👉నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది. నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించినUGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
👉కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300, పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంపు.. మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400, కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7 500, మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400, గతేడాది కంటే రూ.450 ఎక్కువ, పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, గతేడాది కంటే రూ. 12 ఎక్కువ, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..
👉తొలిరోజే దాదాపు 10 గంటల పాటు పవన్ కల్యాణ్ సమీక్ష… అధికారులకు 3 నెలల టార్గెట్ ఫిక్స్!*
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష..
గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, మంచి నీటి కొరత సమస్యలపై దృష్టి
వివిధ అంశాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు
మూడు నెలల్లో సమస్యల పరిష్కారం జరగాలన్న ఉపముఖ్యమంత్రి
ఆ తర్వాత మరోసారి సమీక్ష ఉంటుందని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలి రోజునే సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దన్నారు.ఆ తర్వాత జనసేనానితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కల్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు
👉ప్రకృతి జగన్ ను శపించింది – మంత్రి నిమ్మల..పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇరిగేషన్, డ్రైనేజీ, కన్జర్వెన్సీ శాఖల పనితీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు ఉద్యోగులతో ప్రస్తుత వర్షాకాలంలో వ్యవసాయం ముంపు బారిన పడకుండా పంట కాలవలు, మురుగు డ్రైన్లలో తూడు,గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి పరివాహక గ్రామాల్లో బలహీనంగా ఉన్న ఏటిగట్టు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మొగల్తూరు మురుగు కాల్వలో దట్టంగా అల్లుకుపోయిన గుర్రపు డెక్క ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడారు.జగన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనే అధికార దాహం తప్ప అన్నదాతకు సేవ చేయాలనే ధ్యాసే లేదు ..వర్షాకాలంలో వ్యవసాయం ముంపు బారిన పడకుండా పంట కాలవలు మురుగు డ్రైయిన్ లలో గుర్రపు డెక్క, తూడు పనులపై ముందు చూపు లేదు..అన్నదాతను నిర్లక్ష్యం, దగా చేసినందు వల్లే జగన్ ను ప్రకృతి శపించింది.
👉చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తించాలి!: వైఎస్ షర్మిల..చంద్రబాబు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలయ్యేలా చూడాలన్న షర్మిల..జగన్‌కు వ్యతిరేకంగా వెళదామనే నినాదంతో ఓట్లు పడ్డాయని వ్యాఖ్య..వైఎస్ విగ్రహాలపై దాడులను ఖండించిన షర్మిల..👉వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారు… ఇక నేనేం చెప్పాలని వ్యాఖ్య ..ప్రజల తీర్పును గౌరవిస్తూ చంద్రబాబుకు మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూనే… ఆయనకు పలు విషయాలను గుర్తు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల ఊపిరి అన్నారు. హోదా విషయంలో బీజేపీ మనల్ని మోసం చేసిందని విమర్శించారు. 2015లో ఇచ్చిన హామీని ఈ రోజు వరకు నెరవేర్చలేదన్నారు. అయితే ఈరోజు చంద్రబాబు మద్దతు ఇస్తున్నందువల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలన్నారు.చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉండకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండకపోయేదన్నారు. ఢిల్లీలో తాము పీఠం ఎక్కడానికి ఏపీ ప్రజలే కారణమని మోదీ గుర్తించాలన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించి… ప్రత్యేక హోదా సాధించుకు రావాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. విభజన చట్టంలో పెట్టిన వాటిలో చాలా వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు. రాజధాని, పోర్టులు, కడపలో స్టీల్ ప్లాంట్… ఇలా ఎన్నింటినో చంద్రబాబు సాధించాల్సి ఉందన్నారు.*హానీమూన్ పీరియడ్ తీసుకునే సమయం లేదు*ఇక, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని… వాటిని ఎలా అమలు చేస్తారో… ఎప్పుటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇప్పుడే గెలిచారని తమకు తెలుసునని… కానీ ఏపీ వెనుకబడిన రాష్ట్రం కాబట్టి వారు హనీమూన్ పీరియడ్ తీసుకునే పరిస్థితి కూడా లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు.జగన్‌కు వ్యతిరేకమనే ఒకే నినాదంతో ఓట్లు పడ్డాయి ఇటీవలి సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జగన్‌కు వ్యతిరేకంగా అనే ఒకే నినాదంతో జరిగాయన్నారు. అందుకే ఎన్డీయే కూటమి విజయం సాధించిందన్నారు. ఓటు వృథా కావొద్దు… ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు కంకణం కట్టుకున్నందువల్లే కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఓట్లు సాధించలేదన్నారు. 2029 నాటికి తాము మంచి స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయినా వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని… ఇక తాను మాట్లాడాల్సింది ఏముంటుందన్నారు.👉దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ మంచి సీట్లు గెలుచుకుందన్నారు. బీజేపీ చేస్తోన్న అరాచకాలను ప్రజలు గుర్తించారని… అందుకే ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ఎన్నాళ్లు అధికారంలో ఉంటుందో చెప్పలేమన్నారు. ఈరోజు ఢిల్లీలో పవర్ బీజేపీ చేతిలో లేదన్నారు. బీజేపీ ఇతర పార్టీలపై ఆధారపడి ఉందన్నారు.👉వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణం..ఒక పార్టీ ఓడిపోయినందుకు వైఎస్ విగ్రహాలపై దాడులు దారుణమని షర్మిల అన్నారు. వైఎస్ మహానాయకుడని… ప్రజలకు ఎంతో సేవ చేసిన నాయకుడన్నారు. అలాంటి మహానాయకుడు చనిపోతే… అది తట్టుకోలేక 7 వేల మంది ప్రజలుచనిపోయారన్నారు. అందుకే చనిపోయిన వారికి రాజకీయాలు ఆపాదించవద్దని కోరారు. ‘దయచేసి వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి.. వారు చేశారని మీరు… మీరు చేశారని వాళ్లు.. ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ వెళ్తే దీనికి అంతే ఉండదు. మళ్లీ చెబుతున్నాను… మీకు, ఇంకొకరికి తేడా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టాలి’ అని సూచించారు.వైసీపీకి చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి షర్మిల స్పందిస్తూ… ‘పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే… అది ఎండిపోతే తప్ప’ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జగన్ అయిదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా తేలేకపోయారన్నారు
👉మియాపూర్ బాలిక అనుమానాస్పద కేసులో కొత్త ట్విస్ట్…బాలిక వసంతను తండ్రి హత్య చేసినట్లుగా తెలిసిన పోలీసులు. బాలికను నిర్మానుష ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంత పెట్టిన తండ్రి. తండ్రి కోరిక విని గట్టిగా అరిచిన బాలిక..తండ్రి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బెదిరించిన బాలిక.పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్…తన కోరిక తీర్చాలంటూ బాలిక పై ఒత్తిడి తెచ్చిన తండ్రి నరేష్…అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చిన తండ్రి నరేష్…నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య…బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చిన బాలిక తండ్రి నరేష్…వారం రోజుల తర్వాత బయటపడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ…ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం…తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు…11 నిమిషాల వ్యవధిలోనే బాలిక ను హత్య చేసిన తండ్రి నరేష్…అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చిన నిందితుడు…బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లిన నిందితుడు…వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూస్తూ వచ్చిన నిందితుడు…తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్ దంపతులు…వారం రోజుల పాటు అస్సలు విషయం దాచిన బాలిక తండ్రి నరేష్…బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణ…స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా…బ్రతుకుదెరువు కోసం నడిగడ్డ తండాకు వలసవచ్చిన నరేష్ దంపతులు…వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేసిన తండ్రి నరేష్…నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు…సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు…నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మియాపూర్ పోలీసులు.. గ్రాముల గంజాయి పట్టివేత* ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు వెల్లడించారు*
👉గంజాయి వినియోగంపై ఉక్కు ఉక్కుపాదం మోపుతాం పట్టణ సిఐ శ్రీనివాసరావు హెచ్చరిక..ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 1400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు మంగళగిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు మంగళగిరి పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ సుభాని, కాజా గ్రామానికి చెందిన దొడ్డక పవన్ కుమార్ లు మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళగిరి పట్టణంలో గతంలో సుమారు 30 మంది అనుమానితులు ఉన్నారని వీరిలో కొంతమంది మానేశారని, మరికొందరు ఇంకా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. గంజాయి ఎక్కడినుంచి వస్తుంది ఎక్కడ ఎవరు విక్రయిస్తున్నారు వాటి మూలాలపై ప్రత్యేక గాని పెట్టామని గంజాయి మాదక పదార్థాల వినియోగం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ గంజాయి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే మా పోలీసు వారికి తెలియజేయాలని వారి పేరు గోప్యంగా ఉంచుతామని మంగళగిరి పట్టణాన్ని గంజాయి రహిత చేసేందుకు ప్రజలందరూ సహకరించాలని సి ఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి, నార్త్ సబ్ డివిజన్ డి.ఎస్.పి సిహెచ్ రవికాంత్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై షేక్ ఖాదర్ బాషా, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
👉టీవీ9 రజినీకాంత్ కు ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులుఇన్నాళ్లు అటు తెలంగాణలో కేటీఆర్ నుంచి ఇటు ఏపీలో జగన్ నుంచి అడ్డంగా దోచుకున్న రజినీకాంత్ కు ఐటీ శాఖ నోటీసులు పంపింది..కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక జర్నలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కిన రజినీకాంత్ ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు నోటీసులు పంపారు.. ఇటీవల ఢిల్లీలో ఉన్న కూతుర్ని కలిసేందుకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ కు పంపారు గుర్తు తెలీని వ్యక్తులు..వైసీపీ ముఖ్యనేత బంధువుకు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థ ద్వారా స్పెషల్ ఫ్లైట్ తన వ్యాపార భాగస్వామి నాయుడు అనే వ్యక్తి ద్వారా బుక్ చేసినట్టుగా అందుకు సంబంధించిన ఆధారాలు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికాయి.. ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేయడం అనేది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది..మరోవైపు ఇటీవలే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 11కోట్లతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన ఫ్లాట్, మోకిలాలో 8కోట్లతో కొన్న విల్లా, మియాపూర్ లో కొన్న త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వీటన్నింటిపైనా ఆరా తీస్తున్నారు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు..
👉 మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్ బాబు..హైదరాబాద్ : జూన్ 19మహేశ్ బాబు మరోసారి రియల్ హీరో అనిపించు కున్నారు. కృష్ణా(D) పెదప్రోలుకు చెందిన రాజేశ్.. మొదట కృష్ణకు, ఇప్పుడు మహేశ్‌కు వీరాభిమాని.అని నిరూపించుకున్నారు.ఆయన ముగ్గురు పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని పేర్లు కూడా పెట్టారు. ప్రస్తుతం రాజేశ్ కిడ్నీ పాడైపోయి మంచాన పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ బాబు ఆ ముగ్గురి పిల్లల చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్నిమ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ స్టోరీని షేర్ చేశారు…
👉 కోన శశిధర్ పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా కోన శశిధర్ నియమితులయ్యారు..నూతన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ 2015 నుంచి 2017 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.*ప్రవీణ్ ప్రకాష్ ని GAD కు అటాచ్ చేసిన AP ప్రభుత్వం*జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్.*పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్.*వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్..*కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది..*పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్*పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్ *ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్‌గౌర్*నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్‌గౌర్‌కు అదనపు బాధ్యతలు*పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ *ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు.*ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ.*ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్*ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న *ఆర్థిక వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి *పశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్* గనులశాఖ డైరెక్టర్, కమిషనర్‌గా ప్రవీణ్‌కుమార్* ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు *మురళీధర్‌రెడ్డిని జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం.
👉ఎండీయు వాహనాలను తొలగించేందుకు రంగం సిద్ధం*ఎండీయు వాహనదారులపై వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం ఎండీయు వ్యవస్థను పూర్తిగా తొలగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…ఎండీయు వాహనదారులు పౌర సరఫరా విభాగంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు పౌరసరఫరా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం…..ఈ మేరకు అన్ని ప్రాంతాల ఎండీయుల తో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది…ఈనెల 20వ తేదీన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది……
👉వృద్ధ మహిళ హత్య… సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పట్టణ సీ.ఐ.సాంబశివరావు…పల్నాడు జిల్లావినుకొండ…పట్టణం పట్టణంలోని కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజారులో వృద్ధ మహిళ పి. కోటి రత్నం ( 75 ) హత్య…సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన సిఐ s.సాంబశివరావు..ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దొంగతనానికి వచ్చి ఒక యువకుడు ఇంట్లోకి వెళ్లి మహిళ మెడలోని బంగారు ఆభరణాలు దొంగలించేందుకు ప్రయత్నం.వృద్ద మహిళ పెనుగులాడటంతో హత్య చేసి పరారైనట్లు సమాచారం.ఆమె గొంతు పై గోర్లు తో పీక నొక్కినట్లు గాయయాలు.ఆమె కేకలు పెట్టడం తో పక్కన వారు చూసేసేసరికి దండుగులు పరార్ సమిపంలోని సిసి టీవీ ఫుటేజ్ పరిసిలిస్తున్న ట్లు సీ.ఐ. సాంబశివరావు తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
👉కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు : మల్టీజోన్ ఐజిపి ఏవి రంగనాధ్.. మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై స్టేషన్ ఎస్. ఐ భవాని సేన్ తుపాకీ చూపించి లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళా హెడ్ కానిస్టేబుల్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో భూపాలపల్లి ఎస్పీ చేపట్టిన విచారణలో ఎస్. ఐ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో పాటు ఎస్. ఐ భవాని సేన్ గత 2022 జులై మాసంలో లైంగిక వేధింపులకు పాల్పడంతో ఇతనిపై ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సదరు ఎస్ఐ తన హోదా అడ్డుపెట్టుకొని మరో ముగ్గురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో పాటు ఎస్ఐ తరుచుగా లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడే వ్యవహారం పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉంది.ఎస్ఐ పై ఈ పరిస్థితుల్లో విచారణ చేయడం సరైన నిర్ణయం కాదనే ఆలోచనతో కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ పై ఎలాంటి విచారణ లేకుండానే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆర్టికల్ 311 ప్రకారం సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తునట్లుగా మల్టీ జోన్ ఐజిపి ఏవి. రంగనాథ్ వెల్లడించారు.
👉మక్కాలో మహా విషాదం…645 మంది భక్తులు మృతి…ఇంతమంది చావుకు కారణం ఇదే… ముస్లింల పవిత్ర భూమి మక్కాలో (Mecca) ఘోర విషాదం చోటుచేసుకుంది. హజ్ తీర్థయాత్ర (Hajj pilgrimage)కు వచ్చిన లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు.మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం 645 హజ్ యాత్రికులు (Hajj pilgrims) మరణించినట్లుగా సౌదీ అరేబియా(Saudi Arabia) మీడియా తెలిపింది. వీరిలో భారతదేశానికి (India) చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 68మంది భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులతో పాటు మరో 2వేల మందికిపైగా అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంవత్సరం దాదాపు 16 లక్ష మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొన్నారు. వీరంతా వివిధ దేశాల నుంచి వచ్చినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు తెలిపారు.👉వేడి గాలులు తట్టుకోలేక..మక్కాలో విపరీతమైన వేడి కారణంగా 645 మంది హజ్ యాత్రికులు మరణించారు. బక్రీద్ నేపథ్యంలో హజ్ యాత్రకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. అక్కడ 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్తానిక వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బకు గురై 645 మంది చనిపోయారు.645 మంది మృతుల్లో 68 మంది ఇండియన్స్..చనిపోయిన హజ్ యాత్రికులలో కనీసం 323 మంది ఈజిప్షియన్లు, కనీసం 60 మంది జోర్డానియన్లు ఉన్నారు. వీరితో పాటు అనేక దేశాల నుండి 150 మందికి పైగా మరణించారు. భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 68 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.👉అనారోగ్యంతో 2వేల మంది ఆసుపత్రిలో చేరిక..ముస్లింలు పవిత్ర ప్రదేశంగా భావించే మక్కాలో విపరీతంగా వీస్తున్న వేడిగాలుల కారణంగా 645 మంది మరణించారు. 2 వేల మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వీరంతో ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. వీళ్లే కాకుండా మరికొంత మంది గల్లంతైనట్లుగా కూడా తెలుస్తోంది.ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ తో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా మృతుల్లో ఉన్నట్లుగా ధృవీకరించారు.బక్రీద్ కారణంగా భక్తుల రద్దీ..బక్రీద్ ముస్లింలకు పవిత్ర పండుగ అని దాని కారణంగానే మక్కాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరిగిందని స్థానిక అదికారులు చెప్పారు. వివిధ దేశాల నుంచి 16 లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు సమాచారం.
👉డబ్బులివ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్దపల్లి ఏసీపీ..* పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా..టేకుమట్ల – ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది.రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు ముట్టచెప్తానని వెళ్లిపోయారు.మళ్లీ డబ్బులు ఇయ్యమని ఇంటికి పోతే మొదట ఇస్తా అన్నడు.. తర్వాత ఇవ్వనుపో అన్నడు. పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో.. బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా..ఆయనకి మద్దతు తెలిపిన టేకుమట్ల మండల రైతులు, ప్రజలు.