👉ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చారు:మన్మోహన్ సింగ్..మోడీపై ఫైర్!..ప్రస్తుతం వీల్ చైర్‌కే పరిమితమైన మన్మోహన్ సింగ్..ఓ బహిరంగ లేఖను సంధించారు.పార్లమెంటు ఎన్నికల తుది దశ ప్రచారం ముగిసిన తర్వాత..దేశ రాజకీయాల్లో ట్విస్టు చోటు చేసుకుంది.ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని,కాంగ్రెస్ నాయకుడు మన్మోహన్ సింగ్(ఎం.ఎం) తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.ప్రధాని పదవి హుందా తనాన్ని దిగజార్చారని మండిపడ్డారు.ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోడీ నోటీ నుంచి ద్వేష పూరిత పదాలు.. అత్యంత దారుణమైన పదాలు వస్తున్నాయని.. వినేందుకుసైతం ఏహ్యం కలిగిస్తున్నాయని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీల్ చైర్‌కే పరిమితమైన మన్మోహన్ సింగ్.. ఓ బహిరంగ లేఖను సంధించారు. దీనిలో తొలిసారి ఆయన మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ చేస్తున్న ప్రసంగాలు గతంలో ఏ ప్రధాని చేయలేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. తద్వారా..మోడీ ప్రధానికార్యాలయం పరువును హుందాతనాన్ని తగ్గిస్తున్నారని అన్నారు.రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని.. నిరంకుశ పాలన నుంచి రక్షించేందుకు ప్రజలు దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని ఈ దేశానికి చేసింది ఏమీలేదన్నారు. రైతుల ఆదా యాన్ని పెంచుతామని చెప్పిన మోడీ.. ఆదాయాన్ని పెంచకపోగా.. పంజాబ్ రైతన్నలపై తుపాకీ గుళ్లు పేల్పించారని.. పైగా రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని అన్నారు. మోడీ చేస్తున్న ప్రసంగాలు అత్యంత దుర్మార్గంగా, ద్వేషపూరితంగా ఉంటున్నాయని మన్మోహన్ సింగ్ తెలిపారు. మోడీ హయాంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవడం దారుణ మని అన్నారు. అంతేకాదు.. కరోనా మరణాలు దాచారన్న అంతర్జాతీయ నివేదికలను కూడా.. దాచిపెట్టా రని.. మీడియాను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారని.. ఇంతగా ఏ ప్రధానీ 75 ఏళ్ల భారత దేశ చరిత్రం అభద్రతా భావనతో లేరని మన్మోహన్ వ్యాఖ్యానించారు. కాగా.. జూన్ 1న తుదిదశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని లేఖకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
👉 ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
వీలైనంతవరకు వివాదాలకు కాస్తంత దూరంగా ఉంటారు. ఇప్పటి రాజకీయాలకు భిన్నంగా ఉంటూనే.. రాజకీయ ప్రత్యర్థులు తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మెతగ్గా ఉన్నట్లు కనిపిస్తూనే.. అవసరమైన వేళలో తానేమిటన్న విషయాన్ని ఆయన తన మాటలతో.. చేతలతో చెప్పేస్తుంటారు. తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించిన తీరు.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వింటే నవీన్ పట్నాయక్ మజాకానా? అన్న భావన కలుగక మానదు. ఒడిశాలోని బారపదాలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై అవసరానికి మించిన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నవీన్ ఆరోగ్యం విషయంలో ఏదో కుట్ర జరుగుతోందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారని.. ఆయన అనారోగ్యం వెనుక ఎవరున్నారన్న విషయాన్ని తెలుసుకోవటం ఒడిశా ప్రజల హక్కుగా అభివర్ణించారు. మొత్తంగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యంగా లేరని.. ఆయన అనారోగ్యంపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని.. పట్నాయక్ ఆరోగ్య క్షీణించటానికి కారణం ఏమిటన్నది అన్వేషించటానికి ఒఢిశా అసెంబ్లీని తాము గెలుచుకున్న తర్వాత.. ఒక కమిటీని వేసి వెతుకుతామన్న వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆరోగ్యంలో ఏదో లెక్క తేడా ఉందన్న అభిప్రాయాన్నికలిగేలా చేశారని చెప్పాలి. దీనిపై తాజాగా స్పందించారు నవీన్ పట్నాయక్. తన ఆరోగ్యంపై ప్రధానమంత్రి మోడీకి అంత ఆందోళన ఉండి ఉంటే.. ఆ విషయాన్ని తనకే నేరుగా ఫోన్ చేసి అడిగి ఉంటే బాగుండేది కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తాను ఆరోగ్యంగా ఉన్నాని… తీవ్రమైన ఎండలోనే ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పదేళ్లుగా తన ఆరోగ్యంపై బీజేపీ పుకార్లు పుట్టిస్తోందని.. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లుగా చెప్పారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో తాను ప్రచారం చేస్తున్నాని.. తన ఆరోగ్యంపై తాను ప్రధానికి హామీ ఇస్తున్నట్లుగా కౌంటర్ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం సరిగా లేదన్న బూచిని చూపించి.. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధిక్యతను ప్రదర్శించాలన్న చౌకబారు ఎత్తుగడను మోడీ అండ్ కో వేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు నవీన్ పట్నాయక్ ఇచ్చిన ఘాటు కౌంటర్ మోడీకి భారీపంచ్ గా అభివర్ణిస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి.. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉గాజాలో ఆ 13,000 మంది ఏమయ్యారు? ఇలా మరణించిన వారి విషయంపై క్లారిటీ ఉందట కానీ.. తాజాగా అదృశ్యమైన వారి సంఖ్య తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. హమాస్ – ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంవల్ల గాజాలో ఇప్పటికే సుమారు 36 వేల మంది పాలస్తీనియన్లు మరణించారని అంటున్నారు.ఇలా మరణించిన వారి విషయంపై క్లారిటీ ఉందట కానీ..తాజాగా అదృశ్యమైన వారి సంఖ్య తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వారి సంఖ్య సుమారు 13,000 ఉండొచ్చని అంటున్నారు. అవును…అక్టోబరు 7న, ఇజ్రాయెల్ లోని ఒక మ్యూజిక్ ఫెస్ట్ లక్ష్యంగా హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఊచకోతలో సుమారు 1,200 మంది మరణించారు. మరోపక్క హమాస్ ఫైటర్లు సుమారు 252 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్ ను తుదముట్టించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది..గాజాపై విరుచుకుపడిపోతుంది. అయితే…గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేస్తున్నప్పటి నుంచీ గాజాలోని సుమారు 13 వేల మంది ఆచూకీ తెలియడం లేదని జెనీవాలో ఉన్న యూరో మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. దీంతో ఆ పదమూడు వేల మంది పాలస్థీనియన్లు ఏమయ్యారనే చర్చ బలంగా వినిపిస్తుంది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13,000 మంది ఆచూకి తెలియడం లేదనే విషయం ఇప్పుడు గాజాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిలో సుమారు వేల మంది వరకూ శిథిలాల కింద చిక్కుని మృతి చెంది ఉంటారని అంటున్నారు. ఈ మేరకు గాజా సివిల్ డిఫెన్స్ ఆ విధంగా అంచనా వేసింది.ఇక్కడ మరో టెన్షన్ విషయం ఏమిటంటే… గాజాలోని శిథిలాల కింద చాలా మృతదేహాలతో పాటు సుమారు 7,500 టన్నుల పేలని ఆయుధాలు మిగిలి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. దీంతో.. ఇది మరింత ఆందోళనకరమైన అంశం అని అంటున్నారు. ప్రస్తుతం శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు వలంటీర్లతో కలిసి సివిల్ డిఫెన్స్ పనిచేస్తోంది. ఈ సమయంలో గాజాలో ఎండలు పెరుగుతుండటంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయకపోతే.. అవి కుళ్ళిపోతాయని, ఫలితంగా ఇది ఆరోగ్య సమస్యకు దారితీస్తుందనే ఆందోళన కూడా వినిపిస్తుంది. దీంతో… మృతదేహాలను వెలికితీసేందుకు ఐక్యరాజ్యసమితితో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్న దేశాల మద్దతును కోరింది సివిల్ డిఫెన్స్! ఇదంతా ఒకెత్తు అయితే… అదృశ్యమైన వ్యక్తులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) నిర్బంధించి ఉండవచ్చని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భావిస్తోంది. ఇదే సమయంలో గాజాకు చెందిన వందలమంది పాలస్తీనియన్లు ఐడీఎఫ్ ఆధీనంలో ఉన్నారని.. ఈ విషయంపై వారి కుటుంబాలకూ సమాచారం లేదని యూరో మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్ ఆరోపిస్తోంది. మరి ఈ మిస్సింగ్ వ్యక్తుల ఆచూకీపై హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలాంటి ఆలోచనలు చేయబోతుందనేది వేచి చూడాలి!
👉ఢిల్లీలో తాగు నీటి కష్టాలు నీరు వృథా చేస్తే 2 వేల జరిమానా*హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది.ఈ నేపథ్యంలో ఎవరైనా నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
👉 పాత గొడవలతోనే హత్యాయత్నం ..పెట్రో బాంబు దాడి కేసులో ఒకరి అరెస్ట్ ..మరొకరు పరారీ..విలేకరుల సమావేశంలో డిఎస్పి రామరాజు వెల్లడి..కనిగిరి: వెలిగండ్ల మండలం పందువ పంచాయతీలోని జంగం నర్సాయపల్లిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాధ్యాయుడు తీట్ల నారాయణపై జరిగిన హత్యాయత్నం పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని రాజకీయాలకు సంబంధం లేదని డిఎస్పి ఆర్ రామరాజు వివరించారు. హత్య ప్రయత్నం కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మరొకరిరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.బుధవారం సాయంకాలం డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఉపాధ్యాయుడు తీట్ల నారాయణకు అదే గ్రామానికి చెందిన వాలంటీర్ గా పనిచేసి రాజీనామా చేసిన కటుకూరి అనంతబాల అలియాస్ దూదేకుల రజాక్, కటుకూరి రహీంకు గత నాలుగేళ్ల క్రితం కోవిడ్ సమయంలో పాత గొడవలు జరగటంతో అప్పటినుంచి విభేదాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కటుకూరి అనంత బాల బంధువైన కటుకూరి రహీంను తీసుకొని ఉపాధ్యాయుడిని హత్య చేయటానికి పథకం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడు నారాయణ కుటుంబ సభ్యులపై బీరుపాటిల్లో పెట్రోలు నింపి నిప్పు పెట్టి విసరటంతో అది చెట్టుకు తగిలి ఒకసారి గా పేలి మంటలు రావటంతో నారాయణ కుటుంబం ఉలిక్కిపడి లేచి భయభ్రాంతులకు గురైనారన్నారు. కుటుంబ సభ్యులను చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ తో నిండిన బీరు సీసా కాల్చి విసిరారని ఉపాధ్యాయుడు నారాయణ వెలిగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించి విచారణ చేపట్టామన్నారు. బుధవారం సాయంకాలం నిందితుడు కటుకూరి అనంతబాల పందువ నాగులవరం జంక్షన్ వద్ద అరెస్టు చేశామని, మరో నిందితుడు కటుకూరి రహీం పరారీలో ఉన్నారని త్వరలో నిందితుడిని పట్టుకుంటామని డిఎస్పి రామరాజు తెలిపారు. కేసు విచారణలో ఈ కేసులో వ్యూహాత్మకంగా అడుగులేస్తూ త్వరితగతన కేసును చేదించిన డి.ఎస్.పి రామరాజు, పామూరు సిఐ ఎం రామనాయక్ ,వెలిగండ్ల ఎస్సై శివ, సిఎస్పురం ఎస్ఐ ప్రేమ్ కుమార్ ,పామూరు ఎస్సై సైదుబాబు , కానిస్టేబుల్ ఎస్కే ఎండి సాలికిన్ ను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అభినందించారని తెలిపారు.
👉సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీమకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో కృష్ణయ్య భవనం వద్ద జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం సిఐటియు పోరాటాల నిర్వహిస్తోందని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేపని చేస్తా ఉందని,దేశంలో నూతన ఆర్థిక విధానాలపై,కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి విధానాల పైన, రైతాంగ సమస్యల పైన నిరంతరం పోరాటాలు చేస్తా ఉందని, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తా ఉందనిఅన్నారు.పాలకుల అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మే లు నిర్వహించి రాబోయే రోజుల్లో ఈ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మాట్లాడారు. ముఠావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు బి వీరాంజనేయులు, పి ఆంజనేయులు సిఐటియు నాయకులు పి వెంకటరావు,బి ఓబులేషు,జి అప్పలనాయుడు, బిందె ఆంజనేయులు,డి సురేష్ జి శంకర్, కనకరాజు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు
👉 సిఐటియు 54 వ ఆవిర్భావ దినోత్సవం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్,సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించటం జరిగింది….ఈ సందర్భంగా సిఐటియు జెండాను సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఐక్యత – పోరాటం నినాదం తో 1970 , మే 30 న ఏర్పడిన సిఐటియు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా, కార్మిక హక్కుల పరిరక్షణకై ఉద్యమించే వేగుచుక్క సిఐటియు, దేశంలో ఏ మూల కార్మికులకు సమస్య ఉన్న ప్రతి కార్మికుడు గుర్తించే సంఘంగా సిఐటియు కార్మికుల హృదయలకు హత్తుకునేలా పోరాడుతుంది.. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ,కనీస వేతనం అమలు, సమాన పనికి సమాన వేతనం, కార్మికుడీకీ శ్రమ కు తగ్గ ఫలితం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది.ఆటో , బిల్డింగ్, ముఠా, కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంఘం సిఐటియు. విద్యుత్ ప్రైవేటీకరణ,వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ నికరంగా సిఐటియు పోరాడుతున్నది. అంగన్వాడి, ఆశ,మిడ్ డే మీల్స్, ఉపాధి హామీ, వివో ఏ,ఆర్ పి తదితర స్కీం వర్కర్స్ సమస్య లపై చాంపియన్ గా సిఐటియు పనిచేస్తుందని తెలిపారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆప్కాస్ కార్మికుల ను ఐక్యం చేసి సమాన పనికి సమాన వేతనం,రెగ్యులర్ చేయాలని సిఐటియు పోరాడుతున్నది. రైతుల సమస్యలు పరిష్కరించాలని,రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి కార్మిక కర్షక ఐక్యత చాటి చెప్పే విధంగా సిఐటియు పోరాడుతున్నదన్నారు.కార్యక్రమం సిఐటియు పట్టణ అధ్యక్షులు కె సుబ్బరాయుడు, మిడ్ డే మిల్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు టి గురునాథం, జి హరి పి సలాం ఖాన్, పిఏ బ్రహ్మం, పి శ్రీను, ఎం చెన్నకేశవులు, కనకయ్య,సింగ్, ఎస్.కె యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.