👉విపక్ష నేతగా రాహుల్ పరిణతి….కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభలో విపక్ష నేత అయ్యారు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్న మాట. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి 99 ఎంపీ సీట్లు లభించాయి.దాంతో రాహుల్ లీడర్ ఆఫ్ అపొజిషన్ గా గుర్తించబడ్డారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది.ప్రత్యేక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ తరువాత స్థానంలో ఉంటారు.ఇదిలా ఉంటే విపక్ష నేతగా రాహుల్ గాంధీ తన పరిణతి చూపించారు. ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్ళేందుకు ప్రధాని మోడీతో పాటుగా వచ్చారు. కొత్త స్పీకర్ కి అభినందనలు తెలియచేశారు.మోడీతో కరచాలనం చేశారు.ఆ దృశ్యాలు టీవీలలో చూసిన వారిని అందరినీ ఆహ్లాద పరచాయి. ప్రజాస్వామ్య స్పూర్తి అంటే ఇదే కదా అనిపించాయి. అనంతరం మోడీ సభాపతిని అభినందిస్తూ మాట్లాడిన తరువాత లీడర్ ఆఫ్ అపొజిషన్ కి రెండవ చాన్స్ వచ్చింది.రాహుల్ చాలా క్లుప్తంగా ఆంగ్లంలో ప్రసంగం చేశారు.స్పీకర్ సర్ అని సంభోదిస్తూనే ఆయన విలువైన సూచనలు చేశారు. చట్ట సభలలో అంతిమ అధికారం స్పీకర్ దే అని అంటూ సభలో ఉన్న సభ్యులు అంతా కోట్లాది మంది భారత ప్రజానీకానిని ప్రతినిధులుగా రాహుల్ అభివర్ణించారు. వారి గొంతు బయటకు రావడం అంటే ప్రజల గొంతుక వినిపించడమే అని అర్థం చెప్పారు.గతసారి తో పోల్చితే ఈసారి విపక్షాల బలం పెద్ద ఎత్తున పెరిగిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షానికే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా గుర్తు చేశారు. సభ విజయవంతం అయింది అన్నది ఎంత అర్ధవంతమైన చర్చ సాగింది అన్న కొలమానం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. లోక్ సభ స్పీకర్ హోదాలో సభలో కోట్లాది మంది భారతీయుల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వ్యవహరించాలని ఓం బిర్లాకు రాహుల్ సూచించారు. ఈసారి సభలో టీడీపీ తరఫున సభా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా హైలెట్ అయ్యారు. ఆయన ఆంగ్లంలో మాట్లాడారు. సభను చక్కగా నడపేందుకు తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. అలాగే వైసీపీ తరఫున మిధున్ రెడ్డి శుభా కాంక్షలు తెలియచేస్తూ క్లుప్తంగా మాట్లాడారు. డీఎంకే తరఫున మాట్లాడిన సభా పక్ష నేత స్పీకర్ కి రాజకీయ రంగులు ఉండవని అందరినీ సమానంగా చూడాలని విపక్షానికి ఇంకా ఎక్కువగా చూడాలని కోరారు.ఆయన అలా మాట్లాడినపుడు సభలో విపక్షం అంతా సమర్ధిస్తూ బల్లలు చరచింది.మొత్తం మీద చూస్తే సభలో సభ్యుల సంఖ్యను బట్టి స్పీకర్ మాట్లాడే చాన్స్ ఇచ్చారు.అలా పదిహేనవ స్థానంలో వైసీపీ ఉంటే ఆరవ స్థానంలో ఉన్న టీడీపీ మొదట్లోనే మాట్లాడింది.
👉 జగన్ ఓదార్పు యాత్ర.. టైమ్ మారితే బెస్టేమో..! వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలుచెబుతున్నాయి.వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలుచెబుతున్నాయి. రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత..విడతల వారీగా అన్ని ప్రాంతాల నాయకులతోనూ జగన్ భేటీ అయ్యారు. ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుందని ఆయన వారితో చర్చించారు. మెజారిటీ నాయకులు ప్రజల్లోకి వెళ్లడమే బెటర్ అని సూచించారు.దీంతో మరోసారి ఓదార్పు యాత్రకు రెడీ అవుతున్నారనే సంకేతాలు బయటకు వచ్చాయి. ఈ యాత్రంలో అందరినీ కాకుండా..ఎన్నికలకు ముందు..తర్వాత.. ఇబ్బందులు పడిన , దాడుల్లో గాయ పడిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఓదార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు. వారికి భరోసా ఇవ్వడం ద్వారా..పార్టీని తిరిగి లైన్‌లో పెట్టాలని భావిస్తున్నారు. అయితే..ఇది మంచిదే అయినా..ఇప్పటికప్పుడు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి రాదని అంటున్నారు పరిశీలకులు. పైగా.. ప్రజలు ఇంకా వైసీపీ పాలన ను మరిచిపోలేదని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని నెలలు గడిస్తే.. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఒక అవగాహన వస్తుందని..తమ ఆకాం క్షలు నెరవేరకపోతే.. అప్పుడు సహజంగానే జగన్పై సానుభూతి, వైసీపీపై సింపతీ వస్తాయని..అప్పుడు యాత్రలు చేస్తే మంచిదన్న సూచనలు పార్టీకి అందుతున్నాయి.అలా కాకుండా ఇప్పటికిప్పుడు యాత్రలు చేస్తే.. ప్రజల నుంచి స్పందన లేక పోగా.. అధికార పార్టీ నేతల నుంచి వ్యంగ్యాస్త్రాలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇక, పార్టీ కార్యకర్తలు కూడా.. ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సహకరించడం కూడా కస్టమేనని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలో ఒక సంధి కాలం అయితే..నడుస్తోంది. ఓటమి విషయంలో నాయకులు ఒక రకంగా ఉన్నారు. కార్యకర్తలు మరో రకంగా ఉన్నారు.ఈ పరిస్థితి చల్లారేందుకు నిజానిజాలు వెలుగు చూసేందు కు కొంత సమయం పడుతుంది.అప్పటి వరకు వేచి చూస్తే..జగన్ విషయంలో కొంత సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఈ క్రమంలో అధినేత ఓదార్పు యాత్రల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తేనే బెటర్ అని సీనియర్లు కూడా సూచిస్తున్నారు.
👉 పవన్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ్టి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష ప్రారంభించారు. అయితే దీక్షలో పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని దర్శనమివ్వడంతో నెట్టింట సంచలనంగా మారింది. ఈ ఫోటోపై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘బీజేపీని మెప్పించడానికా? చెప్పులతో దీక్షలు. వాట్ ఏ హిందూ ఫాలొవర్’ అంటూ ట్విట్ చేసింది.
👉 మరదలిని ప్రేమించాడని నరికి చంపారు.. ..హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. బేగంపేట పాటిగడ్డలో ఓ యువకుడిని కత్తులతో నరికి చంపారు. తన మరదలిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఇజాజ్ ముగ్గురు స్నేహితులు ఫిరోజ్, సాహిల్, రెహన్ లతో కలిసి ఉస్మాన్ గొంతు కోశారు. ముఖంపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. కాగా నిందితులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. *సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డోలా బాల వీరాంజనేయులు ని ఈ రోజు విజయవాడలోని ఆయన సెక్రటరీయేట్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్..
👉హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. ఉత్తరప్రదేశ్ రాష్టానికి చెందిన వినీత్ శ్రీ వాస్తవ అనే యువకుడిని పేర్నమిట్ట-మంగమూరు రోడ్ లో రాంబాబు వెంచర్ దగ్గరలో ఉన్న సాగర్ కాలువ దగ్గర ధ్రువ్ చంద్ర వర్మ, రాం చరణ్ అనే ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేసి సాగర్ కాలువలో పడేసినారు. గంటల వ్యవధిలో ముద్దాయిలను పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ హత్య కేసుపై జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ (క్రైమ్) యస్.వి. శ్రీధర్ రావు గారు వివరాలు వెల్లడించారు.ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోని క్రైమ్ నెంబర్: Cr.No.408/2024 U/Sec.302 IPC*మృతుడు:* వినీత్ శ్రీ వాస్తవ s/o ముకుర్ లాల్, వయస్సు: 26 సం., కులం: బ్రాహ్మిన్, R/o సోహ్న పోస్ట్, రాజ్వ పుర గ్రామం, బుద్వా, సిద్దార్థ్ నగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్టం. *హత్య తేదీ & సమయం:* 23.06.2024 అర్దరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో *..ముద్దాయిల పేర్లు:* A1) ద్రువ్ చంద్ర వర్మ @కుమార్ S/o రాం దేవ్, 36 సం, కూర్మి కులం, ఉత్తర ప్రదేశ్, ప్రస్తుతం R/o ఇందిరా నగర్, పేర్నమిట్ట, సంతనూతలపాడు మండలం, ప్రకాశం జిల్లా.
A2) రాం చరణ్ S/o కంతా ప్రసాద్, 34 సం, కూర్మి కులం, ఖానాపూర్, మహదేవ్ ఘాట్, బలరాంపూర్, ఉత్తర ప్రదేశ్. *కేసు వివరాలు:* A1 ముద్దాయి ద్రువ్ చంద్ర వర్మ ఉత్తర ప్రదేశ్ రాష్టానికి చెందిన వ్యక్తి. సుమారు 20 సంవత్సరాల క్రితం ఒంగోలు వచ్చి POP(సీలింగ్) మేస్త్రిగా పనిచేస్తూ సుజాతనగర్ నందు నివాసం ఉంటూ తన రాష్ట్రం నుండి POP పనుల కోసం మనుషులను తెచ్చి వారికి తన ఇంటి కింద రూమ్ లో నివాసం ఏర్పాటు చేసినాడు. ఈ క్రమంలో హత్య జరగటానికి సుమారు 20 రోజుల ముందు మృతుడు వినీత్ శ్రీ వాస్తవ హైదరాబాద్ నుండి పనుల నిమిత్తం A1 ముద్దాయి వద్ద కు వచ్చి పనిలో చేరి పని చేస్తున్నాడు. తేది:23.06.2024 న A1, A2. రాం చరణ్, A1 వద్ద పని చేస్తున్న మిగతా పని వారు సుజాత నగర్ లోని A1 రూమ్ వద్ద ఉండగా మృతుడు A1 ముద్దాయి వద్దకు వచ్చి తన అన్న పెళ్లి ఉందని అడ్వాన్స్ గా 10,000/- వేల రుపాయల డబ్బులు కావాలని అడుగగా A1, A2 లు అతనితో నువ్వు పనిలో చేరి ఒక నెల కూడా కాలేదు, నువ్వు ఆధార్ కార్డ్ కూడా ఇవ్వలేదు అప్పుడే అడ్వాన్స్ అడుగుతావా అన్నారు. అంతట మృతుడు A1, A2 లతో గొడవపడి నా గురించి మీకు తెలియదు, నేను గతంలో ముంబైలో రెండు మర్డర్లు చేసినాను, మిమ్మల్ని చంపటం నాకు పెద్ద విషయo కాదు అని అన్నాడు. ఆ విషయం గురించి A1, A2 మరియు మృతుడి మధ్య వాగ్వాదం జరిగి మృతుడు A1 ముద్దాయిని పని వాళ్ళందరి ముందు నెట్టగా కిందపడినాడు.దానికి A1 ముద్దాయి అవమానంగా భావించి, అదికాక వినీత్ ని ఏదొకటి చేయకపోతే అతనే A1 ముద్దాయిని ఏదొకటి చేస్తాడని భావించి A1, A2 లు అతన్ని చంపాలని నిర్ణయించుకొని అదే రోజు అర్థ రాత్రి 12:30 గంటల సమయంలో మృతుడితో RTC బస్టాండ్ దగ్గర ఈ సమయంలో అమ్మాయిలు ఉంటారు వెళ్దామని నమ్మించి A1 కి చెందిన AP 39 HQ0389 FZ బైక్ మీద A1-A2 మధ్యలో ఎక్కించుకొని పేర్నమిట్ట-మంగమూరు రోడ్ లో రాంబాబు వెంచర్ దగ్గరలో ఉన్న సాగర్ కాలువ దగ్గరకి తీసుకు వెళ్లి A1 వినీత్ శ్రీ వాస్తవ తో మమ్మల్ని చంపుతాను అన్నావు కదరా ఇప్పుడు మేము నిన్ను చంపటానికే తీసుకువచ్చాం అనగా మృతుడు ముద్దాయిలతో మీరు నన్ను చంపుతారా? అంత ధైర్యం ఉందా మీకు, ఏది చంపండి అనగా A1 వినీత్ ను చంపటానికి ముందుగానే తన తో పాటు తెచ్చుకున్న కత్తిని బొడ్లో నుండి తీసి ఒక్క సారిగా పొట్టలో పొడవపోగా వినీత్ తన ఎడమ చేతిని అడ్డం పెట్టగ చేతికి రక్త గాయం అవ్వగా వెంటనే A1 వినీత్ పొట్టలో పొడిచినాడు. అంతట వినీత్ కిందపడిపోగా A2 అతని చేతులు పట్టుకోగా A1 వినీత్ కడుపులో ఉన్న కత్తిని తీసి అతని గొంతును అతి కిరాతకంగా కోసినాడు. వినీత్ చనిపోయాడని నిర్దారించుకొని అతన్ని కాలువలో పడేసి అక్కడి నుండి బైక్ ఎక్కి ఇద్దరు ముద్దాయిలు వెళ్ళిపోయారు. తేది:24.06.2024 న సాయంత్రం సుమారు 05.30 గంటల సమయంలో మృతుని శవం గురించి సమాచారం తెలుసుకున్న పేర్నమిట్ట VRO సంజీవరావు ఒంగోలు తాలుక పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది.👉నేరం జరిగిన తీరు & దర్యాప్తు విధానం:* ఈ కేసుని జిల్లా SP గారు సవాలుగా తీసుకొని కేసుని చేదించడానికి అడిషనల్ SP(క్రైమ్స్) యస్.వి. శ్రీధర్ బాబు ఆద్వర్యం లో మరియు ఒంగోలు DSP గారి పర్యవేక్షణలో ఒంగోలు II టౌన్ సీఐ మరియు తాలుక SI, వారి సిబ్బందితో స్పెషల్ టీములు ఏర్పాటు చేసినారు. రాబడిన సమాచారం మేరకు ఒంగోలు II టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు సిబ్బంది ముద్దాయిలను తేది 25.06.2024 న మధ్యాహ్నం 04.30 గంటలకు ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోనికి తీసుకొన్నారు, తరువాత ముద్దాయిల వద్ద నుండి వారు నేరం చేయటానికి ఉపయోగించిన కత్తిని, వారు ప్రయాణించిన బైక్ ను మధ్యవర్తుల సమక్షములో స్వాధీనపరుచుకున్నారు. మధ్యవర్తుల సమక్షములో ముద్దాయిల ను విచారించగా వారు నేరం చేసినట్లుగా అంగీకరించినారు. 👉 ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ SP (క్రైమ్స్) SV. శ్రీధర్ రావు, ఒంగోలు DSP యం.కిషోర్ బాబు, ఒంగోలు II టౌన్ CI S. జగదీశ్, ఒంగోలు తాలుకా SI M.విజయ కుమార్ లను మరియు సిబ్బంది లను ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
*నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ద్వారా తిరుపతిలోని శ్రీ సిటీలో ఉన్న ఆల్‌స్టోమ్ సహకారంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయి 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. 45 రోజులు ట్రైనింగ్ ఉంటుందని, మొత్తం 60 ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి రూ.25 వేల జీతం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఫోన్: 99082 43736 సంప్రదించగలరు.
👉మై క్వీన్ పేరుతో మార్కాపురం డివిజన్ లో కోట్లలో పెట్టుబడులు …..
అతి గతి లేని ఈ లింక్ పై కోట్లలో పెట్టుబడులు .. రెండు రోజులుగా డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్న డిపాజిట్ దారులు.. రేపటి సంచికలో మరిన్ని వివరాలు..
👉భార్యను చున్నీతో ఉరేసి చంపిన భర్త..వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న భర్త భార్యను చున్నీతో ఉరేసి చంపాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా ఆకుదారివాడ గ్రామంలో జరిగింది. మల్హర్ మండలం అనుసాన్‌పల్లికి చెందిన ఇస్లావత్ సుమత(30)ను 2016లో ఇస్లావత్ హతిరాంకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఏడాదిన్నరగా భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం గొర్రెపిల్లను మేతకు తీసుకెళ్లిన భార్యతో గొడవ పడి చున్నీతో ఉరేసి చంపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…
👉 ఏపీలో డయేరియా విజృంభణ..ఏపీలో డయేరియా వేగంగా విజృంభిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి భారీగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 10 వరకు డయారియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు
👉వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కింజరాపు అచ్చెన్నాయుడు ని ఈ రోజు విజయవాడలోని ఆయన నివాసం నందు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు కె.ఎస్ జవహర్*
👉హిజాబ్ బ్యాన్.. హైకోర్టు కీలక తీర్పు…హిజాబ్ బ్యాన్.. హైకోర్టు కీలక తీర్పు..ముంబైలోని ఓ కళాశాల యాజమాన్యం తీసుకున్న హిజాబ్ నిషేధ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ నిషేధిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 9 మంది విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ చందుర్కర్, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. కాలేజీ నిర్ణయం రాజ్యాంగం తమకు ఇచ్చిన ప్రాథమికహక్కును ఉల్లంఘిస్తోందని విద్యార్థినులు పిటిషన్‌లో పేర్కొన్నారు.
👉బ్యాటరీ లోపంతోనే స్మార్ట్‌ఫోన్ పేలుడు?,బ్యాటరీ లోపంతోనే స్మార్ట్‌ఫోన్ పేలుడు?..స్మార్ట్‌ఫోన్ పేలుడు సంభవించడానికి అత్యంత ముఖ్య కారణం.. ‘బ్యాటరీ లోపం’. అవి లిథియం అయాన్‌తో తయారవుతాయి. అయితే బ్యాటరీలో ఏదైనా లోపం తలెత్తి.. దాని కారణంగా ఉబ్బినట్లు కనిపిస్తే అలర్ట్ కావాలి. ముఖ్యంగా అది అసాధారణంగా ఉబ్బితే మొబైల్ పేలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి, బ్యాటరీ ఉబ్బితే వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు.
👉 మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి…మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి ..ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై మాజీ మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు. దీంతో జర్నలిస్టుతో పాటు కెమెరామ్యాన్ కు గాయాలయ్యాయి. రఘునందన్ దాస్ పై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబీ దాస్ గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా జరిగిందీ ఘటన. దీనిపై జర్నలిస్టులు మండిపడుతున్నారు.
👉 దారుణం.. నంద్యాల జిల్లాలో మహిళ దారుణ హత్య.. అసలు ఏమైంధంటే..! .. ఆళ్లగడ్డ పట్టణంలో మహిళ దారుణ హత్యకు గురయిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధికి చెందిన అట్లా శ్రీదేవి, అట్లా భాస్కర్ రెడ్డిలు మంగళవారం రాత్రి ఇంట్లో ఉండగా దుండగులు ఇంటిలోకి చేరుకుని కళ్ళలో కారంపొడి చల్లి, కత్తులతో దాడి చేసి నరికారు. ఈ ఘటనలో అట్లా శ్రీదేవి (55) అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అట్లా శ్రీదేవి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి తరుపున భూమా అఖిలప్రియకు మద్దతుగా చురుకుగా ప్రచారంలో పాల్గొన్నారు. అట్లా కుటుంబంలో కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం నెలకొంది. అట్లా శ్రీదేవి హత్య సమాచారం తెలిసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, టిడిపి తాలుకా యువ నాయకులు భూమా జగత్ విఖ్యత్ రెడ్డిలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు కారకులైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎసిపి షర్ఫుద్దీన్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
👉 హజరత్ గూడెం మాజీ సర్పంచ్ మృతి ..ప్రకాశం జిల్లా కంభం మండలం హజరత్ గూడెం మాజీ సర్పంచ్.. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు.. సయ్యద్ అబ్దుల్ సుభాన్( 87) అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.బుధవారం సాయంత్రం హజరత్ గూడెం సమీపంలోని స్మశాన వాటిక ముస్లిమ్స్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 👉 శ్రీశైల సత్రం మాజీ ఉద్యోగి ఫరీద్ బేగ్ మృతి.. ప్రకాశం జిల్లా కంభం లోని శ్రీశైల కాణిపాక నిత్య అన్నదాన సత్రంలో ఉద్యోగిగా పనిచేసే ఇటీవల రిటైర్డ్ అయిన మొగల్ ఫరీద్ (62) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యానికి గురికాగా నరసరావుపేటలో ఆయన వైద్య చికిత్సలు పొందుతున్నారు. కాగా బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందారు.