👉 ధ్యానం లోకి మోడీ…ఈసారి ఆ దిక్కు నుంచి ! గత ఎన్నికల ప్రచారం తరువాత మోడీ ఉత్తరాదిన కేదారనాధ్ గుహలలో ధ్యానం చేశారు. నరేంద్ర మోడీ 2019 నుంచి ఒక కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు. రెండున్నర నెలల పాటు విపరీతంగా ప్రచారం చేయడం ఆ మీదట ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానముద్రలో ఉండిపోవడం. గత ఎన్నికల ప్రచారం తరువాత మోడీ ఉత్తరాదిన కేదారనాధ్ గుహలలో ధ్యానం చేశారు. అలా ఆయన మూడు రోజుల పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 304 సీట్లు సాధించింది. ఎన్డీయే కూటమి తో కలుపుకుంటే 330 దాకా సీట్లు దక్కాయి.అలా మోడీ ధ్యానం తో ఇహం పరం రెండూ సాధించారు.ఈసారి కూడా ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్తున్నారు. కానీ ఈసారి ఆయన దక్షిణ దిక్కున ధ్యాన దీక్ష తీసుకుంటున్నారు.ఆయన ఈ నెల 30న తమిళనాడుకు వస్తారు. అక్కడ నుంచి కన్యాకుమారి కి వెళ్తారు.వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శిస్తారు.వివేకానంద రాక్ వద్ద మే 30 నుంచి జూన్ 1 సాయంత్రం వరకూ మూడు రోజుల పాటు మోడీ ధ్యానం చేస్తారు. గతంలో వివేకానందుడు ఇక్కడే ధ్యానం చేశారు. సరిగ్గా ఆ ప్రాంతాన్ని మోడీ ఎంచుకుంటున్నారు. మోడీ ఈసారి కూడా ధ్యానంలో కఠిన నిబంధనలు అనుసరించనున్నారు. ఆ మూడు రోజులూ ఆయన శ్వాస మీద దృష్టి పెట్టి ఉంటారు.ఈ దీక్ష తరువాత ఆయన జూన్ 1వ తేదీ సాయంత్రం మాత్రమే తిరిగి ఐహిక ప్రపంచంలోకి వస్తారు.ఒక విధంగా ఇది మోడీ మార్క్ ట్రెండ్. ఆయన ధ్యానానికి ఎంతో శక్తి ఉంది అని అంటారు. దేశంలో ఈసారి బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు టార్గెట్ గా మోడీ పెట్టుకున్నారు. దాంతో వాటిని సాధించగలమని ఆయన బలంగా నమ్ముతున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం తో చివరి విడత పోలింగ్ పూర్తి అవుతుంది. అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీవీ చానళ్లలో ప్రారంభం అవుతాయి. మరి జూన్ 4 ఫలితాల కంటే ముందే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటో అవి తెలియచేస్తాయి. అలా మోడీ ధ్యాన ముద్రను విడిచిన తరువాత తొలి ఫలితం ఎలా ఉంటుందో కూడా స్వయంగా చూస్తారు అన్న మాట.. ఇటీవల ఆయన తాను దైవంశ సంభూతుడిని అనే సంచలనం సృష్టించారు.. మరి దైవాంశ సంభూతులైన వారికి ప్రజల పట్ల వివక్ష ఎందుకు ఉంటుందని, కేవలం శతకోటీశ్వరులకే న్యాయం చేయడం అందుకు విరుద్ధం కాదా అని విపక్షాలు ఆయనను ఎద్దేవా చేశాయి.. ప్రస్తుతం ఆయన చేపట్టిన దీక్ష కొన్ని వర్గాల వారిని మనోభావాలను రెచ్చగొట్టేందుకే అని, పదేళ్లపాటు ఆయన మాయమాటలను ప్రజలు ఇకపై నమ్మబోరని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
👉ఆంద్రప్రదేశ్ లో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు.
జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు.సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బయట వ్యక్తులకు బెల్ట్ షాపులకు రాజకీయ నాయకులకు మద్యం విక్రయించినట్లు ఆరోపణలు వచ్చిన కఠినమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ వెల్లడించారు
👉గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు: ఎస్పీ సుమిత్. ఓట్ల లెక్కింపు రోజున ప్రకాశం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశంజిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు.బుధవారం కనిగిరిలో రాజకీయ నాయకులు ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాలలో బాణాసంచా కాల్చడం,డ్రోన్ ఎగరవేయడం చేయరాదని స్పష్టం చేశారు.
👉 హైదరాబాద్‌లో స్టార్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ దాడులను తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మంలోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రెస్ట్ ఇన్, శ్రీశ్రీ, హవేలీ రెస్టారెంట్‌లో తనిఖీలు కొనసాగించారు. విస్తుపోయే నిజాలు కళ్లకు కట్టారు. నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్, నాసిరకం మసాలాలు సీజ్ చేశారు. రెస్ట్ ఇన్ హోటల్లో వినియోగదారులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన చికెన్ కబాబ్ లను కాల్వలో వేయించారు ఫుడ్ కంట్రోలర్ అధికారులు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.పాడైపోయిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో వేడివేడిగా వంటకాలు తయార్ చేయడమే కాకుండా.. ఎక్స్‌పైరీ అయిపోయిన ఇంగ్రీడియంట్స్‌తో బిర్యానీ రెడీ చేస్తున్నట్లు అధికారులు రైడ్స్‌లో గుర్తించారు. అంతేకాదు కల్తీ నూనెలు, పాలు, మసాలా దినుసులు, తృణధాన్యాలు, పిండి, వాటర్ బాటిల్స్ సహా దేనిని వదలకుండా ప్రతీదాన్ని కల్తీ చేసి ఫుడ్ తయార్ చేస్తున్నారు. ఇక ఐస్‌క్రీమ్స్, కాఫీ, టొమాటో సాస్, వెజిటెబుల్ ఆయిల్స్, నెయ్యి.. ఇలా ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్నా.. అన్నింట్లోనూ అదే దుస్థితి కొనసాగుతోంది. రెస్టారెంట్లు, హోటళ్లు…ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో.. ప్రజల ఆరోగ్య భద్రతా ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వం సీరియస్ ఆదేశాలు జారీచేసింది. కల్తీ విషయంలో ఎంత పెద్ద వారున్న ఉపేక్షించేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.దాంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడుల కొరడా ఝళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో వణుకుమొదలైంది. ఏక్షణం, ఎటు వైపు నుంచి ఏ అధికారి వచ్చి రైడ్ చేస్తాడో తెలియక టెన్షన్ పడుతున్నారు.
👉చనిపోయిన వ్యక్తికి ఏడాది క్రితం బైక్ లోన్.. రికవరీ కోసం ఇంటికి వెళ్తే బయటపడ్డ మోసం!..రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంకు అధికారులు బుల్లెట్ బైక్ కు లోన్ ఇచ్చారు. కానీ, చివరికి ఏం జరిగిందంటే..?ఇటీవల కాలంలో నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసే నేరగాళ్లు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు, ప్రభుత్వశాఖల పేర్లతో తప్పుడు పత్రాలు సృష్టించి భూ కబ్జాలు, బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని బురిడి కొట్టిస్తున్నారు.
ఇప్పటికే బ్యాంకుల నుంచి చాలామంది లక్షల రూపాయాలను తీసుకొని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఈఎంఐ పేరుతో ఓ కేటుగాడు చేసిన పనికి లోన్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.👉ఇంతకి ఏం జరిగిందంటే..?రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి పేరిట బ్యాంకు అధికారులు బుల్లెట్ బైక్ కు లోన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని మరీ ఆయన పేరు మీద రూ.3 లక్షల విలువైన బుల్లెట్ బండి రిలీజ్ చేశారు. చివరకు కిస్తీలు సరిగా కట్టడం లేదంటూ వారి ఇంటికి వెళ్లి చూసిన బ్యాంక్ అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఆ వ్యక్తి చనిపోయి రెండున్నర సంవత్సాలు దాటిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ బ్యాంకు అధికారులు నివ్వెరపోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా, ఈ విచిత్ర సంఘటన వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేశ్ దంపతులకు ముగ్గురు కొడుకులు. అందులో పెద్దవాడైన భూక్య రాకేష్ వివిధ సమస్యల కారణంగా 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు రెండున్నర సంవత్సరాలకు పైగా అవుతుంది. కానీ, ఇప్పుడు కొంత మంది బ్యాంకు అధికారులు రాకేష్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే రాకేష్పేరు మీద లోన్ ఉందని, కిస్తీలు సరిగా కట్టడం లేదని దబాయించడంతో ఆయన తల్లిదండ్రులు, స్థానికులంతా షాక్ అయ్యారు. ఎందుకంటే.. రాకేష్ ఎప్పుడో చనిపోతే, ఆయన బండి తీసుకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు భూక్య రాకేష్ 2022 జనవరి 23న చనిపోగా, 2023 అక్టోబర్ 18న ఆయన పేరు మీద కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్350 సీసీ ద్విచక్ర వాహనానికి సుమారు రూ.3 లక్షల లోన్ మంజూరు చేశారు. ఇలా మొత్తంగా 48 నెలల ఈఎంఐ ప్లాన్ కూడా ఇచ్చారు. ఈ మేరకు ప్రతి నెలా రూ.7,150 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని బండి రిలీజ్ చేశారు. ఆ తరువాత మూడు నెలల పాటు కిస్తీలు కూడా ఖాతాలో జమయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోవడంతో లోన్ రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ రాకేష్ఇంటికి వెళ్లారు. అక్కడ బుల్లెట్ బండి కనపడకపోగా, ఆయన గతంలోనే చనిపోయాడన్న విషయం తెలుసుకుని బ్యాంక్ అధికారులు షాక్ గురయ్యారు.ఇక తప్పుడు పత్రాలు సృష్టించి ఎవరో రాకేష్ పేరున తీసుకున్నరని కుటుంబ సభ్యులు చెప్పినా బ్యాంకు అధికారులు వినకుండా ఆ కుటుంబం పై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు ఎదురు తిరిగారు. ఎవరికి లోన్ ఇచ్చి ఇలా తమను కట్టమంటే ఎలా కడతామని నిలదీశారు. అనంతరం స్థానికంగా పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే మృతి చెందిన రాకేష్ మిత్రుడొకరు నర్సంపేటకు చెందిన వ్యక్తికాగా, ఆయన ద్వారానే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా నర్సంపేటకు చెందిన వ్యక్తే బండి తీసుకుని, బ్యాంక్ సిబ్బంది, దళారుల సహాయంతో ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. పైగా రాకేష్ పేరున తప్పుడు పత్రాలు సృష్టించి, బ్యాంకు సిబ్బందిని మేనేజ్ చేసి లోన్ మీద బండి తీసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయంపై సంబంధిత బ్యాంకు అధికారులు కూడా పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం అందింది.
👉సీఐ సోమయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాజా నగర్, మరియు పట్టణంలో గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య ఆధ్వర్యంలో బుధవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వెల్లడించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నమని సీఐ సోమయ్య అన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
👉పశ్చిమగోదావరి జిల్లా:రెవెన్యూ అధికారుల చర్యలకు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టిన విజయలక్ష్మి..కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన విజయలక్ష్మి..రెవెన్యూ అధికారుల చర్యలకు అన్యాయంగా తమపై నోటీసులు ఇస్తున్నారంటూ ఆరోపణ..తక్షణమే స్పందించిన సీఐ సుబ్రహ్మణ్యం డి.ఎస్.పి మూర్తి పోలీస్ సిబ్బంది..ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టకుండా నీళ్లు పోసి విజయలక్ష్మిని సురక్షితంగా ఇంటికి తరలించిన పోలీసులు..
👉….జంగారెడ్డిగూడెం పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు..విధులలో నిర్లక్ష్యం వహిస్తూ సబ్ స్టేషన్ లో ఒక మహిళ తో నగ్నం గా నిద్రిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ మహేశ్వర రెడ్డి…తెల్లవారు ఝామున నుండి కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో సబ్ స్టేషన్ లోకి వెళ్లిన్ స్థానికులు…ఉన్నతాధికారులకు సమాచారం అందించిన స్థానికులు…సబ్ స్టేషన్ లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్న మహేశ్వర రెడ్డి…పోలీస్ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన అధికారులు….
👉విజయవాడ.. కలుషిత నీటి ఘటనలో అధికారులపై చర్యలు..ఆరుగురు విఎంసి అధికారుల సస్పెన్షన్. ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ..మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి. ఆస్పత్రిలో 24 మందికి కొనసాగుతున్న చికిత్స..మొగల్రాజపురంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు. వైద్య శిబిరం దగ్గర డిఎంహెచ్ ఓ సుహాసిని పర్యవేక్షణ..నీటిని పరీక్షల కోసం పంపిన అధికారులు. పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచన..*పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
👉 జనగామ జిల్లా: వృద్ధురాలు మెడలోని నాలుగు తులాల బంగారం అపహరించిన గుర్తు తెలియని యువకులు..పాలకుర్తి ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిట్యాల.లింగమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో ఉండగా ఎవరు లేని సమయం అదునుగా భావించి ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్ పై వచ్చి ఆమె ను కొట్టి ఆమె మెడలోని పుస్తెల తాడు, నల్లా పూసలు గొట్టాలు ఎత్తుకెళ్లగా లబోదిబోమంటు కన్నీరుమున్నీరుగా విలపిస్తుతుంది..
👉బాపట్ల మండలం నాగరాజు కాలువ వద్ద నలుగురు యువకులు గల్లంతు.హైదరాబాద్ లోని కూకట్ పల్లి వాసులుగా గుర్తింపు.ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రావడం జరిగింది.తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న నాగరాజు కాలవలోకి ఆరుగురు వ్యక్తులు దిగగా నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.సన్నీ,సునీల్, కిరణ్,నందులు కాలవలో గల్లంతయ్యారు.విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పడవ సహాయంతో నాగరాజు కాలవ వెంబడి గాలిస్తున్నారు.
👉 నల్గొండ జిల్లాలో భలే దొంగలు సినిమా సీన్ రిపీట్ అయింది.ఆ సినిమాలో తరుణ్, ఇలియానా దొంగతనం చేసినట్లే .. నల్గొండలోనూ లవర్స్ చోరీకి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఈసీన్ చూసిన స్థానికులు వెంబడించడంతో హైస్పీడ్‌తో పరార్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. వాస్తవానికి ఈ కేసు నల్గొండ జిల్లా మర్రిగూడలో చైన్స్ స్నాచింగ్ కేస్ సంబంధించిన నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో వారిద్దరూ లవర్స్ కాదని భార్యాభర్తలని గుర్తించారు పోలీసులు. నిందితుడిని హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా గుర్తించారు.వీరు దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.వీరు సునీత అనే మహిళను లిప్ట్ ఇస్తామని చెప్పి స్కూటీ ఎక్కించుకొని..కళ్ళలో కారంచల్లి మంగళ సూత్రాన్ని లాక్కెళ్ళారు.పట్టుబడ్డ ఇద్దరు చెడు వ్యసనాలకు అలవాటు పడి పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.సెల్ ఫోన్ సిగ్నల్, బండి నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేశారు. గతంలో ఎక్కడైనా దొంగతనాలు చేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.సోషల్ మీడియాలో వీరి దొంగతనం గురించి తెగ వైరల్ అవుతోంది.