కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మృతి..మిస్టరీగా మారిన గొయ్యి..నన్ను మోసం చేశారు:జగపతి బాబు..బస్సులో రాసలీలలు..గుంటూరు కుర్రకారు జోష్ కు బ్రేకులు వేస్తున్న పోలీసులు..గిద్దలూరులో ఎన్టీఆర్ జయంతి.. .

బెంగళూరు: బీజేపీ సీనియర్నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళ మరణించింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని సమాచారం.బెంగళూరు డాలర్ సిటీలోని యడ్యూరప్ప ఇంటికి ఈ ఏడాది ఫిబ్రవరి2న తన కూతురుతో కలిసి వెళ్లానని, ఈ సందర్భంగా తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని మహిళ కేసు పెట్టింది.దీంతో మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో యడ్యూరప్పపై పోక్సో చట్టంలోని సెక్షన్ 8తో పాటు ఐపీసీ 354ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది.అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళకు శ్వాససంబంధ సమస్య రావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారని, చికిత్స పొందుతూ ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. యడ్యూరప్పపై లైంగికదాడి కేసును ప్రస్తుతం కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేస్తోంది.కేసు పెట్టిన యువతి తల్లి మరణించినప్పటికీ ఆమె స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతుందని సీఐడీ అధికారులు తెలిపారు. అయితే లైంగికదాడి ఆరోపణలను యడ్యూరప్ప అప్పట్లో ఖండించారు.

👉 ఫోటోలో మీరు చూస్తున్న ఈ గొయ్యే మిస్టరీగా మారింది.అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది. అధికారులను తలలు పట్టుకునేలా చేస్తోంది. అదేంటి ఇంత గొయ్యికి అంత సీన్‌ ఉందా…? ఎవరో తీస్తేనో… ఏదో చేస్తేనే గొయ్యి పడుంటుంది..! అంతమాత్రన మిస్టరీలాంటి మాటలెందుకు అనుకోకండి. ఇది ఎవరో తీసిన గొయ్యి కాదు. ఆకాశం నుంచి ఏదో శకలం భూమ్మీద పడటంతో… ఏర్పడ్డ గొయ్యి. యస్‌ మీరు వింటున్నది నిజమే. అకాశం నుంచి భారీ శబ్ధం చేస్తూ… భూమ్మీద ఓ శకలం పడటంతో ఈ ఆరడుగుల గుంత ఏర్పడింది.తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పెటైలో ఈ గుంత పెద్ద దుమారమే రేపుతోంది. అక్కడి జనాలకు వణికిస్తోంది. ఏదో తెలియని శక్తి భూమ్మీదకి వచ్చిందంటూ జనాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఊరికి కీడొచ్చింది… దానికి ఇదే సంకేతమంటూ తలలు పండినవారూ చెప్పడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి… అధికారుల చెవిలో పడింది. దీంతో అధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పలుమార్లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.అసలేం జరిగిందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అయినప్పటికీ మిస్టరీని చేధించలేకపోయారు.కలెక్టర్‌ సైతం ఘటనా స్థలానికి వచ్చి గొయ్యిని చూశారు. ఎవరు భయపడాల్సిన పనిలేదంటూ అక్కడి జనాలకు ధైర్యం చెప్పారు. మరోవైపు గుంతలో ఉన్న శకలానికి సంబంధించిన శాంపుల్స్‌ను అధికారులు సేకరించారు. ఆ శాంపుల్స్‌ ద్వారా ఈ గుంత మిస్టరీని చేధించే పనిలో పడ్దారు.మొత్తంగా… ఈ పెద్ద గొయ్యి వ్యవహారం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఈ గొంతను విచిత్రంగా చూస్తున్నారు. రకరకల స్టోరీలు చెప్పుకుంటున్నారు. ఒకరు సైన్స్‌ అంటుంటే…ఇంకొకరు తెలియని శక్తంటూ మాట్లాడుకుంటున్నారు.మరి శాంపుల్స్‌ సేకరించిన అధికారులు ఏం తేలుస్తారో చూడాలి… ! సినిమా రేంజ్‌లో ఏమైనా ట్విస్ట్‌ ఇస్తారో చూడాలి.

👉నన్ను మోసం చేశారు: జగపతి బాబు..స్థిరాస్తి రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులకు సూచించారు నటుడు జగపతి బాబు. ‘రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విషయం చెప్పారు.

ఇటీవల నేను స్థిరాస్తి రంగానికి సంబంధించి ఓ యాడ్ లో నటించా. నన్ను మోసం చేశారు. వారెవరు? ఏం జరిగింది? అన్నది త్వరలోనే చెబుతా. ల్యాండ్ కొనేముందు రెరా నిబంధనలు తెలుసుకోండి”అని పేర్కొన్నారు.

👉ఛీ.. ఛీ.. రక్తం కూడా తాగేలా ఉన్నారు.. మరో సంచలన అప్‌డేట్‌.. బ్లడ్‌ శాంపిల్‌ రిపోర్టునే మార్చిన వైద్యులు..రియల్టర్‌ తన కుమారుడిని రక్షించుకునేందుకు వైద్యులతో మాట్లాడి రిపోర్ట్‌ను తారుమారు చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ససూన్‌ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్‌ డాక్టర్‌ అజయ్‌ తవాడే, డాక్టర్‌ శ్రీహరి హల్నూర్‌ తప్పుడు రిపోర్టు ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. నిందితుడి తండ్రి వైద్యులతో మాట్లాడిన కాల్‌ రికార్డును విన్న పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె కారు యాక్సిడెంట్‌ కేసులో ఎన్నో ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. పీకలదాకా కారు నడిపి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న 17 ఏళ్ల రియల్టర్‌ కుమారుడి కేసులో పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ కేసులో రియల్టర్‌ కుమారుడి బ్లడ్‌ శాంపిల్‌ రిపోర్ట్‌ను ఇద్దరు వైద్యులు తారుమారు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు. రియల్టర్‌ తన కుమారుడిని రక్షించుకునేందుకు వైద్యులతో మాట్లాడి రిపోర్ట్‌ను తారుమారు చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ససూన్‌ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్‌ డాక్టర్‌ అజయ్‌ తవాడే, డాక్టర్‌ శ్రీహరి హల్నూర్‌ తప్పుడు రిపోర్టు ఇచ్చి నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. నిందితుడి తండ్రి వైద్యులతో మాట్లాడిన కాల్‌ రికార్డును విన్న పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు.ఇప్పుడు అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న నిందితుడు ఆల్కహాల్ పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే, ఆ రాత్రి అతను సందర్శించిన బార్‌లలోని సీసీటీవీ ఫుటేజీలో అతను స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నట్లు విజువల్స్‌ బయటకొచ్చాయి. ఈ కేసులో వైద్యులపైనే కాదు.. రియల్టర్‌పైన కూడా చర్యలు ఉంటాయని వెల్లడించారు పుణె పోలీస్‌ కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌.పూణే రోడ్డు యాక్సిడెంట్ కేసులో పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. ‘‘19వ తేదీ ఉదయం 11 గంటలకు సుసాన్ ఆసుపత్రిలో మైనర్ నిందితుల రక్త నమూనాను సేకరించారు. నిందితుల రక్త నమూనాను వారు డబ్బాలో పడేశారు. ఆ తర్వాత డాక్టర్‌ మరో వ్యక్తి రక్త నమూనాను తీసుకుని సీల్‌ చేసి నిందితుడి పేరు రాసి ఫోరెన్సిక్‌కు పంపించారు. డా. అక్కడ సీఎంఓగా శ్రీహరి హల్నోరే ఉన్నారు. వారు ఈ రక్త నమూనాలన్నింటినీ మార్చారు. డా. అజయ్ థావ్రే హెచ్‌ఓడి, అతను కూడా ఇందులో పాల్గొన్నాడు” అని పూణే పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ అన్నారు.“అదే రాత్రి, ఔంధ్‌లోని మరో ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడి మరొక రక్త నమూనా తీసుకున్నారు. DNA సరిపోలిక దాని వెనుక ఉద్దేశ్యం. నిందితుడి తండ్రి నమూనా కూడా తీసుకున్నారు. ఔంధ్‌లోని ఒక ఆసుపత్రిలో, నిందితుడి నమూనా తండ్రి నమూనాతో సరిపోలింది. సుసాన్ నమూనా సరిపోలలేదు. అందులో తప్పు జరిగినట్లు పోలీసులు గమనించారు’’ అని అమితేష్ కుమార్ తెలియజేశారు. నిందితులిద్దరినీ ఈరోజు కోర్టులో హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించనున్నారు. ససూన్‌లోని అన్ని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తామని పూణే పోలీస్ కమిషనర్ తెలిపారు.👉పోలీసులు ఎలా ప్లాన్ చేశారంటే..అదృష్టవశాత్తూ, పోలీసులు బాలుడి రక్త నమూనాను రెండవసారి తీసుకున్నారు.. అతని DNA కూడా పరీక్షించారు. ఇదంతా వెల్లడైంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం సాయంత్రం ఆపరేషన్‌ను వివరంగా ప్లాన్ చేశారు.. అనంతరం తెల్లవారుజామున తావేరే, హర్నోర్‌లను వారి ఇంటి నుండి అరెస్టు చేశారు. ఈ చర్యతో వైద్యరంగంలో మరోసారి కలకలం రేగింది..వారికి డబ్బులు ఎవరు పంపిణీ చేశారు?డ్రగ్ మాఫియా లలిత్ పాటిల్ కేసులో సాసూన్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు డా. సంజీవ్ ఠాకూర్ ప్రమేయం బట్టబయలైంది. ఆ తర్వాత కూడా సాసూన్‌లో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి. కళ్యాణి నగర్ యాక్సిడెంట్ కేసులో నిందితుడిని కాపాడేందుకు డాక్టర్ తవారే సహాయం చేసి అతని రక్త నమూనాను మార్చారు. రక్తం మారిందని అతను నివేదించారని.. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో డబ్బు అందినట్లు సమాచారం. వీరిద్దరిని ఎవరు సంప్రదించారు? వారికి డబ్బులు ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

👉ప్రేమికులు ప్రేమ హద్దులు దాటి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పనులు ఎక్కువగా పార్కుల్లో చేస్తుంటారు. కానీ తాజాగా ప్రయాణికులతో నిండిన బస్సులో ఇద్దరు ప్రేమికులు రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘటన ఒడిశాలోని రూర్కెలాలో జరిగినట్లు చెబుతున్నారు.ప్రేమికులు రన్నింగ్‌లో ఉన్న బస్సులో రొమాన్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు కెమెరాలో బంధించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోను మనోజ్ శర్మ అనే వ్యక్తి తన X ఖాతాలో పంచుకున్నాడు. “మెట్రో రైళ్లలో అయిపోయింది. ఇప్పుడు బస్సులలో ఇలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చాడు. వైరల్ వీడియోలో, ఇద్దరు ప్రేమికులు బస్సులో వెనుక సీటులో కూర్చుని, ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్‌లో మునిగిపోవడం మీరు చూడవచ్చు. పక్కన ఓ పెద్దావిడ ఉన్న కూడా పట్టించుకోకుండా వారు అనుచితంగా ప్రవర్తించారు.ఈ వీడియోకు 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ జంటను ఏకిపారేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు.

👉గుంటూరు కుర్రకారు జోష్ కు బ్రేకులు వేస్తున్న పశ్చిమ ట్రాఫిక్ పోలీసులు..కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో సాయంత్రానికి వాహనాలతో రోడ్లపై సంచరించడం ప్యాషన్ గా మార్చుకున్న యువత…ద్విచక్ర వాహనాలతో యువత చేస్తున్న విన్యాసాలకు విసిగిపోయిన నగర వాసులు…వందల సంఖ్యలో వస్తున్న పిర్యాదులతో ఒక్కసారిగా రోడ్డెక్కిన పోలీసులు..పోలీసులు ఒక్కసారిగా రోడ్డుపై కనిపించడంతో మైండ్ బ్లాక్ అయి సందులు గొందుల్లో పారిపోతున్న యువత…పశ్చిమ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలతో శబాష్ అంటున్న నగర వాసులు…ఎట్టకేలకు కొందరు యువకుల వద్ద నుంచి విన్యాసాలకు వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు….

👉 గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో ఘణంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘణంగా నిర్వహించారు. ముందుగా అశోక్ రెడ్డి ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలుమూలల వ్యాపింపచేసిన మహనీయుడు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి పునాదులు వేసిన ప్రజా నాయకుడు తారకరామారావు అని, వారి అడుగు జాడల్లో నారా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పించే దిశగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించబోతుందన్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?