ఎగ్జిట్ పోల్స్ స్థానంలో మోడీ పోల్స్..రాహుల్ సెటైర్స్!..ఆసక్తికరంగా బిజెపి బిజెడీ ఎగ్జిట్ పోల్స్..మహిళా కానిస్టేబుల్ అనుమానస్పద మృతి..పెట్రో బాంబుల కలకలం..కౌంటింగ్ పై సమీక్ష..నకిలీ వైద్యుల పై కోరడా.. 

👉ఎగ్జిట్ పోల్స్ స్థానంలో మోడీ పోల్స్… రాహుల్ సెటైర్స్! ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అనంతరం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సందడి చేశాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేశాయి. వాస్తవ ఫలితాలు వచ్చేలోపు ఈ ఎగ్జిట్ ఫలితాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు. అవును… దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ స్థాయిలోని చాలా సంస్థలు మరోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని అంచనాలు వేశాయి. ఇదే సమయంలో… ఇండియా కూటమికి ఘోర ఓటమి తప్పదనే స్థాయిలో ఫలితాలు వెల్లడించాయనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సందర్భంగా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఇందులో మెజారిటీ ఫలితాలు ఫేక్ అని ఒకరంటే, పెయిడ్ అని మరికొంతమంది కామెంట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇందులో భాగంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ రికార్డు స్థాయిలో మూడోసారి గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇందులో భాగంగా… ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని.. అవన్నీ మోడీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో… ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

👉 ఆసక్తికరంగా బిజెపి బిజెడీ ఎగ్జిట్ పోల్స్..147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశా రాష్ట్రంలోనూ లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలూ జూన్ 4న వెలువడనున్న నేపథ్యంలో… ఈలోపు తెరపైకి వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో భాగంగా… అసలు హోరా హోరీ అంటే ఏమిటో ఇలా ఉంటుంది అన్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా… ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) – బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీలకూ 62 – 80 సీట్ల చొప్పున వచ్చే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. అంటే.. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 – 8 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయపడింది. అయితే… పోలింగ్ పర్సంటేజ్ విషయంలో మాత్రం కాస్త చిన్నపాటి వేరియేషన్ చూపించింది. ఇందులో భాగంగా.. బీజేడీకి 42 శాతం, బీజేపీకి 41 శాతం, కాంగ్రెస్ కు 12 శాతం, రావచ్చని తేల్చారు..

👉 హైదరాబాద్ మహానగరం పరిధిలో గత కొన్ని రోజులుగా ఫేక్ డాక్టర్స్ భరతం పడుతున్నారు వైద్యాధికారులు. నకిలీ వైద్యుల ఆటకట్టిస్తున్నారు. గత వారం క్రితం జీడిమెట్ల, బాలానగర్ పరిధిలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్, క్లినిక్స్ పై దాడులు చేసిన వైద్యాధికారులు సుమారు 50మందిపై FIR నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు సికింద్రాబాద్ మారేడుపల్లి అడ్డగుట్ట ప్రాంతంలో వైద్య మండలీ సభ్యులు దాడులు నిర్వహించారు. నకిలీ వైద్యులను వరుస దాడులతో వైద్య శాఖఅధికారులు హడలెత్తించారు. అడ్డగుట్ట, మారేడుపల్లి ప్రాంతంలో పలు క్లీనిక్ లపై దాడులు నిర్వహించారు అధికారులు. వైద్యుల అర్హతలు, వారు చదివిన కాలేజ్‌ వివరాలు తెలుసుకున్నారు.కొందమందికి వైద్య అర్హతలు లేకపోగా.. RMPలుగా ఉంటూ క్లీనిక్ లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్ట పరంగా నోటీసులు అందించడంతో పాటు వెంటనే క్లీనిక్ లను మూసివేయలంటూ సూచించారు. పలు క్లీనిక్స్‌పై ఫిర్యాదులు రావడంతో నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోన్నన్నట్లు వైద్య మండలీ అధికారి ప్రతిభ లక్ష్మి తెలిపారు.

👉 పల్నాడు…సత్తెనపల్లి లో పెట్రో బాంబుల కలకలం..రాజుపాలెం మండలం బ్రాహ్మణ పల్లిలో ముడి సరుకు లభ్యం..మరి కొన్ని చోట్ల పోలీసులు గాలింపు చర్యలు..

👉సెంట్రీ డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి…అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి(26) అనే మహిళా కానిస్టేబుల్ గన్నుతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గన్నుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ను మిస్ ఫైర్ అయ్యి మృతి చెందిందానే విషయము తెలియాల్సి ఉంది.భర్త పేరు దస్తగిరి ఆయన సొంత ఊరు మదనపల్లి.వేదవతి సొంత ఊరు పుంగనూరు దగ్గర బింగానిపల్లె.దస్తగిరి పుంగనూరులో పోలీస్ అకాడమీ కోచింగ్ సెంటర్ లో ప్యాకల్టీగా పనిచేస్తూ అక్కడ వేదవతి ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఇద్దరు ప్రేమించుకుని 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తూ సంవత్సర క్రితం బదిలీపై అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం దస్తగిరి తో కలిసి వేదవతి రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహకు పక్కనగల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది.ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి గన్ను తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందా లేక గన్ మిస్సయిర్ అయి మృతి చెందింది అనే విషయం తెలియాల్సి ఉంది.ఈ మేరకు డిఎస్పి రామచంద్రరావుఅర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదవతి మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

👉కృష్ణా జిల్లా..ఉయ్యూరు శివారు ప్రాంతంలో గంజాయి తాగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.వారి వద్ద నుంచి రెండు నర్ర కేజీల గంజాయి స్వాధీనం.షేక్ సుభాని, రెహమాన్, సయ్యద్ మూస, అబ్దుల్ అమీర్ అరెస్ట్, పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు

👉 కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో అమానుషం.5 నెలల గర్భవతి సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య.మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చిన కావ్య శ్రీ.విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి.ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్ కు చెప్పిన కావ్య శ్రీ.తమకు వారసుడు ని ఇవ్వాలని అత్త, మామ వేధింపులు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపణలు.ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.మీకు వారసుడిని ఇవ్వలేను అని భర్తకు మెసేజ్.పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

👉ఒంగోలు..సాధారణ ఎన్నికలు – 2024 నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు , ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు,

తదితర అంశాలపై ఆదివారం ఉదయం వెలగపూడి ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అన్నీ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్, ఈటిపిబిఎస్ / పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు, ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారిగా ఫలితాల ట్యాబులేషన్ మరియు ఎన్కోర్ లో ఫీడ్ చేయడం,అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు,మూడు అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని విసి హాల్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ ఏ ఎస్ దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, ఈనెల 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు 100 శాతం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టామన్నారు. సజావుగా కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నామని, అన్ని రకాల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్, సీ.ఈ.ఓ కు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి  శ్రీలత, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్  శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

👉 క్షణికావేశంలో కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్…ఓ కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు.ఆయన కుమారుడు శేష్ కమల్ (20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్‌ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20 వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడని,దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడని సమాచారం..

👉 కంభంలో భారీ వర్షం.. వడగండ్ల వాన.. పిడుగుపాటుకు కూలిన పిట్టగోడ.. యువకులకు తప్పిన ముప్పు.. కంభం పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది అక్కడక్కడ వడగండ్లు పడ్డాయి. ఉదృతంగా వీచిన ఈదురుగాలులకు జాతీయ రహదారిలోని 11 కెవి విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి.. కొన్ని గృహాలలోని ఇన్వర్టర్లు డైరెక్ట్ అయిపోయినట్లు తెలిసింది. మరికొన్నిచోట్ల చెట్ల కొమ్మలు సైతం విరిగిపడినట్లు సమాచారం.పట్టణంలోని నాయక్ వీధిలోని ఒక బిల్డింగ్ పై పిడుగు తాకిడికి బిల్డింగ్ పై భాగంలోని పిట్టగోడ పాక్షికంగా దెబ్బతిన్నది. తీవ్ర స్థాయిలో కనిపించినట్లు సమాచారం .గోడ పై గోడ నుండి కూలిన కొన్ని ఇటుక పెడ్డలు బిల్డింగ్ పక్కనే ఉన్న రేకుల షెడ్డు రేకుల పై నుండి కింద పడ్డాయి. దీంతో షెడ్డు కింద నిలబడి ఉన్న ఇద్దరు యువకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు వాపోయారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం