👉రేపు అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన…ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించనున్న చంద్రబాబు..రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం సందర్శించనున్న చంద్రబాబు.. అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్ పరిశీలిస్తారు.. ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు పరిశీలన..మంత్రులు, జడ్జిల గృహసముదాయాలు పరిశీలించనున్న చంద్రబాబు..ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లు పరిశీల..నరాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులు పరిశీలించనున్న చంద్రబాబు
👉: రాహుల్.. నా స్నేహితుడు, తోటి యాత్రికుడు : ప్రియాంక గాంధీ .. ఢిల్లి..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి సోదరి ప్రియాంకా గాంధీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. “నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ నా స్నేహితుడు, నా తోటి యాత్రికుడు, మార్గదర్శి, తత్వవేత్త, గొప్ప నాయకుడు. కోపం, ద్వేషం, కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వ్యక్తి, వెలుతురు చిందిస్తూ ఆశను రేపాడు” అని ట్వీట్ చేశారు.
👉 చంద్రబాబు అరెస్ట్… ఈటెల సస్పెన్షన్ : కేసీఆర్ జగన్ అందుకే ఓడిపోయారా ?
రాజకీయాల్లో తూకం రాళ్ళు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా కొలిచి పట్టుకోవాలి. అవసరం అయినప్పుడు వాటి బరువుని బట్టి వాడుకోవాలి. రాజకీయాల్లో తూకం రాళ్ళు ఉంటాయి. వాటిని చాలా జాగ్రత్తగా కొలిచి పట్టుకోవాలి. అవసరం అయినప్పుడు వాటి బరువుని బట్టి వాడుకోవాలి. రాజకీయాల్లో ప్రతీ మాటకు విలువ ఉంది. అలాగే ప్రతీ చేతకూ ఒక లెక్క ఉంది. అధికారంలో ఉన్న వారికి మరీ ఎక్కువగా ఈ విలువలూ లెక్కలూ మారిపోతాయి. వారిని అంతా కోటి కళ్ళలో గమనిస్తూంటారు.అయితే అధికారం అన్నది ఒక అద్భుతం.అది ఒక గమ్మత్తు లాంటి మత్తు. అందులో ఉన్న వారికి చాలా వరకూ ఏమీ కనిపించవు. పైగా తాము ఏమి చేసినా కరెక్ట్ అన్న భావన ఉంటుంది. అందుకే వారు తీసుకునే ప్రతీ నిర్ణయమూ జనాల మెప్పు పొందదు. అంతే కాదు వారు తీసుకునే నిర్ణయాలు కనుక సక్రమంగా లేకపోతే జనాగ్రహం పొందుతాయి. ఇప్పుడు అంత పెద్ద పార్టీ! అయితే జనాలు కొన్ని నిర్ణయాల పట్ల బాహాటంగా స్పందిస్తారు. మరికొన్ని టి పట్ల మౌనంగా ఉంటూనే సరైన సమయంలో రియాక్ట్ అవుతారు. ఆ విధంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కెసీఆర్ జగన్ ఆరు నెలల తేడాలో ఓటమి పాలు అయ్యారు. వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. అవే ఇపుడు జనాలలో చర్చకు వస్తున్నాయి. అధికారంలో ఉన్నపుడు కొంతమందికి దూరం చేసుకుని కేసీఆర్ జగన్ పదవీచ్యుతులు అయ్యారు. అలాగే కొన్ని అవాంఛనీయ నిర్ణయాలు తీసుకుని వారు భారీ ఒటమితో బాధపడుతున్నారా అన్న చర్చకు తెర లేచింది. ముందుగా కేసీఆర్ గురించి చెప్పుకుంటే మంచి నేత బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఈటెల రాజెందర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ విధంగా పార్టీతో రెండు దశాబ్దాల పాటుగా పెనవేసుకున్న బంధాన్ని విడగొట్టారు. ఈటెల పట్ల అందరికీ సానుభూతి ఏర్పడడానికి అది ఒక కారణం అయింది. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఈటెల గెలిచి చూపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా తాజాగా వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరీ నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. ఈటెల విజయం అలా ఉంటే ఆయన వల్ల బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీ కుటుంబానికే పరిమితం అయింది అన్న విమర్శలు వచ్చాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతను వెళ్ళగొట్టడం ప్రజా వ్యతిరేకతకు కారణం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో ఈటెల ఎపిసోడ్ చివరికి బీఆర్ఎస్ తలబొప్పి కట్టేలా చేసింది అని అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ఈటెల సస్పెన్షన్ ఒక ప్రధాన కారణం అని అంటున్నారు.అదే విధంగా ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుని సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అరెస్ట్ చేసి వైసీపీ కానీ జగన్ కానీ ఏమి సాధించారో అర్ధం కాదు. కానీ దాని వల్ల భారీ నష్టాన్ని మూటకట్టుకున్నారు అని అంటున్నారు. బాబు అరెస్ట్ తరువాతనే వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా ఉన్న వివిధ సెక్షన్లు అన్నీ పోలరైజ్ అయ్యాయి. బాబు వంటి బిగ్ షాట్ కే భద్రత లేకపోఏ మన సంగతేంటి అన్న చర్చ కూడా వైసీపీ వ్యతిరేక శక్తులు ఒక చోటకు కూడడానికి కారణం అయింది. అంతే కదు ఏపీలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు కొత్త పొత్తులు ఎత్తులకు కూడా బాబు అరెస్ట్ కేంద్ర బిందువు అయింది. ఆ ఫలితాలను వైసీపీ తాజా ఎన్నికల్లో ప్రత్యక్షంగా అనుభవించింది. మొత్తం మీద చూస్తే కొన్ని హై లెవెల్ డెసిషన్స్ పీక్స్ కి చేరిన తరువాత తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఎలా బెడిసికొడతాయి అనడానికి ఈ రెండు ఎపిసోడ్స్ కళ్ళెదుట కనిపించే ఉదాహరణలు అని అంటున్నారు.
👉ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి?*
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమించినట్టు తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు బుచ్చయ్యచౌదరికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు గవర్నర్ దగ్గర ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయను న్నారు. అనంతరం ఎల్లుండి శాసన సభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించను న్నట్టు తెలుస్తుంది. సీఎం చంద్రబాబు తర్వాత అత్యధికంగా ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంత రం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించను న్నారు. స్పీకర్ పదవికి మరో సీని యర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 22, 23 స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది…
👉పవన్ కళ్యాణ్ చేతికి డిప్యూటీ సీఎం ‘పవర్’..విజయవాడ :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావు పేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంపు ఆఫీస్‌లో వేద మంత్రోచ్ఛర ణలు, పండితుల ఆశీర్వచ నాలతో బాధ్యతలు చేపట్టారు. పవన్‌కు తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేసినట్లు సమాచారం.👉నామినేటెడ్ పోస్టు లలో…పవన్‌కు చంద్రబాబు కీలక హామీ ..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.నామినేటెడ్ పోస్టుల్లో తమకు కూడా కొన్ని కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ లేదా మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది.
👉ఈనెల 24న ఏపీ మంత్రివర్గ సమావేశం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సంద్భంగా ఈ నెల 21 సాయంత్రం 4 గంటల్లోగా కేబినెట్‌లో చర్చించాల్సిన ప్రతిపాదనలను పంపించాలని ప్రభుత్వ శాఖలు ఆదేశాలు అందాయి. కాగా ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
👉మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ.. శాఖలు కేటాయించిన మరుక్షణమే కార్యక్షేత్రంలో దిగిన లోకేష్..ఐటీ, విద్య శాఖలపై లోతైన సమీక్షలు..మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహణ..కూటమి ప్రభుత్వంలో యువమంత్రి నారా లోకేష్ తనదైన శైలి పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. గెలిచాం, రిలాక్స్ అవుదాం అనుకునే రకం కాదు. గెలిచిన మరుక్షణమే తనను గెలిపించిన ప్రజలని కలిసేందుకు సమయమంతా కేటాయించారు. 12వ తేదీన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 14వ తేదీన నారా లోకేష్‌కి హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖలు కేటాయించారు. మినిస్టర్ ఆన్ డ్యూటీగా లోకేష్ క్షణం తీరికలేకుండా పాలనలో మునిగిపోయారు. తన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో “ప్రజాదర్బార్” నిర్వహిస్తున్నారు. రోజూ వందలాది మంది తమ సమస్యలు పరిష్కరించాలని వినతులు అందిస్తున్నారు. ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, అందరి సమస్యలు ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించనున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి), ఎలక్ట్రానిక్స్ శాఖల ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున కంపెనీలను రప్పించేందుకు కొత్త ఐటీ పాలసీ తీసుకురావాలని సూచించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి లోకేష్ విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలన్నీ విడుదల చేసి, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఓ వైపు ప్రజాదర్బార్, మరోవైపు ఉన్నతాధికారులతో తన శాఖల సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నా.. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గెలుపు అంటే ప్రజాసేవకు అవకాశం, పదవి అంటే గురుతర బాధ్యత అని భావించే హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ తన పనితీరుతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉప ఎన్నికల్లో ఈటెల గెలిచి చూపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా తాజాగా వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన మల్కాజ్ గిరీ నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. ఈటెల విజయం అలా ఉంటే ఆయన వల్ల బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీ కుటుంబానికే పరిమితం అయింది అన్న విమర్శలు వచ్చాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతను వెళ్ళగొట్టడం ప్రజా వ్యతిరేకతకు కారణం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో ఈటెల ఎపిసోడ్ చివరికి బీఆర్ఎస్ తలబొప్పి కట్టేలా చేసింది అని అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ఈటెల సస్పెన్షన్ ఒక ప్రధాన కారణం అని అంటున్నారు.అదే విధంగా ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుని సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు అరెస్ట్ చేసి వైసీపీ కానీ జగన్ కానీ ఏమి సాధించారో అర్ధం కాదు. కానీ దాని వల్ల భారీ నష్టాన్ని మూటకట్టుకున్నారు అని అంటున్నారు. బాబు అరెస్ట్ తరువాతనే వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా ఉన్న వివిధ సెక్షన్లు అన్నీ పోలరైజ్ అయ్యాయి. బాబు వంటి బిగ్ షాట్ కే భద్రత లేకపోఏ మన సంగతేంటి అన్న చర్చ కూడా వైసీపీ వ్యతిరేక శక్తులు ఒక చోటకు కూడడానికి కారణం అయింది. అంతే కదు ఏపీలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు కొత్త పొత్తులు ఎత్తులకు కూడా బాబు అరెస్ట్ కేంద్ర బిందువు అయింది. ఆ ఫలితాలను వైసీపీ తాజా ఎన్నికల్లో ప్రత్యక్షంగా అనుభవించింది. మొత్తం మీద చూస్తే కొన్ని హై లెవెల్ డెసిషన్స్ పీక్స్ కి చేరిన తరువాత తీసుకునే నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఎలా బెడిసికొడతాయి అనడానికి ఈ రెండు ఎపిసోడ్స్ కళ్ళెదుట కనిపించే ఉదాహరణలు అని అంటున్నారు.
👉అయోధ్య రామమందిరంలో కాల్పులు.. సైనికుడు మృతి..అయోధ్య రామమందిరంలో కాల్పులు..సైనికుడు మృతిఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. రామమందిరం భద్రతకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ పై కాల్పులు జరపడంతో అతడు మరణించాడు.ఈరోజు తెల్లవారుజామున 5.25 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.మృతి చెందిన జవాను శత్రుఘ్న విశ్వకర్మగా గుర్తించారు.
👉 నెల్లూరు లోని మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వర రావు..
👉 ఒంగోలులో ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమం,విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్దుల సంక్షేమ,సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు శాఖామాత్యులు,డా.డోలా బాల వీరాంజనేయ స్వామి జిల్లా అధికారులతో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా SP సుమిత్ సునీల్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ , కనిగిరి శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి , గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి యర్రగొండపాలెం ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ మరియు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు…. 👉మాజీ సీఎం జగన్‌పై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు…మాజీ సీఎం జగన్‌పై పల్నాడు ఎస్పీకి టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రూ.6.7 కోట్ల ప్రజా ధనాన్ని సొంత అవసరాల కోసం వాడుకొని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. ఈ మేరకు ఎస్పీకి ఫిర్యాదు చేశానని, విచారణ జరిపి జగన్, అతనికి సహకరించిన అధికారులపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు.
👉వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి..నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కేసు నమోదు చేయాలి..వైద్యశాలవద్దకుటుంబ సభ్యుల ఆందోళన*పల్నాడు జిల్లా..మాచర్ల వైద్యుల నిర్లక్ష్యం తో గర్భవతి తో పాటు పసికందు కూడా మృతి చెందిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్ మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్ లోని డౌన్ మార్కెట్ కు చెందిన కారే పావని(21) 9 వ నెల గర్భిణి కావడంతో గత సోమవారం సాయంత్రం డెలివరీ కోసం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువచ్చారు.వైద్యులు,సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో గర్భవతి పావని ని ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్తామని కుటుంబ సభ్యులు కోరగా వైద్య సిబ్బంది అంగీకరించలేదు.గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పావని కి డెలివరీ కాగా పసికందు మృతి చెందింది.తల్లి పరిస్థితి కూడా విషమించడం తో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.అంబులెన్స్ కూడా ఆలస్యం వచ్చింది.అనంతరం తల్లి ని అంబులెన్స్ లో మాచర్ల ప్రభుత్వ వైద్య శాలకు తరలిస్తుండగా మృతి చెందింది.కుటుంబ సభ్యులు ఆందోళన తో మాచర్ల రూరల్ సిఐ కె. సురేష్, విజయపురిసౌత్ ఎస్ ఐ పట్టాభి రామయ్య సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిసౌత్ ఎస్ ఐ పట్టాభి రామయ్య పేర్కొన్నారు.
👉బాబోయ్ ‘ కాల్ ‘ కేయులు…. పోలీసుల వేషధారణలో వీడియో కాల్ బెదిరింపులు..కెసులు నమోదయ్యాయని భయపెట్టి ఖాతాలు ఖాళీడిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ల దోపిడీ..అమరావతి: నిత్యం కొత్త ఎత్తుగడలతో దోచుకునే సైబర్ నేరగాళ్లు..ఇప్పుడు కొత్తగా ‘డిజిటల్ అరెస్టు’ పేరుతో బెదిరిస్తూ అందినకాడికి ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసుల అరెస్టులే చూశాం. తాజాగా.. డిజిటల్ అరెస్టులతో తీవ్ర ఒత్తిడికి గురి చేసి కష్టార్జితాన్ని కొట్టేస్తున్నారు. ‘మీరు వీడియో కాల్ చేసి, మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మీపై కేసు నమోదు అయింది’.. ‘మీరు అశ్లీల సైట్లు చూస్తున్నారు. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు వారెంటుతో వస్తున్నాం. అరెస్టు లేకుండా ఉండాలంటే జరిమానా కట్టాలి.’.. ఇలా కాల్స్ చేసి పోలీసు, సీబీఐ, కస్టమ్స్, తదితర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారుల పేరుతో అరెస్టు చేస్తామని బెదిరించి తమ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు కేటుగాళ్లు. అరెస్టు భయంతో పలువురు వీరి వలలో చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో పలువురు డిజిటల్ అరెస్టు బారిన పడి మోసపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
👉తీవ్ర ఒత్తిడికి గురి చేసి లూటీ..మేం పోలీసులం, ఆర్బీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులమని మోసగాళ్లు వీడియో కాల్స్ చేస్తారు. బాధితుడిని కాల్ కట్ చేయొద్దని గంటల తరబడి ఇంటరాగేషన్ పేరుతో ఇబ్బంది పెడతారు. తమ ముందు కనిపించేలా చూసుకుంటూ తమ డిమాండ్ల సాధన కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తారు. అచ్చు ప్రభుత్వ ఏజెన్సీ అధికారుల దుస్తులనే ధరించి.. పోలీసుస్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు అని భ్రమింపజేసేలా స్టూడియోల నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు.తొలుత ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీ సిమ్ నుంచి నేరస్థులకు ఫోన్లు వెళ్లాయని.. మీ బ్యాంకు ఖాతా నుంచి మాఫియా డాన్‌ల ఖాతాలకు లావాదేవీలు జరిగాయనీ.. మీ ఫోన్ నుంచి మహిళ మొబైల్‌కు అసభ్య సందేశాలు వెళ్లాయని.. ఇలా రకరకాల పేరుతో భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. అనంతరం ఈ కేసు గురించి మాట్లాడడానికి సంబంధిత అధికారితో స్కైప్‌తో కలుపుతానని మోసగాడికి వీడియో కాల్ చేస్తారు. తర్వాత అతడు.. కేసు మాఫీ అని ఒత్తిడి చేసి, అందిన కాడికి డబ్బులు గుంజుతాడు. చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసే వరకు పలురకాలుగా ఒత్తిడి చేస్తాడు. వీడియో కాల్ ఆఫ్ చేయనీయకుండా బాధితుడిని మానసికంగా ఒత్తిడి తెస్తారు.నిజమే అని భ్రమింపజేస్తారు.*పోరంకిలో మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారికి ఇటీవల ఓ కాల్ వచ్చింది. తాను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి కాల్ చేస్తున్నానని చెప్పి.. ‘మీ ఫోన్ నంబరు నుంచి అసభ్య మెసేజ్‌లు వెళ్లినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై ముంబయిలోని నౌపడ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని వివరించారు. మరిన్ని వివరాల కోసం ఎస్.ఐతో మాట్లాడమని చెప్పి కాల్‌ను బదిలీ చేశారు. మీ ఆధార్ నంబరుతో సిమ్‌ను ముంబయిలో తీసుకున్నట్లు రికార్డు అయిందని భయపెట్టేందుకు చూశాడు. తాను ఎప్పుడూ ముంబయి నగరం వెళ్లలేదనీ, తనకే సంబంధం లేదని మత్స్య శాఖ అధికారి ఆందోళనతో సమాధానం ఇచ్చారు. కేసు మాఫీకి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు మోసగాళ్లు. దీంతో భయపడిన అధికారి.. చేసేది లేక దశలవారీగా రూ.లక్షల్లో డబ్బులు వారు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు.*విజయవాడ నగరానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ముంబయి క్రైం బ్రాంచి అధికారిని అని ఓ ఫోన్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగాయనీ, దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచిలో కేసు నమోదు అయిందని వివరించాడు. మీపై అరెస్టు వారెంటు జారీ అయిందనీ, దానిని వాట్సాప్‌లో బోగస్ పత్రాన్ని పంపించాడు మోసగాడు. అది చూసి నిజమే అని నమ్మిన నగరానికి చెందిన వ్యక్తి ప్రాథేయపడ్డాడు. దీని కోసమే ఎదురుచూస్తున్న అవతలి వ్యక్తి.. తాను సూచించిన ఖాతాలకు డబ్బులు పంపించమని సూచించాడు. దీంతో దశల వారీగా రూ.11 లక్షలు జమ చేశాడు. తర్వాత నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించాడు.అవగాహనతోనే అరికట్టవచ్చు*సైబర్ మోసాలపై తరచూ అవగాహన పెంచుకోవాలి. అప్పుడే మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.తాము పోలీసులమని గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను పట్టించుకోవద్దు..వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దు. వారి అస్థిత్వాన్ని ధ్రువీకరించుకోండి.ప్రభుత్వ రంగ సంస్థలు కానీ.. అధికారులు కానీ.. ఫోన్ ద్వారా డబ్బులు బదిలీ చేయమని అడగరు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చెల్లింపులు చేయొద్దు.మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే.. మోసగాళ్ల బారిన పడకుండా వెంటనే స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.అనుమానాస్పద కాల్స్ గురించి సైబర్ సహాయవాణి నెంబరు 1930కు ఫిర్యాదు చేయాలి
👉రైలులో అక్రమ మద్యం రవాణా ఇద్దరు అరెస్ట్..గుంటూరు: రైల్వే స్టేషన్ రైలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని మంగళవారం గుంటూరు జిఅర్ పి పోలీసులు అరెస్ట్ చేసారు. ఎస్ ఐ వేంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం పేరేచర్లకు చెందిన రవికుమార్, సాంబయ్య ఇద్దరు హైదరాబాద్ కు వెళ్లి తెలంగాణా మద్యం తీసుకుని రైలులో గుంటూరుకి చేరుకున్నారు. ఎస్ ఐ తమ సిబ్బందితో రైల్వేస్టేషన్ లో తనిఖీలు చేయగా ఇద్దరి బ్యాగులో 40 తెలంగాణా మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.
👉 ఇలా తయారయారేంట్రా.. చికిత్స పేరుతో డాక్టర్‌కే టోకరా.. చనిపోయినట్టు యాక్షన్ చేపించి…దోపిడీ… ఇది నెక్స్ట్ లెవెల్..*వైద్యం చేసిన ఆర్ఎంపీ భార్యకు చుక్కలు చూపించారు రోగి తరఫు కుటుంబ సభ్యులు. రాజకీయ పలుకుబడిని అడ్డుగా పెట్టుకుని యావత్ ఆస్తిని కాజేశారు.తెనాలి:బాలాజీ నగర్ లో జోజి కుమార్. అతని భార్య జయశ్రీ. ఆర్ఎంపిగా చిన్న క్లినిక్ నడుపుతున్నాడు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ 29న బాలాజీ నగర్ కు చెందిన మహిళ గ్యాస్ సమస్యతో బాధపడుతూ జోజి కుమార్ నడుపుతున్న క్లినిక్‌కు వచ్చింది. అయితే ఆ సమయంలో జోజి కుమార్ లేకపోవడంతో అతని భార్య జయశ్రీ రోగి వచ్చిన సంగతి ఫోన్లో భర్తకు చెప్పింది. భర్త సూచనలతో జయశ్రీ ఆమెకు ఇంజక్షన్ చేసింది. ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికే రోగి ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో కంగారు పడిన జయశ్రీ వెంటనే ఫోన్లో భర్తను సంప్రదించింది. అయితే అప్పటికే రోగి బంధువులు జయశ్రీని దుర్భాషలాడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితురాలిని పట్టణంలోని వేరే ఆసుపత్రికి తరలించారు.ఈవిషయం తెలుసుకున్న జోజి కుమార్ హడావుడిగా క్లినిక్ వచ్చి వెంటనే రోగి కోసం పట్టణంలోని ఆసుపత్రులన్నీ వెతికాడు. అయితే మహిళా రోగి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే సమయంలో రోగి బంధువులు తరపున స్థానిక కౌన్సిలర్ రహమత్ బేగ్ రంగంలోకి దిగారు. జయశ్రీని ఆమె భర్త జోజికుమార్ను బెదిరించారు. మహిళా రోగి చనిపోయిందంటూ హాడావుడి చేశారు. విషయాన్ని సెటిల్ చేసుకోవాలంటూ కౌన్సిలర్ సూచించారు. దీంతో జయశ్రీ తన వంటిపై ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఐదు లక్షల రూపాయలను తీసుకొచ్చి ఇచ్చింది. కొద్దీ రోజుల తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అంటూ రహమత్ బేగ్, అతని తమ్ముడు ఫయాజ్ బేగ్, బంధువు జాన్ సైదాలు రంగంలోకి దిగారు.బాలాజీ రావు పేటలో జోజి కుమార్ పేరిట ఉన్న 36 గజాల స్థలాన్ని తమ పేరు మీద రాయించుకున్నారు. అంతేకాకుండా ఖాళీ ప్రామిసరీ నోట్లు, కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. ఇదంతా మే 2న జరిగింది. అప్పటికే ఎన్నికల హాడావుడి మొదలవ్వడం పోలీసులంతా బందోబస్తులో ఉండటంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశారు. కొద్దీ రోజుల తర్వాత చనిపోయిందనుకున్న మహిళ బ్రతికే ఉందన్న విషయం జోజికుమార్ దంపతులకు తెలిసింది. కావాలనే కౌన్సిలర్ కుట్రపన్ని తమ వద్ద నున్న స్థలం రాయించుకున్నారని అర్ధమైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా మారడంతో పోలీసులు కౌన్సిలర్ రహమత్ బేగ్‌పై వచ్చిన ఫిర్యాదులో దర్యాప్తు చేశారు. ప్రాధమిక ఆధారాలు సేకరించిన పోలీసులు రహమత్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.