మెగా DSC అమలుకు,ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ధన్యవాదాలు తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ నాయకులు..ఫలితాలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మంత్రి డోలాశ్రీని కలిసిన ప్రముఖులు..తండ్రిని కడతేర్చిన కూతురు!!!..

👉ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబునాయుడు.👉మెగా DSC అమలుకు తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.👉రెండవ సంతకం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుకు చేసారు సీఎం చంద్రబాబునాయుడు.👉అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగవ సంతకం చేసిన సీఎం చంద్రబాబునాయుడు…పించన్ రూ: 4 వేలకు పెంచుతూ మూడవ సంతకం చేసిన సీఎం చంద్రబాబునాయుడు.

👉మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు..త్వరలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల*16,347 టీచర్ పోస్టుల కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు*ఎస్జిటి: 6,371; పిఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్: 7725; టి జి టి: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52

👉సర్వే ఫలితాలు, అసలు ఫలితాలు… జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు! అవును… ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.

ఏపీలో వచ్చిన ఎన్నికల ఫలితాలను వైసీపీ అధినేత, నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తుంది! 151 నుంచి 11 కి పడిపోవడంపై వారి విశ్లేషణలు ఓ కొలిక్కి వస్తున్నట్లు లేదని అంటున్నారు.ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంటే మాత్రం ఇలా జరుగుతుందా అంటే… ఆ వ్యతిరేకతను జగన్ చేయించుకున్న సర్వే సంస్థలు గుర్తించలేదా అనే చర్చ తెరపైకి వస్తుంది.ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు.తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ సందర్భంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా… ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని..కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయని వ్యాఖ్యానించిన పరిస్థితి.ఇదే క్రమంలో… పోలింగ్ కు ముందు, పోలింగ్ తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని.. ఇందులో భాగంగా 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నామని జగన్ తెలిపారు. దీంతో… జగన్ ఏమి చెప్పాలనుకుంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. కేవలం 17 లక్షల శాంపుల్సేనా అనలేని పరిస్థితి. కారణం… ఈ నెంబర్ చిన్నదేమీ కాదు! అయితే… ఇన్ని లక్షల శాంపుల్స్ తీయించినా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను సర్వే సంస్థలు గుర్తించలేకపోవడం గమనార్హం. నిజంగానే సర్వే సంస్థలు ఆ విషయాన్ని గుర్తించలేదా.. లేక, జగన్ ఆ వ్యతిరేకతను తీసుకోలేరని సర్వే సంస్థలే కావాలనే హైడ్ చేశాయా అనే చర్చా తెరపైకి వచ్చింది. అయితే…ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం తెలుసుకోవడం కోసం పూర్తిగా సర్వే ఫలితాలపైనే ఆధారపడకుండా..రెగ్యులర్ గా తమ ఎమ్మెల్యేలతో జగన్ టచ్ లోకి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం సంభవించేది కాదనే వారూ లేకపోలేదు! జగన్ కూ ఎమ్మెల్యేలకూ మధ్య అడ్డుగా అన్నట్లుగా ఉన్న కోర్ కమిటీ… ప్రజలకు – ప్రభుత్వానికీ కూడా అడ్డుగా నిలిచినట్లున్నారని ఇప్పుడు అనుకున్న ప్రయోజనం ఏముందనేది మరో కామెంట్. ఏది ఏమైనా… ఓటమిని హుందాగా తీసుకోవడమే కాకుండా… ప్రజల్లో బలంగా నిలబడాల్సిన బాధ్యత కూడా జగన్ ఉందనేది పలువురు చెబుతున్న మాట. మరో విషయం ఏమిటంటే… ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎప్పుడూ కనబడదని, కనబడనివ్వరనే విషయం కూడా పెద్దలు గ్రహించాలని అంటున్నారు.

👉ప్రకాశం జిల్లా మంత్రివర్యులు డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ మరియు కొండపి నియోజకవర్గం సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పూర్వ కలెక్టర్ బి.ఉదయలక్ష్మీ మరియు వారి భర్త మాజీ ఐపీఎస్ అధికారి బి.రమణ కుమార్.

👉 బదిలీపై వెళ్తున్న పొదిలి సాటిలైట్ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ వెంకటస్వామిని సత్కరిస్తున్న మార్కాపురం ఎల్ఐసి అధికారులు మరియు ఏజెంట్లు

👉 గత ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి, మాయ మాటలు చెప్పి. యువతను మోసం చేసిన సైకో జగన్మోహన్ రెడ్డి. విద్యార్థుల జీవితాలని నాశనం చెయ్యడమే జగన్ మోహన్ రెడ్డి నైజం.తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే (మెగా డీఎస్సీ) పై తోలి సంతకం పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు (నార చంద్రబాబు నాయుడు),తెలుగుదేశం పార్టీ దమ్మున్న పార్టీ గా నిరూపించారు. యువత జీవితాలను మేలు చెయ్యడం లో చంద్రబాబుకి తిరుగులేదు. గతంలో జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువత కోసం ఎన్నో పోరాటాలు చేశారు. (మెగా డీఎస్సీ ) పై తోలి సంతకం పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి మా ధన్యవాదాలు.T.N.S.F. జిల్లా ప్రథాన కార్యదర్శి షేక్ :గౌస్ బాషా.

👉మార్కాపురం తెలుగుదేశం శాసనసభ్యులుగా ఎన్నికైన కందుల నారాయణరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదగాపూర్వకంగా కలిసిన పొదిలి తాహసిల్దార్ మహమ్మద్ జియా ఆయన వెంట ఆర్ఐ సుబ్బారావు ఆవుదాలపల్లి విఆర్ఓ అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

👉మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ..ఒకరి హత్య*తణుకు, ప.గో.జిల్లా..తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘటన..పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్య వాగ్వాదం..మోటారుసైకిల్‌పై వెళ్లిపోతున్న భాస్కరరావును గాజుపెంకుతో చాతీ భాగంలో పొడిచిన రామకృష్ణ.బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్న భాస్కరరావు.చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిన భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన తణుకు రూరల్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్‌కేసు నమోదు చేసి నిందితుడు భాస్కరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..

👉నాన్నను లేపేసిందోచ్.. మదనపల్లిలో దాష్టీకం…*ఇద్దరి ప్రియుల ముద్దుల గుమ్మ*ఒకడికి రూ.10లక్షల సుఫారి*

తనకు నచ్చని పెళ్లికి సిద్ధమయ్యాడని కన్న తండ్రినే ఓ బిడ్డ కడతేర్చిన ఘటన సభ్య సమాజాన్ని కలచి వేసింది. తప్పటడుగుల ప్రాయంలో చిటికిన వేలుతో నడక నేర్పి,, కౌమార దశలో కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మమకారం..ప్రియుడి ప్రేమమత్తులో ఆ కూతురుకు గుర్తుకురాలేదా? అని మదనపల్లి జనం తమను తాము ప్రశ్నించుకునే దారుణ ఘటన ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘాతుకం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకమ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నారు. ఆయన భార్య లత ఏడాదన్నర కిందట చనిపోయారు.అప్పటి నుంచి తన ఒక్కగాని ఒక్క గారాల పట్టి హరిత (25) ను కంటికి రెప్పలా దొరస్వామి కాపాడుతున్నారు. ఆమె బీఎస్సీ బీఈడీ చదివింది. త్వరలో టీచర్ ఉద్యోగం నుంచి రిటైర్ కానున్నారు. ఉద్యోగ విరమణతో వచ్చే డబ్బుతో .. తల్లి లేని బిడ్డకు వైభవంగా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పంలో ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చారు. సుమారు రూ.80 లక్షల విలువ చేసే రెండు అంతస్తుల భవనం ఆస్తిని ఈ మధ్యనే తన కూతురుకు పసుపు కుంకుమగా రిజిస్ర్టేషన్ చేశారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. బుధవారం రాత్రి మద్యం తాగి నిద్ర పోయారు. ఉదయం చూసే సరికి రక్త మడుగులో దొరస్వామి శవం కనిపించింది. మదనపల్లి పోలీసులకు ఈ సమాచారం అందింది. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వన్ టౌన్, తాలుకా సీఐలు వల్లి బసు , శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కీలక ఆధారాలు సేకరించారు👉ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ.. మాస్టార్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు.అంత్యంత గోప్యంగా అందిన పోలీసుల దర్యాప్తు సమాచారం మేరకు.. కన్నకూతురే అత్యంత క్రూరంగా చంపిందని, ఇందుకు ఇద్దరు ప్రియులను వినియోగిందనే సమాచారం బయటకు పొక్కింది. ఎందుకంటే.. . దొరస్వామి హత్య జరిగిన సమయంలో కుమార్తె హరిత ఇంటిలోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారని చెప్పింది. ఆ సమయంలో ఘర్షణ వినపడలేదా? దెబ్బల శబ్ధం వినపడలేదా? ఇలాంటి ప్రశ్నలు సంధించే సరికి.. తన తండ్రి దొరస్వామిని తానే చంపానని హరిత పోలీసులకు తెలిపింది. దొరస్వామి తనపై లైంగిక వేదింపులకు పాల్సడినట్టు ఆమె వినిపించిన కథను దర్యాప్తు అధికారులు నమ్మలేదు. మరిన్ని ప్రశ్నలు సంధించగా… అసలు ప్రియుల కథను విప్పిందని తెలుస్తోంది. తనకు ఇద్దరు ప్రియులు ఉన్నారు. పై అంతస్తులో రహస్యంగా సహజీవనం చేస్తుంది. రోజుకు ఒకరు పై అంతస్తుకు వస్తారు. కింది అంతస్తులోని దొరస్వామికి ఈ విషయాన్ని స్థానికులు తెలిపారు. పెళ్లి చేసి పంపించాలని నిర్ణయానికి వచ్చారు. వేరే వ్యక్తితో తనకు పెళ్లి వద్దని హరిత ఎదురు తిరిగింది. తండ్రి ఒప్పుకోలేదు. దీంతో అతడిని హతమార్చటానికి హరిత సిద్ధమైంది. ఒక ప్రియుడికి రూ.10లక్షల సుఫారీ ఇచ్చింది. అంతే దొరస్వామిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఓ ప్రియుడు తిరుమలలో వెంకన్న దర్శనం క్యూలో ఉన్నాడు. మరొక ప్రియుడి ఫోన్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. చపాతీల కర్రతో.. ఇనుప రాడ్డుతో తానే కొట్టి చంపానని నిందితురాలు పోలీసులకు చెప్పిట్టు సమాచారం. కానీ.. ఒంటరిగా ఆమె మాత్రమే హత్య చేసే అవకాశం లేదని, కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పిన కొన్ని విషయాలపై మరిన్ని అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఉత్తమ ఉపాధ్యాయుడిని కన్నకూతురే హతమార్చినట్టు పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం