👉ఆన్ లైన్ లో సెట్టింగ్.. హైదరాబాద్ లో హైటెక్ ముఠా గుట్టు రట్టు ఆన్ లైన్ ప్లాట్ ఫాం వేదికగా కస్టమర్లను సంప్రదించటం.. వారు కోరుకున్నట్లుగా కస్టమర్ డేటా బేస్ ను సిద్ధం చేయటం హైదరాబాద్ మహానగరంలో పోలీసులు ఒక హైటెక్ వ్యభిచార ముఠాను పట్టుకున్నారు.
వ్యభిచార ముఠాను పట్టుకోవటం.. వాటి గుట్టు రట్టు చేయటం మామూలే అయినా.. తాజాగా పట్టుకున్న రాకెట్ మొత్తం హైటెక్ వ్యవహారంలో ఉండటంతో పోలీసుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. ఆన్ లైన్ ప్లాట్ ఫాం వేదికగా కస్టమర్లను సంప్రదించటం.. వారు కోరుకున్నట్లుగా కస్టమర్ డేటా బేస్ ను సిద్ధం చేయటం.. వారు ఎంపిక చేసుకున్న మహిళల్ని.. వారు కోరుకున్న చోట కలుసుకునేలా చేయటం.. వారి రేంజ్ కు తగ్గట్లు లాడ్జిలను బుక్ చేయటం లాంటివి చేస్తుంటారు. ఈ రాకెట్ కు సంబంధించి పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్కు హోటల్ లోని ఒక గదిపై దాడి చేశారు. బాధితురాలితో పాటు నిందితుడ్ని అదుపులోకి తీసుకన్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో బాధితులు ఉన్న వేర్వేరు ప్రాంతాల్లోని వేర్వేరు ప్రదేశాల్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ ను బద్ధలు చేశారు. ఈ రాకెట్ లో భాగస్వాములైన ప్రధాన నిర్వాహకుల్ని..వారి ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు.. రెండు కార్లు.. రెండు టూ వీలర్లతో పాటు పద్దెనిమిది సెల్ ఫోన్లు.. పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో హైటెక్ పద్దతిలో సాగుతున్న ఈ దందా గుట్టు రట్టు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
👉ప్రేయసి తల నరికిన ప్రియుడు.. తనని ప్రేమించి మరొకరితో..తన లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలేదని ముఖంపై యాసిడ్ పోశాడు ఓ సైకో ప్రేమికుడు. కాలేజీలో కత్తి దూశాడు మరో లవర్. ఇప్పుడు ఏకంగా తల నరికి.. ఏదో గొప్ప పని చేసినట్లు వీడియో చేసి వైరల్ అవుతున్నాడు మరో ప్రియుడు.ప్రియురాలు ప్రేమించేంత వరకు ఆరాటం.. తన ప్రేమలో పడ్డాక ఆమెతో నిత్యం యుద్ధం చేస్తుంటాడు ప్రియుడు. ప్రేయసి ఫోన్ బిజీగా వచ్చినా.. తనకు చెప్పకుండా ఎక్కడైనా వెళ్లినా, కాస్త అందంగా రెడీ అయినా తట్టుకోలేకపోతుంటాడు ప్రియుడు. పెళ్లి కాకుండానే ఆమెపై అజమాయిషీ చేస్తుంటాడు. ప్రేమలో నిజాయితీని వెతుకుతూనే.. ఆమెను శంకిస్తూ ఉంటాడు. ఇక పరాయి మగవాడితో చూస్తే తట్టుకోలేక.. తనకు దక్కినది మరెవ్వరికీ దక్కకూడదన్న అక్కసుతో ఆమెను చంపేందుకు కూడా వెనకాడాడు సైకో ప్రేమికుడు. తాజాగా ప్రియురాలు.. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఆమెను అత్యంత ఘోరంగా తల నరికి హత్య చేశాడు కర్కోఠకుడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.ఆమెను హత్య చేయడమే కాదు.. అదేదో గొప్పలాగా వీడియోలో చెప్పుకున్నాడు. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్నందుకే చంపేశానంటూ నర్మగర్భంగా అంగీకరించాడు. రెండున్నరేళ్ల పాటు తన సంపాదనను నాశనం చేసిందని, ఆమె చావడానికి అర్హురాలి అని పేర్కొన్నారు. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని ఖుర్జా నగర్ కొత్వాలి ప్రాంతంలోని మొహల్లా ఖిర్ఖానీలోని శ్మశానవాటికలో చోటుచేసుకుంది. ఏ మాత్రం పశ్చాత్తాపం పడకుండా సైకోలా ప్రవర్తిస్తూ.. తనకు ద్రోహం చేసిన స్నేహితులను కూడా చంపేస్తానని బెదిరించాడు. తాను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి, ఖల్ నాయక్ సినిమాలో అతడు పోషించిన బల్లు బలరామ్ క్యారెక్టర్‌కి వీరాభిమానని చెప్పాడు నిందితుడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.‘ప్రేమలో ద్రోహం చూశా. ఈ ద్రోహానికి మరణం మాత్రమే సరైన శిక్ష. అందుకే ఆమె తల నరికా’ అంటూ నవ్వుతూ చెప్పాడు. కాగా, నిందితుడు పేరు అద్నాన్ అని తెలుస్తుంది. నేరం గురించి వీడియోలో గొప్పగా చెప్పుకోవడమే కాకుండా.. తన కుటుంబ సభ్యుల జోలికస్తే.. అందరినీ చంపుతానని, నా కుటుంబ సభ్యులను తాకేందుకు ట్రై చేస్తే వారి ఇళ్లపై బాంబులు వేస్తాను అంటూ అధికారులను బెదిరించాడు అద్నాన్. తాను ఒకే హత్య చేయడం వల్ల ఎన్‌కౌంటర్‌కి గురికానని, ఎవరైనా 10 లేదా అంతకంటే ఎక్కువ మందిని చంపినప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్ జరుగుతుందని, అన్ని నేరాలు చేస్తే తాను ఎన్‌కౌంటర్‌కి సిద్ధంగా ఉంటానని వీడియోలో పేర్కొన్నాడు నిందితుడు. కాగా, నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాల్ని ఆస్మాగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
👉 ఐఐటి పరీక్షల్లో ఆలిండియా 253వ ర్యాంకు సాధించిన పొదిలికి చెందిన విద్యార్థి గణేష్.పొదిలి విశ్వనాధపురం సెంటర్లో పవన్ మెడికల్ షాప్ దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు,స్నేహితులు.డి గణేష్ మరియు తల్లిదండ్రులను అభినందిస్తున్న ప్రముఖ న్యాయవాది వరికుటి నాగరాజు,నాగేశ్వరరావు, ఆర్ఎంపి వైద్యులు భాస్కరరావు, టీవీ షోరూం అధినేత హరిబాబు పొదిలి పట్టణ ప్రజలు అభినందించారు.
👉పొదిలి కమీషనర్ కు జిల్లా కలెక్టర్ ప్రశాంసపత్రం..మీ సేవలు అమోఘం..ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు..పొలింగ్ బాగా నిర్వహించారని పొదిలి కమీషనర్ కు జిల్లా కలెక్టర్ ప్రశాంసపత్రం అందజేశారు…ప్రకాశంజిల్లా పొదిలి నగరపంచాయితీ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కమీషనర్ పనితీరు మొచ్చుకొని ప్రశాంత పత్రం, మెమొంటో అందజేశారు.పొదిలి కమీషనర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించారు.ఉన్నతాధికారుల చేత ఇలాంటి ప్రశంసలు అందుకొవడం చాలా సంతోషంగా ఉందని అధికారుల సేవలను గుర్తించి నందుకు కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కమీషనర్ కు పట్టణ ప్రజలు కుడా అభినందనలు తెలిపారు, ఎన్నికల విషయమేకాక ప్రజలకు సేవలు అందించటానికి ఎప్పుడు ముందుంటారని పలువురు కొనియాడారు._
👉గిద్దలూరు పాముల పల్లె గేట్ లో ట్రాఫిక్ కష్టాల్లో 108 అంబులెన్స్ సర్వీస్….*
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రైల్వే డంబ్లీంగ్ పనుల కారణంగా అంబవరం అండర్ రైల్వే బ్రిడ్జి మరియు రాచర్ల గెట్ రైల్వే బ్రిడ్జి మూసివేయడం కారణంగా రాకపోకలన్నీ పాములపల్లి రైల్వే గేట్ ద్వారా జరగడంతో ప్రజలు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఏర్పడ్డయి. గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య వారి సిబ్బంది మరియు రక్షక దళ సిబ్బంది శేషయ్య ఆధ్వర్యంలో వెంటనే స్పందించి ట్రాఫికు నియంత్రణ చేసి అత్యవసర 108 అంబులెన్స్ సేవలను అక్కడి నుంచి దారి ఇచ్చి పంపించారు…
👉పల్నాడు జిల్లా మాచర్ల….నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ 32 కేజీల గంజాయి…ఈ సందర్భంగా మాచర్ల రూరల్ సిఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…నాగార్జునసాగర్ చెక్పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులో తీసుకున్నారు.కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు, బురగా రాజేశ్వరి, చోళంగి చంద్రశేఖర్ అను ముగ్గురు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుండి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళుతుండగా పట్టుబడ్డారు…..పట్టుపడ్డ గంజాయి విలువ సుమారు మూడు లక్షలు 20,000 ఉంటుందని సీఐ సురేష్ తెలిపారు….ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను, గంజాయిని , వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు.
👉యూసఫ్ గూడాలో ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని దుర్మరణం..యూసఫ్ గూడా లోని మాస్టర్స్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని యూసఫ్ గూడ చౌరస్తాలని మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడింది. మృతి చెందిన విద్యార్థిని మెహరీన్ గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికారమైన ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
*అమరావతి సచివాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్..
👉బంగారం కొరకు కన్న తల్లి దండ్రులనే కడ తేర్చిన కసాయి కొడుకు..పేగు బందం మర్చిపోయి మానవ మృగలుగా మారిన కొడుకు, కోడలు*ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెతకని ఊరు లేదు, వెతకని జాడ లేదు*ఆడ కూతురు ఆందోళనతొ కిష్టయ్య, నర్సమ్మ ల మరణ వార్త బయట పడింది*25 రోజుల తర్వాత వీడిన సాకలి కిష్టయ్య, నర్సమ్మ డెత్ మిస్టరీ*సంగారెడ్డి అతనొక నరరూప రాక్షస పుత్రుడు. అతడు చేసింది అంతా ఇంతా కాదు. అత్యాసకు పోయి దురు వ్యసనాలకు లోనై కన్న తల్లి దండ్రులనే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన సాదుల్లనగర్ నివాసి అయిన సాకలి లక్ష్మన్ బ్రతుకు తెరువు కొరకు దుండగల్ లొ ఒక ప్రైవేట్ ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ అనేక దురువ్యసనాలకు లోనైన లక్ష్మన్ డబ్బుల కొరకు కన్న తల్లి మెడలో ఉన్న బంగారం పై కన్ను పడింది. ఎలాగైనా బంగారం తల్లి దగ్గర నుండి తీసుకోవడానికి పక్కా పథకం ప్రకారం గత నెల మే 22 రోజున తన తల్లి తండ్రులను దుందిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆల్కహాలు సేవించి విందు చేసుకున్నారు. నిందితుడి భార్య తొ కలిసి 3.5 తులాల బంగారం మీద కన్నేసి సమయం కోసం ఎదురు చూశారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నిద్రలో జరుకున్న తర్వాత సొంత తల్లి దండ్రులను గొంతునులిపి కడతేర్చాడు. దానికి అతని భార్య అనిత పూర్తిగా సహకరించి నట్టు తెలిసింది. ఆ తర్వాత కారులో నర్సాపూర్ అటవీ సమీపంలోని రాయరావు చెరువు చెట్ల పొదల్లో తల్లిదండ్రుల శవాల పై పెట్రోలు పోసి నిప్పంటించాడు నికృష్టపు కొడుకు. ఇట్టి విషయాన్ని గప్ చుప్ గా ఉంచిన భార్య భర్తలు ఏమి తెలువనట్టు ఉన్నారు. ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెత కని ఊరు లేదు, వెత కని జాడ లేదు. ఇక పుట్టిన ఊరికి వచ్చి తన తల్లిదండ్రుల గురించి వాకబు చేసింది. అంతలో సాదుల్లా నగర్ లొ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ప్రజలు గుమిగూడి కిష్టయ్య, నర్సమ్మ ల గురించి కొడుకు లక్ష్మన్ ని అడకూతురు గ్రామస్తులు కలిసి నిలదీశారు. గ్రామస్తులు కలిసి తల్లిదండులను నీవే తీసుకపోయావు ఏమిచేశావు అంటూ నిలదియ్యడంతొ నిందితుడు ఖంగుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మన్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతొ తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించినట్టు తెలిసింది. ఇట్టి విషయమై నింధితులైన లక్ష్మన్ అతని భార్య అనిత ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.
👉జిల్లా సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి..
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలలో విజయం సాధిస్తే మార్కాపురం ను జిల్లాగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు జిల్లా సాధనకు కృషి చేయాలంటూ ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు.వినతి పత్రాన్ని అందుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తనవంతు బాధ్యతగా జిల్లా సాధనకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
👉పేకాట ఆడుతున్న 5 మంది మరియు 24,640/- నగదును స్వాధీనం చేస్తున్న, నాగులవరం రోడ్డు, మార్కాపూర్ పట్టణం పోలీసులు