👉400 సీట్లు ఎందుకివ్వాలి? బీజేపీపై సామాజిక ఉద్యమాకారుల యుద్ధం!
”ఇప్పటి వరకు మీరు(ప్రజలు) చూసింది ట్రైల్ మాత్రమే.. అసలు కథ ముందుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు.ప్రస్తుతం దేశంలో జరుగుతున్నసార్వత్రిక ఎన్నికల పోలింగ్(ఇప్పటి వరకు ఐదు దశలు జరిగాయి. మరో రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉంది) ప్రక్రియలో ఊరూ వాడా .. బీజేపీ నేతలు.. తమకు 400 సీట్లు రావాలని.. ఇవ్వాలని కూడా..ప్రచారం చేస్తున్నారు. ఇది వస్తే.. దేశ గతిని మార్చేస్తామని కూడా చెబుతున్నారు. ”ఇప్పటి వరకు మీరు(ప్రజలు) చూసింది ట్రైల్ మాత్రమే.. అసలు కథ ముందుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఇక, కేంద్ర మంత్రి , బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా..ఇదే చెబుతున్నారు. తమకు 400 సీట్లు వస్తే.. పీవోకేను భారత్‌లో కలిపేస్తామని.. యూసీపీ(ఉమ్మడి పౌరస్మృతి )ని అమలు చేస్తామని అంటున్నారు. మంత్రి పదవికి లోకేష్ దూరం ? మొత్తంగా చూస్తే.. తమకు 400 స్తానాలు కావాలని కమల నాథులు కోరుతున్నారు.ఇక, ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు.. ఇండియా కూటమి సభ్యులు కూడా ప్రస్తావిస్తూ.. ఇదే జరిగితే.. అంటే బీజేపీకి 400 స్థానాలు కట్టబెడితే.. రాజ్యాంగాన్ని మార్చేస్తా రని, తద్వారా.. రిజర్వేషన్లుపోతాయని. ముస్లింలు పొరుగు దేశాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. వీరి ప్రచారంలో బీజేపీ దూకుడు ముందు ఇండియా కూటమి… కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నవి పెద్దగా ప్రజల మధ్యకు చేరడం లేదనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా సామాజిక ఉద్యమకారులు.. రోడ్డెక్కారు. వీరిలో ప్రముఖులు మేధాపాట్కర్, అరుణ్ రాయ్ వంటి వారు కూడా ఉన్నారు. 400 సీట్లు బీజేపీకి ఎలా వస్తాయని..ఎందుకు వస్తాయని.. ఎందుకు ఇవ్వాలని వీరు ప్రశ్నల పరంపర ఎక్కు పెట్టారు. కొన్ని మీడియా చానెళ్లకు ఎన్నికలకు ముందుగానే వీరు ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రచారం కాకుండా.. ప్రసారం కాకుండా కూడా..తొక్కి పెట్టినట్టు తెలిసింది. అయితే.. వీటికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా వీటిలో రెండు కోణాలను ఉద్యమకారులు ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి బీజేపీ ప్రభుత్వంలో అడ్డుకట్ట పడిందని.. రచయితలు.. మేధావులను కూడా అణిచేశారని వీరు చెబుతున్నారు.ఇక, ధరలు.. సామాన్యులపై మోపిన భారాలను వీరు ప్రస్తావిస్తున్నారు.వీటిని ప్రాతిపదికగా చేసుకుని.. గడిచిన ఎన్డీయే 10 ఏళ్లపాలనను కూడా.. వీరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో 12 మంది రచయితలు..హత్యకు గురయ్యారని తెలిపారు. అదేవిధంగా ఉద్యమకారులైన.. వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా వంటి వారిని వందల మందిని అరెస్టు చేసి జైలు పాలు చేశారని చెబుతున్నారు. ఇందుకోసమేనా 400 సీట్లు ఇవ్వాలి ? అనేది వీరి ప్రశ్న. మరోవైపు..సామాన్య జనాలపై ధరల భారం మోపారని చెబుతున్నారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేవరకు మధ్య ప్రతిదీ జీఎస్టీతో ముడిపడిన విషయాన్ని ఎత్తి చూపారు. ఇందుకోసమేనా..బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని నిలదీస్తున్నారు.అయితే.. వీరి విషయాలను.. వాదనలను ప్రధాన మీడియా స్రవంతులు ప్రసారం చేయకపోవడం గమనార్హం. 👉ఇక ఎన్నికల చివరి రోజు వచ్చేసరికి ఇతడు మనల్ని ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే మనల్ని గాలి పిలుచుకోవడం కూడా కష్టమే అంటాడేమో అని పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.ఒక ప్రధాని తాను ఎలా పాలిస్తాడు ఎంత అభివృద్ధి చేస్తాడు అన్న విషయంపై ఎన్నికల ప్రసంగాలు చేయాలి కానీ ఇలా మీ మంగళ సూత్రాల దొంగలు ఇస్తారు, ఇంట్లో కులాయి నల్లాలు చోరీ చేస్తారు, మీ ఇంటికి వచ్చే విద్యుత్తు కనెక్షన్ కట్ చేస్తారు అని బెదిరిస్తూ భయపెడుతూ ఎన్నికల ప్రచారాలు చేయడం 140 కోట్ల ప్రజలకే సిగ్గు చేటు అని నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలా చేసేవాడిని మానసిక సంతులన కోల్పోయిన వ్యక్తిగా పరిగణలోకి తీసుకోవాలని నెట్టింట విమర్శిస్తున్నారు.
👉టీడిపి తలపెట్టిన “ ఛలో మాచర్ల ” ప్రోగ్రామ్ కి ఎటువంటి అనుమతి లేదు..ఎస్పీ మాలిక గార్గ్..
పల్నాడు జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ ఆదేశాల మేరకు జిల్లాలో 144 CRPC సెక్షన్ అమలులో ఉన్నందున టీడీపీ వారు తలపెట్టిన “ ఛలో మాచర్ల ” ప్రోగ్రామ్ కి ఎటువంటి అనుమతులు ఇవ్వనందున టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సదరు ప్రోగ్రామ్ కి పాల్గొనటం, హాజరవటం,ర్యాలిగా వెళ్ళటం చెయ్యకూడదని అట్లు చేసిన ఎడల చట్ట ఉల్లంగన కింద నేరం కావున అటువంటి వారిపై చట్టపరమైన మరియు కటినమైన చర్యలు తీసుకుంటామని,జిల్లా ఎస్పి హెచ్చరించారు. టిడిపి నేతల గృహనిర్బంధం..మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను
గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు ..గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసు బలగాలను మొహరించారు.పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.అలాగేగొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
👉మాచర్ల పట్టణంలోని వినాయకుని గుట్టలోటిడిపి నాయకుల దాడి..వైసీపీకి చెందిన లుకయ్య(63) వృద్ధుడిపై దాడి…కేశవరెడ్డి అనుచరుడుగా పిలవబడే తోడిచర్ల విజయ్, తోడిచెర్ల యాకోబు మరికొందరు విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో వైసీపీకి చెందిన పొన్నూరు లుకయ్య(63) కీ తీవ్రమైన గాయాలయ్యాయి…..👉నిర్మల్ జిల్లాలో బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు*నిర్మల్ జిల్లాలోని సారంగా పూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు ఈరోజు తెల్లవారు జామున బోల్తా పడింది.అందులో ప్రయాణిస్తున్న 25 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్ తరలిస్తుండగా..అదిలాబా ద్‌కు చెందిన ఫర్హాన అనే యువతి మరణించినట్లు తెలిసింది. మరొ ముగ్గురి పరిస్థితి సైతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు సూచించారు…
👉జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,ఒకరి మృతి*నెల్లూరు జిల్లా…దుత్తలూరు సమీపం లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం,ఒకరి మృతి,నలుగురికీ తీవ్ర గాయాలు..ప్రయాణికులు ప్రకాశం జిల్లా CS పురం మండలం ఉప్పలపాడు,పామూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు…ప్రకాశం జిల్లా కు చెందిన కొందరు వ్యక్తులు తిరుమలకు వెళ్లి తిరిగి తమ స్వస్థలాలకు వెళుతుండగా దుత్తలూరు సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న వాహనం పాలవ్యాను ను ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించి నట్టు, నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం,మరణించిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి గా గుర్తింపు, వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
👉ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం*కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తు్న్నారు.బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగిందని సమాచారం.మృతులు లక్ష్మీ మరియు గోవర్ధిని హైద్రాబాద్ వాసులుగా గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణీకులను సమీప ఆస్పత్రికి తరలించారు.అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.👉 ప్రవేట్ బస్సులు ఆటోలు, ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నాయి.. అతి వేగం ఒక కారణం కాగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడము, ఆటోలో బస్సులో బైకులు నడిపే వారికి డ్రైవింగ్ నియమాలు తెలియకపోవడం ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు,. డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే సమయంలో రోడ్డు రవాణా శాఖ అధికారులు లైసెన్సులో పొందుతున్న వారికి కనీసం డ్రైవింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లైసెన్సులు జారీ చేస్తున్నారని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
👉 వీక్షణ సమావేశంలోపాల్గొన్న జిల్లా కలెక్టర్.. ..ప్రకాశం…జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యలయం లో ఎన్నికల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల భద్రతపై ముఖ్య ఎన్నికల అధికార సంఘం నిర్వహించిన విక్షణసమావేశంల జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ జిల్లా డి ఆర్ ఓ శ్రీలత .జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గోన్నారు