👉 ట్విస్ట్.. పులివెందులపై పెరిగిన బెట్టింగ్లు..కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోతారు.. మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి ఖాయం.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయేలా వున్నారు.. ఇలా వైసీపీ చెబుతున్నా, పులివెందులలో వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి.? అన్న అయోమయం, వైసీపీ శ్రేణుల్లో షురూ అయ్యింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చే ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి వస్తాయ్.. అని టీడీపీ, జనసేన బలంగా చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్ మారింది. పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోతున్నారన్న ప్రచారానికి తెరలేచింది.కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అన్న చందాన, ‘కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు..’ అన్న ప్రచారానికి విరుగుడుగా, ‘పులివెందులలో వైఎస్ జగన్ ఓటమి..’ అనే ప్రచారానికి తెరలేపింది టీడీపీ. జనసేన కూడా ఈ వాదనతో గొంతు కలపడం గమనార్హం.నిజానికి, ఈసారి పులివెందులలో గెలవడానికి వైఎస్ జగన్ చాలా శ్రమించాల్సి వచ్చింది. వైఎస్ జగన్ సతీమణి భారతి, గడప గడపకీ వెళ్ళి, తన భర్తను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.👉మరోపక్క, పులివెందులలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, ఓటర్లకు డబ్బు పంపిణీ అనూహ్యమైన స్థాయిలో జరిగింది. ఓ వైపు జగన్ సోదరి షర్మిల నుంచి ఎదురవుతున్న తలనొప్పులు, ఇంకో వైపు కూటమి బలం.. ఈ రెండూ వైసీపీకి పులివెందులలో షాక్ ఇచ్చేలా వున్నాయ్.ఈ క్రమంలోనే, పులివెందుల ఫలితంపై బెట్టింగులు గత కొద్ది రోజుల్లో అనూహ్యంగా పెరిగాయి.వైఎస్ జగన్ ఓడిపోతారన్న కోణంలో బెట్టింగులు నడుస్తున్నాయట. భారీగా సొమ్ము చేతులు మారుతోందిట. ఉభయ గోదావరి, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో ఈ మేరకు బెట్టింగులు నడుస్తుండడం గమనార్హం.
👉మాచర్ల నియోజక వర్గంలో హై అలర్ట్ నెలకొంది…. 👉పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారట పోలీసులు. పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని సీరియస్ గా తీసుకుంది ఎన్నికల సంఘం.దీంతో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బృందాలుగా వీడి పోయి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం గాలిస్తున్నారట ఏపీ పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తెలియజేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తున్నది.
👉ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హత వేటు వేయాలి…ఈవీఏం లు పగలగొట్టిన అభ్యర్థులపై ఎన్నికల కమీషన్ కొరడా ఝలిపించాలి…జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్..ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నేత నేతి మహేశ్వర రావు.. డిమాండ్.
👉ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పోలింగ్ రోజున బూతుల్లోకి వెళ్లి ఈవీఏం ధ్వంసం చేసిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హత వేటు వేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నేత నేతి మహేశ్వర రావులు వేర్వేరు ప్రకటనలలో డిమాండ్ చేశారు.ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా లేదా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు రాచమార్గంగా పోలింగ్ బూతులోకి వెళ్లే అధికారాన్ని రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు.లోపలకెళ్లి ఓటింగ్ సరళి తదితర విషయాలు పరిశీలించాలే గాని ఈవీఎంలు పగలగొట్టడానికి కాదని పేర్కొన్నారు. అభ్యర్థి వ్యవహార శైలి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అతన్ని భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించేలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమీషన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధి, మాజీ విప్ అయినటువంటి పిన్నెల్లి ఇటువంటి ఘటనలకు పాల్పడటం హేయమైన చర్యన్నారు. భవిష్యత్తు ల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా గుంతకల్లు టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి మధుసుధన్ గుప్తా కూడా ఈవీఎం పగలగొట్టిన వీడియో చక్కర్లు గోడుతున్నాయని పేర్కొన్నారు.ఎన్నికల రోజు అభ్యర్థులు ఎక్కడైన ఇటువంటి ఘటనలకు పాల్పడుతే వారందరి పైన శాఖాపరమైన చర్యలతో పాటు శాశ్వత అనర్హత వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు.
👉ఇండోర్, మే 21: పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్ధి అనుమానాస్పద రీతిలో హాస్టల్ గదిలో మృతి చెందికనిపించాడు. విద్యార్ధి శరీరంపై చీర ధరించి ఉండటంతోపాటు ముఖానికి అమ్మాయిల మేకప్, కళ్లకు గంతలు కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. పైగా మృతుడి గదిలో రక్తపు మరకలు ఇది ఖచ్చితంగా హత్యేననే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.
పథకం ప్రకారం విద్యార్ధిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..👉మధ్యప్రదేశ్‌కి చెందిన పునీత్ దూబే (21) B.Sc అనే విద్యార్ధి ఇండోర్‌లోని రంజిత్ సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత గది నుంచి దుర్వాసన రావడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించిన పునీత్ వేషధారణ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. చీర ధరించి, మహిళల అలంకరణలో కనిపించాడు. పైగా పునీత్ కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహానికి సమీపంలో నేలపై కూడా రక్తపు మడుగు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పునీత్‌ది మృతి ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
👉 జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు..హైదరాబాద్:మే :22జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి.ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు ను వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది.ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయనున్నారు.
👉 బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇక ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఆదివారం రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం గమనార్హం. సుమారు 150 వరకు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారని.. పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఈ ఫామ్‌హౌజ్‌ను బుక్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు.👉 ఇక తాజాగా రేవ్ పార్టీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ వివరాలు..ఈ రేవ్ పార్టీలో దొరికిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని తెలుస్తోంది. ఈ పార్టీలో సుమారు 100-150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. బెంగళూరు పోలీసులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీనటులతో పాటు.. వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారని సమాచారం. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాముల ఎండీఎంఏతో పాటు గంజాయి వాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి.. పరీక్షలకు పంపారు పోలీసులు.సన్‌సెట్ టూ సన్ రైజ్ విక్టరీ పేరుతో వాసు బర్త్‌డే పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరితో పాటు టెక్కీలు, 25 మంది యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్ధిఖీ, రణధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు.👉ఇక హీరో శ్రీకాంత్ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి.కానీ తాను ఇలాంటి పార్టీలకు దూరం అని..ఇంట్లోనే ఉన్నానంటూ హీరో శ్రీకాంత్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో రిలీజ్ చేశారు.👉ఇక నటి హేమ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే.పార్టీకి వెళ్లిన హేమ.. తాను ఇంట్లో ఉన్నట్లు వీడియో రిలీజ్ చేసింది.అయితే హేమ పార్టీకి వచ్చిందని బెంగళూరు పోలీసులు తెలిపారు .
👉రూ 200 కోట్లకు శఠ గోపం ..పిల్లల చదువుకు, పెళ్లికి, ఇల్లు కొనుక్కుందామని కొంత డబ్బును దాచుకోవాలని అనుకుంటారు. సామాన్యుడికి ఒక్కసారే లక్షలు రావు కనుక.. కొంచెం కొంచెం డబ్బును కూడేసి.. చిట్టీల రూపంలో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇదే మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది………
👉కష్టపడి రూపాయి రూపాయి పోగేసి.. సేవ్ చేయాలని అనుకుంటాడు పేద, మధ్యతరగతి మానవుడు. తిని తినక కొంత డబ్బును వెనకేసుకుంటాడు. పిల్లల చదువుకో లేక అత్యవసరాలకు పనికి వస్తుందని కాస్త కూడబెడుతుంటాడు. అయితే బ్యాంకులో పెడితే..లాభం ఏమీ ఉండదని భావించి.. దాచిన డబ్బులను ఎవరికో ఒకరికి అప్పు రూపంలో ఇస్తుంటాడు. లేదా చీటీల రూపంలో డబ్బులు కడుతుంటాడు. వారి ఆశే కొంపలకు ముప్పు తెచ్చిపెడుతుంది. చిట్టీల పేరుతో లక్షలు, కోట్లను వసూలు చేసి.. ఆ తర్వాత పెట్టా బేడా సర్దేస్తున్నారు వ్యక్తులు, సంస్థలు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగినా కూడా పేరాశ.. సగటు మానవుడ్ని మోసపోయేలా చేస్తుంది.👉తాజాగా హైదరాబాద్‌లో ఓ చిట్ ఫండ్ కంపెనీ.. రూ. 200 కోట్ల ప్రజా డబ్బును తీసుకుని ఉడాయించింది. దీంతో చిట్టీలు కట్టిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. 510 మందిని పైగా మోసం చేసింది సదరు సంస్థ. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణీ బాల, మేక నేతాజీ భార్యా భర్తలు. సైదాబాద్‌లో నివసిస్తున్నారు. వాణీ హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (టెస్కాబ్)లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త మేకా నేతాజీ, కొడుకు శ్రీ హర్షలు శ్రీ ప్రియంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ స్థాపించారు. ఈ క్రమంలో వాణి బాల.. తన బ్యాంకుకు డిపాజిట్లు చేసేందుకు వచ్చిన కస్టమర్లతో మాటలు కలిపి.. ఎక్కువ వడ్డీ ఆశ చూపించి తమ సంస్థలో చీటీలు కట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. ఈ క్రమంలోనే తన ఆఫీసుకు దగ్గరలోనే మరో ఆఫీసును కూడా తెరిపించింది వాణీ బాల.తన వద్దకు వచ్చిన కస్టమర్లను అక్కడకు వెళ్లేలా ప్లాన్ చేసేది. అంతేకాకుండా తనతో వర్క్ చేసే అధికారులు, డీసీసీబీల సిబ్బంది, స్థానికులు,బంధువులు.. ఇలా తెలిసిన వారి చేత చిట్టీలు కట్టించింది. అలా 517 మంది నుండి రూ. 200 కోట్లు కాజేశారు. అయితే వాణీ బాల మరికొన్ని రోజుల్లో రిటైర్డ్ అవుతుండగా.. ఉన్నపళంగా సెలవులు పెట్టింది. అంతలో కంపెనీ సంస్థ కూడా మూత పడటంతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. అయితే ఇద్దరు ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో బోర్డు తిప్పేశారని అర్థం చేసుకున్న కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇందులో ఐదు వందల మందిని పైగా మోసం చేసి.. ఆ డబ్బులతో ఉడాయించారు. కాగా, దాచుకున్న డబ్బులు పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే..ఈ మోసం గురించి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వాణీ బాలను విధుల్లో నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
👉హింస-రహిత ప్రకాశం..శాంతియుత ఎన్నికలకు ధన్యవాదాలు..ఎ.ఎస్.దినేష్ కుమార్, ఐ.ఎ.ఎస్*కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి..ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఇదే శాంతి స్ఫూర్తితో రానున్న రోజుల్లో “హింస-రహిత ప్రకాశం” నిర్మాణం కోసం సహకరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.
👉రాచర్లలో కార్డెన్ సర్చ్.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలో బుధవారం గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్, రాచర్ల ఎస్ఐ హరిబాబు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చింగ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్లు లెక్కింపు సందర్భంగా ఎవరు కూడా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరిస్తూ కలిసిమెలిసి ఉండాలని ప్రజలకు సీఐ దాసరి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అల్లర్లు చేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ దాసరి ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటిది అల్లర్లు జరగకుండా ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు ముందస్తుగా కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నట్లు సిఐ దాసరి ప్రసాద్ వెల్లడించారు. ఈ కార్డన్ సెర్చ్ లో కొమరోలు ఎస్సై మధుసూదన్ రావు తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.