👉 అమరావతి*చంద్రబాబు*అప్పులు విపరీతంగా చేసేశారు.ఏపీ గల్లా పెట్టే ఖాళీ అయింది.
*రూ. 500 కోట్లతో రుషికొండను తొలిచేసి.. ప్యాలెస్ కట్టేశారు.*నిబంధనలకు విరుద్దంగా రుషికొండను నిర్మించారు.వైసీపీకి 11 సీట్లు ఇవ్వకూడదనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది.వైసీపీ నేతల్లాంటి వారికి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా..?ఖజానాలో ఎంత డబ్బుందో తెలీదు.భారీగా అప్పులున్నాయి.లెక్కలన్నీ బయటకు తీయాలి.కానీ నేను పారిపోవడానికి సిద్దంగా లేను.అధ్యయనం చేస్తాం.. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం.మొన్నటి వరకు అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు అడ్రస్ లేకుండా పోయారు.*రెండో ప్రపంచ యుద్దంలో ధ్వంసమైన హిరోషిమా, నాగసాకిలను అలాగే ఉంచారు.*వాటిని చూసి కసితో జపాన్ అభివృద్ధి చెందింది.*విధ్వంసమైన ప్రజా వేదికను అలాగే ఉంచాలన్న సూచనలు వస్తున్నాయి…
👉ఈవీఎంల చెకింగ్, వెరిఫికేషన్ కోసం ఈసీకి ఎనిమిది దరఖాస్తులు.. డిల్లీ…లోక్సభ ఈవిఎంల కోసం ఎనిమిది, అసెంబ్లీ ఈవిఎంల కోసం మూడు దరఖాస్తులు వైయస్సార్సీపి నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్ల లోని ఒక పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వైఎస్ఆర్సిపి నుంచి గజపతినగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసిన నాలుగు వారాలలో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం ..
👉 ఆడుదాం ఆంధ్రాలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు: రోజా.. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై టీడీపీ బురద జల్లుతోందని మాజీమంత్రి రోజా మండిపడ్డారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ.. “ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే.. స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. నేను, సిద్దార్థ్డ్డి అవినీతి చేశామనడం హాస్యాస్పదమే అవుతుందన్నారు.
👉త్వరలోనే జగన్ ఓదార్పు యాత్ర..కొడాలి నాని….వైసీపీ అధినేత,మాజీ సీఎం జగన్ త్వరలోనే ఓదార్పు యాత్ర చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులు దాడులు చేసినవారిని జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు.నియోజకవర్గాల్లో వారం రోజులపాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒకమిరాకిల్ మాదిరి ఉందని, ఇంత మంచి చేసినా,ఓటమి చెందడం నమ్మశక్యంగా లేదని చెప్పారు.సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలని కొడాలి నాని డిమాండ్చేశారు.
👉 ఓటమి జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే:వైస్ జగన్..
తాడేపల్లి లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో తమ నేతలకు పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని అన్నారు.శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.శ్రీకృష్ణుడి తోడు ఉన్న పాండవులు అప్పుడప్పుడు ఓడిపోయారు.చివరకు ప్రతి ఒక్కరూ అర్జునుడుల విజయం సాధిస్తారు.99% హామీలు అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం అని పేర్కొన్నారు.వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మీద జరుగుతున్న దాడులు పై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి త్వరలో డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టి మీ అందరి దగ్గరకు వచ్చి భరోసా కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందని వైసీపీ అధినేత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
👉 రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు …వరంగల్ – నర్సంపేటలో కందకట్ల అజయ్(23) అనే యువకుడికి రీల్స్ చేసే అలవాటు ఉంది. ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.అయితే అజయ్ గతంలో కూడా “3” మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు.
👉సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా గచ్చిబౌలితో పాటుగా ఐదు బ్రాంచ్ లు ఓపెన్ చేసింది..ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది నిరుద్యోగుల దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి 50వేల రూపాయలు వసూలు చేసింది ఈ సంస్థ…ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసింది.రూ. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే కంపెనీ బోర్డు తిప్పేసింది.కంపెనీ క్లోజ్ చేశామాంటూ యాజమాన్యం నిరుద్యోగులకు షాకిచ్చింది.కంపెనీ చేసిన మోసంతో దాదాపుగా 100 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు.దీంతో బాధితులంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…
👉స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల ఉన్నత విద్యాధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది మేళాతాలాలతో సాదర స్వాగతం పలికారు. మొదటగా పాఠశాల ప్రాంగణంలోని శ్రీ సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విద్యార్థులకు బ్యాగ్, పాఠ్యపుస్తకముల కిట్ లను అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి నాణ్యమైన విద్యా, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ సందర్బంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలియచేశారు..కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నత అధికారులు, ఉపాధ్యాయులు, గిద్దలూరు జడ్పీటీసీ, పట్టణ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గోన్నారు.