భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ..జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణి..శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు..జనంలోకి జగన్..విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త..ఉపాధ్యాయుడు హత్య..రెస్టారెంట్లలో కుళ్ళిపోయిన గుడ్లు.

👉భారత్‌లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ కోల్‌కతా : భారత్‌లో రెండో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కోల్‌కతాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ(H9N2) సంక్రమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.
భారతీయ సంతతికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఆస్ట్రేలియాలో ఉండగా ఈ వ్యాధి సోకింది. వైద్య పరీక్షల్లో చిన్నారికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారనైంది.
ఇది జరిగిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌కు వెళ్లడించింది. ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. చిన్నారి గత ఫిబ్రవరిలో తల్లిదండ్రులతో కలసి కోల్‌కతాకు వచ్చింది.
చిన్నారి కుటుంబం ఫిబ్రవరి చివరిలో సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత చిన్నారికి జ్వరం వచ్చింది. చిన్నారి బ్లడ్ శాంపిల్‌ను పరీక్షించగా ‘బర్డ్‌ ఫ్లూ’ వైరస్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.👉తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడిన ఆ చిన్నారిని ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించారు. కొద్దిరోజుల క్రితమే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత గత మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఈ వార్త చేరింది. దీంతో భారత్‌లోని ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.కోల్‌కతాలో చిన్నారితో పరిచయం ఉన్న వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు చేసింది. అయితే ఎవరిలోనూ వైరస్‌ కనుగొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆలస్యంగా నివేదిక అందినందుకు ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.ఫిబ్రవరిలో జరిగిన సంఘటనను మే రెండవ వారంలో నివేదించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా భారత్‌లో ఇది రెండో H9N2 బర్డ్‌ఫ్లూ కేసు. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయని వెల్లడించింది. భారత్‌లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య కేంద్రం నిఘా పెంచింది.
బర్డ్‌ఫ్లూ H5N2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం అదే అని WHO వెల్లడించింది.సాధారణంగా పక్షులకు మాత్రమే బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది.కానీ ఒక్కోసారి మనుషుల్లో కూడా ఇది కనిపిస్తుంది
👉జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయ్యండి..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని టీడీపీ ట్వీట్ చేసింది. ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి,చంద్రబాబుకు ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్స్ అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది.

👉తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం..తిరుమల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్ వద్దకు తెదేపా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

👉జనంలోకి జగన్..యాత్రకు సిద్దం..

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తనకార్యాచరణ సిద్దం చేస్తున్నారు.ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం.పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది.రెండు లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.ఇక..జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు
👉 ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య గురైన ఘటన కలకలం రేపుతుంది.

పాఠశాల పున: ప్రారంభం సందర్భంగా బుధవారం విధులకు హాజరయ్యేందుకు నార్నూరు మండలంలోని తన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో లోకారి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పై టీచర్ పై దాడి చేసి హతమార్చారు. అయితే ఘటన ఎందుకు జరిగింది. కారణం ఏంటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
👉అలిగి ఇంట్లో నుండి వెళ్లిపోయిన భార్య..
విద్యుత్ స్తంభం ఎక్కిన భర్త…సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉండే మోహన్ బాబు(25) మద్యం మత్తులో శంకేశ్వర్ బజార్ చౌరస్తా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి గందరగోళం చేశాడు.
స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు, మోహన్ బాబు స్తంభం మీదే కూర్చొని సిగరెట్ వెలిగిస్తూ అందరినీ ఆందోళనకు గురిచేశాడు. గంటన్నర పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు పోలీసులే స్తంభం ఎక్కి సముదాయించి కిందకు దించారు.
ఇతడు రెండేళ్లలో ఐదుసార్లు ఇలా విద్యుత్ స్తంభం ఎక్కాడు.. భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని తెలిపిన పోలీసులు.

👉మిరమిట్ల గొలిపే విద్యుత్ లైట్లు, వెరైటీ రుచులంటూ ఆకర్షణీయమైన బోర్డులతో ఆకట్టుకుంటున్న హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదు. కనిపించి, కనిపించని విద్యుత్ లైట్ల వెలుతురులో రెస్టారెంట్లలో కూర్చున్న కస్టమర్లకు నిర్వాహకులు కుళ్లిపోయిన, నాణ్యతలేని ఆహారం అంటగడుతు పబ్బం గడుపుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంపై ఏ మాత్రం పట్టించుకోకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాల్లోకి వెళితే… మంచిర్యాల పట్టణంలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంటు నుంచి క్రాంతి అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాడు. తీరా అది ఓపెన్ చేస్తే కుళ్లిపోయిన గుడ్డు ముక్కలు, దుర్వాసన రావడంతో సదరు యువకుడు ఆ రెస్టారెంటు వెళ్లి ఆర్డర్ చేసిన ఎగ్ మంచూరియాను చూపించి నిర్వాహకులు ప్రశ్నించారు. నిర్వాహకుడు ఇదేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. లోపల ప్యాక్ చేసేది, చేసింది మాకెలా తెలుస్తుంది. నీకు ఇష్టమైంది చేసుకో, ఎవరికైనా చెప్పుకో, కౌంటర్ వద్దకు వచ్చి గొడవ చేశావంటూ నీ పైనే కేసు పెడుతానంటూ బెదిరింపులకు గురి చేశాడు. అంతే కాకుండా ఈ రెస్టారెంట్ ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడి కొడుకుది కావడంతో వారి నుంచి సైతం ఫోన్లు వస్తుండటం కొసమెరుపు.పట్టించుకోని అధికారులు…నిత్యం ఆహార నాణ్యతను చూసే సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంతో రెస్టారెంటు, హోటళ్ల నిర్వాహకుల వ్యాపారం మూడు పువ్వులు.., ఆరు కాయలుగా సాగుతున్నది. అసలు మంచిర్యాలలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో, లేదో కూడా తెలియడం లేదు. తనిఖీలు లేవు, పర్యవేక్షణ లేదు. అధికారులు వారి కనుసన్నుల్లో ఉండడంతోనే హోటళ్ల నిర్వాహకులు, ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఏం చేసుకుంటారో చేసుకోమన్నారు👉క్రాంతి.. ఫుడ్ ఆర్డర్ చేసిన బాధితుడు..మేం మంచిర్యాలలోని స్వాగత్ ఫ్రైడ్ రెస్టారెంట్ నుంచి ఎగ్ మంచూరియా ఆర్డర్ పెట్టాం. మాకు వచ్చిన పార్సిల్లో కుళ్లిపోయిన గుడ్లు వచ్చాయి. దుర్వాసన రావడంతో దానిని స్వాగత్ ప్రైడ్ రెస్టారెంటుకు వచ్చి చూపించాం. నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండి, అన్నింటిని చూడలేం కదా అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ నాణ్యతలేని మంచూరియాను డస్ట్ బిన్లో పడేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే చెప్పుకోండి, మీరిక్కడ గొడవ చేయడానికి వచ్చారా.. వెళ్లండంటూ పంపించేశారు. అధికారులు స్పందించి ఇలాంటి రెస్టారెంట్లపై అదికారులు చర్యలు తీసుకోవాలి.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం