👉ఎగ్జిట్ పోల్ : ఒక తాజా వంటకం ! ‘ఎగ్జిట్ పోల్స్’ రెండు నెలల కిందట ఒక ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. ‘ఎగ్జిట్ పోల్స్’ రెండు నెలల కిందట ఒక ఇంట్లో వండి తాజాగా వడ్డించిన వంటకం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు విలువ లేదని ఆమె కొట్టిపారేశారు. గత ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కాలేదని, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగిందని, ఫలితాల్లో ఇది బయటపడుతుందని దీదీ అభిప్రాయపడ్డారు. మార్చిన జీవితం బెంగాల్ లో బీజేపీ హవా కొనసాగిందని, రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వెనకకు నెట్టి బీజేపీ ముందంజలో ఉంటుందన్న దానిపై ఏమనుకుంటున్నారన్న దానిపై మమతా బెనర్జీ స్పందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భారీ వ్యత్యాసం ఉంటుందని, 2016, 2019, 2021 లలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం స్పష్టమైందని దీదీ తెలిపారు. ఈసారి కూడా బెంగాల్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయని అన్నారు. బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి మేలు చేకూర్చేందుకు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయని దీదీ ఆరోపించారు.
👉హైదరాబాద్ నగరంలో మహిళ దారుణ హత్య?హైదరాబాద్ జిల్లా మల్కాజ్ గిరి నియోజక వర్గం పరిధి లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్య గురైంది.. సోమవారం ఉదయం బలరాం నగర్ లో మాధవి అనే మహిళ తలకు తీవ్ర గాయలతో రక్తపు మడుగులో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేర కు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీ లించారు. తలపై గాయం చేసి కొట్టి చంపినట్లుగా పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. మృతికి వివాహేతర సంబంధమే కారణం అని తెలుస్తుంది. మాధవికి ముగ్గురు పిల్లలు ఉన్నారు…
👉కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక.. జూన్ 4వ తారీఖున జరుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంభం సర్కిల్ పరిధి నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కంభం సర్కిల్ పరిధి నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువగా ఎక్కడ గుమిగుడి ఉండరాదని సీఐ రామకోటయ్యయ హెచ్చరించారు.కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు అంతా సీసీ కెమెరా నిఘా లో ఉన్నది. జూన్ 3 వ తేదీ రాత్రి నుండి 4 వ తేదీ రాత్రి వరకు కంభం సర్కిల్ పరిధిలో రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ లాడ్జీలు అన్ని మూసి వేయవలెను, ఎక్కడ గాని బహిరంగ భోజనాలు కానీ , సంబరాలు కాని చేయరాదు, లాడ్జిల్లో, కళ్యాణ మండపాల్లో వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉండరాదు. జూన్ 6 వ తేదీ వరకు ఎటువంటి ఉత్సవాలు కానీ సంబరాలు కాని చేయుటకు పర్మిషన్ లేదు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కానీ బాణాసంచాలు కాల్చడం కానీ చేయరాదు. ఎవరైనా ఈ పోలీస్ వారి ఉత్తర్వులు పాటించనట్లయితే వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
👉మంగినపూడి బీచ్ లో విషాదం….మంగినపూడి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకని బీచ్ కి వచ్చిన ఓ యువకుడు గల్లంతు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరు కు చెందిన భానుగా సమాచారం. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్ కి వచ్చిన 9 మంది స్నేహితులు. స్నేహితులంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా ఆలలు రావడంతో బీచ్ లోకి కొట్టుకుపోయిన భాను.భానుతో పాటు మరో యువకుడు కొట్టుకుపోతుండగా కాపాడిన స్థానికులు.సదరు యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించిన స్నేహితులు. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న యువకుడు.
👉కిడ్నాప్ కేసును రెండు గంటల్లోనే చేదించిన మైదుకూరు అర్బన్ పోలీసులు..కడప జిల్లా..మైదుకురు.. ఆదివారం సాయంత్రం సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మైదుకూరు మండలం జీవి సత్రం గ్రామమునకు చెందిన అవిరేని సంతోష్ అనే వ్యక్తిని జీవి సత్రం గ్రామం నుండి కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన ముద్దాయిలు సంతోష్ అన్న అయిన శివ కి ఫోన్ చేసి, మీ తమ్ముడు మా వద్ద నుంచి వీసా ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, మా డబ్బులు మాకు పంపితే కానీ మీ తమ్ముణ్ణి వదలము అని బెదిరించడం జరిగింది.ఈ విషయంపై సంతోష్ తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మైదుకూరు అర్బన్ పోలీసులు, మైదుకూరు డిఎస్పి వెంకటేశులు ఆధ్వర్యంలో మైదుకూరు అర్బన్ సిఐ మస్తాన్, ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి, దువ్వూరు ఎస్సై శ్రీనివాసులు మరియు తమ సిబ్బంది తోటి కలిసి మొత్తం 10 మంది ముద్దాయిలను దువ్వూరు బైపాస్ రోడ్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర గల నేషనల్ హైవే పై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది.ముద్దాయిల చెర నుండి సంతోష్ అనే యువకుడ్ని కాపాడి క్షేమంగా అతని తండ్రికి అప్పగించడం జరిగింది.ముద్దాయిల వద్ద నుండి కిడ్నాప్ కొరకు ఉపయోగించినటువంటి మహీంద్రా బొలెరో వాహనం ను మరియు 10 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.ముద్దాయిల వివరములుదుర్గారెడ్డి, వెంకటేశ్వర్లు మరియు 8 మంది (మొత్తం 10 మంది)అందరిదీ ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా అని విచారణ లో తెలిసినది.కడప ఎస్పీ సిబ్బందిని అభినందించారు.
👉బెంగళూరు పోలీసుల అదుపులో నటి హేమ.హేమను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు.హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం.గత నెల 20న రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ.డ్రగ్స్ కేసులో నటి హేమకు పాజిటివ్.
👉రామచంద్రపురం(చంద్రగిరి) : కర్ణాటక రాష్ట్రం నుండి టెంపో ట్రావెలర్ వాహనంలో కర్ణాటక మధ్యాన్ని తిరుపతికి తరలిస్తుండగా పట్టుబడింది. సోమవారం చంద్రగిరి సీఐ ఎం రామయ్య ఆధ్వర్యంలో చంద్రగిరి జాతీయ రహదారి వద్ద చంద్రగిరి పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తుండగా కర్ణాటక భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంలో మరణాయుధాలు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో మద్యం, మరణ ఆయుధాలు ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు..? ఎందుకోసం తీసుకొచ్చారు..? ఎక్కడికి తరలిస్తున్నారు..? అనే కోణంలో చంద్రగిరి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతిలో మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా హింసాత్మక దాడులు చేపట్టేందుకు కుట్రలో భాగంగానే ఈ తరలింపులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులకు ముందుగానే భారీగా తిరుపతికి కర్ణాటక మద్యం, తరలించారేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా పోలీసులు ఇంకా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓట్లు లెక్కింపు కేంద్రం వద్ద, చంద్రగిరి నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ.. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పోలీసులకు చాలెంజ్గా మారింది. పూర్తి వివరాలను చంద్రగిరి పోలీసులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించనున్నట్లు సిఐ రామయ్య తెలిపారు
👉ఫిల్మ్ ఇండస్ట్రీపై ఇప్పటికే ఓ అపోహ ఉంది. అదే ఆడవాళ్లకు సినీ పరిశ్రమ సురక్షితం కాదని. అందుకే ఇందులోకి వస్తామని అమ్మాయిలు చెప్పగానే.. తల్లిదండ్రులు వెంటనే నో అని చెబుతారు. కమిట్‌మెంట్స్ అడుగుతారని, రూమ్స్‌కు రమ్మని పిలుస్తారని, అమ్మాయిలను ట్యాప్ చేస్తారని, తమకు లొంగని వారిని కెరీర్ లేకుండా చేస్తారని, అవసరమైతే అత్యాచారం చేయడానికి కూడా వెనకాడరని ఎప్పటి నుండో రూమర్స్ ఉన్నాయి. కొంత మంది భంగపడ్డ నటీమణులు, టెక్నీషియన్లు చేసే ఆరోపణలు కూడా ఈ వాదనకు ఆజ్యం పోసేలా మారాయి. అలాగే ఇండస్ట్రీలోకి రావాలనుకున్న అమ్మాయిలు ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఉండనే ఉన్నాయి. ఓ ఒక్కరి వల్లో ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది.ఇప్పుడో నిర్మాత.. తన వద్ద పనిచేసిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఇప్పటి వరకు కిమ్మనకుండా ఉంది. ఇప్పుడు అతడి ఆగడాలు మరింత ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై కోలీవుడ్ సినీ నిర్మాత మహ్మద్ అలీని పోలీసులు అరెస్టు చేశారు.మహ్మద్ అలీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నిర్మాత. చిన్న నిర్మాతగా కాస్తంత గుర్తింపు వస్తున్న సమయంలో ఇప్పుడ సెక్స్ హెరాస్ మెంట్ ఆరోపణలపై అరెస్టు కాబడ్డాడు. కొరట్టూరుకు చెందిన 28 ఏళ్ల యువతి.. గత ఏడాది సెప్టెంబర్‌లో అతడి కార్యాలయంలో ఉద్యోగంలో చేరింది. అయితే అతడికి అప్పటికే పెళ్లి కాగా, ఈ విషయాన్ని దాచి పెట్టి.. ఆ అమ్మాయితో ప్రేమ నటించాడు.నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అనంతరం తనకు బలవంతంగా మద్యం సేవించి అత్యాచారం చేసి.. వాటిని వీడియో తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి అంబత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ వీడియో చూపించి.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. తాను గర్భవతి కాగా, తనకు అబార్షన్ మాత్రలు ఇచ్చాడని పేర్కొంది బాధితురాలు. ఈ విషయంపై ప్రశ్నిస్తే.. తన వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేస్తానని బెదిరించాడని, తనను బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపింది సదరు మహిళ. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేసి.. జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఇలాంటి నిర్మాతలు,దర్శకుల వల్లే.. పరిశ్రమలోకి రావాలంటే భయపడుతున్నారు అమ్మాయిలు.
👉ఎసిబి వలలో చిక్కిన సూర్యాపేట సబ్-రిజిస్ట్రార్ మరియు డాక్యుమెంట్ రైటర్స్.. సోమవారం, (A.O-1) బానోత్ సురేందర్ నాయక్,సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేసి అంగీకరించడంతో ఎసిబి అధికారులు పట్టుకున్నారుA-2 కల్లూరి శ్రీనివాస్, దస్తావేజు రైటర్ మరియు A-3 తంగెళ్ల వెంకట రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ద్వారా 99,200/- లను లంచం గా తీసుకొనగా పట్టుబడినారని తెలిపారు. ఫిర్యాదుదారు ఎం . వెంకటేశ్వర్లు వెంకటేశ్వర కాలనీ, సూర్యాపేట పట్టణం లో గల తన ఖాళీ జాగను తన కూతురు ,పేరున గిఫ్ట్ డీడ్ ను రిజిస్ట్రేషను చేయడం కోసం ఫిర్యాదుదారు కుమార్తె పేరు మీద 1080 చదరపు గజాల విస్తీర్ణంలో ఓపెన్ ప్లాట్ మేకా మానస గిఫ్ట్ డీడ్‌గా మరియు మిగిలిన 160 చదరపు గజాలు మేడిపల్లి రవిరాజు పేరున సేల్ డీడ్‌గా రిజిస్ట్రేషన్ చేయడానికి డిమాండ్ చేసిన లంచం మొత్తాన్ని ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.స్పాట్ లో A-2 & A-3 యొక్క రెండు చేతి వేళ్లు లంచం తీసుకున్న సమయంలో వచ్చినప్పుడు రసాయనంలో సానుకూల ఫలితం లభించింది.గతంలో ఏఓ-1 2007లో రెండుసార్లు ఏసీబీ అధికారులకు చిక్కాడు. అందువల్ల, A.O-1, A-2 & A-3ని అరెస్టు చేసి, SPE మరియు ACB కేసుల కోర్టు నాంపల్లి ప్రత్యేక న్యాయమూర్తుల ముందు హాజరు పరచడం జరిగింది,కేసు విచారణలో ఉంది.ఫోన్ నంబర్ 1064కి కాల్ చేయండి (టోల్ ఫ్రీ నంబర్)ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే, చర్య తీసుకోవడానికి A.C.B. టోల్ ఫ్రీ నంబర్, 1064ని ప్రజలు సంప్రదించమని అభ్యర్థించారుచట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు.
👉 హైదరాబాద్..గంజాయు సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు యువకులు – మరో ముగ్గురు పరారీ*కృష్ణా జిల్లా ఉయ్యూరులో పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడింది. పట్టణ సీఐ మహమ్మద్ హబీబ్ బాషా, ఎస్సై గణేష్ కుమార్లకు అందిన సమాచారంతో చెరుకు పరిశోధన కేంద్రం శివారులో రెక్కీ నిర్వహించారు. గంజాయి తాగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఉయ్యూరు పట్టణంలో ఎవరైనా గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మహమ్మద్ హబీబ్ బాషా హెచ్చరించారు.