వైసిపి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు-‘వర్ల’..డ్రగ్స్,రేవ్ స్కాముల సూత్రధారులు టీడీపీ వాళ్ళే!..వైకాపా**మదనపల్లెలో యువకుడు దారుణహత్య**3 వారాల్లో ప్రపంచ యుద్ధం?..*లక్షలు పెట్టి రేవ్ పార్టీలకు ఎందుకెళ్తారు?

👉రాష్ట్రంలో వైసీపీ దుకాణం బంద్..నిశ్శబ్ద విప్లవంలో జగన్ అరాచక పాలన కొట్టుకుపోవడం ఖాయం..సజ్జల అవహన రాహిత్యం తో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు..ఆరోజే 32 చోట్ల రీపోలింగ్ కోరామని తెలిపిన వర్ల..

సీఎం జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ… వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.శుక్రవారం నాడు టీడీపీ నేతలు ఈసీని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు.అనంతరం వర్ల రామయ్యమాట్లాడుతూ.. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది, ఆ నిశ్శబ్ద విప్లవంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి కొట్టుకుని పోతున్నాడు.పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే సీఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలింగ్ బూత్ 202లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడు అక్కడ వీవీ ఫ్యాట్ స్లిప్‌లు బయటపడ్డాయి,అందులో 6 ఓట్లు వైసీపీకి.. 22 ఓట్లు టీడీపీకి పడ్డాయి.అవి చూసి పిన్నెల్లికి పిచ్చెక్కింది. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది,పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మాచర్లలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అక్కడ రాజ్యాంగ పాలన లేదు. ఈ ఎమ్మెల్యే మాకొద్దని ప్రజలు నిర్భయంగా ఓట్లు వేశారు.మాచర్లలో మొదలైన నిశ్శబ్ద విప్లవం విప్లవం రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాల్లోనూ వచ్చింది.ఆ నిశ్శబ్ద విప్లవంలో జగన్ అరాచక పాలన కొట్టుకొని పోవడం ఖాయం. జగన్ నిర్మించుకున్న అవినీతి, నేర సామ్రాజ్యాన్ని ప్రజలు కూల్చివేశారు.అల్లర్లు సృష్టించి సజావుగా కౌంటింగ్ జరగకుండా ఉండేందుకు ఏజెంట్లను కిడ్నాప్ చేసి గందరగోళం సృష్టించేందుకు సజ్జల కుట్ర పన్నారు.ఇక వైసిపి కుట్రలు చెల్లవు.రాష్ట్రంలో వైసీపీ దుకాణం బంద్ అయింది, పోలీసులు వైసిపి నేతల మాట వినే పరిస్థితిలో లేరు. ఇకనైనా సజ్జల రామకృష్ణారెడ్డి,డిజిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలి, నాడే 32 చోట్ల రీపోలింగ్ కోరాం…సజ్జల అవగాహన రాహిత్యంగా మాట్లాడటం మానుకోవాలి. ఓడిపోతున్నామన్న నిరాశ నిస్పృహలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఓడిపోతున్నామని తెలిసి చాలామంది వైసిపి నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. వై నాట్ 175 అన్న పెద్దలు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా అని ఆందోళన చెందుతున్నారు.మరి కొంతమంది ప్రతిపక్ష హోదా అయినా అన్న దక్కుతుందా అని ఆందోళనలో ఉన్నారు. వైసీపీ కార్యాలయాలు చిన్నబోయి ఒకరిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్నారు.వైసిపి ఖేల్ ఖతం అయిందని ఆ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైంది. పోలింగ్ ఏజెంట్లుగా ఉండటానికి కూడా ఆ పార్టీకి కార్యకర్తలు కరువయ్యారు. పోలీసులు కూడా వారి మాట వినడం లేదు,మాకెందుకు వచ్చిన గొడవ చట్టం ప్రకారం పని చేస్తామని పోలీసులు బదులిస్తున్నారు. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రభావం జూన్ 4 ఉదయం 10 గంటలకు భగ్గుమంటుందని వర్ల అన్నారు.ఈసిని కలిసిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి.మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, ఎస్పీ సాహెబ్, కోడూరి అఖిల్ తదితరులు ఉన్నారు.

👉డ్రగ్స్ అయినా, స్కాములైనా సూత్రధారులు మాత్రం తెలుగు డ్రగ్స్ పార్టీ (టీడీపీ) వాళ్ళే!.. వైకాపా ఆరోపణలు..బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళలో నారా లోకేష్ కి ముఖ్య అనుచరులు అయిన చిత్తూరు జిల్లాకు చెందిన మద్దిపట్ల ప్రణీత్ చౌదరి (ఐటీ ఎంప్లాయ్) కొండేటి సుకుమార్ నాయుడు (సీఈవో) Eavetop Softtech pvt Ltd. బెంగళూరు టీడీపీ ఐటీ వింగ్ కి చెందిన కీలక వ్యక్తులు..చిత్తూరు, పూతలపట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో వీరికి సన్నిహిత సంబంధాలు.ఇవన్నీ చూస్తుంటే వైజాగ్ డ్రగ్స్ కంటైనర్ దగ్గర నుంచి బెంగళూరు రేవ్ పార్టీ వరకు అన్నీ నారా లోకేష్ అనుచరుల హయాంలోనే జరుగుతున్నాయని ప్రజలకు బాగా అర్థమవుతోందని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.

👉మదనపల్లెలో యువకుడు దారుణ హత్య..భార్య ముందే భర్తను అతి కిరాతకంగా నరికిన దుండగులు..యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె..

మదనపల్లి పట్టణంలోని శ్రీవారినగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం వేకువుజమున మదనపల్లిలో దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు బీగాలు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి, ఇంట్లో నిద్రిస్తున్న రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు(25)ను కత్తులు వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. ఘటన సమాచారం అందుకున్న డిఎస్పి ప్రసాద్ రెడ్డి, సీఐలు వలీబషు, యువరాజు, శేఖర్ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచినామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.

👉3 వారాల్లో 3వ ప్రపంచ యుద్ధం.. భారతీయ జ్యోతిషుడి సంచలనం ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే.. ఓవైపు రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఏడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య బీభత్సమైన సమరం సాగుతోంది.. ఇంకోవైపు తైవాన్ ను చైనా తరచూ భయపెడుతోంది.. ఇదేకాక.. ఆ మధ్య ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్జీసీ)ను ఇజ్రాయెల్ హతమార్చడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంతలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ అనూహ్యంగా దుర్మరణం పాలయ్యారు. దీనివెనుక ఇజ్రాయెల్ ఉందనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇలా యూరప్, పశ్చిమాసియా, ఆసియాల్లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇవి తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తే.. అందులోనూ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాలు జరిగితే..? అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే..? వివిధ దేశాల మధ్య, ముఖ్యంగా ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుందనే ఊహాగానాలు పెద్దఎత్తున వచ్చాయి. కానీ, అవి భయాందోళనలుగానే మిగిలిపోయాయి. నోస్ట్రడామస్, బాబా వంగాతో సహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది జ్యోతిష్కులు దీని గురించి అంచనాలు వేసినా.. అదేమీ జరగలేదు. అయితే, ఇలాంటి అంచనాల వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతూ.. చాలామంది దృష్టిని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలానే భారతీయ జ్యోతిషుడు చెప్పిన అంచనాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. హరియాణాలోని పంచకులకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు కుశాల్ కుమార్ లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసిన దాని ప్రకారం.. మూడో ప్రపంచ యుద్దం మరో మూడు వారాల దూరమే ఉంది. గ్రహాల గమనం, స్థితి ఆధారంగా జరగబోయే ఘటనలపై ఈ వేద జ్యోతిషుడు జోస్యం చెబుతుంటాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తున్నదో చూడాలి. అసలు అవకాశం ఉన్నదా..? జ్యోతిష్యులు, ఇతర వ్యక్తులు చెప్పినవన్నీ నిజం కావాలని ఏమీ లేదు. అసలు జరగను కూడా జరగని ఉదంతాలు ఉన్నాయి. అందులోనూ ఈ కాలంలో ప్రపంచ యుద్ధాలు సంభవించడం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే జరగబోయే నష్టాలు తెలుసు కాబట్టి.. ఏ దేశమూ దీనిని కోరుకోదు. అందుకనే రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా అమెరికా బయటి నుంచి మద్దతు ఇస్తున్నదే కానీ.. నేరుగా రంగంలోకి దిగలేదు. గాజా స్ట్రిప్ పై దాడిచేస్తున్న ఇజ్రాయెల్ ను వారిస్తున్నదే కానీ.. ఎగదోయడం లేదు. ఈ ఉదాహరణ నేపథ్యంలో చూసినా మూడో ప్రపంచ యుద్ధం అసంభవమే.

👉₹ 50 లక్షలు పెట్టి.. రేవ్ పార్టీకి దేనికి పోతారు? ఆడ, మగకి నో రూల్స్, నో లిమిట్స్!గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేవ్‌ పార్టీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అక్కడే జరిగే దారుణాల గురించి జోరుగా చర్చించుకుంటున్నారు.ఆ వివరాలు..రెవ్‌ పార్టీ..రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది.బెంగళూరు శివారులో ఆదివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి వచ్చిన వారిలో చాలా వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్‌, నటి హేమ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీకాంత్‌ తనకు ఈ పార్టీతో అసలు సంబంధమే లేదని స్పష్టం చేయగా.. హేమ మాత్రం కవర్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్కయ్యింది. పైగా ఆమె రేవ్‌ పార్టీలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఈ రెండు రోజుల నుంచి మీడియా, సోషల్‌ మీడియా ఇలా ఎక్కడ చూసిన రేవ్‌ పార్టీ వార్తలే కనిపిస్తున్నాయి. జనాలు సైతం అసలు రేవ్‌ పార్టీ అంటే ఏంటి.. అక్కడ ఏం చేస్తారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.👉రేవ్‌ పార్టీ అంటే మన బర్త్‌డే పార్టీల్లాంటిందే అనుకుంటే.. పబ్బులో కాలేసినట్లే. సామాన్యుల ఇళ్లలో పార్టీలంటే నాన్‌ వెజ్‌, మందు. అదే బాడాబాబుల ఇళ్లలో పార్టీలు అంటే రకరకాల మద్యం బ్రాండ్లు, ఫుడ్డు,దానితో పాటు అమ్మాయిలు కూడా ఉంటారనే టాక్‌ ఉంది.మరి రేవ్‌ పార్టీ అంటే అంతకు మించి. ఇక్కడ మందు, చిందుతో పాటు డ్రగ్స్‌, విశృంఖల శృంగారం ప్రధానం అంటున్నారు.రేవ్‌ అనేది ఇంగ్లీష్‌ వర్డ్‌. ఎక్సైటింగ్‌ అనే అర్థంలో వాడతారు. అంటే ఈ పార్టీలు కూడా అలానే ఎక్సైటింగ్‌ అన్నమాట.ఈ పార్టీలు చాలా సీక్రెట్‌గా జరుగుతాయి.ఎక్కువగా నగర శివార్లలోనే వీటిని కండక్ట్‌ చేస్తారు. పైగా ఇవి ఇల్లీగల్‌. ఇక ఈ పార్టీల్లోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. పార్టీకి ఎంత మంది రావాలని ముందే నిర్ణయిస్తారు. చివరి నిమిషంలో కొత్త వారికి అనుమతి ఇవ్వడం వంటివి ఉండవు. చాలా తక్కువ సంఖ్యలో ఈ పార్టీకి ఎంట్రీలు ఇస్తారు.👉మహిళలే ఎక్కువ..ఇక రేవ్ పార్టీకి వెళ్లాలంటే.. 50 లక్షల ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఇక రేవ్‌ పార్టీకి వచ్చే వారిలో 25 శాతం మగవాళ్లు ఉంటే.. 75 శాతం మహిళలు ఉంటారు. అంటే 100 మందికి ఆహ్వానం ఉంటే వీరిలో 25 మంది మగవాళ్లు ఉంటే.. మిగతా 75 మంది ఆడవాళ్లే ఉంటారు. ఇక వీరందరికి పార్టీ నిర్వహణకు ముందుగానే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తారు. ఎస్‌టీడీ,ఎయిడ్స్‌ వంటి రోగాలు ఉన్న వారిని అనుమతించరు. ఇక ఒక్కసారి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చామంటే మొబైల్స్‌ ఆఫ్‌ చేయాలి. కెమరాలు తీసుకెళ్లకూడదు. అక్కడ సీసీ కెమరాలు ఉండవు.లోపల ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు.ఇక రేవ్‌ పార్టీలో మందు,డ్రగ్స్‌తో పాటు..విశృంఖల శృంగారం కీలకం.ఈ పార్టీకి వచ్చే వారిలో అమ్మాయిలే ఎక్కువ.ఇక ఒక్కో అమ్మాయి.. నలుగురైదుగురు అబ్బాయిలతో శృంగారంలో పాల్గొంటుంది.రాత్రంతా మద్యం, డ్రగ్స్‌, శృంగారం ఇదే పని.ఇక్కడకు కొందరు బడా బాబులు తమ భార్యల కోర్కెలను తీర్చడానికి తీసుకువస్తారని టాక్‌.ఇక శృంగారం కూడా విచ్చలవిడిగా ఉంటుంది.. రకరకాల థీమ్స్‌ పేరుతో గ్రూపులుగా డివైడ్‌ అయ్యి.. విచ్చలవిడిగా ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే పార్టీకి వచ్చే వారికి ముందుగానే వీటి గురించి పూర్తిగా చెప్తారట.ఒక్కసారి పార్టీకి వచ్చాక.. దేనికి నో చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అడ్డమైన గలీజు పనులకు రేవ్‌ పార్టీ అడ్డా అంటున్నారు. మరి ఇంత జుగుప్సకరమైన పార్టీలు సెలబ్రిటీలు హాజరవ్వడం సంచలనంగా మారింది.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం