👉స్పీకర్ ఎన్నికలో ఇండియా కూటమికి దీదీ షాక్?😲లోక్ సభ స్పీకర్ ఎంపిక వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే లోక్ సభ స్పీకర్ ఎంపిక వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఎన్డీయే తరఫున గత సభల్లో స్పీకర్ గా పనిచేసిన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. కానీ, అందుకే ఎన్డీఏ నేతలు ఒప్పుకోకపోవడంతో సంచలన రీతిలో స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది.ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్ వేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్ సభ స్పీకర్ పదవి కోసం చరిత్రలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకివ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఆ ఎన్నికలో ఇండియా కూటమికి తాము మద్దతు ఇవ్వకూడదని దీదీ ఫిక్స్ అయ్యారట.సురేశ్ ను నామినేట్ చేస్తున్నామన్న సంగతి తమకు చెప్పలేదని దీదీ గుర్రుగా ఉన్నార.అందుకే, తమ మద్దతు సురేశ్ కు ఇవ్వకూడదని టీఎంసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్పీకర్ ఎన్నికలో సురేశ్ నామినేషన్ గురించి తనకు చెప్పారని టీఎంసీ ఎంపీ డెరెక్ చెప్పారు.కానీ, తమ పార్టీ అధినేత్రి మమతతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.మరోవైపు, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.స్పీకర్ ఎన్నికల్లో అధికార పక్షానికి సహకరించేందుకు తాము సిద్ధమేనని,సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని తాను కోరానని అన్నారు.ఈ విషయంపై తమ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో సంప్రదించారని, కానీ, ఇప్పటివరకు స్పందన రాలేదని అన్నారు.కాబట్టే, సంప్రదాయాన్ని వీడి ఇండియా కూటమి తరఫున స్పీకర్ బరిలో ఎంపీ సురేశ్ ను నిలబెట్టక తప్పలేదన్నారు
👉మీ రాజకీయాలు మార్చుకోకుంటే క్రికెట్ టీం..కాస్త ..వాలీబాల్ టీం అవుతుంది..⚠️
మాజీ సీఎం జగన్‌కు మంత్రి గొట్టిపాటి హెచ్చరిక…..
తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆయన బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. జగన్ ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, లేదంటే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందని ఆయనకున్న ఎమ్మెల్యేలను గుర్తుచేస్తూ హెచ్చరించారు.
జగన్‌ను జనం పాతాళానికి తొక్కేసినా బుద్ది మార్చుకోలేదన్న మంత్రి గొట్టిపాటి అర్హత లేకున్నా చంద్రబాబు ఆదేశంతోనే అసెంబ్లీలో గౌరవం లభించిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు..
జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని ,
జగన్‌ను ప్రజలు పాతాళానికి తొక్కేశారని, అయినప్పటికీ చంద్రబాబు పెద్దమనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తుచేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 వైసీపీ లీడర్స్ సజ్జల,కారుమూరి పై..సి ఐ డి కి ఫిర్యాదు చేసిన..బద్రినాధ్😲
అధికారాన్ని అడ్డంపెట్టుకుని నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు మైనింగ్‌లో ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డారని ఓ మైనింగ్ యజమాని ఆరోపించారు.
అన్ని అనుమతులు ఉన్న తన భూముల్ని లాగేసుకుని మైనింగ్ చేసి వేలకోట్ల క్వార్జ్‌ను విదేశాలకు తరలించారని నెల్లూరు సీఐడీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దోపిడీ వెనక ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.
లక్ష 50వేల టన్నుల క్వార్జ్ రాయిని తవ్వేసి దాదాపు 500 నుంచి 800కోట్ల రూపాయలు దోపిడి చేశారని ఆరోపించారు.ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేసి రెండేళ్లుగా కోట్ల రుపాయల మేర క్వార్జ్‌ని తవ్వేశారని ఆరోపించారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై హైకోర్టులో కేసు వేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా తవ్వకాలు జరిపారని ఆరోపించారు. ఇప్పటికైన వారిపై చర్యలు తీసుకోవాలని క్వార్జ్ గనుల యజమాని డిమాండ్ చేశారు.👉నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని జోగుపల్లిలో 240ఎకరాల్లో మైన్స్ ఉన్నాయి. దానికి చట్ట బద్దంగా అన్ని అనుమతులు ఉన్నాయి. కానీ స్థానిక వైసీపీ నాయకులతో పాటు రాష్ట్రస్థాయిలో పెద్ద నేతలు బెదిరించి మైనింగ్‌ని చేజిక్కించుకుని రెండేళ్లుగా వేలకోట్ల మేర క్వార్జ్‌ని తవ్వేశారు. వందల కోట్ల విలువైన క్వార్జ్‌ని తవ్వేసి అమ్ముకున్నారు. ఇదేంటని నిలదీస్తే కేసులు పెడుతామని బెదిరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినందున అక్రమాలపై ధైర్యంగా ఫిర్యాదు చేశాను.” –
బద్రీనాథ్, సైదాపురం మైనింగ్ భూముల యజమాని
👉*ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్*
సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో ఆరోగ్య శ్రీ కార్డు లేని వారికి ఇచ్చే అనుమతి పత్రాలను ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది.
ఎన్నికల కోడ్ కారణంగా వీటిని ప్రభుత్వం నిలిపివేసింది.
తాజాగా వీటిని పునరుద్ధరిస్తూ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య శ్రీ కార్డు లేని వారు సంబంధిత పత్రాలతో స్కీమ్ అనుబంధ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు.
కలెక్టర్ ఆమోదంతో ట్రస్ట్ అధికారులు ఈ పత్రాలను జారీ చేస్తారు.
👉లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వెల్దండ ఎస్‌ఐ 🤭 నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్లండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రవికుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్లండ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ రవికుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో నిందితుడి నుంచి ఎస్సై లంచం అడిగినట్టుగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఇటీవల కల్వకుర్తికి చెందిన వెంకటేష్ ఇంట్లో జిలెటెన్ స్టిక్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని వెల్దండ ఎస్సై రవికుమార్ డిమాండ్ చేశాడు. దాంతో వెంకటేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.వారి సూచన మేరకు వెంకటేశ్ ఎస్సైకి ఫోన్ చేసి లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు.అయితే ఎస్సై నేరుగా మాట్లాడకుండా అతని డ్రైవర్‌తో ఫోన్ చేయించి కాన్ఫరెన్స్‌లో వెంకటేశ్‌తో మాట్లాడాడు.ఎస్సై సూచన మేరకు వెంకటేశ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
👉 పెంపుడు కుక్క కాటు.. తండ్రీకొడుకు మృతి😱😱
పెంపుడు కుక్క కరవడంతో తండ్రీకుమారుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా భీమిలిలో జరిగింది. నరసింగరావు (59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన 2 రోజులకు కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే మెదడు, కాలేయం, ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ మరణించారు.