👉రాములోరి అయోధ్యలోనే కాదు సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓటమి.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. రాముడి పేరు మీద బీజేపీ సాగించిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయోధ్యలో తాము నిర్మించిన రామ మందిరాన్ని చూపించి ఓట్లు అడిగిన వైనంపై దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రజల రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ.. అయోధ్యలో మాత్రం బీజేపీని రిజెక్టు చేశారు అక్కడి ప్రజలు. అయోధ్య రామాలయం కొలువు ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానాన్ని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించటం తెలిసిందే. ఈ అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసింది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకు రాములోరు కొలువై ఉన్న అయోధ్యలో బీజేపీ ఓటమిపాలు కావటంపై వార్తలు వచ్చాయి. కానీ.. సీతమ్మ ఊరుగా చెప్పే సీతాపూర్ లోనూ బీజేపీ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. కమలం పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపాలు కావటం సంచలనంగా మారింది. బీజేపీ అభ్యర్థి రాజేశ్ వర్మను కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ రాథోడ్ 89,641 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ స్థానంలో బీజేపీ ఓటమిని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే భావించారు. అలాంటిది అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ నియోజకవర్గంమీద పడేలా చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీతాపూర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత కమలనాథులకు కంచుకోట లాంటి సీతాపూర్ స్థానం టికెట్ తనకు వద్దన్న ఆయన మాటతో కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దించాల్సి వచ్చింది.తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి నకుల్ దూబేకు టికెట్ ఇచ్చేందుకు ఆఫర్ చేసింది.ఆయన అందుకు ఆసక్తి చూపలేదు. దీంతో..అభ్యర్థులు ఎవరూ దొరకని వేళ కాంగ్రెస్ పార్టీ ఓబీసీకి చెందిన తేలీ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్ రాథోడ్ కు టికెట్ కేటాయించారు. ఆయన నామినేషన్ తర్వాత పరిస్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దళితులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు మళ్లటంతో సీతమ్మ వారి ఊళ్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓవైపు రాములోరి ఊళ్లోనే కాదు..ఆయన సతీమణి సీతమ్మ ఊళ్లోనూ బీజేపీ ఓడటం దేనికి సంకేతం? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
👉మోడీ లో మార్పు!!!..తాజా సార్వత్రిక ఫలితాలతో మోడీలో చాలానే మార్పు వచ్చినట్లుగా చెప్పాలి. గతానికి భిన్నంగా తాను ఒక్కడినే ఫోకస్ అయ్యే తీరుకు భిన్నంగా.. తనతో పాటు మిత్రపక్షాలను సైతం ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎన్డీయే పక్షాలతో శుక్రవారం జరిగిన సమావేశాన్ని చూస్తే.. కొత్త మోడీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తారు. భాగస్వామ్య పక్షాల గొప్పతనాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము కలిసి ముందుకు సాగుతామన్న మాట మోడీ నోటి నుంచి వచ్చింది. మొత్తానికి గతంతో పోలిస్తే వర్తమానంలో మోడీలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి. అంచనాలు ఎలా మార్చిందంటే…? మోడీలో మార్పు ఎంతలా వచ్చిందన్న దానికి నిదర్శనంగా ఒక ఆసక్తికర ఘటనతో ముగిస్తాం. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన ఆయన.. సదరు హాల్లోకి ప్రవేశ పెట్టినంతనే.. ఆయన నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకొని వందనం చేయటం గమనార్హం. అక్కడితో ఆయన ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. భావోద్వేగ వ్యాఖ్యల్ని ఆ ఫోటోకు జత చేశారు. తన జీవితంలో ప్రతి క్షణమూ.. రాజ్యాంగం ప్రవచించిన గొప్ప విలువల పరిరక్షణమే అంకితమన్న మోడీ.. ‘‘నాలాంటి వెనుకబడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నానంటే అది కేవలం మన రాజ్యాంగం గొప్పదనం’’ అంటూ పేర్కొన్నారు.👉 కొసమెరుపు ఏమంటే.. గడిచిన పదేళ్లుగా రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి.. 400 ప్లస్ సీట్ల సాధించిన తర్వాత రాజ్యాంగాన్ని సైతం మార్చేయాలన్నట్లుగా ఆయన వ్యవహరించి.. ఈ రోజున రాజ్యాంగం గురించి చేసిన వ్యాఖ్యలు మోడీనా.. మజకానా? అన్న భావన కలగటం ఖాయం. కాదంటారా?.. అంతేకాక దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో గమనించడం కూడా మరో కారణం కావచ్చు..
👉కర్నూలు జిల్లా కోడుమూరు సీఐ మన్సురుద్దీన్ అకౌంట్ నుంచి రూ.2.20 వేలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. సీఐ పర్సనల్ సిమ్ బ్లాక్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
👉 ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్…ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు బంద్.ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి పేపర్ సర్కులేషన్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ9, ఎన్టీవీ,10 టీవీ ప్రసారాలు నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం.ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలి అని గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేయడంతో ఒకే రోజు 12 లక్షల సాక్షి పేపర్ సర్కులేషన్ పడిపోయాయి.
👉 ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు మృతి.హైదరాబాద్:స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి.తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన రామోజీ రావు..పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలింపు.
👉 ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వంనిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లుసమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు..సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతోఅంత్యక్రియలు..నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.
👉కొడాలి నాని కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న బాధితులు..కృష్ణాజిల్లా గుడివాడ .. టిడిపి విజయంతో గెడ్డం గ్యాంగ్ అరాచకాలను ఎదిరిస్తున్న ప్రజలు..రెండు జెసిబి లతో కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను తొలగించిన బాధితులు..కొడాలి నాని అరాచకాలు నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బాధితులు..👉బాధితుల కామెంట్స్..బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడు..ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి. వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడు..న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం కోర్టులను ఆశ్రయించాం.. ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం… అయినా మాకు న్యాయం దక్కలేదు… వెనిగండ్ల రాము వల్లే నేడు మాకు న్యాయం జరిగింది.. అందరినీ 420 అనే కొడాలి నాని నే అసలైన 420 . కొడాలి నాని నీ గుడివాడ నుండి తరిమి కొడతాం మరలా కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తాం.. బాధితులు..ఆశలు వదిలేసుకున్న తరుణంలో మా పాలిట దైవంలా వెనుగండ్ల రాము అండగా నిలబడ్డారు. ఇటువంటి మంచి వ్యక్తులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నాం. రాము ఎమ్మెల్యే గా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
👉 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శనివారం హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏ సి పి కే యం కిరణ్ కుమార్ ఢిల్లీలో కలిసి ఫ్లవర్స్ బొకే అందించి అభినందనలు తెలియజేశారు
👉సంగపేటలో కొండచిలువ కలకలం.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సంగపేట గ్రామంలో శనివారం కొండచిలువ కలకలం రేపింది. స్థానిక రైతుకు చెందిన ఓ గడ్డివాము దొడ్డిలో పది అడుగుల కొండచిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ ప్రియాంక, డిఆర్ఓ రంగారెడ్డి కొండచిలువను సురక్షితంగా బంధించి స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పాములు కనిపిస్తే వాటిని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని పాములను పట్టుకుని సురక్షితంగా అడవి ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
👉రంగనాయక స్వామిని దర్శించుకున్న మాగుంట రాఘవరెడ్డి..
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని శనివారం టిడిపి నాయకులు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి అధికారంలోకి రావడంతో స్వామివారికి మొక్కు చెల్లించేందుకు వచ్చినట్లుగా మాగుంట రాఘవరెడ్డి తెలిపారు. అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.