ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు* సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది..ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి..అధికారం ఉన్నవారికి.. డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ముకాస్తూ.. సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవటంలేదు..కొన్ని పీఎస్ లు ఏకంగా సెటిల్ మెంట్ల కు అడ్డాగా మారుతున్నాయి..లాకప్ డెత్, బెదరింపులు, వసూళ్లు, అక్రమార్కులకు అండదండగా ఉంటున్నారనే ఆరోపణలతో ఆ వ్యవస్థ పై నమ్మకం లేని పరిస్థితి నెలకొంది.. కొన్ని స్టేషన్‌లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరగుతున్నాయి.. ఇలా పీఎస్ లలో జరిగేది ప్రతీదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో, తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ ల విషయంలో సుప్రీం కోర్టు జూలు విదిలించింది..అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.దీనికి సంబంధించి పనులు ఎంత వరకూ జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది.👉 ఈ నిర్ణయం పట్ల పలు ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
👉 క్రేజీ కేజ్రీవాల్.. ఆప్ తో ఆపసోపాలు పడుతున్న బీజేపీ..’ఆప్’ అనే పార్టీ 2012లో ఏర్పాటు అయింది. ఆ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకుంది. అయితే తగినంత మెజారిటీ దక్కలేదు. . ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత కూలిపోయింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మాజీ జేడీ కీలక వ్యాఖ్య! ఇక 2020లో మరోసారి ఆప్ గెలిచి మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే పార్టీ పెట్టిన పదేళ్ళ కాలంలోనే ఆప్ కి కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ 9న ఆమ్ జాతీయ పార్టీ హోదాను ప్రకటించింది. ఇల ఆప్ ప్రభావంతో పంజాబ్ లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. గుజరాత్ లో తొలిసారి పోటీ చేసి ఏడున్నర శాతం ఓట్లు సాధించింది. యూపీ సహా చాలా చోట్ల ఆప్ సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో ఆప్ తో ఎలా అన్నది బీజేపీకి అర్ధం కావడం లేదు అంటున్నారు. కాంగ్రెస్ ని అయితే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కుటుంబ పార్టీగా గాంధీ ఫ్యామిలీ అంటూ విమర్శించవచ్చు. జనాలు కూడా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తే అవి నిజమైతే యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది కాబట్టి తప్పులు జరుగుతాయి. వాటిని ఎత్తి చూపుతూ బీజేపీ తన రాజకీయ దూకుడుని కొనసాగించే వీలుంది. మరో వైపు చూస్తే కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గింది. ఎస్పీ లాంటివి అన్నీ ప్రాంతీయ పార్టీలే. అయితే ఆప్ తో మాత్రం బీజేపీకి ప్రమాదం ముంచుకొస్తోంది. ఏకంగా బీజేపీ ప్రముఖులు అంతా ఉన్న చోటనే ఢిల్లీలో ఆప్ జెండా పాతేసింది. బీజేపీకి పూర్వ రూపం జనసంఘ్ కాలం నుంచి ఢిల్లీలో పట్టుంది. ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఢిల్లీ పీఠం ఎక్కింది బీజేపీ నాటి నుంచి నేటి వరకూ మళ్ళీ ముచ్చట తీరలేదు. ఇక ఆప్ ని ఎలా డీల్ చేయాలో బీజేపీకి తెలియడం లేదని అంటున్నారు. దాంతోనే ఆప్ సోపాలు పడుతోంది అని అంటున్నారు. అలాగే బీజేపీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ చిల్లు పడే సీన్ కళ్ళ ముందే ఉంది అని అంటున్నారు.ఈ నేపధ్యంలో ఆప్ తో ఎలా అన్నది బీజేపీకి అర్ధం కావడం లేదు అంటున్నారు. కాంగ్రెస్ ని అయితే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కుటుంబ పార్టీగా గాంధీ ఫ్యామిలీ అంటూ విమర్శించవచ్చు.జనాలు కూడా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తే అవి నిజమైతే యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంది కాబట్టి తప్పులు జరుగుతాయి. వాటిని ఎత్తి చూపుతూ బీజేపీ తన రాజకీయ దూకుడుని కొనసాగించే వీలుంది. మరో వైపు చూస్తే కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గింది.ఎస్పీ లాంటివి అన్నీ ప్రాంతీయ పార్టీలే. అయితే ఆప్ తో మాత్రం బీజేపీకి ప్రమాదం ముంచుకొస్తోంది. ఏకంగా బీజేపీ ప్రముఖులు అంతా ఉన్న చోటనే ఢిల్లీలో ఆప్ జెండా పాతేసింది. బీజేపీకి పూర్వ రూపం జనసంఘ్ కాలం నుంచి ఢిల్లీలో పట్టుంది. ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఢిల్లీ పీఠం ఎక్కింది బీజేపీ నాటి నుంచి నేటి వరకూ మళ్ళీ ముచ్చట తీరలేదు.ఇక ఆప్ ని ఎలా డీల్ చేయాలో బీజేపీకి తెలియడం లేదని అంటున్నారు. దాంతోనే ఆప్ సోపాలు పడుతోంది అని అంటున్నారు. ఆప్ ని ఒక విధంగా పెను భూతంగా చూస్తూ పెంచి పోషించింది కూడా బీజేపీ అని అంటారు. ఆప్ కి కాంగ్రెస్ బీజేపీ రెండూ ప్రత్యర్ధులే. అలా డిసైడ్ అయి అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయం మొదలెట్టారు. అలాంటి ఆప్ ని బీజేపీ టార్గెట్ చేయడంతోనే ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టాల్సి వచ్చింది అని అంటున్నారు. దాని మూల్యన్ని బీజేపీ ఢిల్లీతోనే చెల్లించబోతోంది అని అంటున్నారు. అలాగే బీజేపీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ చిల్లు పడే సీన్ కళ్ళ ముందే ఉంది అని అంటున్నారు. ఎవరికి ప్లస్? కేజ్రీవాల్ ని జైలులో పెట్టడం లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేయడం వంటి వాటి వల్ల బీజేపీకి ఏమి ఒరిగిందో తెలియదు కానీ ఆప్ అధినేత మాత్రం జనంలో ముఖ్యంగా ఉత్తర భారతాన క్రేజ్ బాగానే సంపాదించుకున్నారు అని అంటున్నారు.దానికి గానూ ఆయన కమలానికి థాంక్స్ చెప్పుకుని తీరాల్సిందే అంటున్నారు.నేను ప్రధాని పదవిని పోటీ దారుణ్ణి కాను అని కేజ్రీ అంటున్నా బీజేపీ టార్గెట్ తో ఇంతింతై ఎదుగుతున్న ఆయన ఏదో నాటికి కేంద్రానికే గురి పెట్టడం ఖాయమని అంటున్నారు. రాజకీయాలో కొన్ని డెసిషన్స్ బూమరాంగ్ అవుతూ ఉంటాయి. కేజ్రీ విషయంలో బీజేపీ కొత్త వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుందేమో అంటున్నారు.
👉దేవతలాంటి అమ్మాయిని దారుణంగా ముంచేశాడు! ఏ అమ్మాయికి ఈ స్థితి రాకూడదు! నేటికాలంలో ప్రేమ అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ప్రేమను కామానికి మరో రూపంగా వాడుకుంటున్నారు. శరీర సుఖాలను తీర్చుకునేందుకు కొందరు ప్రేమ అనే పదాన్ని వాడి.. అవసరం తీరిన తరువాత నిండా ముంచేస్తున్నారు.ప్రేమ.. విన్నడానికి ఇది రెండు అక్షరాల పదమే. దీని కారణంగా ఎంతో మంది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సంసారాన్ని హాయిగా సాగిస్తున్నారు.ప్రేమకు నిజమైన అర్థం చెబుతూ నలుగురి ఆదర్శంగా నిలిచిన ప్రేమ జంటలు అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో ప్రేమ అనే పదానికి పూర్తి అర్థం మారిపోయింది. శరీరంపై ఉండే కోరికను తీర్చుకునేందుకు ప్రేమ అనే దానిని వాడుతున్నారు. అవసరం తీరిన..మోసం చేస్తున్నారు. అలా మోసపోయిన యువతులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రేమ పేరుతో మోసపోయినా ఓ యువతి కథ విషాదాంతమైంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోక వెళ్తే..తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా అత్తూరు తాలూకా సాలిపుధూరు గ్రామానికి చెందిన వీరయ్య కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు సూర్య అనే 22 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె గ్రాడ్యూయేట్ పూర్తి చేసి.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తుంది. ఇదే సమయంలో చెన్నైలో మురుగన్ అనే వ్యక్తి ప్రభుత్వ రవాణా సంస్థలో టికెట్ తనిఖీ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతని అరుణ్ కుమార్ (29)అనే కుమారుడు ఉన్నాడు. అతడు కూడా చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం అరుణ్‌కుమార్, సూర్య పరిచయమైంది. అది కాస్తా ప్రేమకు దారితీసింది.ఈ క్రమంలో గత మూడేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. మురుగన్, వీరయ్యలది ఒకే గ్రామం. అరుణ్ కుమార్, సూర్య గత ఏడాది కాలంగా చెన్నైలోని కుంరత్తూర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. 4 నెలల క్రితమే సూర్య గర్భం దాల్చినట్లు సమాచారం. పెళ్లి చేసుకోమని కోరగా.. అరణ్ కుమార్ మాటలు దాటేస్తు వచ్చారు.గత ఏప్రిల్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అబార్షన్ చేసినట్లు సమాచారం. అతడి ప్రేమ మైకంలో పడిన ఆ యువతి అతడు చెప్పినట్లు గర్భం తీయించుకునేందుకు కూడా సిద్ధమైంది. అంత త్యాగం చేసిన యువతిని నిండా ముంచేశాడు. అరుణ్‌కుమార్‌కు వేరే యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు సూర్య అనే యువతికి తెలిసింది.ఈ విషయమై సూర్య..అరుణ్‌కుమార్‌ను అడగ్గా.. పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన సూర్య బుధవారం రాత్రి ప్రియుడు అరుణ్‌కుమార్ ఇంటి ఎదుట విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు యువతిని చికిత్స నిమిత్తం దిండిగల్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ప్రేమ పేరుతో మోసపోయిన ఈ యువతి కథ విషాదం మారింది.
👉రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈ నెల 27న విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమె రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో విచారించాలని పోలీసులు నిర్ణయించారు.తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ తొలుత హేమ ఓ వీడియోను విడుదల చేయగా.. బెంగళూరు పోలీసులు ఆమె ఫొటోను రిలీజ్ చేసి, క్లారిటీ ఇచ్చారు.
👉వరంగల్ జిల్లాలోరైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య తెలంగాణ..వరంగల్ జిల్లా..రైలు కింద పడి యువతి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీల వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహ త్యకు పాల్పడ్డారు.తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందగా..మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలిం చారు. తీవ్ర గాయాల పాలై న యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరా లు తెలియ జేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులు తెలిపారు…