👉 ఆదానీని లాగొద్దు .. మోడీ, రాహుల్ పై దావా !
అయితే మొదటిసారి ఈ ఎన్నికలలో మోడీ ఆదానీ మీద ఆరోపణలు చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ఆదానీ, మోదీ బంధాల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నది. 2014లో దేశానికి ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టాక ఆదానీ వెలుగులోకి వచ్చాడు. దేశ,విదేశీ పర్యటనలకు ఆదానీని వెంటబెట్టుకు వెళ్లి మరీ ఆయన వ్యాపారాభివృద్దికి మోడీ సహకరించారని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆదానీ బ్యాంకులలో చేసిన అప్పులను రైటాఫ్ చేసేందుకు కూడా సహాయపడ్డారన్న విమర్శలు కోకొల్లలు. అయితే మొదటిసారి ఈ ఎన్నికలలో మోడీ ఆదానీ మీద ఆరోపణలు చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ఆదానీ, మోదీ బంధాల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నది. ఇవే ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. సుర్జీత్ సింగ్ యాదవ్ అనే స్టాక్ ఇన్వెస్టర్ దీనిని దాఖలు చేశారు. అదానీ మీద, ఆదానీ గ్రూప్ మీద వీరిద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోర్టును అభ్యర్థించాడు. పదే పదే రాజకీయ నేతల ఆరోపణల మూలంగా ఆదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, ఆ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన నాలాంటి అనేకమంది ఇన్వెస్టర్లకు నష్టం కలుగుతుందని పిటీషనర్ వాపోయాడు. అదానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని రాహుల్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని పేర్కొన్నాడు. ఆదానీ, అంబానీల నుండి కాంగ్రెస్ పార్టీ ముడుపులు తీసుకుందని, అందుకే ఆ తర్వాత వారి పేరు ఎత్తడం లేదని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటీషన్ మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి.
👉 పంజాబ్ లో మాత్రమే కనిపించే ఓ అరుదైన వ్యాధి తాజాగా ఏపీలోని పల్నాడులో దర్శనమిచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది! సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే ఈ వ్యాధిని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో గుర్తించినట్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు మీడియాకు వెళ్లడించారు. తాజాగా ఈ వ్యాదికి సంబంధించిన విషయాలను వెల్లడించిన గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్… పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఈ సమయంలో… వారికి రక్తపరీక్ష చేయగా..వారు సికిల్ హిమోగ్లోబిన్ డి-పంజాబ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారని తెలిపారు. ఈ వ్యాది చాలా అరుదుగుగా వస్తుందని.. ఇలా చాలా అరుదైన ఈ సమస్యకు ఎముక మజ్జ మార్పిడి చికిత్స ఒక్కటే సరైన పరిష్కారమని తెలిపారు.అయితే ప్రస్తుతం ఈ చికిత్స ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో లేదని తెలిపిన ఆయన…తాత్కాలికంగా దాతల రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు వేరు చేసి ఎక్కించడం ద్వారా రోగికి మేలు కలుగుతుందని వెల్లడించారు. ఈ అరుదైన వ్యాధిని గుర్తించిన ప్రాంతంలో నివసిస్తున్న ఇతర పిల్లలందరికీ రక్త పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని గుంటూరు మెడికల్ కాలేజ్ పెథాలజీ విభాగం అధిపతి అపర్ణ తెలిపారు! ఏంటీ వ్యాధి..? సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్ ను హిమోగ్లోబిన్ డీ (హెచ్.బి.-డీ) అని కూడా పిలుస్తారు. ఇది భారత్ తో పాటు పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుందట. అయితే.. భారత్ లో మాత్రం వాయువ్య రాష్ట్రాల్లో చిన్నారులకు ఎక్కువగా సోకుతుందని.. ఈ వ్యాధి సోకిన వారు త్వరగా అలసిపోతారని.. వీరిని తరచూ రోగాలు చుట్టుముడుతుంటాయని చెబుతున్నారు!
👉ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్.అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా..ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారు.ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు.గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.
👉 కంభం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు దివంగత ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తోట శ్రీనివాసులు, కేతం శ్రీనివాసులు,కొప్పుల పాపిరెడ్డి,అత్తర్ షైక్ హుస్సేన్ (దాదా ) చెన్నయ్య, రజాక్ భాష జిలాని రవికుమార్ పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉 వైద్యుల నిర్లక్ష్యం.. పేషెంట్ మృతి..చైతన్యపురిలోని షణ్ముఖ హాస్పిటల్ ముందు ఓ వ్యక్తి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. నేపాల్ రాష్ట్రానికి చెందిన కమల్ బహుదూర్ బతుకు దెరువు కోసం వచ్చి హైదరాబాద్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ రాజధాని ఖాట్మండు కు చెందిన కమల్ బహుదూర్(38) బతుకుతెరువు కోసం నేపాల్ నుంచి కుటుంబ సభ్యులతో సహా నగరానికి వచ్చి కొద్దిరోజులు వాచ్ మెన్ గా పనిచేసే అటు నుండి నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ఓ కంపెనీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.కొద్దిరోజుల తర్వాత తన సొంత గ్రామమైన ఖాట్మండుకు వెళుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్ రాజధాని పరిధిలోని లక్నోలో షార్ట్ సర్క్యూట్ కు గురైనాడు. 70 శాతం కాలిన గాయాలతో చికిత్స నిమిత్తం తిరిగి నగరానికి వచ్చి ఉస్మానియా ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందాడు.తదుపరి మెరుగైన వైద్యం కోసం అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అక్కడ డబ్బులు కట్టలేక తిరిగి ఉస్మానియా హాస్పిటల్ కు వెళ్లాడు. చైతన్యపురి లోని షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ లో నాణ్యత గల వైద్యం అందించి అతని పూర్వస్థితికి తీసుకొస్తామని షణ్ముఖ వైష్ణవి హాస్పిటల్ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడంతో ఈ నెల 21న అతని బంధువులు హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. చికిత్స కోసం నేపాల్ చెందిన అతని బంధువులందరూ డబ్బులు చందాలు వసూలు చేసిరూ. ఏడు లక్షల 50 వేల రూపాయలు చెల్లించారు.హాస్పిటల్ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించకపోవడంతో సోమవారం ఉదయం కమల్ బహదూర్ మృతి( 40 )చెందాడు. కమల్ బహదూర్ బతుకుతాడని నేపాల్ చెందిన ప్రతి ఒక్కరు చందాలు వసూలు చేసి వైద్యం అందించినప్పటికీ నాణ్యత గల వైద్యం అందించకపోవడంతో కమల్ బహుదూర్ మృతిచెందాడని అతని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు.హాస్పిటల్ ముందు పోలీసుల బందోబస్తు..హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన దిగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎల్బీనగర్ నాగోల్ చైతన్యపురి సీఐల ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు
👉ఒంగోలు చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో lbg భవన్ లో జరుగుతున్న సమ్మర్ క్యాంపు 3వరోజు…*సులభముగా ఇంగ్లీష్ నేర్చుకునే మెలుకువలు* బోధించిన దేవరం పాడు హై స్కూల్ & కాలేజ్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్ శాస్త్రి,ఇంగ్లీష్ టీచర్ యామిని.అనంతరం సైన్స్ తో సరదాగా అనే క్లాసును జన విజ్ఞాన వేదిక నాయకులు మాజిక్ రామన్ బోధించారు.50 మందితో ఈ క్యాంపు..
జరుగుతుంది..👉గణితంలో మెలుకువలు నేర్పిన ఆకృతి రాము..ఒంగోలు చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో 4వ రోజున ఫన్నీ మ్యాధ్స్ క్లాసును *ఆకృతి అకాడమీ రాము* బోధించారు..గణితం అంటే భయపడే పిల్లల మెదడులో నుంచి భయాన్ని పోగొట్టే విధంగా సులభమైన పద్ధతిలో గణితం నేర్చుకోవడం, గణితం పట్ల ఆసక్తి పెరిగేలా మెమరీ గేమ్స్ ఆడించారు. అనంతరం టి. జ్యోతి మ్యాథ్స్ ట్రిక్స్, పజిల్స్, కథలు విద్యార్థులకు నేర్పారు.ప్రజానాట్యమండలి నగర కార్యదర్శి యస్.ఇంద్రజ్యోతి విద్యార్థులకు ఆటా,పాట నేర్పించారు నాలుగవ రోజు సమ్మర్ క్యాంపు ఉత్సాహంగా ముగిసింది
👉 రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు అలవెన్స్ వెంటనే చెల్లించాలని కోరుతూ సబ్ కలెక్టర్ మరియు మార్కాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్,సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ మే 13 న రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మార్కాపురం మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ మేరకు స్థానిక ఎస్వికెపి కళాశాల నందు విధులు నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా పోలింగ్ ముందు రోజులు పోలింగ్ ముందు ఏర్పాట్లు భాగంగా ఈవీయంలో పంపిణీ ,ఎగుమతి, దిగుమతి ,ఏవీఎంల స్టిక్కర్ అంటించడం,సరి చేయటం, వంటి పనులను రాత్రి, పగలు అని లేకుండా విధులను నిర్వహించడం జరిగింది. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో వాటర్ సరఫరా వంటి ఎన్నికలవిధులను తొమ్మిది రోజులపాటు నిర్వహించడం జరిగింది.ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఎలక్షన్ కమిషన్ గారి ఉత్తర్వుల ప్రకారం,ఇతర అధికారులకు ప్రత్యేక అలవెన్స్లు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ ఉత్తరవుల ప్రకారం ఔట్సోర్సింగ్ కార్మికులకు అలవెన్సులు వెంటనే చెల్లించేందుకు తగు చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయిస్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి హరి, కే సుబ్బరాయుడు, ఎస్.కె ఇమాంసా పి సలాం ఖాన్,,ఏ రమణ, పిఏ బ్రహ్మం, ఎస్కే ఇబ్రహీం, ఎం చెన్నకేశవులు, రామకృష్ణ,సుభాని తదితరులు పాల్గొన్నారు