బాబూ బీజేపీని నమ్మొద్దు..ఆ వీర మహిళా జవాన్ కు దేశం మద్దతు..రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు  పార్థివదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు,భువనేశ్వరి,కందుల..పెంచుకున్న వారే కడతేర్చారు.మార్కాపురం డిఎస్పి..బి పేటలో టిడిపి సంబరాలు.

👉బాబూ బీజేపీని నమ్మొద్దు.. ఆ పదవిని తీసుకోండి! ఈ నేపథ్యంలో శివసేన  విభాగం నేత ఆదిత్య ఠాక్రే..చంద్రబాబుకు కీలక సూచన

చేశారు. లోక్‌ సభ స్పీకర్‌ పదవిని తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి ధాటికి వైసీపీ కకావికలమైంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ టీడీపీ చక్రం తిప్పనుంది. టీడీపీకి 16 లోక్‌ సభ స్థానాలు వచ్చాయి. జనసేన పార్టీ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈ 18 స్థానాలు మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీలు అవసరం కాగా బీజేపీ 240 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. మెజార్టీకి 32 స్థానాల దూరంలో బీజేపీ ఆగిపోయింది.ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఆ తర్వాత జేడీయూ నిలుస్తోంది. జేడీయూకి 12 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో సంకీర్ణ సర్కారులో టీడీపీదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో తమకు నాలుగైదు కేబినెట్‌ మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను చంద్రబాబు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో లోక్‌ సభ స్పీకర్‌ పదవిని టీడీపీ చేపట్టి ఉండటంతో ఈసారి కూడా తమకు లోక్‌ సభ స్పీకర్‌ పదవిని కేటాయించాలని అడుగుతున్నట్టు సమాచారం. అయితే స్పీకర్‌ తో సహా కీలక శాఖలను మిత్ర పక్షాలకు కేటాయించే ఉద్దేశంలో బీజేపీ లేదని అంటున్నారు. కీలక శాఖలు మినహాయించి ఇతర శాఖలనే మిత్ర పక్షాలకు కేటాయించవచ్చని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్‌) విభాగం నేత ఆదిత్య ఠాక్రే.. చంద్రబాబుకు కీలక సూచన చేశారు. లోక్‌ సభ స్పీకర్‌ పదవిని తీసుకోవాలని కోరారు.ఆ పదవిని బీజేపీకి వదిలేయొద్దన్నారు.తమ అనుభవాల దృష్ట్యా ఈ సూచన చేస్తున్నామని ఆయన సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేశారు. భారత్ పెద్ద మనసు మిత్ర పక్షాలను చీల్చి లబ్ధి పొందడం బీజేపీకి అలవాటు అని ఆదిత్య ఠాక్రే గుర్తు చేశారు. గతంలో తమ పార్టీని ఇలాగే చీల్చారన్నారు. అందువల్ల స్పీకర్‌ పదవిని టీడీపీ తీసుకోవాలన్నారు. స్పీకర్‌ పదవిని తీసుకుంటే బీజేపీ మిత్రపక్షాలను చీల్చే అవకాశం ఉండదన్నారు. జేడీయూకూ కూడా ఆదిత్య ఠాక్రే ఇదే సూచన చేశారు. స్పీకర్‌ పదవిని మిత్ర పక్షాలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ స్పీకర్‌ పదవిని తీసుకుంటే పార్టీలను చీల్చడం ఖాయమని హెచ్చరించారు. మరి శివసేన నేత సూచించినట్టు టీడీపీ, జేడీయూ స్పీకర్‌ పదవి కోసం పట్టుబడతాయో, లేదో వేచిచూడాల్సిందే.

👉 రైతులు తమ హక్కుల కోసం నిరాహార దీక్షలు చేస్తూ నెలలు తరబడి రోడ్లపై కూర్చుని ఉంటే సమాజం యొక్క నైతిక విలువలు తెలవని ఒక నటి లంగనారావత్ అక్కడ కూర్చున్న హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు రోజుకు 100 రూపాయలకు కిరాయి తెచ్చిన కూలీలు అని ఎగతాళి చేసింది.దేశ రక్షణ బలగాలలో సేవ చేస్తున్న ఈ మహిళ తన తల్లి ఆ దీక్షలో కూర్చున్నందుకు ఇలా అవమానించిన ఆ నటి చెంప పెడేళ్లు అనిపించింది. ఈ ధీర వనిత చెల్లికి యావత్ భారత సమాజం.. పాధాభి వందనాలు చేస్తున్నది.ఎండకు వానకు చూడకుండా మన కోసం భూమి నుండి ఆహారం సమకూర్చే రైతులను నోటి దురుషుతో ఇలా ప్రవర్తించడం కర్షక సమాజాన్ని అవమానించడమే….ఈ వీర వనితకు సపోర్టుగా మనం నిలబడదాం.రైతులను అవమానించే ఈ మతోన్మాద పార్టీని భూస్థాపితం చేద్దాం..

👉సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

👉 రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు  పార్థివదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి.

👉ప్రముఖ వ్యాపారస్తులు భవాని గ్రూప్స్ అధినేత  పేర్ల శ్రీనివాసరావు పొదిలి లోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సంస్థ ఛైర్మెన్ మువ్వల పార్థసారథికి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు.పొదిలి లో మానవత సంస్థ ఏర్పడిన తరువాత నిరుపేదలకు చేయూత నిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని భవిష్యత్ లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని తనవంతు గా ఈ ఆర్థిక సహాయం చేసినట్లు పేర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పొదిలి మానవత సంస్థ వారికి అభినందలు తెలియచేసింది.

👉 మార్కాపురం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత కీర్తిశేషులు రామోజీరావు చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన సంతాపం తెలియజేసిన టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తమ్ముడు కందుల రామిరెడ్డి. ఈ కార్యక్రమం లో పాల్గొని నివాళ్లు అర్పించిన పలు టీడీపీ నాయకులు…

👉 ఉద్యోగ అవకాశం..కంభం పట్టణంలోని ప్రముఖ హాస్పిటల్ అయిన శ్రీ రామచంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు మార్కెటింగ్ విభాగం నందు pro గా పని చేయుటకు పురుషులు కావలెను.👉 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:* *8639700334*

👉 బేస్తవారిపేట టౌన్ నందు 87 బూతు నందు మల్ల అల్లూరయ్య ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తుమూల అశోక రెడ్డి గెలుపు సందర్భంగా కేక్ ను కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు దూదేకుల కాసిం పీరా (సైదులు) కస్టర్ ఇంచార్జి ముప్పూరి రాము యూనిట్ ఇన్చార్జి సుబ్రహ్మణ్యం బీసు అరుణ్. బూత్ కన్వీనర్లు సున్నపు అనిత అనుముల కిషోర్ వల్లపు మహీంద్రా మరియు కందగట్ల బాల చెన్నయ్య పాల్గొన్నారు.

👉పెంచుకున్న వారే శాన్విని హత్య చేశారు.డీఎస్పీ ఎం బాల సుందర రావు.. ప్రకాశం జిల్లా కంభం ..పెంచుకున్న వారే శాన్విని హత్య చేశారని మార్కాపురం  డీఎస్పీ ఎం బాల సుందర రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన కంభం సీఐ కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈనెల ఆరవ తేదీన అర్ధవీడు మండలం అర్థవిడు గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక శాన్వి రెడ్డి హత్యకు గురైన విషయం విధితమే .. తొలుత హత్య ఎవరో దుండగులు చేసి ఉంటారని ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ కేసు విషయమై మార్కాపురం డి.ఎస్.పి బాల సుందర రావు తమ సిబ్బందితో కలిసి వేరు వేరు బృందాలుగా విచారణ జరిపారు.

అర్ధవీడు మండలంలో ఉపాధ్యాయంగా పనిచేస్తున్న పుచ్చకాయల వెంకటరమణారెడ్డి లక్ష్మీ పద్మావతి దంపతులకు సంతానం లేకపోవడంతో తన అన్న అయినా వెంకట రంగారెడ్డి కుమార్తెను 9 ఏళ్ల కిందట దత్తతకు తీసుకున్నాడు. అయితే ఇటీవల శాన్వి రెడ్డి కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తులు విషయంలో గొడవలు జరిగాయని డిఎస్పి బాలసుందర్రావు తెలిపారు. కన్న తల్లిదండ్రులు కూడా శాన్విరెడ్డిని ప్రేమగా చూస్తుండడంతో, రమణారెడ్డి లక్ష్మీ పద్మావతి దంపతులు ఓర్వలేకపోయినట్లు, పాము ఎన్నాళ్లు పోషించిన శాన్వి రెడ్డి తల్లిదండ్రులకు దగ్గర కావడం, పైగా ఆస్తి కూడా మొత్తం శాన్వి రెడ్డికే రాసి ఇవ్వాల్సి వస్తుందని ఓర్వలేక గొంతు కోసి హత్య చేసినట్లు తెలిపారు.ఆరో తేదీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తన బెడ్ రూమ్లో ఫోన్ చూసుకుంటున్న శాన్వి రెడ్డిని పుచ్చకాయల లక్ష్మీ పద్మావతి వంటగదిలో ఉన్న కత్తి తీసుకొని వెళ్లి ముఖంపై దిండుతో గట్టిగా నొక్కి పట్టి శాన్వి రెడ్డి గొంతును కోసి హత్య చేసినట్లు ఆ సమయంలో రెండవ ముద్దాయి అయినా వెంకటరమణారెడ్డి గేటు వద్ద నిలబడి ఎవరైనా వస్తారేమోనని కాపలా గా నిలబడినట్లు తెలిపారు. అనంతరం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్వి రెడ్డిని హత్య చేసినారని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ముద్దాయిలైన వెంకటరమణారెడ్డి లక్ష్మీ పద్మావతి లను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు. కేసును చాకచక్యంగా విచారణ జరిపి అసలు నేరస్తులను గుర్తించి కేసు నమోదు చేసిన 48 గంటల లోపు ముద్దాయిలను అరెస్టు చేసినందుకు గాను కంభం సీఐ జె.రామకోటయ్య తో పాటు కంభం సర్కిల్లోని ఎస్ఐలను సిబ్బందిని డిఎస్పి బాలసుందర్రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సిఐ జె రామకోటయ్య, కంభం ఎస్ఐ పులి రాజేష్, అర్ధవీడు ఎస్సై ఎం అనిత, బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం