టిడిపిలో పదవుల కోసం కొట్లాట..మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి :హోంమంత్రి అనిత..చిరంజీవికి మోదీ బంపర్ ఆఫర్..ఐ ప్యాక్ చెల్లింపులపై ఆరా!. కోటంరెడ్డి సోదరులకు ఘన స్వాగతం..13వ సారి రక్త దానం చేసిన యువకుడు.

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదిరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తన మార్కు పాలన మొదలుపెట్టాడు. అలాంటి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తనకింద 24 మంది మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చి వారికి శాఖలను కూడా కేటాయించారు. ప్రస్తుతం పాలన మొదలైనట్టే తెలుస్తోంది. ఈ విధంగా ఒక అడుగు ముందుకు వేసిన తరుణంలో కొంతమంది నేతలు విపరీతంగా కొట్లాడుతున్నారట.చంద్రబాబు వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారట. నాకంటే నాకు అంటూ ఆ పదవి కోసం కొట్లాడుకుంటు న్నారట. ఏం జరిగింది అసలు ఏం పదవి ఉంది అనే విషయానికి వెళ్తే.. మొత్తం 24 మంది మంత్రులను సెలెక్ట్ చేసి వారికి శాఖలను కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇంకొక మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఆపారు. ఆ మంత్రి పదవి కోసం దాదాపు పది మంది లీడర్ల వరకు కొట్లాడుతున్నారట. చంద్రబాబు దగ్గరికి ఆ పదవిని తనకు కావాలంటే తనకు కావాలంటూ అడుగుతున్నారట. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే బిజెపి నుంచి గెలిచిన వారిలో సృజన చౌదరి కామినేని శ్రీనివాస్ ఈ పదవిని అడుగుతున్నారు.అంతే కాకుండా బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రులు, ధూళిపాల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, రఘు రామ కృష్ణంరాజు, అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి అలాంటివారు ఆ ఒక్క మంత్రి పదవి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారట. మరి చూడాలి ఈ మంత్రి పదవి ఎవరిని వరించనుంది చంద్రబాబు మనసులో ఉన్నది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది. ఈ పదవిలే కాకుండా ప్రభుత్వ విప్ మరియు అనేక కార్పొరేషన్ పదవులు కూడా ఉన్నాయి. ఈ పదవుల కోసం కూడా చాలామంది నాయకులు ఇప్పటికే కస రత్తులు మొదలుపెట్టి నాకంటే నాకంటూ కొట్లాడు కుంటున్నట్టు తెలుస్తోంది.

👉 ఆ అధికారులను దూరం పెట్టనున్న సీఎం చంద్రబాబు!.. అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చేయోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.

** మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి : హోంమంత్రి అనిత..రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు.లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు.పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామని ఆమె వెల్లడించారు. గతంలో పోలీసులు నాపైనే అట్రాసిటీ కేసు పెట్టారని హోంమంత్రి గుర్తు చేశారు. చాలా మంది ఐపీఎస్‌లు జగన్‌కు, వైఎస్సార్సీపీకి తొత్తులుగా పనిచేశారని ఆమె విమర్శించారు.గత ఐదేళ్లలో చాలామంది ఐపీఎస్‌లు వారి గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల గౌరవాన్ని పెంచేలా మా పాలన ఉంటుందని అనిత స్పష్టం చేశారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని హోంమంత్రి హెచ్చరించారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఆలోచనలతోనే పనిచేసే అధికారులను ఉపేక్షించమని తెలిపారు. అన్యాయం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్నారు.ఎవరికి అన్యాయం జరిగినా ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే విధంగా తమ పాలన ఉంటుందన్నారు.టి డీపీ కేంద్ర కార్యాలయంపై దాడి,చంద్రబాబు నివాసంపై దాడి కేసులను పునర్విచారణ చేయిస్తానని దళిత వర్గానికి చెందిన తనకు సీఎం చంద్రబాబు హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారుఎలాంటి పక్షపాతం లేకుండా నిస్పక్షపాతంగా వ్యవహరిస్తానని తెలిపారు.

*స్పా కేంద్రం ముసుగులో వ్యభిచారం.. రాజమహేంద్రవరం..స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

👉 వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐప్యాక్ కు చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయి అన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐ ప్యాక్ కు చెల్లించిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే వెళ్లిందనీ, ఆ విధంగా జగన్ సర్కార్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయిఈ విషయంపై నిజాల నిగ్టు తీయడానికి చంద్రబాబు సర్కార్ సమాయత్తమైందని తెలుస్తోంది. ఐప్యాక్ కు వైసీపీ చెల్లింపులపై ఓ ప్రత్యేక బృందం ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 2019, 2024 ఎన్నికలలో ఐ ప్యాక్ వైసీపీకి రాజకీయ,ఎన్నికల వ్యూహాలను అందజేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఆ ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ దాదాపు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. దానిని బట్టి 2024లో ఐప్యాక్ కు అంతకు మించి చెల్లింపులు జరిగి ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం కోల్పోయే వరకూ అంటే 2019 నుంచి 2024 వరకూ ఐప్యాక్ ప్రభుత్వంలో భాగంగా మారిపోయింది.  విశ్వసనీయ సమాచారం మేరకు జగన్ ఐప్యాక్ డైరక్టర్లతో బినామీ కంపెనీలు పెట్టించి వాటికి కొన్ని పాంప్లెట్లు.. ఇతర సామాగ్రి కాంట్రాక్టులు వాటికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేశారు. దీంతో ఐప్యాక్ ద్వారా కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకుని ఎమ్మెల్యేలపై నిఘాకు నియోగించారు. వీరందరికీ వివిధమార్గాల ద్వారా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ తేల్చి బండారం బయటపెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐప్యాక్ చెల్లింపుల బాగోతాన్ని బట్టబయలు చేసే దిశగా తెలుగుదేశం సర్కార్ అడుగులు వేస్తోంది.

👉 జనసైనికుల కష్టం మర్చిపోను ..నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..ప్రజా సునామీ రాబోతుందని 16 నెలల క్రితమే చెప్పా- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి- దుగ్గిశెట్టి ఆధ్వర్యంలో కోటంరెడ్డి సోదరులకు ఘన స్వాగతం

నెల్లూరు : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగిందని .. జనసేన నేతలు, కార్యకర్తల కష్టం ఎప్పటికీ మర్చిపోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ లో.ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయానికి ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఇచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ..కోటంరెడ్డి సోదరులకు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లేరా ఏర్పాట్లు చేశారు. అనంతరం కోటంరెడ్డి సోదరులను దుగ్గిశెట్టి సుజయ్ బాబు, పలువురు జనసేన నేతలు,కార్యకర్తలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

*హైదరాబాద్ లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు*హైదారాబాద్ :జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న జీహెచ్‍ఎంసీ సిబ్బంది..రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వైఎస్ ఫ్యామిలీ..ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం ..లోటస్‍పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు..ఆంధ్రాలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు…

*స్పందన’ పేరును* శనివారం *తొలగింపు.ఇకపై *’ప్రజా సమస్యల* *ఫిర్యాదులు-పరిష్కారాలు’* పేరుతో వినత లను స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించగా.. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని కొత్త ప్రభుత్వం భావిస్తోంది.

ఏలూరు జిల్లా..హోంశాఖా మాత్యులు శ్రీమతి వంగల పూడి అనిత ని సఖినేటి పల్లి (లంక) లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏలూరు రేంజ్ ఐ.జి. జి. వి అశోక్ కుమార్. అంబేద్కర్ జిల్లా SP శ్రీధర్.. ASP ఖాదర్ బాషా లు..పాల్గొన్నారు

👉చిరంజీవికి మోదీ బంపర్ ఆఫర్.. పెద్దన్నయ్యకు పెద్ద పదవి దక్కబోతుందా?..ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. చిరుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమం లోనే పాలన మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే చిరంజీవిని రాజ్యసభ కు పంపించి బీజేపీ లాభం పొందాలనుకున్నట్లు సమాచారం..

👉మహిళ మెడలో గొలుసు చోరీ..మహిళ మెడలో గొలుసు చోరీ.. ఖమ్మం లోని రోటరీ నగర్లో శుక్రవారం చోరీ జరిగింది. రోటరీ నగర్లో ఉన్న కిరాణ షాపుకు ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి షాపు నిర్వాహకురాలు లక్ష్మిని పెరుగు ప్యాకెట్ కావాలని అడిగాడు. ప్యాకెట్ ఇస్తుండగానే ఆమె మెడలోని బంగారు తాడును లాక్కుని పరారయ్యాడు. రూ. 2. 50లక్షల విలువైన గొలుసు చోరీపై బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం టూటౌన్ పోలీసులు తెలిపారు.

👉పరిటాల సునీతమ్మ కు CMO నుంచి ఫోన్….

రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కు సీఎం చంద్రబాబు ఆఫీసు నుంచి ఫోన్ వెళ్లింది. ఆమెకు సచివాలయానికి రావాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన కేబినెట్లో ఆమె పేరు లేదు. దీంతో రాయలసీమ నుండి కీలక పదవి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదే అంశంపై ఆమె తో చర్చించనున్నారని తెలుస్తోంది.

👉13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ..చెన్నై రాష్ట్రవ్యాప్తంగా 13 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రీటా హరీస్‌ టక్కర్‌ ప్రజా, పునరుజ్జీవన శాఖ కార్యదర్శిగాను, ఆ శాఖ కార్యదర్శి నందకుమార్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వీరితో సహా 13 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు.

* కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకొచ్చారు. ఈ నెల 12న కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇప్పటికే నివాళులర్పించారు.

** అంబేద్కర్ కోనసీమజిల్లా..
రాజోలు..భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్..కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్..రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో సంఘటన..భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…

*ఎం.ఆర్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో వరుసగా 13వ సారి రక్త దానం చేసిన యువకుడు👉వివరాల్లోకి వెళితే “గిద్దలూరు” పట్టణం లోని ” ఓ ప్రైవేట్ “హాస్పిటల్ లోని గర్భిణీ స్త్రీ కి అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ నిమిత్తం (A+) పాజిటివ్ రక్తం అవసరం అయింది.👉విషయం తెలుసుకున్న MR సేవా సంస్థ కమిటి సభ్యుడు” “హరీష్” అనే యువకుడు వెంటనే వెళ్లి ఆ గర్భిణీ స్త్రీ కి (A+) పాజిటివ్ రక్తాన్ని ఇచ్చాడు .ఆపత్కాలలో వెంటనే స్పందించినందుకు పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు “హరీష్”కీ కృతఙ్ఞతలు తెలియజేశారు సేవా కార్యక్రమంలో “ఎం ఆర్ సేవా సంస్థ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

 

7k network
Recent Posts

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

తిరుమల పవిత్రను కాపాడుతాం – ముఖ్యమంత్రి చంద్రబాబు .. 👉అన్న క్యాంటీన్ల కోసం రూ.10 లక్షల విరాళం* … *ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి .. *సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … *గాలి జనార్దన్ రెడ్డి కేసుల విచారణలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం .. *కోడి పందాలు పేకాటల పై కఠిన చర్యలు విజయవాడ పిసి