టగలిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. తాను గత ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని అప్పట్లో మోడీ మళ్ళీ గెలిస్తే అమిత్ షా దేశానికి హోం మంత్రి అవుతారు అని చెప్పాను అంటూ కేజ్రీవాల్ గుర్తు చేశారు.ఈసారి మోడీని గెలిపిస్తే అమిత్ షా దేశానికి ప్రధాని అవుతారు అంటూ కేజ్రీవాల్ చేస్తున్న ప్రచారం బీజేపీ ఎన్నికల ప్రచార రోడ్ మ్యాప్ నే పూర్తిగా మలుపు తిప్పేసింది. దాంతో పాటుగా రాజ్ పుట్ వర్గాలను ఆయన వెనకేసుకుని వస్తున్నారు.ఆ వర్గానికి చెందిన యోగీని సీఎం పదవి నుంచి దించేస్తారని కూడా జోస్యం చెబుతున్నారు. దీంతో బలమైన రాజ్ పుట్ ఓట్లు ఇండియా కూటమి వైపుగా ట్రావెల్ కావడానికే అరవింద్ కేజ్రీవాల్ ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.దేశంలో బీజేపీని ఎదుర్కోనేది ఆప్ మాత్రమే అని అందుకే తమ పార్టీని లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సడెన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నికల ప్రచారాన్ని కీలక మలుపు తిప్పిన కేజ్రీవాల్ క్రేజ్ ఉత్తరాదిన బాగా పెరిగిపోయింది.ఆయనను తమ సభలకు పిలిపించుకోవాలని కూటమి నేతలు తాపత్రయపడుతున్నారు.అదే సమయంలో ఆయన రాకతో ఇండియా కూటమి గ్రాఫ్ కూడా పెరిగినట్లు అయింది.ఈసారి వచ్చేది ఇండియా కూటమే బీజేపీకి జస్ట్ రెండు వందల సీట్లు మాత్రమే అంటూ ఆయన చెబుతున్న జోస్యం కమలనాధులకు కలవరం రేపుతోంది.ఈ అరవిందుడిని ఎలా ఎదుర్కోవడం అన్నదే కమలనాధులకు ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా మారిందని అంటున్నారు.లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఎన్నికల ముఖ చిత్రాన్ని కేజ్రీవాల్ మలుపు తిప్పుతున్నారని అంటున్నారు.

👉విజయవాడ..ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా‌ జరుగుతున్నాయని మాజీ ఐఎఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి ఎస్ ఆర్ కె ఆర్.విజయ్ కుమార్ ఆరోపించారు.ఎలక్షన్ జరిగిన తర్వాత ముడూ జిల్లాల్లో హింస జరిగిందని పోలీసు అధికారులను, ఎస్ పి లను సస్పెండ్ చేశారని పల్నాడు కలెక్టర్ ను మాత్రం ట్రాన్ఫర్ చేశారు ..మిగిలిన వారిని సస్పెండ్ చేశారని రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలి..కాని దానిలో వివక్ష చూపించడం అధికార యంత్రాంగం కు . తగదన్నారు. ఎప్పుడు

ఏ‌సంఘటన జరిగినా నోరు మెదపని బలహీనవర్గాల వారే బలవుతున్నారని,ఎలక్షన్ ముందు ముగ్గురు కలెక్టర్లను మార్చారు. ఎందుకు మార్చారో. కారణాలు ఎవరికి తెలియదు..పల్నాడు కలెక్టర్ శివ శంకర్ ను మార్చారు. ఎందుకు మార్చారో చెప్పడం లేదు.. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలి చేయడానికి ఎస్ సి ఎస్ టి అధికారులే ఉంటారా ఎలక్షన్ కమిషన్ మార్చిన నలుగురు కలెక్టర్లలో ముగ్గురు ఎస్ సి, ఎస్ టి అధికారులేనని,పేదల కోసం, బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.పల్నాడు జిల్లా‌ కలెక్టర్ గా శివ శంకర్ ను తిరిగి కొనసాగించాలి ..లేదా శివశంకర్ చేసిన తప్పు చూపించాలని డిమాండ్ చేశారు.తిరుపతి లో కారు తగలపెడితే చర్యలు లేవు..లా అండ్ ఆర్డర్ సిచ్చువేషన్స్ కు కలెక్టర్ ను ఎలా‌ బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.సిఎస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రాజాబాబు, లక్ష్మీ షా, శివ శంకర్ బదిలీలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.వీరి బదిలీలపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

👉ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పోలీస్ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్..సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఆదివారం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో “మాబ్ ఆపరేషన్”మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయంలో క్రౌడ్ కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇస్తామని, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగిస్తామని, తర్వాత లాఠి చార్జ్ చేపడతామని,ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట,ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేస్తామని జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు,అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా 10 ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందని,అదే విధంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని, పలు గ్రామాల్లో ఆర్మ్స్ తో ఒక మొబైల్ పార్టీ తిరుగుతుంటాయని తెలిపారు.కార్యకమ్రంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు, ఎఆర్ డిఎస్పీ చంద్ర శేఖర్,ఒంగోలు వన్ టౌన్ సీఐ అలీఖాన్,ఆర్ఐలు,ఆర్.ఎస్.ఐ,సిబ్బంది పాల్గొన్నారు.

👉కర్నూలు : కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో “గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి”చెందారు. వారిలో ఇద్దరి మృతదేహాలు చెరువులో ఉన్నాయి. మరో మహిళ మృతదేహం చెరువు గట్టుపై ఉంది.ప్రమాదవశాత్తు వీరు మృతి చెందారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతి చెందిన మహిళల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం… కర్నూలు మండలం గార్గేయపురం సమీపంలోని నగరవనం వద్ద చెరువులో ఇద్దరి మహిళల మృతదేహాలు నీటిపై తేలియాడుతూ ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అదే చెరువు గట్టుపై గాయాలతో మరొక మహిళ మృతదేహం కనిపించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీములను రప్పించి ఆనవాళ్లను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జిల్లా సర్వజన వైద్యశాలకు తరలించారు. చుట్టుపక్కల వారిని విచారించినా ఆ మహిళలు ఎవరన్నదీ తెలియరాలేదు. ఈ ఘటన ప్రమాదవశాస్తు జరిగిందా? లేక ఎక్కడో హత్య చేసి మృతదేహాలను ఇక్కడ ఇలా పడేశారా? లేదా? ఇక్కడే హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతర జిల్లాలకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ మధ్య ఎక్కడైనా మహిళల మిస్సింగు కేసులు ఉన్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన కర్నూలు రేంజ్‌ డిఐజి, ఎస్‌పి..ఘటనా స్థలాన్ని కర్నూలు రేంజ్‌ డిఐజి సిహెచ్‌.విజయరావు, జిల్లా ఎస్‌పి జి.కృష్ణకాంత్‌ పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముగ్గురు మహిళల మృతదేహాలు ఒకేసారి బయటపడడంతో లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు జిల్లా అడిషనల్‌ ఎస్‌పి, డిఎస్‌పి ర్యాంకు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఈ నివేదిక, సాంకేతిక అంశాల ఆధారంగా ఈ కేసు నిగ్గు తెలుస్తామని చెప్పారు. వారి వెంట అడిషనల్‌ ఎస్‌పి నాగరాజు, డిఎస్‌పి విజరు శేఖర్‌, తాలూకా సిఐ శ్రీధర్‌, నాలుగో పట్టణ సిఐ శంకరయ్య ఉన్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భార్యా భర్తకు పోస్టింగ్..

గుంటూరు: ఆ భార్యా భర్తలు ఐపీయస్ అధికారులు.. వీరిద్దరిని కూడా అదే ఉమ్మడి జిల్లాలో ఎస్పీలుగా ప్రభుత్వం నియమించింది. వారే పల్నాడు, బాపట్ల జిల్లాల ఎస్పీలుగా భార్య భర్తలు మల్లిక గర్గ్, వకుల్ జిందాల్లు. భార్యా భర్తలు ఇద్దరూ అఖిల భారత సర్వీసుల అధికారులైతే వేర్వేరు ప్రాంతాల్లో కొలువు తప్పదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే ఇద్దరికి పోస్టింగ్ రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

👉నేటి తరానికి సుందరయ్య ఆదర్శం కావాలి:

నేటి తరానికి సుందరయ్య జీవితం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ప్రకాశం జిల్లా ఒంగోలు, మార్కాపురం, రాయవరం,గిద్దలూరు,పెద్ద దోర్నాల కనిగిరి, జరుగుమల్లి దర్శి పామూరు, చీమకుర్తి వెనిగండ్ల రామలింగాపురం,కొండపి  మిట్టపాలెం,గుడిపాడు,సింగరాయకొండ, తదితర పట్టణాలలో గ్రామాలలో జెండావిష్కరణ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా నాయకులు జాల అంజయ్య, సయ్యద్ హనీఫ్ జీవి కొండారెడ్డి, మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి సుందరయ్య అని ఆయన ఆశయాలను నేటితరం ఆచరించాలన్నారు. చిన్నతనంలోనే అంటరాంతనం,అస్వృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. రాజకీయాలు అంటేనే డబ్బులతో ముడిపెట్టి ఎన్నికల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ తరుణంలో ఆదర్శ విలువలతో అభ్యుదయ సమాజం కోసం తన ఆస్తిపాస్తులను ప్రజా ఉద్యమాలకోసం ఖర్చు చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు.

👉ప్రకాశంజిల్లా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో తెల్లవారుజామునుంచి ఏకలవ్య, ఎస్టేట్ కాలనిలలో ఆకస్మిక సొదాలు నిర్వహిస్తున్న రూరల్ ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్…

👉ప్రకాశంజిల్లా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆద్వర్యంలో తెల్లవారుజాము నుంచి టైలర్స్ కాలనిలో ఆకస్మిక సొదాలు నిర్వహించారు.ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది.ఈక్రమంలో పొదిలి టైలర్స్ కాలనిలో కార్బన్ సర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?? మారణాయుధాలు ఎమైనా వున్నయా అనే కోణం లో సొదాలు కొనసాగుతున్నాయి.ఈ సొదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని 26 బైకులను స్వాధినం చేసుకున్నట్లు మల్లిఖార్జున్ రావు తెలిపారు.ఈ సొదాలు ఇంకా కొనసాగుతాయని శాంతి,భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.ఈ సొదాలలో పొదిలి,కొనకనమిట్ల,తర్లుపాడు ఎస్సైలు పాల్గొన్నారు.👉 శిoగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ దాచేపల్లి రంగనాథ్ ఎస్సై టి శ్రీరామ్ ఆధ్వర్యంలో కాలనీలో తనిఖీలు చేయగా ఎలాంటి పత్రాలు లేని 16 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త