మనుషులను టార్గెట్ చేసిన బర్డ్ ఫ్లూ..200 కోట్ల స్కామ్ లో నిందితుల అరెస్టు..బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఎయిర్ హోస్టేస్స్ అరెస్టు..వైవి ని కలిసిన ఆదిమూలపు..జూన్ 3 నుంచి 5 వరకు 144 సెక్షన్- కలెక్టర్ దినేష్ కుమార్..ట్రావెల్స్ బస్సు బోల్తా..ఉపాధి కూలీలకు వేసవి భత్యం చెల్లించాలి సిఐటియు..

👉మనుషులను టార్గెట్ చేసిన బర్డ్ ఫ్లూ… సీడీసీ ఏమి చెబుతుందంటే…? వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది.ఇన్నాళ్లూ పక్షులు, జంతువులకు పరిమితమైన బర్డ్‌ ఫ్లూ..ఇప్పుడు మనుషులనూ టార్గెట్ చేస్తున్నట్లుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురికి సోకింది. ఈ మేరకు పాడి పశువులలో ప్రస్తుత వైరస్ వ్యాప్తికి సంబంధించిన బర్డ్ ఫ్లూ తాజాగా మూడవ మనిషికి సోకిందని అమెరికా అధికారులు నివేదించారు. దీంతో… మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ విషయం వైరల్ గా మారింది. అమెరికాలో మనుషులకూ బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుంది. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైంది. మిచిగాన్ వ్యవసాయ కార్మికుడు ఏప్రిల్‌ లో టెక్సాస్‌ లో మొదటి కేసు కాగా.. మిడ్‌ వెస్ట్రన్ రాష్ట్రంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రెండో కేసు. ఈ క్రమంలో తాజాగా మూడో కేసు నమోదైందని, అతనికి ఆవుల నుంచి ఈ వైరస్ సోకిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ప్రకటనలో ఈ మూడు కేసులూ ఆవుల నుండి మనుషులకు వ్యాపించాయని..ఇవి మనిషి మనిషికీ భిన్నంగా ఉన్నాయని.. ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. ఈ వ్యాది సోకినవారు దగ్గు, కళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం వీరిని ఇంట్లోనే ఉంచి యాంటీవైరల్ మెడిసిన్ ఒసెల్టామివిర్ తో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. సదరు కార్మికుడు వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించలేదని, పాడి పశువులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యక్తిగత రక్షణ ముఖ్యమని ఈ మేరకు ఆరోగ్య అధికారులు సిఫార్సు చేశారని మిచిగాన్ ఆరోగ్య విభాగం తెలిపింది. వాస్తవానికి యూరప్‌ లోనే కాకుండా, అమెరికన్ రైతులు కూడా పశువులకు కోడి వ్యర్థాలను తినడానికి అనుమతించబడ్డారని తెలుస్తుంది. దీంతో… బర్డ్ ఫ్లూకి ఇది ప్రమాద కారకంగా ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. మరికొంతమంది యూఎస్ అధికారులు మాత్రం… బర్డ్ ఫ్లూ ఆవులకు సోకడానికి అడవి పక్షులే కారణమని విశ్వసిస్తున్నారు. కాగా… బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన ఆవుల పచ్చి పాలను అలాగే తాగితే, మనుషులకు కూడా ఆ వైరస్‌ సోకే ప్రమాదముందని అట్లాంటాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకులు తెలిపారు. వైరస్‌ సోకిన జంతువుల పాలను నేరుగా తీసుకోవడం మానుకోవాలని, పాశ్చరైజేషన్‌ చేశాకే వాటిని వినియోగించాలని సూచించారు.
👉 బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్హోస్టెస్ అధికారులకు చిక్కింది. ఆమె మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ కు పాల్పడ్డారు….కన్నూర్: దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి ఈ అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది.నిందితురాలు తన రహస్య అవయవాల్లో కేజీ బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మే 28న మస్కట్ నుంచి కన్నూర్ ఎయిరోపోర్టు కు ఓ విమానం చేరుకుంది. అందులో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఎ అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విమానంలో ఎయిర్హోస్టెస్ గా ఉన్న సురభి ఖాతూన్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారం లో 960 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.విచారణ అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఆమెను కన్నూర్ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్లైన్కు చెందిన సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం దేశంలో ఇదే తొలిసారని డీఆస్ఐ వర్గాలు వెల్లడించాయి.

👉రూ.200 కోట్ల స్కాం కేసులో కీలక పరిణామం..వాణి బాల అరెస్ట్!…

నిమ్మగడ్డ వాణిబాల అనే దంపతులు రూ.200 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.సామాన్య ప్రజలకు డిపాజిట్ల పేరుతో ఓ దంపతులు రూ.200 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. కొన్ని రోజుల క్రితమే ఈ దంపతలు స్కామ్ వ్యవహారం బయటపడింది. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలోనే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (టీఎస్ సీఏబీ ) నిమ్మగడ్డ వాణి బాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణీ బాల, మేక నేతాజీ దంపతులు. వీరు హైదరాబాద్ లోని సైదాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వాణీ బాల హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త నేతాజీ, కొడుకు శ్రీ హర్షలు ..శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజేస్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. ఈ క్రమంలోనే వాణి బాల..తన బ్యాంకులో డిపాజిట్లు చేసేందుకు వచ్చే వినియోగదారులకు మాటలు కలిపి…వారిని తమ సంస్థలో చీటీలు కట్టేలా వారిని మార్చేది. ఈ క్రమంలోనే తాను పని చేసే బ్యాంకుకు సమీపంలో తమ వాళ్లది మరో ఆఫీసును కూడా తెరిపించింది ఆ విధంగా 517 మంది నుండి రూ. 200 కోట్లు కాజేశారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోఆమె రిటైర్డ్ అవుతుండగా.. సడెన్ గా సెలవులు పెట్టింది. ఇదే సమయంలో దంపతుల ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో బోర్డు తిప్పేశారని అర్థం చేసుకున్న కస్టమర్లు లబోదిబోమంటుతమకు న్యాయం చేయాలంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్ బయటకు రావడంతో వాణీ బాలను విధుల్లో నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డిసిపి ఎన్ శ్వేత పర్యవేక్షణలో ఏసిపి కేఎం కిరణ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు .ఈ క్రమంలో తాజాగా ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలను ఆమె భర్త నేతాజీ, కొడుకు హర్షలను అరెస్ట్ చేశారు.

👉జిల్లా వ్యాప్తంగా జూన్ 3 నుంచి 5 వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన కలెక్టర్ దినేష్ కుమార్..4వ తేదీన ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కించనున్న నేపథ్యంలో ప్రజలు గుమి గూడకుండా  ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ…..3వ తేదీ ఉదయం 6 నుంచి 5వతేదీ సాయంత్రం ఆరు గంటల వరకు144 సెక్షన్ అమలులో ఉంటుందన్న కలెక్టర్ దినేష్ కుమార్

👉ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు..పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడి కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న సమయంలోనే కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

👉ఉపాధి కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి..వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వేసవి భత్యం ప్రభుత్వ పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కందులూరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలను ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఫిబ్రవరి నెలలో చేసిన పనికి 20% మార్చి నెలలో 30% ఏప్రిల్ మే నెలలో 35 శాతం వేతనాన్ని పెంచి అదనపు పారితోషకంగా ఇచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేయడం అన్యాయమని అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో 50 డిగ్రీల స్థాయిలో ఎండలు కాస్తున్నాయని, తీవ్రమైన వడగాళ్లు వీస్తున్నాయని, అయినా పేదలు పొట్టకూటి కోసం ఈ పనులకు వస్తున్నారని తెలిపారు. అటువంటి స్థితిలో ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే వారి జీవితాలు అస్తవ్యస్తమవుతాయని అన్నారు. మానవతా హృదయంతో పేదలను ఆదుకునేందుకు గతంలో ఇచ్చిన విధంగానే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పలుగు, పార,తట్ట లాంటి పనిముట్లు ప్రభుత్వ నిధులతో కొని ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వారని, వాటిని కూడా తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ పథకం ద్వారా పేదల చేతుల్లోకి ప్రభుత్వం నిధులు వస్తే అవి వారి కొనుగోలు శక్తిని పెంచుతాయని పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు దేశంలో 20 కోట్ల మంది పేదలు పనిచేస్తున్న ఉపాధి హామీకి నిధులు పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ఈ డిమాండ్లను సానుకూలంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.👉కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వి. మోజస్ మాట్లాడుతూ కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, పని అడిగిన వారందరికీ పని కల్పించాలని, లేదా చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ప్రతి సంవత్సరం 100 రోజుల పనికి ప్రణాళిక రూపొందించగా అవి 50 రోజుల్లోపే అయిపోతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులవల్ల పని దినాలు తగ్గుతున్నాయని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడాదికి ప్రభుత్వం 200 రోజులకు పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం