తెల్లరేషన్‌ కార్డుదారులకు తీపి కబురు..రుషి కొండ ప్యాలెస్‌..జ‌గ‌న్ కోసం కాదు:140 నియోజకవర్గాల కౌంటింగ్ లో గోల్మాల్. పోలవరం నిర్మాణంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు- చంద్రబాబు.. మాజీ మంత్రి సిద్దా వైసీపీకి రాజీనామా!..బెడిసి కొట్టిన దొంగల ప్లాన్.

👉వచ్చేనెల 1 నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు. తీపి కబురు అందించిన టిడిపి ప్రభుత్వం. బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు*జూన్‌ 16 : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో ఈనెల 12వతేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపారు. ఈనెల 20వతేదీ నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది.దీంతో పౌరసరఫరాల శాఖ ఆఽధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో దించిన చెక్కర, కందిపప్పు నాణ్యతతోపాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు.

👉ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు…ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు…వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి…2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటనలో 293మంది మరణించారు. అదే ఏడాది OCTలో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. 👉తాజాగా ఇవాళ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్య్వవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్  మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి అనంతపురము జిల్లాకు విచ్చేసిన సందర్బంగా జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ *; అనంతపురము ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, జేసీ అస్మిత్ రెడ్డి, బండారు శ్రావణిశ్రీ, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వేంకటేశ్వర ప్రసాద్, ఎం ఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టూమెన్ కమిటీ సభ్యులు ఆలం నరస నాయుడు ముంటిమడుగు కేశవరెడ్డి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, వేలాదిమంది కార్యర్తలతో గుత్తి వద్ద గల బాటలో సుంకలమ్మ దేవాలయం వద్ద ఘన స్వాగతం పలకడం జరిగింది. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు, గజమాలలతో సత్కరించారు, సుంకులమ్మ దేవాలయం వద్ద పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది….

*అమరావతి…*సెక్రటేరియట్‌లో పవన్‌కల్యాణ్‌కు చాంబర్ కేటాయింపు…రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులోపవన్ కోసం చాంబర్ సిద్ధం చేస్తున్న అధికారులు…పవన్‌తో పాటు జనసేన ఇద్దరు మంత్రులకు చాంబర్లు అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం…పక్కపక్కనే ఉండనున్న పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాంబర్‌లు…ఎల్లుండి తన చాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్

👉పోలవరంలోముఖ్యమంత్రికిఘనస్వాగతం.పోలవరం : ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 11. 45 ని.లకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్ర మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి డా. నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి పూలగుచ్చం అందించి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారధి, కందుల దుర్గేష్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ , శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, ప్రభృతులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ ఏం. వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి ఆర్డీఓ అద్దయ్య , ప్రభృతులు పాల్గొన్నారు.

👉రుషి కొండ ప్యాలెస్‌.. జ‌గ‌న్ కోసం కాదు: మాజీ మంత్రి అమర్నాథ్ ..

గుడివాడ‌ ఈ ప్యాలెస్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోల‌ను కూడా.. మీడియాకు విడుద‌ల చేసి న విష‌యం తెలిసిందే. విశాఖ‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌పై వైసీపీ హ‌యాంలో రూ.500 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చుచేసి నిర్మించిన విలాస‌వంత‌పై ప్యాలెస్ రాజ‌కీయంగా వివాదానికి కార‌ణ‌మైంది. ఈ ప్యాలెస్‌ను జ‌గ‌న్ త‌న కుటుంబం కోసం నిర్మించుకున్నార‌ని.. త‌న స‌తీమ‌ణి కోసం ప్ర‌త్యేకంగాగ‌దులు నిర్మించార‌ని.. విశాల‌వం త‌మైన బాత్రూంలు.. నిర్మించుకున్నారని, దీనికి ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌ని.. అధికార పార్టీ టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. ఈ ప్యాలెస్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోల‌ను కూడా..మీడియాకు విడుద‌ల చేసి న విష‌యం తెలిసిందే. దీంతో రుషికొండ ప్యాలెస్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు గుడివాద అమ‌ర్‌నాథ్ రియాక్ట్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్‌ను జ‌గ‌న్‌కోసం నిర్మించుకోలేద‌న్నారు. దీనిని ప్ర‌భుత్వం కోస‌మే నిర్మించార‌ని తెలిపా రు.త‌మ ప్ర‌భుత్వ‌మే మ‌రోసారి వ‌స్తుంద‌ని ఆశించామ‌ని.. అయితే.. ప్ర‌జా తీర్పు వేరే విధంగా ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఒక్క‌సారికూడా ఇక్క‌డ‌కు రాలేద‌న్నారు. జ‌గ‌న్‌కు ఆ ఆశ కూడా లేద‌న్నారు.ఈ ప్యాలెస్‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం త‌న అవ‌స‌రాలకు ఎలాగైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంద‌న్నారు. దీనిని ఆలోచించడం మానేసి వైసీపీ నేత‌లు, జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తే.. ఏమీ రాద‌ని గుడివాడ వ్యాఖ్యానిం చారు. ప్ర‌తి విష‌యాన్ని వివాదం చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. విశాఖను జ‌గ‌న్‌ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నార‌ని కానీ, అప్ప‌ట్లోనూ ప్ర‌తిప‌క్షాలు అనేక ఇబ్బందులు పెట్టి అడ్డుకున్నాయ‌ని తెలిపారు. రుషి కొండ అన‌ధికార క‌ట్ట‌డం కాద‌ని మాజీ మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి పూర్తిప్లాన్ ప్ర‌భుత్వం ద‌గ్గ‌రే ఉంద‌ని తెలిపారు. గ‌తంలోనే జ‌గ‌న్‌.. రుషి కొండ నిర్మాణానికి సంబంధించి.. ముగ్గురు ఐఏఎస్‌ల‌తోకూడిన క‌మిటీని నియ మించార‌ని గుడివాడ‌వివ‌రించారు. వారు చేసిన సూచ‌న‌లు, ఇచ్చిన నివేదిక ఆధారంగానే నిర్మాణాలు చేప‌ట్టార‌ని వివ‌రించారు. తాము కూడా విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల‌మ‌ని.. గ‌త‌చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఎంత ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయిందో వారు ఆలోచించుకోవాల‌ని అన్నారు. కానీ, తాము అలాంటి వివ‌రాలు చెప్ప‌ద‌లుచుకోలేద‌ని.. గౌర‌వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని మాజీ మంత్రి చెప్పారు.

👉 140 నియోజకవర్గాల కౌంటింగ్ లో గోల్ మాల్ ! 543 నియోజకవర్గాలకుగానూ డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, కేరళలో అట్టింగల్‌ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో గోల్ మాల్ జరిగిందా ? కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పోలైన ఓట్ల కన్నా కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ ఓట్లను లెక్కించారా ? దాదాపు 140 నియోజకవర్గాలలో చోటు చేసుకున్న ఈ అవకతవకలకు సంబంధించి ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ‘ది వైర్‘ ప్రచురించిన ఓ కథనం దేశంలో ప్రస్తుతం సంచలనంగా మారింది. 543 నియోజకవర్గాలకుగానూ డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, కేరళలో అట్టింగల్‌ మినహా దాదాపు అన్ని స్థానాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని..పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు సరిపోలడం లేదని ఈ కథనం వెల్లడించింది. ఏకంగా 140కిపైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అధికంగా ఉన్నాయని, ఈ వ్యత్యాసం 2 ఓట్ల నుంచి 3,811 ఓట్ల వరకు ఉన్నదని స్పష్టం చేసింది.లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం కచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్‌ తర్వాతనే విడుదల చేసిన నేపథ్యంలో ఈ లెక్కలపై అనుమానాలు బలపడుతున్నాయి. వాయువ్య ముంబై(మహారాష్ట్ర): 9,51,580 ఈవీఎం ఓట్లు పోలవగా, 9,51,582 ఓట్లు లెక్కించారు. అంటే రెండు ఓట్లు అధికంగా లెక్కించారు. ఈ స్థానంలో శివసేన(షిండే వర్గం) అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. జైపూర్‌ రూరల్‌(రాజస్థాన్‌): 12,38,818 ఓట్లు పోలవగా, 12,37,966 ఓట్లను లెక్కించారు. ఇక్కడ 852 ఓట్ల తేడా కనిపిస్తున్నది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,615 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కంకేర్‌(ఛత్తీస్‌గఢ్‌): 12,61,103 ఈవీఎం ఓట్లు పోలవగా, 12,60,153 మాత్రమే లెక్కించారు. 950 ఓట్లు కౌంటింగ్‌లోకి రాలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 1,884 ఓట్ల తేడాతో గెలిచారు. ఫరూకాబాద్‌(యూపీ): 10,32,244 ఈవీఎం ఓట్లు పోలవగా, 10,31,784 మాత్రమే లెక్కించారు. 460 ఓట్లను లెక్కించలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి 2,678 ఓట్ల మెజార్టీతో గెలిచారు. విమర్శల తర్వాతనే కచ్చితమైన వివరాలు లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం కచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్‌ తర్వాతనే విడుదల చేయడం గమనార్హం. అస్సాంలోని కరీంగంజ్, ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, మధ్యప్రదేశ్ లోని మండ్లా లోక్ సభ స్థానాలలో పోలైన దానికన్నా ఎక్కువ ఓట్లు లెక్కించగా,తమిళనాడు తిరువళ్లూరు, అస్సాం కోక్రాఝర్, ఒడిశాలోని ధేన్ కనాల్ స్థానాలలో తక్కువ ఓట్లు లెక్కించడం గమనార్హం.

👉పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు ..పోలవరం:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు..అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..”పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయి”….👉రాష్ట్రానికి శాపంగా జగన్‌..’రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు. ‘ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు” 👉వేల కోట్ల ప్రజాధనం వృథా..”ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్టడీ. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీతనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?. ప్రజలనే కాదు, మీడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది. ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వక్తికి చెందిన ప్రాజెక్టు ఇది” అని చంద్రబాబు అన్నారు.

👉ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

👉 శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసక్తికర ఫ్లెక్సీ ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత తనను అభినందించేందుకు వస్తున్న కార్యకర్తలు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని.వాటికి బదులు విద్యార్థుల కోసం నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శ్రావణి.

👉వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా ..మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

👉మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. హైకోర్టు నోటీసులు..మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్  తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి,తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తోసహా 12మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు :

👉సోనియా,రాహుల్,ప్రియాంక గాంధీ లను కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి..డిల్లీ..ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై చర్చించిన షర్మిలా రెడ్డి

👉 రూ.950 కోట్లు కొట్టేసి వాటి ప్లేసులో నల్లకాగితాలు పెట్టాలనుకున్న దొంగలు.. బెడిసికొట్టిన ప్లాన్..రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, మన్సూరాబాద్‌కు చెందిన శేఖర్‌రెడ్డి, ఎండీ మైమూద్‌ ముగ్గురూ కలిసి పథకం వేసి తుర్కయాంజల్‌ శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే ఓ చాక్లెట్‌ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు.ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి.. నల్ల ధనం ప్లేసులో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి, ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి 100కు కాల్ చేశాడు.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.

👉ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు…ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు…వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి…2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటనలో 293మంది మరణించారు. అదే ఏడాది OCTలో విజయనగరంలో 2 రైళ్లు ఢీకొనడంతో 14 మంది చనిపోయారు. ఈనెల 2న పంజాబ్లోని ఫతేగఢ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. 👉తాజాగా ఇవాళ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్, గూడ్స్ ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం