👉వాయు కాలుష్యంతో రోజుకు 2వేల మంది చిన్నారులు మృతి*ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2వేల మంది చిన్నారులు మరణిస్తున్నారని యూఎస్-హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయుకాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారకంగా ఉందని వెల్లడించింది. దీనిని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్పై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.
👉 బాపట్ల జిల్లా :చీరాల (మం.) ఈపూరుపాలెంలో దారుణ హత్య ..బహిర్బుమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి.. హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈపురుపాలెం సీతారామ పేటకు చెందిన సుచరిత (21) గా యువతి గుర్తింపు. డాగ్ స్కాడ్ తో రంగంలో దిగిన పోలీసులు. సంఘటనా స్థలంలో డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ.
👉 యుద్దాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీ ఆపలేరా ? ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని చెబుతుంటారు. కానీ దేశంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందని, విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని, ఇప్పటికే ఒక పరీక్షను రద్దు చేశారని, ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదని రాహుల్ అన్నారు. ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లవుతోందని, వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యే అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందని, ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ నిలదీశారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే.
👉రుషికొండ ప్యాలెస్… చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!…ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.రుషికొండ ప్యాలెస్… చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు ఈ చర్చ రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి. దీంతో…ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.అవును… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఆ భవనాలు లోపల ఎలా ఉంటుందో కూడా తెలియని నేపథ్యంలో… తాజాగా ఆ రుషికొండ ప్రాంతం వచ్చే భీమిలీ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని వెళ్లడంతో… ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.ఈ సమయంలో ఆ భవనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే విషయంపై తీవ్ర ఆసక్తినెలకొన్న వేళ.. పలుసలహాలూ సూచనలు అందుతున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.👉ఇందులో భాగంగా… తొలుత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి మొదలైన ఆరోపణలపై విచారణ జరిపించాలని చంద్రబాబు కోరారు నాగేశ్వర రావు. అనంతరం దీన్ని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలని.. తద్వారా ప్రజలకు అంకితం చేయాలని సూచించారు.👉ఢిల్లీలోని ఎయిమ్స్ లేదా జిప్ మర్ తరహాలో ఈ రుషికొండ ప్యాలెస్ భవనాలను మార్చి ప్రజలకు అంకితం చేయాలని.. తద్వారా ఏపీని తన వ్యక్తిగత ద్వేషంగా మార్చుకున్న జగన్ కు తగిన సమాధానం చెప్పాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు కోరారు. ఇదే సమయంలో… గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఆ ఆస్పత్రికి పెట్టాలని కూడా ఆయన బాబుకు సూచించారు.ఇలా రోజు రోజుకీ ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ విషయం మరింత హాట్ టాపిక్ గా మారుతున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది.
👉మాజీ మంత్రి గుడివాడ కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు తో..కేసు నమోదు!చేసిన పోలీసులు..కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వలంటీర్ల ఫిర్యాదు..వారి ఫిర్యాదుతో వైసీపీ నేతపై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులునానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైసీపీ నేతలపై కేసు నమోదుఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. మాజీ వార్డు వలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డిజిపిగా సిహెచ్. ద్వారకా తిరుమలరావు ఐపిఎస్. మంగళగిరి డిజిపి ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు.
👉భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం..ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బెజంగివాడ రిజర్వ్ ఫారెస్ట్ నందు ఒక పర్వత కుహూరంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. దూలగొండి గ్రామం సమీపంలో మావోయిస్టుల డంప్ నుంచి SBML గన్స్ 3, బారేల్ 1,ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 4,జిలెటిన్ స్టిక్స్ 98, డైరెక్షనల్ మైన్ 2ను 142వ బెటాలియన్ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
*సంబరాలు చేసుకున్న టిడిపి నాయకులు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి కి టిడిపి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
👉నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి..హైదరాబాద్
ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెంద డంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు…
👉చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు సిఐ మారుతి శంకర్ కి ఏడాది జైలు శిక్ష..గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్సైగా పనిచేశారు. అక్కడ ఘానాపురం గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డి ని 2015లో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించి నరేంద్ర పై ఎస్సై మారుతి శంకర్ దాడి చేశారు. దీనిపై నరేందర్ రెడ్డి ఎస్సై మారుతి శంకర్ పై ప్రైవేట్ కేసు వేశారు .ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐ మారుతి శంకర్ కి కోర్టు ఏడాది జైలు శిక్ష 10000 జరిమానా విధించారు.ప్రస్తుతం గంగాధర్ నెల్లూరు సిఐగా మారుతి శంకర్ పనిచేస్తున్నారు
*కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య రూపా దేవి,ఆత్మహత్య❓*
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం సృష్టించింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువా రం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నా రు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్‌కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువు లతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ విష యం అర్ధరాత్రి బయటకు వచ్చింది….
👉డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలోకి డైనమిక్ ఆఫీసర్?*అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ రానున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపించాలను కుంటున్న పవన్ కళ్యాణ్.. ఏరికోరి కృష్ణతేజను నియమించుకుంటున్నారు. కృష్ణతేజను డిప్యుటేషన్‌పై పంపాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కాగా, 2015 బ్యాచ్‌కు చెందిన కృష్ణతేజది పల్నాడు జిల్లా చిలకలూరిపేట….
👉: చంద్రబాబు చేసిన శపథం ఇదే..,చంద్రబాబు చేసిన శపథం ఇదే..‘‘ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’’ అని 2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు.మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో ఆయన అడుగు పెట్టారు.
👉 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం…అమరావతి: ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సభలో ఉండకుండా ఛాంబర్ కు పయనమైన జగన్..!వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు . ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం చేసిన అనంతరం జగన్ సభలో ఉండకుండా ఛాంబర్కు వెళ్లిపోయారు.అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా సభకు వచ్చేవారు. అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించి వేరే మార్గంలో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో అదుగు పెట్టిన జగన్…
👉ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక గురువారం నంద్యాలలోని శ్రీ రామకృష్ణ వివేకానంద ఆడిటోరియంలో జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 19 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు జరిగింది అధ్యక్షులుగా పి నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్ రమాదేవి,జి రాజశేఖర్, ఎం సుబ్బలక్ష్మి, కోశాధికారిగా జి లతా, కార్యదర్శులుగా జి రామాంజనేయరెడ్డి, బి శ్రీనివాసులు, పీవీ సుబ్బారాయుడు, అయ్యస్వాములు, సహాయ కార్యదర్శిగా కే ప్రభావతి తదితరులు ఎన్నికైనారు.. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ఫెడరేషన్ సభ్యులతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు ,లక్ష్మణ్ పాల్గొన్నారు.