👉ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అడుగులు అంత ఈజీకాదు…?
ఐటీ శాఖ అనేది.. భావోద్రేకాలు.. సంబంధించినది కాదు., ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎవరూ హర్ట్ కారు. యువ మంత్రి నారా లోకేష్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా పరిస్థితి ఉందా? ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం నారా లోకేష్ రెండు కీలకమైన శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఐటీ శాఖపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా..ఇబ్బందులు రావు. పైగా మెప్పులే ఉంటాయి.కానీ, రెండో శాఖైన మానవ వనరుల శాఖ విషయంలో మాత్రం నారా లోకేష్ కు ఇబ్బందులు వచ్చే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. ఐటీ శాఖ అనేది.. భావోద్రేకాలు.. సంబంధించినది కాదు., ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఎవరూ హర్ట్ కారు. కానీ, విద్యా శాఖ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది లక్షలాది మంది విద్యార్థులపైనా.. ఉపాధ్యాయులపైనా.. తల్లిదండ్రులపైనా ప్రభావం చూపించే అవకాశం మెండుగా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాయి. ఉపాధ్యాయులు ధర్నాలు.. నిరసన పేరుతో అట్టుడికించారు. దీనికి ప్రధాన కారణం.. అటెండెన్సు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, బాత్ రూంల పర్యవేక్షణ, విద్యార్థుల పుస్తకాల పంపిణీ వంటి కీలక అంశాలు. నిజానికి ఈ పనులు ఎక్కడైనా ఉపాధ్యాయులే చేయాలి. గతంలోనూ ఈ రూల్ ఉంది. కానీ, అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా ప్రబుత్వ పాఠశాలలంటే.. సమాజంలో ఏవగింపు వచ్చింది. కానీ, దీనిలో కొంత మార్పు తీసుకువస్తూ..జగన్ సర్కారు మంచి పనే చేసింది. కానీ, అర్ధమయ్యే లా చెప్పడంలో లోపమో.. లేక ఒత్తిడి గురిచేస్తున్నారన్న భావన ఉద్యోగుల్లో కలగడమో జరిగింది. దీంతో ఉపాధ్యాయులు వైసీపీ ప్రబుత్వంపై కత్తికట్టారు. కానీ.. పరీక్షల ఫిలితాల విషయానికి వస్తే.. మాత్రం గతంలో కంటే వ్యవస్థ మెరుగు పడిందని.. నిపుణులు సైతం అంగీకరించారు. ఇక, ఇప్పుడు ఈ శాఖకు మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏం చేస్తారు? ఉపాధ్యాయులు ఇష్టపడని వాటిని తీసేస్తారా? అలా తీసేస్తే.. ప్రబుత్వ పాఠశాలలు భ్రష్టు పట్టిపోతాయి. పోనీ.. కొనసాగించాలంటే.. గత ప్రభుత్వం మాదిరిగానే నిరసనలు ఖాయం. ఎలా చూసుకున్నా..వీటిని సమన్వయం చేయడం అతి ముఖ్యం. నిజానికి చెప్పాలంటే.. వైసీపీ హయాంలో విద్యార్థుల తల్లిదండ్రులు హ్యాపీ. కానీ, ఉపాధ్యాయులే ఫైరయ్యారు. ఇప్పుడు వీరిని ఎలా లోకేష్ ముందుకు తీసుకువెళ్తారనేది చూడాలి.
👉 ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నందు హెచ్చార్డీ, ఐటీ, ఆర్టీజీఎస్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువనాయకులు నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య.
👉గిద్దలూరు పి అర్ కాలనీ లోని సంజీవిని వృద్ధాశ్రమంలో సోమవారం వృద్దులకు ,అనాథ పిల్లలకు బెస్టవారిపేట లోని హెల్పింగ్ హార్ట్స్ ద్వారా నిత్యవసర సరుకులు,పండ్లు,స్వీట్స్ పంచడం జరిగింది.
👉రౌడీలు, గంజాయి ముఠాలకు చీరాల ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!!!చీరాలలోని రౌడీలు, గంజాయి గ్యాంగులకు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదివారం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చీరాల ప్రాంతంలో జరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ రౌడీలు, గంజాయి బ్యాచ్ ఇక్కడ పేట్రేగిపోతున్నాయని, అందువల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇకపై వారు అతి చేస్తే పరలోకానికే ప్రయాణం అవుతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పలుసార్లు ఆవేశంలో నోరు జారారు.
*హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం*హైదరాబాద్:గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది,దీంతో తమకు న్యాయం చేయాల ని, బాధితులంతా ఆదివా రం సీసీఎస్ ముందు ఆందోళ నకు దిగారు. పెట్టిన సొమ్ముకు ఐదునెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు. తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు.అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేశ్.. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసు లను ఆశ్రయించారు…
👉దక్షిణ భారతదేశంలోనే దరిశికి అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు మంజూర అయిందని ఇది ఒక వరమని అది పూర్తయితే 1000 మందికి శిక్షణ ప్రతి ఏడాది పొందుతారని ఇక్కడ ఎంతో మంది ఉపాధి పొందుతారని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు సోమవారం దర్శి లోని శివరాజ్ నగర్ లో నెలకొల్పనున్న డ్రైవింగ్ స్కూల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18.5 కోట్లతో నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారని ఆమె పేర్కొన్నారు ఈ డ్రైవింగ్ స్కూలు దర్శికి ఎంతో మేలైనదిగా ఆమె పేర్కొన్నారు నిధులు మంజూరు చేసినందుకు జిల్లా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరిస్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కడియాల లలిత సాగర్ నగర పంచాయతీ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య ఆర్ అండ్ బి డి కృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాజీ పిఎసిఎస్ చైర్పర్సన్ కల్వకులను శేఖర్ బాబు ఏఈ స్రవంతి తోపాటు దారం సుబ్బారావు