మణిపూర్ లో రెండు భిన్న డిమాండ్లు..మోడీ నిర్ణయం ఎటు?..అయోధ్య రామాలయంలోకి వర్షపు నీరు..”వేధించిన వైసీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదు-సీఎం..”షర్మిలని తప్పించండి”…కాంగ్రెస్ లో విలీనం చేస్తా..? మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు..సజ్జలపై సిఐడి కి ఫిర్యాదు..మహిళపై చిరుతపులి దాడి..నగదును రెట్టింపు చేస్తామని మోసం..చెంచు మహిళకు న్యాయం చేయాలి.. సివిల్ సెటిల్మెంట్ లో బెజవాడ పోలీసులు?..ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్‌ను చెరువులో తోసేసిన డ్రైవర్…

👉మణిపూర్ లో రెండు భిన్న డిమాండ్లు.. మోడీ నిర్ణయం ఎటు? మణిపూర్ రాష్ట్రంలో గతంలో జరిగిన అల్లర్లు, అరాచకాలు, దారుణాలు, ఘోరాల గురించి తెలిసిందే. మణిపూర్ రాష్ట్రంలో గతంలో జరిగిన అల్లర్లు, అరాచకాలు, దారుణాలు, ఘోరాల గురించి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగానూ చర్చనీయాంశం అయిన పరిస్థితి. ఆ ఘోరాల తాలూకు నీడలు, గుర్తులు, మరకలు ఇంకా స్పష్టంగా ఉన్నాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా కుకీ జో తెగ సంఘాలు మణిపూర్ లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. అవును… మణిపూర్ లోని కొండప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో కుకీ జో తెగ సంఘాలు తాజాగా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాయి. .ఈ సందర్భంగా… మణిపూర్ లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలకాలని.. ఇదే సమయంలో తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని ఆ తెగ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ విషయాలపై ప్రధాని స్పందించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తమ డిమాండ్ ల పరిష్కారాలను వేగవంతం చేయాలని కోరుతూ… కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు మెమరాండం సమర్పించినట్లు కుకీ జో తెగ సంఘాల జిల్లా అధికారులు చెబుతున్నారు. వీరి సంగతి అలా ఉంటే… మరోపక్క వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి! ఇందులో భాగంగా… కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. “ప్రత్యేక పరిపాలనా వద్దు.. గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేయొద్దు” అనే నినాదాలతో ర్యాలీ చేశారు. దీంతో.. ఈ విషయంపై ప్రధాని ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. కాగా… గత ఏడాది మే నుంచి మణిపూర్ లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగకు.. పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగకు మధ్య తీవ్రస్థాయిలో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు హింసాత్మక ఘటనలుగా మారడంతో సుమారు 220 మంది మృతి చెందరు.. వేలాది మంది గాయపడ్డారు.. చాలా

👉 అయోధ్య రామాలయంలోకి వర్షపు నీరు..నిర్మాణ లోపమే కారణం! మరో షాకింగ్ అంశం ఏమంటే..వర్షపు నీరు బయటకు వెళ్లటానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు.షాకింగ్ నిజం వెలుగు చూసింది.

తాజాగా అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలోని గర్భాలయంలోకి వర్షపు నీరు లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పిన వేళ..అందుకు భిన్నంగా ఆలయం ప్రారంభమైన తర్వాత కురిసిన మొదటి భారీ వర్షంతో నిర్మాణ లోపాలు వెలుగు చూడటంపై ఆలయన ప్రధాన పూజారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.శనివారం అయోధ్యలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్రతకు అయోధ్య గర్భగుడిలో బాలరాముడ్ని పూజించే పూజారులు కూర్చునే చోటుతో పాటు వీఐపీ భక్తులు వచ్చే దారిలోనూ వర్షపు నీరు లీక్ అవుతున్న విషయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ స్పందించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షపు నీరు లీక్ కావటాన్ని ఆయన తప్పు పట్టారు. మరో షాకింగ్ అంశం ఏమంటే..వర్షపు నీరు బయటకు వెళ్లటానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు.దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్న ఆయన మాటలు ఇప్పుడు షాకిచ్చేలా మారాయి. కారణం..ఈ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఇంజనీర్లు..అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలయం ప్రారంభమైన తొలి వర్షానికే లీక్ కావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.భూమ్మీదకు భారీ భూకంపాన్ని సైతం తట్టుకునేలా వెయ్యేళ్లు అయినా చెక్కుచెదరని రీతిలో నిర్మాణం చేశారంటూ..భారీ కథనాలు ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో పబ్లిష్ కావటం తెలిసిందే. అలాంటి ఆలయంలో వర్షపు నీరు లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతో అనుభవం ఉన్న ఇంజనీర్లు కట్టినప్పటికీ ఇలా వర్షపునీరు లీక్ కావటం పెద్ద తప్పే అంటూ ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ న్రపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. లీక్ గురించి తెలిసినంతనే ఆలయానికి చేరుకున్న ఆయన.. తక్షణం మరమ్మత్తులకు ఆదేశించారు. ఆలయం మొదటి అంతస్తు పనులు ఇంకా పూర్తి కాలేదని.. జూలై నాటికి పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఈ డిసెంబరునాటికి నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఏమైనా.. ఐకానిక్ టెంపుల్ గా వ్యవహరిస్తున్న అయోధ్య ఆలయానికి లీకేజీ బెడద షాకింగ్ గా మారింది.

👉కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలు వద్దు – మంత్రులకు ఏపీ సీఎం.. చంద్రబాబు సూచనలు*అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ తారకమంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు. ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక అంశాలతో ముడిపడని హామీలు తక్షణం అమలు చేయాలని దిశానిర్దేశం చేసారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఎన్నోఅంచనాలు ఉన్నందున వాటికీ తగ్గట్లు ప్రతిఒక్కరు కష్టపడాలని ఆదేశించారు. కాన్వాయ్‌లు, సైరన్‌ల వంటి ఆడంబరాలకు స్వస్తిపలికి ప్రజలతో మమేకం కావాలన్నారు.ఏ పని చేసినా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. శాఖాపరమైన సమీక్షా సమావేశాల సమయం తగ్గించుకోవాలని, వీలైనంత వరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత సమావేశాలు వద్దని చంద్రబాబు సూచించారు.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని వెంటనే చేయగలిగినవి, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినవి అని రెండు విభాగాలుగా చేసుకోవాలని చంద్రబాబు తెలిపారు.

👉సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు కీలక ఆదేశాలు..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ నేతల్ని, కార్యకర్తల్ని *వేధించిన వైసీపీ నేతల్ని* టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు.గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని.. అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు. అలాగే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని సొంత లాభం కోసం పార్టీలోకి వచ్చే వారితో జాగ్రత్తగ ఉండాలన్నారు.

👉 ఏపీ మాజీ సీఎం జగన్ మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు..మాజీ సీఎం జగన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం 986 మంది పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు.సీఎం చంద్రబాబుకు పోటీగా జగన్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.సముద్రం, ఆకాశం,భూమిపై పోరాడేలా శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్ ఆయుధాలు తెప్పించారు. జగన్ భద్రత కోసం ప్రాణాలకు తెగించి పోరాడేలా 379 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.రాష్ట్రపతి, ప్రధానమంత్రిని మించిన స్థాయి భద్రత ఏర్పాటు చేసుకోవడం ద్వారా సెక్యూరిటీ మాన్యువల్ ను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. జగన్ తన ప్యాలెస్ కు ఆక్టోపస్ కమాండోలతో భద్రత కల్పించుకున్నారని, బూమ్ బారియర్స్, టైర్ కిల్లర్స్, బొల్లార్డ్స్, రిట్రాక్టబుల్ గేట్లు ఏర్పాటు చేసుకున్నారని, తాడేపల్లి ప్యాలెస్ కు 30 అడుగుల ఎత్తున ఐరన్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

👉షర్మిలని తప్పించండి… కాంగ్రెస్ లో విలీనం చేస్తా..?డీకే ముందు ఆఫర్ పెట్టిన జగన్..?_11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయం అయిన జగన్ రెడ్డి, ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు, బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో, జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టటం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి సిద్ధం అయ్యారు. ఇందుకు బెంగుళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, డీకే శివకుమార్ తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్, కాంగ్రెస్ నుంచి షర్మిలని తరిమేస్తే, తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని ఆఫర్ ఇచ్చారు. దీని పై హైకామాండ్ తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తుంది.👉ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని, ఇంటలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్, ఇక నుంచి బెంగుళూరు యలహంకా ప్యాలెస్ లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. చూడాలి పరిణామాలు ఎలా మారతాయో.

👉ఎ పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆఫీసు ముందు సూసైడ్ యత్నం*ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. అందుకే పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు.సమయానికి పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కాపాడారు.

👉సజ్జల రామకృష్ణారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు..
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో గనులు దోచేశారని ఆరోపించారు. సజ్జల అనుచరులు శ్రీకాంత్రెడ్డి, ధనుంజరెడ్డి దౌర్జన్యం చేశారని.. దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించినట్లు బద్రీనాథ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
👉మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ..వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా చేశారని ఆరోపిస్తూ కౌసర్‌ జాన్‌ చిన్నబజార్‌ సీఐకు ఫిర్యాదు అందజేశారు.  నెల్లూరు భగత్‌సింగ్‌ కాలనీలోని తమ స్థలంలో వైకాపా ఆఫీసు కడుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఏడాదిగా పోరాటం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో తన భర్త కొన్న స్థలంలో 2.8 ఎకరాలు ఆక్రమించారని తెలిపారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.*
👉మహిళపై చిరుత పులి దాడి..!!! ప్రకాశం జిల్లా..
గిద్దలూరు — పచ్చర్ల మధ్య గల అటవీ ప్రాంతంలో  నంద్యాల జిల్లా పరిధిలో చిరుత పులి ఒక మహిళపై దాడి చేయగా ఆ మహిళ మృతి చెందింది.చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా హతం..కట్టెల కోసం అడవి లోని వంక వద్దకు వెళ్లిన మెహరున్నిసా.. మెహరున్నిసా పై దాడికి చేసి, చంపి, తలను తినేసిన చిరుత,మెహరున్నిసా కేకలు విని వంక వద్దకు వెళ్లిన స్థానికులు, స్థానికులు వెళ్ళేసరికి కనిపించిన మొండెం.
ఇటీవల సంచరిస్తున్న చిరుత..నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీ పై దాడి చేసి గాయపరిచిన చిరుత. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు, 2 బొన్లు.ఏర్పాటు చేసి.. పచర్ల కు బయలుదేరిన అటవీ శాఖ అధికారులు.

👉నగదును రెట్టింపు చేస్తామని మోసం చేయుచున్న ముఠా అరెస్ట్♦ 24 గంటలలో నిందితులను ఛేదించి పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు ..జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్.. నల్లగొండ జిల్లా మరియు మండల లోని చందనపల్లి గ్రామంలో ఒరిజినల్ 500 రూపాయల కరెన్సీ నోటు లను పైన ఒకటి, కింద ఒకటి పెట్టి మద్యలో తెల్ల కాగితాలను పెట్టి, బాదితులను మోసం చేసి అక్కడి నుండి అసలు కరెన్సీ తో పారిపోవడం. వివరాలలోకి వెళితే తేదీ 22.06.2024 రోజున నల్గొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ఆర్‌ఎం‌పి డాక్టర్ రామోజు రామాచారి వద్ద నుండి 33 లక్షల రూపాయలను నగదును రెట్టింపు చేస్తాం అని చెప్పి, మోసం చేసి అసలు నగదుతో పారిపోగ, జిల్లా S.P శ్రీ శరత్ చంద్ర పవార్ – IPS గారి ఆదేశాల మేరకు నల్గొండ-డి.ఎస్.పి.కె.శివరాం రెడ్డి పర్యవేక్షణ లో నల్గొండ-II టౌన్ సర్కిల్ సిఐ బి.డానియెల్ కుమార్  ఆధ్వర్యం లో నల్గొండ-రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ. జె. శివ కుమార్ మరియు కానిస్టేబుల్ తిరుమలేష్, కానిస్టేబుల్ లు జానకి రాములు లు నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ధ నుండి రూ.24 లక్షల రూపాయలు స్వాధీనము చేసుకున్నారు. మూడవ వ్యక్తి పరారీలో ఉన్నాడు.  *నేరస్థుల వివరాలు* . 1. షేక్ శిరాజ్ తండ్రి బదృద్దీన్, వయస్సు; 53 సంవత్సరాలు, వృత్తి; బట్టల వ్యాపారం, నివాసం; 1 వ వార్డ్, చిట్బౌల, దిలార్పూర్, కటిహర్, బిహార్ రాష్ట్రం.2. రాం నరేష్ యాదవ్ తండ్రి పద్దు యాదవ్, వయస్సు; 40 సంవత్సరాలు, వృత్తి; తాపే మేస్త్రి, నివాసం; శిమ్ము, మణిహారి, కటిహర్, బిహార్ రాష్ట్రం.3. షేక్ అఫ్తాబ్ (Absconding)  *స్వాదీనం సొత్తు* (1) 24 లక్షల నగదు (2) 3 సెల్ ఫోన్ లు (3) నోట్లను తయారుచేస్తానని మోసం చేయుటకు ఉపయోగించిన రంగు కలర్ సీసాలు మరియు ఇతర సామగ్రి(4) తెల్లని కాగితాలు కలిగిన నోట్ల కట్ట (నేరస్థులు నేరస్థలంలో వదిలి వెళ్ళినవి) *నేరస్తులు నేరం చేయు విధానం (MO* ).. బీహార్ రాష్ట్రానికి చెందిన రామ్ నరేష్ యాదవ్ గతంలో నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో తాపీ మేస్త్రిగా పని చేసినాడు.ఆ సమయంలో చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అయిన శ్రీ రామోజు రామాచారి ఇల్లును కట్టడం జరిగింది. తేదీ 22-06-2024 రోజున సుమారు ఉదయం 11 గంటల సమయంలో సదరు రామ్ నరేష్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన అతని స్నేహితుడు షేక్ సిరాజ్ తో కలిసి చందనపల్లి గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీరామోజు రామాచారి ఇంటికి వెళ్లి వారి దగ్గర డబ్బులను రెట్టింపు చేసే లిక్విడ్ ఉన్నదని మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నచో వాటిని రెట్టింపు చేసి ఇస్తామని ఆశ చూపించి నమ్మించగా, వారి మాటలను నమ్మిన శ్రీ రామోజు రామాచారి అతని బావమరిది బై రోజు అమరేంద్ర చారి లు ఇద్దరూ రామాచారి వాళ్ళ ఇంట్లో మొదటి ఫ్లోర్ కి తీసుకెళ్లి, రామాచారి భూమిని కొనుగోలు చేయడానికి తెచ్చిన 33 లక్షల రూపాయల నగదును వారికి చూపించగా, వారి వెంట తెచ్చుకున్న లిక్విడ్ ని ఒక బకెట్లో పోసి 50 వేల రూపాయల కట్టలను ఆరింటిని అనగా మూడు లక్షల రూపాయలను ఒకసారి లిక్విడ్ లో ముంచి బయటకు తీసి, వాటికి వారి వద్ద ఉన్న తెలుపు మరియు బ్రౌన్ కలర్ ప్లాస్టర్లు వేసి ఒక బండల్ గా చేసినారు. అలా మరొక మూడు లక్షల రూపాయలను లిక్విడ్ లో ముంచి వాటికి కూడా ప్లాస్టర్లు వేసి బండెలుగా చేసినారు. అనంతరం అలా మూడు లక్షల రూపాయల ఒక కట్ట చొప్పున మొత్తం 33 లక్షల రూపాయలను11 కట్టలు కట్టి, అట్టి కట్టలలో మూడు కట్టలను ఒక పెద్ద బండెలుగా తయారుచేసి, అలా 3 బండెలు లు చేసి వారు తెచ్చిన లిక్విడ్ లో ముంచినారు. ఒక గంట తర్వాత వాటిని స్టవ్ పై వేడిచేసి ఒక రోజు తర్వాత ఓపెన్ చేస్తే అట్టి డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి వాటికి హైదరాబాద్ కు వెళ్లి లేబుల్స్ కొనుక్కొస్తామని చెప్పినారు. అంతలో రామాచారి బావమరిది అమరేంద్ర చారి తన ఇంటికి వెళ్ళగా, పేషెంట్ వచ్చినాడని రామాచారి మొదటి ఫ్లోర్ నుండి కిందికి దిగినాడు. ఆ సమయంలో నేరస్తులు ఇద్దరు అప్పటికే వారి వెంట బ్యాగులో ఒక కట్టకి పైన ఒకటి కింద ఒకటి ఒరిజినల్ 500 రూపాయల నోట్లు పెట్టి మధ్యలో తెల్లటి కాగితాలను పెట్టి ప్యాక్ చేసి ఉంచిన డబ్బు కట్టలను నిజమైన కట్టల స్థానంలో ఉంచి వాటిని నేరస్తుల బ్యాగుల లో పెట్టుకొని హైదరాబాద్ కు వెళ్లి లేబుల్స్ తీసుకుని ఉదయం వస్తామని చెప్పి వెళ్ళిపోయినారు. పై విషయంలో కేసు నమోదు చేసుకొని నల్గొండ ఎస్‌పి  ఉత్తర్వుల మేరకు, నల్గొండ రూరల్ ఎస్‌ఐ శివ కుమార్, కానిస్టేబుల్స్ తిరుమలేష్, జానకి రాములు మరియు హోం గార్డ్ సలీం లు టీమ్ గా ఏర్పడి నేరస్తుల ఆచూకీ గురుంచి వెతుకుతుండగా, నల్గొండ రైల్వే స్టేషన్ లో బిహార్ పారిపోవుటకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి, వారి వద్ద ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా, డబ్బుల కట్టలు కనిపించినవి. వెంటనే వారి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, విచారించి వారి వద్ద ఉన్న 24 లక్షల నగదు స్వాధీనం చేసుకోనైనది. ఇట్టి కేసులో ఉన్న మూడవ వ్యక్తి అయిన షేక్ ఆఫ్తాబ్ 9 లక్షల నగదుతో పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతనిని పట్టుబడి చేస్తాము. ఈ కేసును నల్గొండ డి‌ఎస్‌పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో, నల్గొండ టు టౌన్ సర్కల్ ఇన్స్పెక్టర్ డానియల్ కుమార్  ఆద్వర్యంలో నల్గొండ రూరల్ ఎస్‌ఐ శివ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్, జానకి రాములు, హోం గార్డ్ సలీం చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులని పట్టుబడి చేసినారు అని, నల్గొండ ఎస్‌పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ అభినందించినారు.

👉అన్నమయ్య జిల్లా గుర్రంకొండ *గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించింది టీడీపీ నేతలే*..*దాడిని అడ్డుకున్న ఎస్ఐ2, హెచ్ సి పైన దాడి ఘటనపై స్పందించిన ఎస్పీ**ఎస్సై2, హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు*అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం లోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై సోమవారం రాత్రి కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించడాన్ని అడ్డుకున్న అక్కడి ఎస్ఐ2 శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణుపై దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణా రావు వెంటనే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో అమిలేపల్లికి చెందిన టిడిపి నాయకులు ద్వారక, ప్రకాష్, సాగర్, రామకృష్ణ, మల్లేశ్వర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలేపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఘర్షణ పడ్డాడని తీసుకొచ్చిన ఎస్ఐ2 శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణు పై కోపంతో స్టేషన్ కు వచ్చి గొడవపడ్డ విషయం తెలిసిందే . అదే సమయంలో స్టేషన్ వద్ద ఉన్న వైసిపి ఎంపీపీ ని చుసి అతనిపైన దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా ఎస్ఐ2, హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేశారు.

👉సివిల్ సెటిల్మెంట్ లో బెజవాడ సింగ్ నగర్ పోలీసులు…👉బెదిరించి 14 లక్షలకు తెల్ల కాగితాలపై సంతకాలు…👉సీపీకి ఫిర్యాదు చేసిన శీరంశెట్టి వెంకటేశ్వర్లు..విజయవాడ:నా చేత బలవంతంగా 14 లక్షలు మీద సంతకాలు చేయించారని బాధితుడు సీరం శెట్టి వెంకటేశ్వర్లు విజయవాడ పోలీస్ కమిషనర్ పి హెచ్ డి రామకృష్ణకు సింగనగర్ పోలీసులపై ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే:*విఎంసిలో పీహెచ్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న సీరం శెట్టి వెంకటేశ్వర్లు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన తన అక్కకి సంబంధించిన డబ్బు బంగారం తీసుకున్నారని వారి బంధువులు సింగి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సివిల్ వివాదంలో తలదూర్చిన సీఐ గురు ప్రకాష్ బాధితుడు చేత బలవంతంగా బెదిరించి, భయపెట్టి, చంపేస్తామని తెల్ల కాగితాలపై ప్రాంస్సరి నోట్ పై 14 లక్షల రూపాయలు కి సంతకాలు చేయించారని బాధితులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.ఇదిలా ఉండగా 8341051000 నంబర్ సింగినగర్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నామని వడ్డాది మనోహరి, రాజేశ్వరి లకు ఇవ్వవలసిన చెక్కులు ఎప్పుడు ఇస్తారని ఇవ్వకపోతే అరెస్టు చేసి జైలుకు పంపుతామని సింగినగర్ పోలీసులు బెదిరిస్తున్నట్లు బాధితుడు సీరం శెట్టి వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అవినీతి కార్యకలాపాల పై విజయవాడ పోలీస్ కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. *

👉ఇసుక ట్రాక్టర్ పట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్‌ను ట్రాక్టరుతో సహా చెరువులో తోసేసిన డ్రైవర్.. రాజన్న సిరిసిల్ల – ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు.ఒక్కో ట్రాక్టర్ ఫై ఒక్కో కానిస్టేబుల్ కూర్చొని స్టేషన్ తీసుకొస్తున్న పోలీసులు.ఓ ట్రాక్టర్ ఫై డ్రైవర్‌తో పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్.. డ్రైవర్‌కి సత్యనారాయణకి మార్గమధ్యంలో వాగ్వాదం జరిగింది.. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్‌తో సహ ట్రాక్టర్‌ను చెరువులోకి తోసేసి పక్కకి దూకిన డ్రైవర్.ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయట పడగా.. కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.

👉సామాన్య చెంచు మహిళ అయినటువంటి ఈశ్వరమ్మ పై జరిగిన దాడిని మానవ హక్కుల నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు. పోలె నరేందర్ భీమ్ రావు ఖండించారు.. సామాన్య చెంచు మహిళ అయిన ఈశ్వరమ్మ పై కొంతమంది వ్యక్తులు ఆమెపై దాడి చేసి వివిధ రకాలుగా చిత్రహింసలు పెట్టడం అప్రజాస్వామిక చర్య అని ఆయన ఖండించారు.బండ వెంకటేష్ యాదవ్ అనబడే వ్యక్తి చెంచు మహిళా అయిన ఈశ్వరమ్మకి ప్రభుత్వం ఇచ్చిన భూమి తక్కువ ధరకే అమ్మాలి అంటూ ఆమెపై హింసకు పాల్పడడం జరిగిందని దీన్ని హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో  ఖండిస్తున్నామన్నారు.. అతి త్వరలో నాగర్ కర్నూల్ జిల్లా అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం రోజు ఈ సంఘటనపై తమ గళం విప్పడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం