ఓటర్లను భయపెట్టి ఓట్లు సంపాదించిన మోడీ…బాబు.. “పూరీ జగన్నాథుడు మోడీ భక్తుడని నోరు జారి లెంపలు ?..బెంగుళూరు రేపటిలో డ్రగ్స్!!! రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్!!.. “ఆరోగ్యశ్రీ నిలిపివేత!!!..అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు-కంభం సీఐ

👉ఓటర్లను భయపెట్టి ఓట్లు సంపాదించిన మోడీ…బాబు !..న్యూ ట్రెండ్ ని అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు క్రియేట్ చేశారు అని అంటున్నారు.

అదేంటి అంటే ఓటర్లను భయపెట్టి ఓట్లు పొందడం అని అంటున్నారు. ఈ ఓట్లు సంపాదించాలంటే శత కోటి మార్గాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఏమిటి అంటే విన్నపాలు చేసుకోవడం, తాము ఎలాంటి మంచి పాలన అందిస్తామో చెప్పడం, తమ నాయకత్వ లక్షణాల గురించి తాము చేసిన కార్యక్రమాల గురించి జనాలకు చెబుతూ వారి మెప్పు పొందుతూ ఉంటారు. ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారంలో అంతా అనుసరించే విధానం. కానీ ఈసారి జరుగుతోంది మాత్రం వేరే లెవెల్ అని అంటున్నారు. న్యూ ట్రెండ్ ని అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు క్రియేట్ చేశారని అంటున్నారు. అదేంటి అంటే ఓటర్లను భయపెట్టి ఓట్లు పొందడం అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జూన్ 4న కనుక ఫలితాలు వచ్చి కేంద్రంలో మోడీ అలాగే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక సంక్షేమ పధకాలు కానీ అభివృద్ధి కానీ అసలు అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివాదంలో చివరకు ఏం జరిగింది? అదేలా అంటే ఈ ఇద్దరి ప్రసంగాలు ప్రచార శైలిని బట్టే ఈ విధమైన మాట అంతా అంటున్నారు.మోడీ రెండు సార్లు కేంద్రంలో బీజేపీ తరఫున అధికారంలో ఉన్నారు. పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు.కానీ ఆయన తన ప్రచారంలో ఎక్కడా తాను ప్రధానిగా గత దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి.అదే సమయంలో ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంతే సంగతులు అంటూ ఓటర్లను విపరీతంగా భయపెడుతున్నారని అంటున్నారు.నిజానికి చూస్తే పదేళ్ళ పాలనలో జీ 20 సమ్మిట్ ని దేశంలో నిర్వహించామని చెప్పుకోవచ్చు.అలాగే దేశ ఆర్ధి వృద్ధి రేటుని అయిదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతామని చెప్పడంలేదు, విశ్వ గురు అన్న మాట లేదు, మేక్ ఇన్ ఇండియా అన్న మాట అంతకంటే లేదు, ఉద్యోగాల కల్పన గురించి కానీ దేశంలో సమస్యల గురించి కానీ ఏమీ లేదు. కేవలం కాంగ్రెస్ మీద విరుచుకుపడడం ముస్లిం మైనారిటీల పేరిట ఎమోషన్ క్రియేట్ చేయడమే ఒక తంతుగా సాగుతోంది అని అంటున్నారు.దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే చాలు ముస్లిం లకు దోచిపెడుతుంది అన్న మాటనే ఒక నినాదంగా మోడీ కానీ బీజేపీ కానీ చేసుకుందని అంటున్నారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తేవద్దు అంటూ ఓటర్లను బెదిరించడం జరుగుతోందని అంటున్నారు.ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన మంగళసూత్రాలను తెగనమ్మి ముస్లింల కోసం దోచిపెడుతుందని కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.ఇవన్నీ ఒక విధంగా ఓటర్లను భయపెట్టడమే అని అంటున్నారు.ఓట్లు దేశంలో ఉన్న వారే వేస్తారు కానీ మోడీ ప్రసంగాలలో ఎక్కడో ఉన్న పాకిస్థాన్ ఇష్యూని తెస్తున్నారు.అలాగే పీఓకే సమస్యను ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఇవన్నీ దేశాల మధ్య ఉన్న సమస్యలు వాటికీ ఓటర్లకు పెద్దగా సంబంధం లేవు.అయినా సరే భావోద్వేగాలను కలిగించడం కోసమే ఈ విధంగా బీజేపీ అధినాయకత్వం కానీ మోడీ కానీ పదే పదే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారని అంటున్నారు.ఎవరైనా ప్రజల వద్దకు వెళ్ళినపుడు మేము ఫలానా పని చేశామని చెబుతారు,మాకు ఈ కారణంగా ఓట్లు వేయండి అని అంటారు. కానీ కాంగ్రెస్ వస్తే దేశం సర్వ నాశనం అవుతుంది,లేదా ఫలానా వర్గం వల్ల ఇబ్బంది అవుతుంది అని బెదిరింపు ధోరణితో ప్రచారం చేయడం బీజేపీ నేతలకే చెల్లిందని అంటున్నారు.మరో వైపు చూస్తే ఏపీలోనూ ఇదే తరహా ప్రచారం సాగింది. దానిని ప్రారంభించిన వారు చంద్రబాబు. ఆయన కూడా తాను 2014 నుంచి 2019 దాకా ఏపీ సీఎం గా ఏమి చేశాను అన్నది ఎక్కడా చెప్పలేదు, ఎంత సేపూ వైసీపీ వస్తే ఏపీ నాశనం అవుతుందని చెబుతూ వచ్చారు. అంతే కాదు ఎపుడో అయిదేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుని పదే పదే ఎన్నికల సభలలో ప్రస్తావిస్తూ ఓటర్లను భయపెట్టేశారు.మళ్ళీ జగన్ ఏపీలో అధికారంలోకి వస్తే మీ భూములు దోచుకుంటారు అని కూడా బెదిరింపులు చేస్తూ పోయారు.అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం కేంద్రానిది.మోడీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక మోడల్ ప్రాజెక్ట్ ని ఏపీలో చేయించారు తప్పితే ఏమీ జరగలేదు. అయితే దాని మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఓటర్లను బెదిరించే కార్యక్రమానికి చంద్రబాబు దిగిపోయారు అని అంటున్నారు. జగన్ మళ్ళీ వస్తే మీ భూములు మీకు దక్కవని కూడా విపరీతమైన భయం పెంచుతూ ప్రచారం చేశారు. ఇలా ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అన్నది ఒక టాక్ గా ఉంది. మరి ఇదే తీరున ప్రచారం చేస్తూ పోతే దేశమో అభివృద్ధి మీద చర్చ అక్కరలేదు, సంక్షేమం గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదు అని అంటున్నారు. అయిదేళ్ళ పాలనకు సైతం అర్ధం ఉండదని అంటున్నారు. ఎన్నికల వేళకు ఏదో ఒక ఇష్యూని ముందుకు తేవడం అలా జనాలను భయపెట్టి ఓట్లు వేయించుకోవడమే చేస్తారు అని అంటున్నారు. ఈ విధంగా ఓటర్లను భయపెడితే అవరు ఓట్లు ఎంత మేరకు వేస్తారు అన్నది జూన్ 4న ఫలితాలు తేల్చనున్నాయి. అక్కడ కనుక సక్సెస్ అయితే రాబోయే రోజులలో ఇలా బెదిరింపు పాలిటిక్స్ కే కాలం వచ్చినట్లుగా అంతా భావించల్సి ఉంటుందని అంటున్నారు మేధావులు.

👉నోరు జారనేల .. దీక్ష పట్ట నేల ?! ‘‘నేను అనుకోకుండా ఈ తప్పు చేుశాను.కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. ‘‘అడుసు తొక్కనేల ..కాలు కడగ నేల’’ అని సామెత.ఒడిశాలోని పూరి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సంధర్భంగా బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘‘ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన పూరీ జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని’’ అన్నాడు. ఆడిన మాట, పోయిన కాలం వెనక్కి రావు. అసలే ఎన్నికల కాలం సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై బీజేడీ తీవ్రంగా విరుచుకుపడుతున్నది.సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.అయితే,తాను జగన్నాథుడిపై ప్రధాని మోడీకి ఉన్న భక్తి గురించి చెప్పే ప్రయత్నంలో పొరపాటున జగన్నాధుడు మోడీ భక్తుడు అని పొరపాటున అన్నానని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చాడు.పూరీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా ఛానెల్‌లకు బైట్ ఇచ్చాను, ప్రధాని నరేంద్ర మోడీ మహాప్రభు జగన్నాథ భక్తుడని ప్రతిచోటా అదే మాట చెప్పాను,అయితే అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాను అని అన్నాడు. ‘‘నేను అనుకోకుండా ఈ తప్పు చేుశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు.దీనికి పశ్చాత్తాపంగా జగన్నాథుడి కోసం ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని సంబిత్ పాత్ర ప్రకటించాడు.ఈ నేపథ్యంలో సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఇలాంటి వ్యాఖ్యలు మహాప్రభు జగన్నాథుడి పవిత్రతను దెబ్బతీస్తాయని అన్నారు.ఇది లక్షలాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని,రాజకీయాల్లోకి దేవతలను లాగడం మానుకోవాలని బీజేపీని’’ కోరారు.

👉 బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇందులో 150 మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, కన్నడ, తమిళ సినీ నటులు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో పలువురు నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు ఉన్నారని టాక్‌ నడుస్తోంది. వీరంతా రెండు రోజులపాటు ఫామ్‌ హౌస్‌ లోనే ఉన్నారని చెబుతున్నారు.ఇప్పటికే తాము ఈ రేవ్‌ పార్టీలో లేమని ప్రముఖ నటులు శ్రీకాంత్, హేమ, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ మాస్టర్‌ వెల్లడించారు. పోలీసులు మాత్రం హేమ ఉందని అంటున్నారు.కాగా బెంగళూరు శివార్లలో హైదరాబాద్‌ కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందిన జీఆర్‌ ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో పాల్గొన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.👉డాగ్‌ స్క్వాడ్‌ తో తనిఖీలు చేపట్టగా సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ లభించాయని పోలీసులు తెలిపారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసును కర్ణాటక పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.హైదరాబాద్‌ లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటం, డ్రగ్స్, రేవ్‌ పార్టీలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించడంతోనే పార్టీకి బెంగళూరును ఎంపిక చేసుకున్నారని..అది కూడా ఆ నగర శివార్లలో ఉన్న ఫామ్‌ హౌస్‌ ను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.‘సన్‌సెట్‌ టూ సన్‌ రైజ్‌ విక్టరీ’ పేరుతో ఒక వ్యాపారి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బర్త్‌ డే పార్టీ పేరిట రేవ్‌ పార్టీ జరిగిందని.. ఇందులో డ్రగ్స్‌ వినియోగించినట్టు సమాచారం.రేవ్‌ పార్టీ బాధ్యతలను అరుణ్‌ అనే వ్యక్తి నిర్వహించినట్టు తెలుస్తోంది. వాసు బర్త్‌ డే పార్టీకి డ్రగ్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌ కూడా హాజరయ్యారు.ఈ నేపథ్యంలో రేవ్‌ పార్టీ ఇచ్చిన వాసు గురించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. డ్రగ్‌ ప్లెడ్లర్‌ లతో అతడికి ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు.ఇప్పటికే అతడిపై ఉన్న పాత కేసుల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు.కాగా రేవ్‌ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ,రణధీర్, రాజ్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకుని..వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

👉 ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం..

అమరావతి: రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది..ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. మే 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న రూ.1,500 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది..సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని లేఖలో పేర్కొంది..

👉అర్బన్ కాలనీలో కార్బన్ సెర్చ్ లో భాగంగా జల్లెడ పట్టిన పోలీసులు..ప్రకాశంజిల్లా కంభం టౌన్ అర్బన్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం అర్ధవీడు బేస్తవారిపేట ఎస్సైలు, వారి సిబ్బంది సంయుక్తంగా కార్బన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.. 26 టూవీలర్ వాహనాలను స్వాధీనం చేసుకుని కంభం పోలీసు స్టేషన్ తరలించారు.వాహనాల ధ్రువపత్రాలు చెక్ చేసి వారికి జరిమానా విధించారు..

👉ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలి.. కంభం సీఐ కె రామకోటయ్య.. ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని కంభం సర్కిల్ సీఐ రామకోటయ్య కోరారు. కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు సహకరించిన కంభంబిపేట అర్ధవీడు మండలాల ఓటర్లను ఆయన అభినందించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఒకవేళ అల్లరులకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నీ మేరకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన లేదా మెజారిటీలపై బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అలాగే 9 నుండి 12 అంగుళాలకు పైగా పొడవు, రెండు అంగుళాల వెడల్పు కలిగిన మారణాయుధాలను, కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు..ఓట్ల లెక్కింపు తర్వాత ర్యాలీలు నిర్వహించడం బాణాసంచా కాల్చడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.👉అంతేకాక నిబంధనలు పాటించకుండా సరైన వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేని వాహనదారులు తప్పనిసరిగా తమ వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు కంభంబిపేటలలో కార్టన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు.అలానే మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆయనతోపాటు కంభం ఎస్సై పులి రాజేష్ పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం