అనూహ్య ఓటములు..దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలువీరికే..90 వేల నుంచి 59 వేల‌తో..జ‌గ‌న్ గెలిచారు అంతే!.అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు..చంద్రబాబును కలిసిన అధికారులు..కంభంలో సంబరాలు .

👉అనూహ్య ఓటములు..అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయారు. గాంధీ- నెహ్రూ కుటుంబానికి విధేయుడైన కిషోరీ లాల్ శర్మ అక్కడ గెలిచారు.2019లో రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓడించారు, దీంతో నెహ్రూ- గాంధీ కుటుంబ వారసుడు ఒక సాధారణ బీజేపీ నాయకురాలి చేతిలో ఓడిపోయారనే సందేశం పంపారు. ఈసారి స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేయలేదు, కానీ, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దించి, విజయం సాధించారు.ప్రారంభంలో ప్రధాని మోదీ కూడా బనారస్‌ (వారణాసి)లో వెనుకంజలో కనిపించారు. తర్వాత రౌండ్ రౌండ్‌కు ఆధిక్యాన్ని సంపాదించారు. అయితే ఈసారి బనారస్ నుంచి మోదీ గతంలో మాదిరి భారీ విజయమైతే నమోదు చేయలేకపోయారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో బనారస్‌లో దాదాపు నాలుగు లక్షల 80 వేల ఓట్లతో విజయం సాధించారు మోదీ. 63 శాతం ఓట్లు వచ్చాయి.2014లో 56 శాతంతో 5,81,022 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాకు 2,09,238 ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ 1,52,513 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు.ఉత్తరప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు పోటీలో ఉన్నారు.ప్రధాని మోదీ బనారస్ నుంచి, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగారు. రాజ్‌నాథ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆయన సతీమణి డింపుల్ యాదవ్ కూడా పోటీ చేశారు.ఉత్తరప్రదేశ్‌లో ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయం, రాజ్యాంగం బలహీనపడటం వంటి అంశాలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు లేవనెత్తాయి. రెండు పార్టీలు కూడా రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. రిజర్వేషన్‌ను అంతం చేయాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. దీనితో పాటు, భారత ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై కూడా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు.యూపీలో బీజేపీ 33 సీట్లకు తగ్గిపోవడం ప్రధాని మోదీకి ఎదురుదెబ్బే కాదు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా చేదువార్త అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.

👉 దేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీలు వీరికే..

లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092

రక్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476

శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408

సీఆర్ పాటిల్(నవసారి-బీజేపీ) 7,73,551

అమిత్ షా(గాంధీనగర్-బీజేపీ) 7,44,716

అభిషేక్ బెనర్జీ(డైమండ్ హార్బర్-టీఎంసీ)7,10,930

రఘువీర్ రెడ్డి ( నల్గొండ-కాంగ్రెస్) 5,59,905

👉 90 వేల నుంచి 59 వేల‌తో.. జ‌గ‌న్ గెలిచారు అంతే! ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఘోరప‌రాజ‌యాన్నే కాదు.. అత్యంత ఘోర అవ‌మానాన్ని కూడా మిగిల్చాయి. ఆయ‌న పార్టీకి చెందిన అతిర‌థ మ‌హార‌థుల‌న‌ద‌గిన నాయ‌కులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మిన‌హా మిగిలిన వారంతా ఈ ఎన్నిక‌ల్లో మ‌ట్టిక‌రిచారు. ఇక‌, కీల‌క నాయ‌కులు కూడా.. టీడీపీకూట‌మి సృష్టించిన‌.. ఓట్ల సునామీలో కొట్టుకుపోయారు.ఇక, పార్టీకి ఆయువు ప‌ట్టువంటి సీమ‌లో అస‌లు వైసీపీ నామ‌రూపాలు కూడా లేకుండాపోయింది. ఏపీలో గరం లేపిన గురుమూర్తి ! ఇంత ఘోర ప‌రాజ‌యం ఓవైపు జ‌గ‌న్‌ను వెంటాడుతుంటే.. మ‌రో ఘోర అవ‌మానం కూడా..ఆయ‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చింది. అదేఆయ‌న గెలిచిన పులివెందుల‌లో ద‌క్కిన మెజారిటీ. 2019లో 90 వేల‌కు పైగా.. మెజారిటీ ద‌క్కించుకుని రాష్ట్రంలో నెంబ‌ర్ వ‌న్ మెజారిటీ ద‌క్కించుకున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు జ‌గ‌న్‌. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఇంత కుమించి మెజారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న ఆశించారు.ఇదే విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణి కూడా.. చెప్పుకొచ్చారు. కానీ, ఫ‌లితం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. లీడ్స్ ఒకానొక ద‌శ‌లో జ‌గ‌న్ ను భ‌య కంపితుల‌ను చేశాయ‌న‌డంలోసందేహం లేదు.అయితే..ఎట్ట‌కేల‌కు 59 వేల మెజారిటీతో జ‌గ‌న్ గ‌ట్టెక్కారు. కానీ,గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న సాధించిన మెజారిటీతో పోల్చుకుంటే.. మాత్రం ఇది అత్యంత నాశిర‌కం.అంతేకాదు.. అంత‌కు మించిన అవ‌మానం కూడా అంటున్నారు ప‌రిశీల‌కులు.జ‌గ‌న్ ఇమేజ్‌తో ఎమ్మెల్యేలు గెలిచార‌ని.. 2019లో చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు అదే జ‌గ‌న్ కు దారుణ‌మైన మెజారిటీ రావ‌డంతో కిమ్మ‌న‌డం లేదు.ఇదంతా కూడా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను ప‌ట్టి చూపించింద‌ని ప‌లువ‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం జ‌గ‌న్ సాధించిన మెజారిటీ టీడీపీ కి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అంత‌కు మించి సాధించారు. ముఖ్యంగా జ‌గ‌న్ ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసిన టీడీపీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌కు 91 వేల‌కు పైగా మెజారిటీ లభించింది.ఇక‌, చంద్ర‌బాబును ఓడించాల‌ని అనుకున్నారు.కానీ, ఆయ‌న‌కు 47 వేల‌కుపైగా ఓట్ల మెజారిటీ ద‌క్కింది. ఇలా..జ‌గ‌న్ కంటే.. చాలా మంది భారీ మెజారిటీ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఒక్క ఛాన్స్ ను స‌రిగా నిల‌బెట్టుకోని ఫ‌లితంగా జ‌గ‌న్ బొక్క‌బోర్లా ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

👉అధికారుల‌కు చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు.. విష‌యం ఏంటి? ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. కూట‌మిగా బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లిన టీడీపీ.. సీట్లు పంచుకుంది. ఈ క్ర‌మంలో 144 సీట్ల‌లోనే టీడీపీ పోటీ చేసింది. అయితే.. 135 స్థానాల‌కు పైగా టీడీపీ ఒంట‌రిగానే ద‌క్కించుకుంది.ఇక‌, జ‌న‌సేన పూర్తిగా 21 -స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. ఇలా.. కూట‌మి భారీ విజ‌యంతో దూసుకుపోయింది. అయితే.. ఈ క్ర‌మంలో సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణం చేసేందుకు ఇంకా స‌మ‌యం ఉంది.మంచి రోజు.. ముహూర్తం కోసం.. వేచి చూస్తున్నారు.తాను ఓడి.. అన్ననూ ఓడించిన షర్మిల.. ఏపీ ఫలితాలపై ఏమన్నారంటే? అయితే.. సాధారణంగా ఎక్క‌డైనా ప్ర‌భుత్వం మారుతుంటే.. ఫైళ్లు ధ్వంసం చేయ‌డం.. మాయంచేయ‌డం అనేవి ప‌రిపాటిగా మారి పోయాయి. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాలు..వివాదాస్ప‌ద అంశాల‌కు సంబంధించిన ఫైళ్ల‌ను మాయం చేస్తుంటారు. గ‌త 2023లో తెలంగాణ ప్ర‌భుత్వం మారిన‌ప్పుడు కూడా ఇలానే చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఇది అక్క‌డ పెద్ద వివాదం అయింది. ఇలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని గుర్తించిన టీడీపీఅధినేత‌, కాబోయే సీఎం చంద్ర‌బాబు..ముందుగానే ఇలాంటి విష‌యంపై దృష్టి పెట్టారు.అన‌ధికారికంగానే ఆయ‌న సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలిసింది.ఏ విభాగం నుంచి ఏ ఒక్క ఫైలు కూడా..మిస్ కావ‌డానికి వీల్లేద‌ని క‌ఠిన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.అంతేకాదు.. ఏ ఫైలైనా మిస్స‌యినా.. ధ్వంస‌మైనా..సంబంధింత అధికారుల‌ను బాధ్యుల‌ను చేసి ఖ‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది.ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం..అత్యంత దారుణ‌మైన స్థితిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే.దీంతో చంద్ర‌బాబు ఈ నెల 9న మంచి ముహూర్తంలో అమ‌రావ‌తిలో ప్ర‌మాణం చేయ‌నున్నారు.దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.

👉టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా,మరికొందరు IAS, IPS అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కంభంలో మిన్నంటిన సంబరాలు  సంబరాలుగిద్దలూరు లో టిడిపి అభ్యర్థి గా ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన సందర్బంగా కంభం పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ లో, కందులాపురం లో కేకులు కట్ చేసి బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు బాణసంచా కాలుస్తూనే ఉన్నారు. కార్యక్రమంలో కంభం మాజీ సర్పంచ్ స్టార్ భాష, టిడిపి నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, రజాక్ బాషా, జిలాని, రహిమాన్ ఫజల్, మస్రోద్ సుకూర్, అశ్వక్, నలబుల వెంకటేశ్వర్లు, తోట శీను, ఆర్టీసీ జిలాని, ఖాదర్ మాస్టర్,తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం