రాహుల్ గాంధీ పొలిటికల్ బ్లాస్ట్ స్టేట్ మెంట్!..రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం:DY CM పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ కు పోలీసుల గౌరవ వందనం..ఒక్కసారిగా పెరిగిన ధరలు.. సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..ప్రముఖులతో మాగుంట.. ఎమ్మెల్యే ముత్తుములకు సన్మానం.. ఎమ్మెల్యే కందులను కలిసిన గునుపూడి..

👉రాహుల్ గాంధీ పొలిటికల్ బ్లాస్ట్ స్టేట్ మెంట్!

బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ, బీజేడీ లు బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా అవతరించడంతో.. కేంద్రంలో వారి పాత్ర కీలకంగా మారింది. మరోపక్క… ఎన్డీయే ప్రభుత్వం బలహీనంగా ఉందని.. ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ రకరకాల వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ప్రధాని మోడీ నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని..ఫలితంగా, దానిలోని కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏది మంచి..ఏది చెడు.. ? తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. మోడీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బందిపడే అవకాశం ఉంది.అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.దీంతో… ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో విద్వేషాలను వ్యాప్తి చేసి, దాని ఫలితాలను పొంది ఉండొచ్చు కానీ… ఈసారి మాత్రం ఆ ఆలోచనను ప్రజలు తిరస్కరించారని.. అసలు ఎలాంటి వివక్షా లేని పరిస్థితులు ఉంటే కచ్చితంగా ఇండియా కూటమి మెజారిటీ దక్కించ్కొని ఉండేదని రాహుల్ బీజేపీని ఉద్దేశించి అన్నారు. తమ చేతులు కట్టేసిన పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడినట్లు తెలిపారు.. ఆ సమయంలో ఏమి చేయాలో ప్రజలకు కచ్చితంగా తెలుసని రాహుల్ నొక్కి చెప్పారు. కాగా… గడిచిన 2014, 2019 రెండుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయిన పరిస్థితి. దీంతో… ఎన్డీయే కూటమి పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు గతంలో కంటే మురుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు దక్కించుకోగా.. మొత్తం ఇండియా కూటమి 230కి పైగా సీట్లు గెలుచుకుంది.

👉 రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం :

DY CM పవన్ కళ్యాణ్..పశ్చిమబెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15 మంది మరణించడం దురదృష్టకరమన్నారు.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు.

👉పవన్ కళ్యాణ్ కు పోలీసుల గౌరవ వందనం.. డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాంప్ ఆఫీసు పరిశీలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పించారు. అనంతరం రేపు సచివాలయంలో మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడంపై అధికారులతో పవన్ చర్చించారు.

👉ఒక్కసారిగా పెరిగిన ధరలు…సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం..ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి.
దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%,
జుట్టు సంరక్షణ నూనెలు 8-11%,
ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి.
డోవ్ సబ్బులు 2%,,విప్రో ఉత్పత్తులు 3%,HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%,నెస్లే కాఫీ 8-13%,మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి.
ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.

👉ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గురజాల నియోజకవర్గంలో గెలుపొందిన తరువాత దాచేపల్లి టౌన్ కి మొదటిసారిగా విచ్చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకి దాచేపల్లి టౌన్ లోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద గల అమరావతి హోటల్ దగ్గర తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు యరపతినేని శ్రీనివాసరావుకి భారీ గజమాలతో స్వాగతం పలికారు.అనంతరం కారంపూడి రోడ్డు నందు టీడీపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు 2 భారీ గజమాలలతో యరపతినేని గారికి స్వాగతం పలికారు.కారంపూడి రోడ్డు లోని వీర్ల అంకమ్మ తల్లి దేవాలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో యరపతినేని పాల్గొనటం జరిగింది.అనంతరం ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్ వరకు జరిగిన విజయోత్సవ ర్యాలీలో యరపతినేని పాల్గొనటం జరిగింది. ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్ వద్ద నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యరపతినేనికి భారీ గజమాలతో స్వాగతం పలికారు.

👉 స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?..లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్అభ్యర్థిగా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీపడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం,ఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్ అభ్యర్థిగాఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

👉 మేము సాదాసీదా హోం మంత్రులమే..

మంగళవారం ఉదయం వందే భారత్ ట్రైన్ లో విశాఖపట్నం నుండి విజయవాడ వరకు తన కుమార్తెతో కలసి ప్రయాణించిన ఆంధ్ర రాష్ట్ర హోం మంత్రి..!!హంగూ ఆర్భాటాలు మాకు తెలియదబ్బా..!!ఎదగటమంటే “ఆర్భాటం” కాదు “హంగామ” చేస్తూ ఎగురుతూ తిరగటం కాదు..!!”ఎదిగిన” కొద్దీ “ఒదిగి” ఉండటమే ‘ఎదగటం’..విద్యతో’ ‘వినయం’ వస్తుంది..వినయంతో’ ‘విజయం’లభిస్తుంది.విజయంతో’ ‘విలువ’పెరుగుతుంది..ఇక్కడే..ఇప్పుడే..హుందాగా ఉండాలి,అప్పుడే కదా నిజమైన కీర్తి దక్కేది

👉నెల్లూరు లోని కోటంరెడ్డి కార్యాలయం లో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా 5వ సారి గెలుపొందిన సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసారు.

👉 దేవాదయ శాఖ మంత్రివర్యులుగా ఇటీవల బాధ్యతులు స్వీకరించిన సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డిని వారి స్వగృహం లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.

👉 సిఐటియు ,ఏపీ ఎం ఎస్ ఆర్ యు కమిటీలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం… స్థానిక రెడ్ క్రాస్ బిల్డింగు వద్ద సిఐటియు, ఏపీఎంఎస్ ఆర్ యు కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్. రవీంద్రనాథ్ ఒంగోలు నగర కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ , డాక్టర్ ఎన్ ఉదయిని MD(OBG&Gyn)బెత్థెన్ నర్సింగ్ హోమ్, డాక్టర్ చాపల వంశీకృష్ణ MS(ortho)MCH, (ortho)శ్రీరామ్ మల్టీ స్పెషలిస్ట్ ఒంగోలు ప్రారంభించారు. ఆర్ రవీంద్రనాథ్ గారు అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పనిచేయటమే కాకుండా సమాజంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో కృషి మంచిదని అన్నారు, డాక్టర్ ఎన్ ఉదయిని, డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ రక్తదానం చాలా ప్రాముఖ్యమైనది ప్రజలకు చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో మరియు కీలకమైన సందర్భాల్లో రక్తము అందక మరియు రక్తహీనతోటి బాధపడుతున్న ప్రజలకు చేకూర్చే ,ప్రక్రియ రక్త దాన శిబిరం నడపడం అనేది మంచి అంశమని అన్నారు.పౌష్టిహారం తినలేక మరియు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ మంది రక్తహీనత తోటి బాధపడుతున్నారు, అందరం కలిసికట్టుగా పనిచేసే ప్రజలకు, కార్మికులకు ,ఉద్యోగులకి అందుబాటులో రక్తాన్ని అందించడానికి ,ఇలాంటి రక్తదాన సేవా కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, పి కల్పన, బంకా సుబ్బారావు, పి ఆంజనేయులు, జీవి రాగయ్య ,ఉబ్బ ఆదిలక్ష్మి సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి టి మహేష్ ,నగర నాయకులు తంబి శ్రీనివాసులు దామా శ్రీనివాసులు ,జి.రమేష్ మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నిపాటి శ్రీనివాసరావు ,యూనిటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి నాగేశ్వరావు ,అంగన్వాడి జిల్లా కోశాధికారి కె.వి సుబ్బమ్మ ,ఏపీ ఎం ఎస్ ఆర్ యు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చిరంజీవి, కార్యదర్శి ఐ వి కృష్ణమోహన్ నాయకులు జె ఉదయ్ కిరణ్, బి సురేంద్ర ,నరసింహారావు, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంగళగిరి నరసింహ రావు ,ఒంగోలు నగర అభివృద్ధి , మారేళ్ళ సుబ్బారావు ఉద్యోగులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

👉శాసనసభ్యులు కందులను కలిసిన గునుపూడి….*
రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి మాజీ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో కందుల దగ్గరకు కదిలిన ఆర్యవైశ్య నాయకులు….*
మార్కాపురం తెలుగుదేశం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని కలిసి పూలదండ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి,గునుపూడి భాస్కర్…….*
విజయవంతంగా చార్ దామ్ యాత్ర పూర్తి చేసుకొని మెజారిటీతో గెలుపొందిన కందుల నారాయణ రెడ్డినీ స్వయంగా నాయకులతో, కార్యకర్తలతో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి గునుపూడి భాస్కర్…….
తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మాజీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు గునుపూడి భాస్కర్ తో పాటు తరలివెళ్లి కార్యకర్తలు నాయకులు అభిమానులు…..

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమం, సచివాలయాల శాఖ మంత్రివర్యులు డా. డోలా బాల వీరాంజనేయ స్వామిని మంగళవారం సాయంత్రం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం గ్రామంలోని మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ఇరువురు చర్చించారు.

👉మున్సిపల్ అధికారులపై మరోసారి రెచ్చిపోయిన అయ్యన్న..చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడిన అయ్యన్న.తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపు.కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు..ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుపులు..త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను..మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతాను..
*మహారాష్ట్ర లోని ఎల్లోరా గుహల విహార యాత్ర కి వెళ్లిన స్నేహాతులు, సరదా కోసం కార్ రివర్స్ చేసేందుకు ట్రై చేసిన యువతి, బ్రేక్ నొక్క బోయి ఎక్సలేటర్ ని నొక్కిన యువతి, వెనక ఉన్న లోయలోకి పడి పోయి మృతి, నుజ్జు నుజ్జు ఐన కారు, వీడియో తీసిన స్నేహితుడు.
👉ఎమ్మెల్యే  అశోక్ రెడ్డిని సన్మానించిన కంభం మండల నూర్ భాషా సంఘ నాయకులు..గిద్దలూరు ::
గిద్దలూరు లోని టిడిపి నియోజకవర్గ కార్యాలయం లో
కంభం మండల నూర్ భాషా సంఘ నాయకులు ఎమ్మెల్యే ని కలిసి సన్మానించడం జరిగింది.కార్యక్రమంలో డి అబ్దుల్ జిలాని (మాజీ వైస్ ఎంపీపీ), ఖాదర్ హుస్సేన్ (మాజీ ఎంపీటీసీ), హబీబుల్లా, సాదిక్ హుస్సేన్ ,.ఖాదర్ వలీ (చమన్),తెలుగు యువత గిద్దలూరు నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్, డి.న్యామతుల్లా, కరీం బీయబాని, సాబీర్ హుస్సేన్, అస్లాం, అక్రమ్ ఖాన్, ఫయాజ్ పాల్గొన్నారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం