జాతిపితపై మోడీ సంచలన వ్యాఖ్యలు..పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై రగడ..ఒంగోలులో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్..గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి?..రిటర్నింగ్ అధికారి సస్పెండ్.. వాలంటీర్ ఇంట్లో బాంబులు .

👉 మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మన జాతిపిత మహాత్మ గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు అని అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో… మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. మహాత్ముడి వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది. ఇదే సమయంలో… గాంధీ అంటే బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించిన మోడీ… స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ 75 సంవత్సరాల్లో మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై లేదా? అని ప్రశ్నించారు. మహాత్ముడిపై హాలీవుడ్‌ లో తీసిన సినిమా విడుదలైన తరువాతే ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్ సంగతి కాసేపు పక్కనపెడితే… కాంగ్రెస్ పార్టీ మాత్రం కస్సుమంది. ఇందులో భాగంగా… అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వాళ్లు ఎప్పటికీ బాపూజీ చూపిన సత్య మార్గంలో ప్రయాణించలేరని అన్నారు. ఇదే సమయంలో మోడీ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ… మహాత్మాగాంధీ గురించి తెలుసుకోవాలంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే సినిమా చూడాలని సెటైర్స్ వేశారు. ఆరెస్సెస్స్ విద్యార్థి నుంచి గాంధీజీకి ఎలాంటి సర్టిఫికేట్ అక్కర్లేదని.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్ మండేలాకు గాంధీ తక్కువేం కాదని తెలిపారు. ఇదే క్రమంలో… మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా… ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్‌ లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

👉ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ..పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాంవైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి…గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు.ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. టీడీపీకి ఎలాగూ గెలిచే ఆలోచన లేదన్నారు.ఏవైనా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లను అడ్డుపెట్టుకుని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‎ను అడ్డుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తమ పార్టీ ముఖ్యనేతలు కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ శర్మను కలిసి వివరిస్తారన్నారు.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిస్తారో అదే మాదిరిగానే ఏపీలో పోస్టల్ ఓట్లు లెక్కించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా సాయంత్రం 4 గంటల లోగా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామంటున్న  వైసీపీనేతలు…

👉సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 4వ తేదీన రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు ఈ నెల 30వ తేదీ నాటికీ పూర్తి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎ.ఎస్. దినేష్ కుమార్, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు రిటర్నింగ్ అధికారులు, సహా రిటర్నింగ్ అధికారులతో సమావేశమై ఈ నెల 4వ తేదీన రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారిచేశారు.

👉షాద్ నగర్ ఎన్ కౌంటర్” సొమ్మంతా యాడికి పోయింది..?గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి సారూ..? నయీం ఆస్తులపై సీఎం రేవంత్ న్యాయవిచారణ చేయిస్తారా..?* షాద్ నగర్ లో దొరికిన ఆస్తులు నగదు, పత్రాలు ఏమయ్యాయి..దొరికిన నగదు పై చిదంబర రహస్యం!!!..

హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. షాద్ నగర్ లో గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆరోజు స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు నగలు నగదు ఏమయ్యాయని ప్రశ్న మొదలవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అప్పటి షాద్ నగర్ లో ఈ ఎన్కౌంటర్ సమయంలో అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాను ఎవరిని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు కొంతమంది స్థానిక జర్నలిస్టులు సంఘటన స్థలానికి వెళితే వాళ్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఉదయం నుండి సాయంత్రం దాకా సాగిన ఈ తంతులో మొట్టమొదట అక్కడ చేరుకున్న జర్నలిస్టులు అనేక చిత్ర విచిత్ర విన్యాసాలు చూశారు. అనేక రూపకల్పనలు జరిగిన దాఖలాలు అక్కడ కనిపించాయి. కానీ అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఇదంతా డ్రామా చేయించి మీడియాను దగ్గరకు కూడా రాకుండా చేశారనేది వాస్తవం. మరోసారి ఈ అంశం తెరపైకి వస్తుండడంతో హలో షాద్ నగర్ కేపీ ప్రత్యేక కథనం..షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్ షిప్ లో జరిగిన ఆ ఎన్ కౌంటర్ సంఘటనలో అక్కడికి శీఘ్రంగా వెళ్లిన స్థానిక జర్నలిస్టులు కొందరు మొదట ఉన్న పరిస్థితులు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్ని కళ్లకు కట్టినట్టు చెబుతారు. డబ్బు లెక్కింపుకు వచ్చిన పరికరాలు, డిసిఎం వాహనాల నిండా సొత్తు తీసుకెళ్లిన దాఖలాలు, పత్రాలు విలువైన వస్తువులు ఎన్నో ఊడ్చిపెట్టుకుని మరి తీసుకుపోయారు. కానీ అదంతా ఏమైందో ఇప్పటివరకు స్థానిక మీడియాకు కూడా వెల్లడించలేదు. ఇంకెవరికి కూడా తెలియదు.. ఈ ఎన్ కౌంటర్ అంతా చిదంబర రహస్యమే. అయితే నయీం ఆస్తులపై సస్పెన్స్ తీరేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ లో పలువురు కోరుతున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీంను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో 2016 ఆగస్టు 9న ప్రత్యేక బృందం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.ఆయనపై అనేక చోట్ల నమోదైన 197 కేసులను దర్యాప్తు చేసేందుకు అప్పటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను సిట్ వెలుగులోకి తెచ్చింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్‌ అప్పటిలో నిర్ధారించింది. నయీం పైనా ఆయన బినామీల పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ కూడా అప్పటిలో అంచనా వేసింది.

షాద్ నగర్ ఎన్ కౌంటర్ ద్వారా అప్పట్లో పోలీసులు కొన్ని విషయాలు మాత్రమే మీడియా దృష్టి తెచ్చారు.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని ఎన్ కౌంటర్ తర్వాత సిట్‌ గుర్తించింది. నయీం డెన్‌లో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 8 లక్షల 52 వేల 400 రూపాయల నగదుతోపాటు 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్‌ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అప్పటిలో పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే షాద్ నగర్ విలీనం టౌన్షిప్ లో పెద్ద ఎత్తున లభించిన నగదు వస్తువులు ఆస్తి పత్రాలు బయటికి రాలేదనే విమర్శ ఉంది.నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటమనిషి ఫర్హానా పేరిట హైదరాబాద్‌, సైబరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని సమాచారం. చరాస్తుల గురించి అనుమానం లేకపోయినా కూడా స్థిరాస్తుల గురించి మాత్రం పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా పరాధీనం అయ్యాయని కూడా కొందరు అంటున్నారు. రాజకీయ నాయకులు ఆ ఆస్తులను గుర్తించి తమ పేరిట మార్చుకున్నారని కూడా అంటున్నారు. అప్పటిలో నయీం తన పేరు మీద, తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందనేది సమస్యగా ఉండేది. ఒకసారి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ లభిస్తాయి.బెదిరింపులతో ఆస్తులు కూడపెట్టుకున్నా అన్ని ఆస్తులను సంపాదించే శక్తి నయూంకు లేదన్న కారణాలతో అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అప్పటిలో అనుకున్నారు. అయితే అక్రమాస్తులను బాధితులకు అప్పగించే విషయంలో చట్టపరమైన సమస్యలు వస్తాయని కూడా అప్పటిలో భావించారు. బెదిరించి బలవంతంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు కాబట్టి వాటిని బాధితులకు అప్పగించాలనే వాదన ఉంది. ఆ దిశగా కూడా కొంత ప్రయత్నం చేశారు. ఆ ముసుగులో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడున్న ప్రభుత్వానికి కొందరు ఉప్పందిస్తున్నారు.పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని తొలుత సమర్థించారు. ఈ ప్రక్రియ న్యాయస్థానం ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఆక్రమించుకున్న ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయి. ఆక్రమణల్లో నయీం చట్టబద్దమైన వ్యూహాన్ని అనుసరించాడు.నయీం రెండు రకాలుగా ఆస్తులు సంపాదించేవాడు. తన అనుచరుల ద్వారా ఆస్తుల సమాచారం సేకరించి, వాటి యజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆక్రమించుకునే వాడు. ఎవరైనా భాగస్వామ్య వివాదాలతో తన వద్దకు వస్తే ఇద్దర్నీ కాదని ఆ ఆస్తిని తనపరం చేసుకునేవాడు. ఆక్రమించుకున్న ఆస్తులను నయానోభయానో చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడు. సంబంధిత దస్త్రాలన్నీ తన వద్దనే ఉంచుకునేవాడు.అయితే ఎన్ కౌంటర్ తర్వాత నయీం భూములు ఏమయ్యాయి అనే అంశంపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తున్నది.చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో.ఆ చిదంబర రహస్యాన్ని ఎలా బయటికి తీస్తారు వేచి చూడాలి. షాద్ నగర్ ఎన్కౌంటర్ పై అన్ని అనుమానాలే ఉన్నాయన్నది మాత్రం జగద్వితం..’ కే పీ ‘

👉బిజెపి పార్టీలో అస్సలు అవినీతి లేదు అందరూ సత్యహరిశ్చంద్రులు అని నమ్మే మూర్ఖులకు ఇది మంచి ఉదాహరణ..లోకసభ స్పీకరు *ఓం బిర్లా* కూతురు అక్రమంగా IAS పదవి పొందింది ఎలాగు అంటే మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం UPSC అనే రాత పరీక్ష ద్వారా కాకుండా కొందరిని లాటరల్ ఎంట్రీ ద్వారా కూడా నియామకాలు జరపడానికి రాజ్యాంగంలో రాసి ఉన్న నియమాలు మార్చేశారు.అయితే ఇలా నియామకం పొందిన ప్రస్తుత లోక సభ స్పీకరు కూతురు ఒక పెద్ద ప్రభుత్వ పదవిలో ఉండి కూడా తన తండ్రి పోటీ చేస్తున్న కోటా పట్టణంలో అసెంబ్లీ స్థానానికి *బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం* ప్రభుత్వ అధికార దుర్వినియోగం కాదా?ఈ విషయం మోడీకి,ఎన్నికల కమిషన్ కు తెలియదా.మరి వీరి దృష్టిలో ఉండి కూడా వీళ్ళని ఈ రకంగా అధికార ఉల్లంఘనకు ఎలా చూస్తూ ఊరుకున్నాడు. అంటే మోడీ మరియు ఎన్నికల కమిషన్ కూడా అవినీతికి పాల్పడినట్టు కాదా అని పలువురు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.. ఇంకా ఎలక్ట్రోరల్ బాండ్స్ విషయంలో  బిజెపి ప్రభుత్వం అవినీతికి పాల్పడిన సంస్థల నుండి విరాళాలు సేకరించడం పై.. విదేశాలకు ఎగుమతి చేస్తున్న సంస్థల వద్ద కూడా విరాళాలు సేకరించడం.. అంబానీ అదాని వంటి  శతకోటీశ్వరులకు బిజెపి ప్రభుత్వం లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం.. లక్షల కోట్ల బ్యాంకు బకాయిలు రద్దు చేయడం.. విజయ్ మాల్యా వంటి వారిని మన దేశానికి రప్పించింది బకాయిలను వసూలు చేయడంలో.. కర్ణాటకలో సెక్స్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన ప్రజ్వల్ రేవన్న వంటి వారిని మన దేశానికి రప్పించడంలో తాత్సారం చేయడం..పేద ప్రజల  సంక్షేమ పథకాలు మాత్రం భారం అని చెప్పి రద్దు చేయడానికి ప్రయత్నించడం.. పీఎం రిలీఫ్ ఫండ్కు్్ కు లెక్కలు చూపకపోవడం అవినీతి కాదా అని విపక్షాలు బహిరంగంగా ప్రశ్నిస్తున్న సమాధానం లేదు..

👉రైతులు అప్రమత్తంగా ఉండాలి.. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ, విక్రయాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. జిల్లా ఎస్పీ రితిరాజ్,మే 29,గద్వాల్ : జిల్లాలో నకిలీ విత్తనాల రవాణా , ఉత్పతి , విక్రయాలు జరిపి రైతులను మోసం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, నకిలీ సీడ్స్ అమ్మే వారి పట్ల రైతులు మోసపోకుoడ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.ఆరుగాలం కష్టించి పని చేసే రైతులు మోసపోకుండా ఉండేందుకు జిల్లా లో నకిలీ సీడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిల్లా ఎస్పీ గారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో గతం లో నమోదు అయిన నకిలీ విత్తనాల కేసుల వివరాలను పరిశీలించారు.ఆయా కేసులలో ఉన్న నిందితుల పై పోలీస్ అధికారులు నిఘా ఉంచాలని, ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారు, ఎలా జీవనం కొనసాగిస్తున్నారు వంటి వివరాలు తెలుసుకొని నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కేసులలో సాక్ష్యాధారాలు సేకరించడం తో పాటు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్, ఏ. ఓ రిపోర్ట్ పకడ్బందీగా సబ్మిట్ చేసి ఆయా కేసులలో నిందితులకు శిక్షలు పడేందుకు కృషి చేయలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. వర్ష కాలం సమీపిస్తున్న వేళ గ్రామాలలో రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలలో వీ పి ఓ ల ద్వారా నిఘా పటిష్ఠం చెయ్యాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలో నకిలీ విత్తనాలు జిల్లాలోకి రావడం గాని, జిల్లా నుండి బయటకు వెళ్లడం జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, విత్తనాలు అమ్మే షాపులు లలో నిఘా ఉంచి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలనీ , లూస్ విత్తనాలను కొనవద్దని, గుర్తింపు పొందిన కంపనీ డీలర్ల వద్ద మాత్రమే సీడ్స్ ను తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైన తక్కువకు విత్తనాలు వస్తాయoటే కొని మోసపోవద్దు అని,జర్మినేషన్ టెస్ట్ లో ఫెయిల్ అయిన విత్తనాలను విక్రయించే అవకాశం ఉందని వాటిని కొని మోసపోవద్దు అని అలాగే ఇతర ప్రాంతాల నుండి గ్రామాల్లోకి వచ్చి నకిలీ లేబుల్ తో అమ్మే విత్తన ప్యాకెట్స్ లను తీసుకోవద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు .జిల్లా లో ఎవరైనా నకిలీ సీడ్స్ ను అమ్మిన, సరఫరా చేసిన, అలాంటి వారికి సహకరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అలాంటి వారి పై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు

👉 రిటర్నింగ్ అధికారి పై వేటు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న జరిగిన పోలింగ్లో యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో, సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.

👉స్పా సెంటర్ పై దాడి.. 8మంది మహిళలు అరెస్ట్..  హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీసులు నాలానగర్లోని రెండు స్పాలపై బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడులో ఎనిమిది మంది మహిళలతో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఖచ్చితమైన సమాచారం ఉండడంతో జన్నత్, మ్యాజికల్ ఫ్రెండ్స్ స్పా దాడి చేసి వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు మొహమ్మద్ ఆరిఫ్, రూబీ, ఆదిత్యాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?