👉 మోడీని వెంటాడుతున్న ప్రకాష్ రాజ్…మరో వైరల్ ట్వీట్!… మోడీపై తనదైన శైలిలో విమర్శలు ,వెటకారాలూ గుప్పించే నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ విధానాల పైన తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్! బీజేపీ, మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన నిత్యం ఎండగడుతూ..
పలు వేదికలపై తనదైన శైలిలో విచురుకుపడుతుంటారు. ఈ సమయంలో మరోసారి ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. అవును… మోడీపై తనదైన శైలిలో విమర్శలు, వెటకారాలూ గుప్పించే నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా… ప్రస్తుతం కన్యాకుమారిలో సుదీర్ఘ ధ్యానంలో ఉన్న మోడీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ… “మెడిటేషనా.. లేక, మీడియా అటెన్షనా..?” అంటూ తనదైన శైలిలో సందేహాన్ని వ్యక్తపరిచారు. అంతకంటే ముందు మోడీ కన్యాకుమారి పర్యటనకు వెళ్తున్న సమయంలో… ప్రమాదానికి గురై తుక్కు తుక్కైనా కారును లాక్కుని వెళ్తున్న కారు వీడియోను పోస్ట్ చేస్తూ… “స్వయం ప్రకటిత దేవుడు కన్యాకుమారికి వెళ్తున్నాడు” అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మోడీని ఓడిపోయిన చక్రవర్తిగా అభివర్ణిస్తూ.. మోడీ ధ్యానంలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా… “నేడు ఎన్నికల చివరిదశ.. నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాను.. నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నేను నమ్ముతున్నాను.. 4వ తేదీన కలుద్దాం.. వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి” అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు మోడీ ధ్యానం చేస్తున్న రెండు ఫోటోలు షేర్ చేశారు. కాగా.. ఇటీవల ప్రధాని మోడీకి సంబంధించిన ఓ హోటల్ బిల్లు ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఉన్నప్పటికీ దాన్ని చెల్లించకపోవడంతో సదరు హోటల్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా స్పందించిన ప్రకాష్ రాజ్… “దేవుడు పంపిన నాన్ బయోలాజికల్ జీవి నుంచి బిల్లును మానవులు ఎలా క్లెయిమ్ చేస్తారు” అంటూ ప్రశ్నించారు.
👉 తల్లికి ఇన్స్టాలో మెసేజ్ చేసి కూతురు అదృశ్యంబంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసంవెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు… బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-11లోని ఉదయ్నగర్లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు.ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయిలో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్ను పెళ్లి చేసుకున్నానని, ముంబయిలో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
👉 గొర్రెల స్కాంలో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సీఈఓ సబావత్ రాంచందర్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రికి ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. గొర్రెలను కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని పశుసంవర్ధక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇలా మొత్తం 2కోట్ల 10లక్షల రూపాయల దాకా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో రాంచందర్ తో పాటు కళ్యాణ్ కుమార్ ఇద్దరు అధికారులు కీలకపాత్ర పోషించారని ఏసీబీ అధికారులు గుర్తించారు.
👉 మార్కెట్లోకి మరో కొత్త మోసం వచ్చేసింది. ఒక్క ఫోన్ కాల్ చేసి మీ ఖాతాను ఖాళీ చేసే బ్యాచ్ తయారైంది. వీళ్లతో గనుక మాట కలిపితే మీ బ్యాంకు అకౌంట్లను దెబ్బకు ఖాళీ చేసేస్తారు.మార్కెట్లో ఇప్పటివరకు చాలానే మోసాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఒళ్లు వంచకుండా ఎవరో కష్టార్జితాన్ని దోచుకోవాలి అని చూసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అలాంటి వారి కృషి వల్లే ఇప్పుడు మార్కెట్లోకి కొత్తరకం మోసం వచ్చింది. ప్రస్తుతం అందరినీ ఈ ఘరానా మోసం లక్షలు నష్టపోయేలా చేస్తోంది. ఇది కేవలం ఫ్రాడ్ అని తెలియక ఎంతో మంది తాము కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అసలు ఆ మోసం ఏంటి? ఎందుకు ప్రజలు అంత తేలిగ్గా నమ్మేస్తున్నారు? అసలు ఆ మోసాన్ని ఎలా తిప్పి కొట్టాలి అనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.👉ఇప్పుడు చెప్పుకుంటున్న మోసం పేరు పార్సిల్ స్కామ్ లేదా కొరియర్ స్కామ్ అంటారు. అంటే మీ పేరిట ఒక పార్సిల్ వచ్చింది అంటారు. అయితే అందులో మాదకద్రవ్యాలు, నిషేదిత వస్తువులు ఉన్నాయి అంటూ కబుర్లు చెప్తారు. కాసేపు మిమ్మల్ని బెదిరిస్తారు. మీ మీద కేసు నమోదు చేస్తున్నాం అంటూ మాయ మాటాలు చెప్తారు. కాసేపు మిమ్మల్ని బెదిరించి.. డబ్బులకు బేరానికి వస్తారు. మీరు గనుక ఫలానా మొత్తం ఇచ్చేస్తే మీ మీద ఎలాంటి కేసు లేకుండా చూస్తాం అంటూ నమ్మబలుకుతారు. అందుకు వాళ్లు అడిగినంత కట్టాలి. లేదంటే మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి ఇవ్వాలి. రెండు సందర్భాల్లోనూ మీ ఖాతాను ఖాళీ చేయడమే వారి ధ్యేయం..ఎలా స్టార్ట్ చేస్తారు?:ఈ స్కామ్ మొదట ఒక మిస్డ్ కాల్ తో స్టార్ట్ అవుతుంది. మీరు తిరిగి ఆ నంబర్ కు కాల్ చేస్తే ఏదో ఒక కొరియర్ ఆఫీస్ కి వెళ్లినట్లు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఎవరో ఒక అధికారి మాట్లాడుతున్నాం అని చెప్తారు. అది పోలీసు అధికారులు, ఎన్సీఆర్బీ ఏజెంట్లు, కస్టమ్ అధికారుల పేర్లతో పరిచయం చేసుకుంటారు. మీ పేరిట ఒక పార్సిల్ వచ్చింది అంటారు. ఆ తర్వాత అందులో నిషేదిత మాదకద్రవ్యాలు ఉన్నట్లు మీకు చెప్తారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతారు. మీ మీద కేసు నమోదు చేయబోతున్నాం అంటూ బెదిరిస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, బ్యాంకు వివరాలు, పాన్ కార్డు డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. ఆ వివరాల ద్వారా మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు.ఈ తరహా మోసాలపై అవగాహనతో ఉండాలని పోలీసులు, సైబర్ క్రైమ్ టీమ్ హెచ్చరిస్తోంది. ఈ మోసాలను అరి కట్టేందుకు కృషి చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర టెలిఫోన్ అథారిటీ రంగం రంగంలోకి దిగింది. ఈ మోసాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ మోసాలకు సంబంధించి ఇప్పటికే ఫేక్ ఐడీలను గుర్తించినట్లు చెప్పారు. దాదాపు 1500 వరకు ఫేక్ సోషల్ మీడియా ఐడీలను గుర్తించామన్నారు. ఈ తరహా ఫోన్లు, మెయిల్స్ వస్తే మాత్రం సంబధింత అధికారులు, పోలీసులు దృష్టికి తీసుకెళ్లండి.
👉 ప్రియుడిని బంధించి ప్రియురాలిపై ఓ హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకొంది. దిశ ఎస్సై పి.నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమికులు గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు.అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్‌కుమార్ వారిని చూశాడు. పోలీసు వాహనంతో అక్కడికి వెళ్లి.. స్టేషన్‌కు రావాలని ప్రేమికులను బెదిరించాడు.వదిలేయాలని సదరు జంట వేడుకోవడంతో డబ్బులు డిమాండు చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక.. ప్రియుడిని కట్టేసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు శుక్రవారం దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.విజయనగరం జిల్లాకు చెందిన రాజ్‌కుమార్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డీఎస్పీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఘటన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
👉 అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలు జిలిటన్ స్టిక్స్ ను పట్టుకున్న పోలీసులు..ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ పట్టివేత..రూ. 8 లక్షల 74వేల 950 విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం..నలుగురిని అరెస్టు చేసిన షాద్ నగర్,
శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు..కంప్రెషర్ ట్రాక్టర్, 4 స్మార్ట్ ఫోన్స్ తదితర సామాగ్రి సీజ్.. మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపి రంగస్వామి వెల్లడి..రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలు జిలిటన్ స్టిక్స్ ను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 8 లక్షల 74వేల 950 విలువైన పేలుడు పదార్థాలతో పాటు కంప్రెషర్ ట్రాక్టర్, 4 స్మార్ట్ ఫోన్స్ తదితర సామాగ్రిని సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. శనివారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) సీహెచ్ రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ.. కేసు వివరాలను వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలంలోని కమ్మదనం గ్రామానికి చెందిన ఉరుసు నరసింహ (60), పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాల సమీపంలో నివసిస్తున్న ఈశ్వర్ (45), అదేవిధంగా పట్టణానికి చెందిన వురుసు రాజు తదితరులు 490 జిలిటన్ స్టిక్స్ ను నిబంధనలకు వ్యతిరేకంగా తమ వద్ద నిల్వ ఉంచుకున్నారు. వీటి విలువ రూ. 8 లక్షల 74వేల 950 ఉంటుందని ఎసిపి వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్, డిసిపిలు నారాయణరెడ్డి, డి.శ్రీనివాస్, శంషాబాద్ ఎస్ఓటి డిసిపి రాంకుమార్, అడిషనల్ డిసిపి శంషాబాద్ జోన్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వారి సూచన మేరకు షాద్ నగర్ ఏసిపి సిహెచ్ రంగస్వామి సారథ్యంలో షాద్ నగర్ సిఐ కే. ప్రతాప్ లింగం, శంషాబాద్ ఎస్ఓటి సిఐ సంజయ్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించి 490 జిలిటీన్ స్టిక్స్ తో పాటుకంప్రెసర్ ట్రాక్టర్, నాలుగు స్మార్ట్ ఫోన్లు, ఒక వైర్ కట్టర్, ఒక ఎలక్ట్రిక్ టెస్టర్, సామాగ్రిని పట్టుకున్నట్టు ఏసిపి రంగస్వామి తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా వీటిని నివాస గృహాల మధ్య ఉంచడం, ఎంతో నిషిద్ధమని పేర్కొన్నారు. ఇవి పేలితే ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని ఏసిపి పేర్కొన్నారు. కమ్మదనం గ్రామానికి చెందిన ఉరుసు నరసింహ, ఈశ్వర్, వురుసు రమేష్, బిల్డింగ్ బ్లాక్స్ కు చెందిన మధుసూదన్ రెడ్డి తదితరులు కలిసి వీటిని అక్రమంగా నిలువ ఉంచారని వారు పేర్కొన్నారు. బిల్డింగ్ బ్లాక్స్ కు చెందిన యజమాని మధుసూదన్ రెడ్డి ఇలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి లైసెన్స్ లేకుండా జిలేటెన్ స్టిక్స్ వాడకానికి వాటిని ఉపయోగించేందుకు తెచ్చారని ఎసిపి పేర్కొన్నారు.నల్గొండ జిల్లాకు చెందిన సతీష్ వీటిని వారికి ఇచ్చేవాడని భువనగిరి ప్రాంతానికి చెందిన ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజీవ్ లిమిటెడ్ కంపెనీ నుండి వీటిని వారు తీసుకొస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. బిల్డింగ్ బ్లాక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి వీటిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ బ్లాస్టింగ్ చేసేందుకు ప్రయత్నించారని ఇందులో భాగంగానే సమాచారం అందడంతో వాటిని శంషాబాద్, షాద్ నగర్ పోలీసులు కలిసి వీటిని పట్టుకున్నారని పేర్కొన్నారు. ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ ప్లోజీవ్ లిమిటెడ్ భువనగిరి ప్రాంతంలోని చిట్యాలకు చెందిన మేనేజర్ పి. నరేందర్ రెడ్డి అదేవిధంగా మధుసూదన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అదుపులో నరసింహ, ఈశ్వర్, రాజు, రమేష్ ఉన్నారని వారిని విచారిస్తున్నట్లు ఏసిపి రంగస్వామి తెలిపారు. పరారీలో ఉన్న వారిలో బిల్డింగ్ బ్లాక్స్ యజమాని మధుసూదన్ రెడ్డి కంపెనీ మేనేజర్ నరేందర్ రెడ్డి సతీష్ ఉన్నట్టు ఏసీపీ తెలిపారు.షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 421/2024 ప్రకారం 4 అండ్ 5 ఆఫ్ ఎక్స్ ప్లోజీవ్ యాక్ట్ 1908 ఆఫ్ షాద్ నగర్ కింద కేసు బుక్ చేసినట్టు తెలిపారు. శంషాబాద్ ఎస్ఓటి సీఐ సంజయ్ కుమార్, స్థానిక సిఐ ప్రతాప్ లింగం తదితరులు చాకచక్యంగా కేసులొ వ్యవహరించినట్టు తెలిపారు. జిలిటన్ స్టిక్స్ పట్టివేతలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఎస్సైలు శ్రీకాంత్, తరుణ్, హెడ్ కానిస్టేబుల్స్ వెంకటరమణ, సోమ్లా నాయక్, ప్రభాకర్ రెడ్డి, కానిస్టేబుల్స్ సత్యనారాయణ, జాన్సన్, వంశీకృష్ణ, రాధాకృష్ణ, రవికుమార్, రాజశేఖర్, ఆంజనేయులు, విజయ నర్సింగ్ తదితరులను ఎసిపి రంగస్వామి అభినందించారు.