ఏపీకి మోడీ ఇవ్వబోయేది ఏమిటి ?..పవన్ కు షాక్ ఇచ్చిన అధికారులు..మై క్వీన్ యాప్ దోపిడీ.. బదిలీలలో రాజకీయజోక్యం వద్దు మంత్రి లోకేష్.. నెల్లూరులో ఘరానా దొంగల అరెస్ట్

👉ఏపీకి మోడీ ఇవ్వబోయేది ఏమిటి ? ఏపీకి మోడీ ఏమిస్తారు అన్నది అందరిలో చర్చగా ఉంది. ప్రధాని మోడీని ఢిల్లీలో టీడీపీకి చెందిన ఎంపీలు అంతా కలిశారు. ఏపీకి మోడీ ఏమిస్తారు అన్నది అందరిలో చర్చగా ఉంది. ప్రధాని మోడీని ఢిల్లీలో టీడీపీకి చెందిన ఎంపీలు అంతా కలిశారు. వారంతా ఏపీకి చేయాల్సిన సాయం గురించి ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భేటీ అనంతరం ఎంపీలు ట్వీట్ చేయలేదు.అలా చేస్తే అది రొటీన్ అవుతుంది. ఏకంగా మోడీయే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు నన్ను కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు ఏపీలో కేంద్రంలో సన్నిహితంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.దేశ ప్రగతితో పాటు ఏపీ ప్రగతికి సాధ్యమైనది అంతా చేస్తామని మోడీ ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. దానికి ప్రతిగా చంద్రబాబు అదే ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు.మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ తన నాయకత్వంలో వికసిత్ ఏపీని చూస్తామని అన్నారు. ఇలా ఇద్దరు నేతలూ ఎక్స్ వేదికగా బాగానే స్పందించారు. ఇంతకీ మోడీ ఏపీకి సాధ్యమైనంతగా చేసే సాయం ఏమిటన్న చర్చ సాగుతోంది. మోడీ ఏపీకి ఎంత చేసినా ఏమి చేసినా ప్రజల ఆకాంక్షలను అది అందుకోవాలని అంటున్నారు. ఏపీ ప్రజల గుండెలలో బలంగా నాటుకున్నది ప్రత్యేక హోదా హామీ.దానిని మోడీ తీరిస్తే జనాలు గుండెలలో పెట్టుకుంటారు. ఏపీని ఎంతోగానో గుర్తించినట్లుగా భావిస్తారు. ఆ పని మోడీయే చేయాలని కూడా వారు ఆశిస్తున్నారు.అలాగే ఏపీకి మంచి రాజధానిని కట్టి ఇచ్చే బాధ్యత కూడా మోడీ తీసుకోవాలని కోరుకుంటున్నారు.పోలవరం సత్వరం పూర్తి చేయలాని కూడా వేడుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక ఉండదు కాక ఉండదు అని స్వయంగా మోడీ నోట మాట వినాలని చూస్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించిన విభజన హామీలు అన్నీ నెరవేర్చాలని కూడా కోరుకుంటున్నారు. ఇలా అయిదు కోట్ల ప్రజలు మోడీ మీద ఆశలు ఎన్నో పెట్టుకున్నారు.అయితే ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఏపీకి ఎంతో చేశమని బీజేపీ నేతలు చెబుతున్న మాటలకే జనాలు విస్తుపోతూంటారు.ఏపీ జనాలు ఆశించినది చేస్తే వారు మెచ్చుకుంటారు తప్ప మంచి మంచి పదాలతో నోరు తీపిని చేయాలనుకుంటే ఊరుకోరని అంటున్నారు. ఏపీకి నిధులు కావాలి. కానీ అప్పులు కాదు. ఉదారంగా అప్పులు చేసుకోవడానికి అధికారం ఇచ్చినా అది తప్పే అవుతుంది ఏపీకి నిప్పే అవుతుంది అని అంటున్నారు.వీలైతే మంచి మనసు చేసుకుని స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాలి. ఏపీ నుంచి కేంద్రానికి ఒక రూపాయి జీఎస్టీ రూపంలో వెళ్తూంటే వెనక్కి వచ్చేది 42 పైసలే అని అంటున్నారు. మరి ఏపీ వంటి అన్ని విధాలుగా కునారిల్లిన స్టేట్ ని అక్కున చేర్చుకుని ఎక్కువ నిధులు ఇస్తే తప్పేంటి అని అడుగుతున్నారు.కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా ఏపీ జనాలు వేసిన ఓట్లతో సీట్లతో ఎన్డీయే నిలిచింది.అందువల్ల ఏపీకి ఎంతో చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు కాకుండా కాంక్రీట్ గా ఫలానా అని చెప్పి చేస్తే జనాలు సంతోషిస్తారని అంటున్నారు.

👉ఇది పదవి కాదు.. బాధ్యత: రాహుల్..లోక్ సభ విపక్ష నేతగా ఇండియా బ్లాక్ తనను ఎన్నుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు. “నాపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇండియా బ్లాక్ సహచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది పదవి మాత్రమే కాదు.మీ హక్కులకోసం పోరాడే బాధ్యత. రాజ్యాంగం పేదలు,అణగారిన, మైనారిటీలు, రైతులు, కూలీలకు అతిపెద్ద ఆయుధం.దానిని రక్షించుకుంటాం. నేను మీవాడిని. మీకోసమే పనిచేస్తాఅని చెప్పుకొచ్చారు.

*మై క్వీన్ యాప్ పేరుతో కోట్లలో పెట్టుబడులు* …..

అతి గతి లేని ఈ లింక్ పై కోట్లలో పెట్టుబడులు .. చెల్లించిన డబ్బు రాక ఆందోళన చెందుతున్న డిపాజిట్ దారులు..

ఇటీవల మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కులుసుకట్టు కంపెనీలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి..ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అంటే ఎవరైనా ఆశ పడిపోతారు..ఈజీ మనీ కోసం మార్కాపురం డివిజన్లో ఇటీవల ఓ ఆన్లైన్ కంపెనీ తిష్ట వేసినట్లు విశ్వస నీయ సమాచారం.. మార్కాపురంలో ఈ సంస్థ కార్యాలయం ఉన్నట్లు దీనిని కొందరు కంభం వ్యక్తులు నడిపిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి .మొన్నటి వరకు సేఫ్ షాప్ అంతకుముందు ఆమ్వే.. గాల్వే..అలేఖ్య ఎల్లో పేజెస్…. ఎన్ మార్ట్.. వంటి మనీ సర్కులేషన్ గొలుసుకట్టు సంస్థలు.. బిట్ కాయిన్, అగ్రిగోల్డ్ వంటి సంస్థలలో చేరి లక్షలాది రూపాయలు నష్టపోయిన వారు ఉన్నారు.. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆయా సంస్థలు ప్రజల డబ్బును దోచేసుకున్నాయి.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలలో చేరిన సభ్యులు ఎంతమందిని ఎక్కువగా చేర్పిస్తే అంతగా డబ్బు సంపాదించవచ్చని ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక్కొక్క సభ్యుడి నుండి వేలాది రూపాయలు దోచుకున్నాయి. మొన్నటి దాకా సేఫ్ షాప్ అనే మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ మార్కాపురం డివిజన్లో ఉర్రూతలూగించింది.సుమారు రెండేళ్ల పాటు ఈ ప్రాంతంలో వేలాది మంది లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చని రూ 15 వేల రూపాయలు చెల్లించి అందులో చేరారు. సమాజంలో అంతో ఇంతో పరపతి ఉన్నవారు తమ కింద సుమారు 50 నుండి 100 మంది దాకా చేర్పించగలిగారని ఇందులో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముగ్గురిని చేర్పిస్తేనే వారు కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి..ముగ్గురు సభ్యులను చేర్పించలేక ఎంతో మంది నష్టపోయారు.సంస్థలలోని ప్రొడక్ట్స్ ధరలు కూడా చాలా ఎక్కువ ఉంటాయని, పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సేఫ్ షాప్ ఊపు తగ్గిపోయింది.ఇటీవల మై క్వీన్ పేరుతో ఓ వ్యాపారం గుట్టుగా నడుస్తుంది.ఓ ఆన్లైన్ లింక్ ఇది.. ఎపుడు దాక ఉంటదో ,ఎపుడు ఉడ్తాదో తెలియని ఈ యాప్ లో కంభం లో సుమారు 10 కోట్లకు పై గా పెట్టుబడులు పెట్టినట్లు ఈ ప్రాంతంలో ఈ వార్త ప్రస్తుతం ఓ హాట్ టాపిక్ గా మారింది.. ఇక గిద్దలూరు మార్కాపురం కంభం పట్టణాలలో సైతం కోట్లాది రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.*మై క్వీన్ యాప్ లో సభ్యత్వం తీసుకున్న వారికి డబ్బు ఎలా వస్తుంది..ఈ యాప్ గురించి మనకి తెలిసిన మన పరిచయస్తుల ద్వారా ఈ యాప్ మనకి పరిచయం అయితుంది .మనకు తెలిసినవారు ఎవరో ఒకరు ఈ యాప్ కి సంబందించిన లింక్ ని మనకి మొదటగా పంపడం జరుగుతుంది .ఆయాప్ పై క్లిక్ చేసి దానిని డౌన్లోడ్ చేసుకోవాలి .తర్వాత మన ఫోన్ నెంబర్ ,తో ఓ .టి .పి ద్వారా అతని రెఫరెల్ ద్వారా ఇందులోకి ఎంట్రీ చేస్తారు .మొదటగా 770 తో ఈ ప్రోడక్ట్ స్టార్ట్ అవుతుంది .770ప్యాకేజీ తో ఇందులో ఐ .డి తీసుకోవాలి అలాగా తీసుకున్న వాళ్ళు ఓ వాట్స్ అప్ గ్రూప్ లో మనల్ని యాడ్ చేయడం జరుగుతుంది .ఈ వాట్స్ అప్ గ్రూప్ పెరు మై క్వీన్ ఇండియా వెల్ఫేర్ గ్రూప్ ఇందులో జాయిన్ అయిన వ్యక్తి పొరపాటున ఈ గ్రూప్ నుంచీ వైదొలగకూడదు ..పొరపాటున గ్రూప్ నుంచీ వైదొలిగితే అతని ఐ .డి కంపెనీ బ్లాక్ చేయడం జరుగుతుందట.ఈ యాప్ లో కొని ప్రోడక్ట్ ద్వారా కంపెనీ జనాలని బురిడీ కోటిస్తునారు…… …….*ఇలా సాగుతుంది తంతు..ఈ యాప్ లో ప్రోడక్ట్ 410.0,9300,18500,37500,61000,85000,99000,119500,145000,173000 ఇలాగ రకరకాల ప్రోడక్ట్ లు మనము కొనాలి.. దీనిని కంపెనీకి పే .టి .యం ద్వారా అమౌంట్ పంపించాలి .ఆలా పంపించిన తర్వాత 60 రోజులు ,95 రోజులు ,97 రోజులు 88 రోజులు ,92 రోజులు 80,85 రోజులు ఇలాగ కంపెనీ టైం పీరియడ్ ఇస్తుంది .4100 తో మనము ఇందులోకి వస్తే ప్రతి రొజూ 299 ఆలా 60 రోజులు ఇస్తారని ఉంటుంది .9300 తో వస్తే రోజుకు 725 ఆలా 65 రోజులు ఇస్తారట,18500 పెడితే రోజుకు 1535,37500 పెడితే 75 రోజులు రోజుకు 3300 ఇస్తారట,,61000 పెడితే 80 రోజులు రోజుకు 5555 ఇస్తారట,85000 పెడితే 85 రోజులు రోజుకు 7900 ఇస్తారట,99000 కు 88 రోజులు రోజుకు 9400,119500 పెడితే 92 రోజులకు రొజూ 11472,145000 పెడితే రోజుకు 14210 ఇలా 95 రోజులు ఇస్తారని ,173000 పెడితే 97 రోజులు రోజుకు 17300 ఇలా 97 రోజులు ఇస్తారని చెప్పడం తో కంభం లో భారీగా కోట్లలో డబ్బులు పెట్టడం జరిగింది .

ఇలాగ జనాలు పూర్తి గా మై క్వీన్ కి అలవాటు పడి అప్పులు చేసి మరి ఇందులో పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం .జనాలు అంతా భ్రమలో ఉన్నటు తెలుస్తుంది . మార్కాపురం డివిజన్లోని పలు మండలాలలో మై క్వీన్ ఇప్పుడు ప్రతి నోటా ఇదే మాట ఈ లింక్ తెలియని వారంటూ లేరు అంటే నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజం కంభం లో మై క్వీన్ దుమ్ము రేపుతుంది గత 2 నెలల నుండి కోట్లలో డబ్బులు పెట్టారు ,లక్షల్లో ఒక్కొక్కరు డిపాజిట్ లు చేశారు.లక్షకు రోజుకు 10000 వస్తున్నాయి.. మేము కట్టిన డబ్బులు 10 రోజులో వస్తున్నాయి ..మా డబ్బులు పోయిన పర్లేదని జనాలు ఎగబడి చేరినట్లు సమాచారం .దీనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.

👉దిల్లీ: దాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్‌ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండు దఫాలుగా ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. వాస్తవానికి 1969 వరకూ ప్రతిపక్ష నేతకు ఎలాంటి గుర్తింపు, హోదా, ప్రత్యేకాధికారాలు ఉండేవి కావు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత జీతభత్యాల చట్టం-1977 ద్వారా ప్రత్యేక గుర్తింపునివ్వడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీకి కేబినెట్‌ మంత్రికి ఉండే సౌకర్యాలు, హోదా దక్కనున్నాయి. వేతనంగా రూ.3.3 లక్షలు, జడ్‌+ కేటగిరీ భద్రత లభిస్తుంది. పార్లమెంట్‌ బిల్డింగ్‌లో ఆయనకో కార్యాలయం, ప్రభుత్వ బంగ్లా, సిబ్బంది కూడా ఉంటారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలి సీటు కేటాయిస్తారు.

👉 హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును గురువారానికి రిజర్వు చేసింది. తాము బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్‌ లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసులో అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్‌ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్‌వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్‌ వేయనట్లు కాదన్నారు.

👉 దిల్లీ: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి కుమారస్వామిని దిల్లీలో బుధవారం ఏపీ భాజపా ఎంపీలు కలిశారు. రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌లు.. కుమారస్వామితో సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. స్టీల్‌ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలని కోరారు. భాజపా ఎంపీలు చెప్పిన అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి.. మరోసారి సమావేశమవుదామని తెలిపారు.

👉 ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు…అమరావతి:..ఉపాధ్యాయ బదిలీల్లో రాజకీయ జోక్యంరాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. టీచర్లపై అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి.. ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో దాదాపు 3గంటల పాటు సమీక్షించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలు రూపొందించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్‌ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.

👉 నెల్లూరు జిల్లా…మారు తాళాలు తో బైకులను క్షణాల్లో మాయం చేసే ఘరానా ముఠా అరెస్ట్…నెల్లూరు జిల్లా…నిందితుల వద్ద నుండి 15 లక్షలు విలువ చేసి ఇరవై ఒక్క బైక్లు స్వాధీనం…నిందితులంతా కప్పరాళ్ళ తిప్పకు చెందిన 19 నుండి 23 సంవత్సరాల లోపు వారే…జల్సాలుకు అలవాటు పడి దొంగతనాలును మార్గంగా ఎంచుకున్న నిందితులు…నిన్న నెల్లూరు లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బైక్ దొంగతనాలు చేసే ముఠా గురించి పూర్తి వివరాలు వెల్లడించారు.

👉ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎవరికైనా శిక్ష తప్పదు- పిన్నెల్లి అరెస్టుపై ఎన్నికల సంఘం – టీడీపీ ఏజెంట్పై హత్యాయత్నం, సీఐపై దాడి కేసులలో రిమాండ్: ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికీ మూడుసార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనల విన్న న్యాయమూర్తి పాల్వాయిగేట్‌ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు.పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల తరలించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లలో తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడి చేశారు. ఆయన కడుపులో చేతితో గట్టిగా గుద్దారు.

👉ఏపీ లో ఇసుక అమ్మకాల్లో ..చేతిరాత బిల్లులకు చెక్.. ఇక ఆన్‌లైన్ పర్మిట్లే!..అమరావతి..గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్‌లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్‌లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

👉 పవన్ కే షాక్ ఇచ్చిన అధికారులు!? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మీద రివ్యూ చేపట్టారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరసబెట్టి తన శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన తాజాగా స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మీద రివ్యూ చేపట్టారు.ఈ రివ్యూ సాగుతూండగా అధికారులను పవన్ నిధులు ఎన్ని ఉన్నాయని అడిగారు. దానికి వారు ఇచ్చిన సమాధానం తో పవన్ షాక్ తిన్నారు. జస్ట్ ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్పడంతో పవన్ సీరియస్ అయ్యారు. ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూపిస్తూ ఈ విధంగా అధికారులు చెప్పడంతో పవన్ అసలు నిధులు అన్నీ ఏమయ్యాయని నిలదీశారు. కేంద్రం నుంచి ఏకంగా గడచిన అయిదేళ్ళలో 1066 కోట్ల రూపాయలు విడుదల చేసింది కదా వాటి సంగతి ఏమైందని పవన్ ప్రశ్నించారు.ఇక 2021లో 2092 కోట్ల రూపాయల మేర నిధులు ఉంటే అవన్నీ ఏమయ్యాయని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ ఎత్తున నిధుల మళ్ళింపు ఎలా జరిగింది అన్నది డిప్యూటీ సీఎం కే అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు. అసలు కార్పొరేషన్ నిధులు ఎటు మళ్ళించారు అని ఆయన అధికారులను గట్టిగానే ప్రశ్నించారని భోగట్టా. అంతే కాదు నిధుల మళ్ళింపు మీద సమగ్రమైన నివేదికను తయారు చేసి ఇవ్వాలని అక్కడికక్కడ పవన్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ఏడు వేల కోట్లు దేనికి పనిని వస్తాయీ అంటే అయిదు నెలల పాటు ఉద్యోగుల జీతాలకు అని అంటున్నారు. అందువల్ల వాటిని ముట్టుకోవడానికి లేదు. మరి ఇంతటి కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా పనులు చేయించుకోవాలి ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది మాత్రం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కి అర్ధం కావడం లేదు అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పూర్తిగా దారి మళ్ళాయని ఈ రివ్యూలో పవన్ గ్రహించారు అని అంటున్నారు. మరి దాని మీద నివేదిక వచ్చాక సీరియస్ యాక్షన్ వైపు గానే పవన్ ఉన్నరని అంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ధర్మాగ్రహానికి గురి అయ్యేది ఎవరు అన్నదే ఇక్కడ చర్చ.

👉 సీఐ అనుచిత ప్రవర్తన.. అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు మంగళవారం హడావుడి చేశారు. పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సీఐకి సూచించారు. సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు. బూట్లతోనే లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు. సీఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో బుధవారం సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.

👉 రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూముల్లో వైయస్సార్సీపి కార్యాలయాలు కట్టినారు వాటిని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రభుత్వం కూల్చివేత కార్యక్రమం పెట్టినారు ఆ కార్యాలయాలను కొల్చవద్దని వాటిని రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు భవనాలుగా కేటాయించాలని కోరుచున్నాము ప్రభుత్వ భూముల్లో కట్టినటువంటి అక్రమ కట్టడాలను ఎక్కడ కూల్చకుండా ఎస్సీ ఎస్టీ కళ్యాణ మండపాలుగా బీసీలకు మీటింగ్ హాలుగా మైనార్టీలకు ఉపయోగపడే భవనాలుగా ఉంచాలని ఉంచాలని కోరుతూ ఈ అక్రమాలను కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భవనాలను స్వాధీనం చేసుకొని వారికి కేటాయించాలని కోరుచున్నాము

👉అమలులోకి రాబోతున్న.. జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు*కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. 👉దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. 👉జీరో ఎప్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పీఎస్ పరిధితో సంబంధం లేకుండా ఏ పీఎస్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. 👉మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి….👉 జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ అన్సరియా… ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ అయ్యారు.

👉ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. హిందూపురంలో బాలకృష్ణా గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

*మున్సిపాలిటీలపై టీడీపీ కన్ను..*చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భారీ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు పుంగనూరు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. ఛైర్మన్ అలీం భాషాకు గాలం వేశారు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు.ఈ తరుణంలోనే.. వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు ఛైర్మన్ అలీం భాషా.ఆయనతోపాటు మరో 20 మందిపైగా కౌన్సిలర్లు కూడా వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడిన వారు… చల్లా బాబు సమక్షంలో మధ్యాహ్నం టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. పుంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టిడిపి నేత చల్లా బాబు..ఛైర్మన్ అలీం భాషాకు గాలం వేశారు. మొత్తం 31 మందిలో 20పైగా టిడిపిలోకి వచ్చేలా చక్రం తిప్పారు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. తరుణంలోనే … పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ పార్టీ కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పుంగనూరులో పెద్దిరెడ్డి హావా తగ్గుముఖం పట్టినట్లయింది.

*కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత*….ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుత పులి కలకలం..దేవనగరం సమీపంలోని ఓ గుంతలో పడి చిక్కుకుపోయిన చిరుత పులి..చిరుతను రక్షించి అడవిలో విడిచి పెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అటవీశాఖ అధికారులు.ప్రస్తుతం దేవనగరం సమీపంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..చిరుత గుంతలో పడి 15 గంటలకు పైగా కావడంతో నీరు ఆహారాన్ని చిరుతకు అందించిన అధికారులు..

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం