ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ-నారాయణ సంచలన వ్యాఖ్యలు!..ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు..జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

👉ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ… నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం అధికారులా, నేతలా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రధానంగా ఈసారి మాత్రం ఏపీలో భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఇక వీటితో పాటు పలు అప్రజాస్వామిక ఘటనలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పార్టీకి ఓటు వేశారంటూ వారి వారి ఇళ్లకు వెళ్లి రాళ్ల దాడి చేయడం.. వారంతా గంగమ్మ గుడిలో దాక్కోవడం.. ఈవీఎం లను ధ్వంసం చేయడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… జూన్ 4న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రాబోయే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో… సీపీఐ నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా… ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ.. కింది స్ధాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని నారాయణ వెల్లడించారు. ఇదే క్రమంలో… ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వీరిరువురి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఇదే క్రమంలో ఈసారి ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన నారాయణ… తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే ముఖ్యమంత్రులు కావాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు.

👉ఇలాంటి మహిళని చూసుండరు… కూతురి ద్వారా మైనర్ పిల్లల చేత వ్యభిచారం!…మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేపిచ్చి భారీగా డబ్బులు సంపాందిచిన యువతి.. పదవ తరగతి పిల్లలకి ఎర..డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రస్తుత సమాజంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు.

నేటికాలంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. వ్యభిచారాలు, డ్రగ్స్ సరఫరా వంటివి చేస్తూ భారీగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు. మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేసి…భారీగా డబ్బులు సంపాందిచింది. తాజాగా పోలీసులు దాడులు చేయడంతో ఈ కిలాడీ వ్యవహరం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

👉ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. మతాన్ని ఏకైక ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

👉జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దివంగత నటుడు హరికృష్ణ గారి చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి.. అతని తాతగారి పోలికలు ఉండటం వల్ల బాగా కలిసొచ్చి వెంటనే స్టార్ అయ్యాడు అని అంతా అనుకుంటారు.కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలబడింది లేదట. అందుకే కొత్త నటుల్లానే అతను కూడా బాగా కష్టపడాల్సి వచ్చిందట.కానీ ఎన్టీఆర్ ఆ కష్టాన్ని ఎప్పుడూ లెక్కచేయలేదట. ఆ స్వభావమే అతన్ని స్టార్ గా నిలబెట్టిందని అతని స్నేహితులు చెబుతూ ఉంటారు. ‘స్టార్ ఫ్యామిలీస్ నుండీ వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుంది’ అనుకునేవాళ్లు ఎక్కువ. కొంతవరకు అది నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు.అందుకే అతను చాలా స్పెషల్.ఒకానొక టైంలో అతని స్నేహితుడు,అతనితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత, ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్. అతని టాలెంట్ వల్లే ఈరోజు అతను స్టార్ అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నైపుణ్యం కలిగిన నటుడు. మొదటి నుండీ అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించింది లేదు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా..అతనికి ఇవ్వాల్సిన పారితోషికం నిర్మాతలు ఎగ్గొట్టారు.అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు.ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ అతను కొత్త నటుడులానే అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం