👉జగన్ షాకింగ్ ఐడియా: విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి.. రాజధాని కడదాం!🤭🙏🙏🙏 “విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు. పైగా పొల్యూషన్ కూడా ఉంది. దానిని నేలమట్టం చేసేద్దాం. అక్కడ 33 వేల ఎకరాల స్థలం ఎలానూ ఉంది. వివాదాస్పద నిర్ణయాలకు, ప్రజావ్యతిరేక నిర్ణయాలకు కేంద్రంగా మారిన గత ముఖ్యమంత్రి జగన్.. రాజ ధాని విషయంలో ఏం చేశారో అందరికీ తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని కోసం.. మూడు పంటలు పండే 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన అమరావతి రైతులను పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపా దన తీసుకువచ్చారు. దీనికంటే ముందు.. జగన్ చేసిన మరో వివాదాస్పద నిర్ణయం.. అతి తెలివి.. తాజా గా వెలుగు చూసింది. ఆంధ్రుల హక్కుగా అనేక సంవత్సరాల పాటు పోరాడి ఏర్పాటు చేసుకున్న విశాఖ ఉక్కును సైతం ఆయన కాలరాసే చర్యలకు ప్రయత్నించారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ హయాంలో తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం .. అప్పట్లో జగన్ ఆలోచనా విధానాన్ని వెల్లడించి.. అందరినీ దిగ్భ్రంతికి గురి చేశారు. విశాఖను రాజధాని చేయాలన్న ఆలోచన జగన్‌కు తొలినాళ్లలోనే వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన ప్రభుత్వ పెద్దగా.. సుదీర్ఘ కాలం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేల మట్టం చేసి.. అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని భావించినట్టు ఎల్వీ తెలిపారు. “విశాఖ ఉక్కుతో ప్రయోజనం లేదు. పైగా పొల్యూషన్ కూడా ఉంది. దానిని నేలమట్టం చేసేద్దాం. అక్కడ 33 వేల ఎకరాల స్థలం ఎలానూ ఉంది. అక్కడే రాజధాని కట్టేద్దాం“ అంటూ.. అప్పట్లో జగన్ తనకు చెప్పారని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే.. జగన్ ఆలోచనా సరళి చూసి తాను దిగ్బ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. అలా ఎలా చేస్తాం.. సర్.. అది సుదీర్ఘ కాలం పోరాడి ఏపీ ప్రజలు సాధించుకున్నారని తాను వివరించినా.. అప్పట్లో జగన్ వినిపించుకోలేదన్నారు. అంతేకాదు.. “ఏంటి ఇలా వాదిస్తావ్“ అంటూ.. తనను తీవ్రంగావ్యాఖ్యానించినట్టు ఎల్వీ చెప్పారు. ఇది జగన్‌కు వచ్చిన చాలా భయంకరమైన ఆలోచనగా ఎల్వీ పేర్కొన్నారు. దీనిని వినగానే తాను షాక్‌కు గురయ్యానన్నారు. ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా? అని అనుకున్నట్టు తెలిపారు. అసలు ఏమిటీ ఆలోచన? ఎవరైనా అసలు ఇలా ఊహించగలరా? అని అనుకున్నట్టు చెప్పారు. తాను వద్దని వాదించిన ట్టు ఎల్వీ తెలిపారు. అయితే.. తన వాదనను జగన్ కొట్టిపారేశారని అన్నారు. “ఏంటి నువ్విలా మాట్లాడ తావు. నీతో వచ్చిన సమస్యే ఇది“ అంటూ.. వ్యాఖ్యానించారని ఎల్వీ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌తో పొల్యూషన్ లేదన్నా వినలేదని, సిటీ మధ్యలో స్టీల్ ప్లాంట్ ఉందని.. దానిని తీసేయాలని చెప్పారన్నారు. కేంద్రంతో అలా చేయించారా? ఇక, విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి ఇప్పుడు మరోసారి చర్చనీయాం శంగా మారింది. అప్పట్లో జగన్‌తోచెట్టాపట్టాలేసుకుని తిరిగిన కేంద్రం.. విశాఖను ప్రైవేటీకరిస్తున్నామని చెప్పింది. అయితే.. ఈ ఆలోచన వెనుక జగన్ ఉండి ఉంటారని.. తాజాగా ఎల్వీ చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. కేంద్రం పట్టుదలగా ముందుకు కూడా సాగింది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఆ కోణంలో ముందుకు తీసుకువచ్చి.. విశాఖ ఉక్కును తీసేయించి.. ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలన్న ప్లాన్‌ను జగన్ అమలు చేయాలని అనుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. జగన్ ఆలోచనా విధానం ఇలా ఉంటుందని బహుశ.. ఎవరూ ఊహించి ఉండరేమో!! అంటున్నారు మేధావులు.
👉రేవణ్ణ..ఎర్ర చీర..నల్లగాజులు!?😱 ఇప్పుడు ప్రజ్వల్ వ్యవహారం చాలదన్నట్టు అతడి సోదరుడు సూరజ్ రేవణ్ణ వ్యవహారం కలకలం రేపుతోంది. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు అతడి సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ వ్యవహారం ఇంకా ప్రకంపనలు రేపుతోంది. తనను సూరజ్ రేవణ్ణ అత్యాచారం చేశాడంటూ ఒక యువకుడు ఫిర్యాదు చేయడంతో సూరజ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా సూరజ్ సోదరుడు ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై అత్యాచారాలు చేశాడంటూ వేలాది నీలి వీడియోలు ఇప్పటికే కర్ణాటకను షేక్ చేశాయి. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ ఎట్టకేలకు ఇండియాకు తిరిగి రాగానే ఆయనను బెంగళూరు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రజ్వల్ వ్యవహారం చాలదన్నట్టు అతడి సోదరుడు సూరజ్ రేవణ్ణ వ్యవహారం కలకలం రేపుతోంది. అతడు స్వలింగ సంపర్కుడు అని సూరజ్ పై ఫిర్యాదు చేసిన యువకుడు వెల్లడించినట్టు తెలుస్తోంది. అమావాస్య రోజుల్లో సూరజ్ రేవణ్ణ ఎర్ర చీర ధరించి.. నల్ల గాజులు వేసుకునేవాడని ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులకు అత్యాచారానికి గురయిన యువకుడు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. తనకు 2019 ఎన్నికల çసందర్భంగా అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని బాధిత యువకుడు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. అప్పుడు సూరజ్ రేవణ్ణ తన ఫోన్ నంబరు తీసుకుని, విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు. సూరజ్ ప్రతి రోజూ తనకు గుడ్ మార్నింగ్‌తో పాటు ప్రేమ సందేశాలు పంపించేవాడని పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒకరోజు తనను ఫాంహౌస్ కు పిలిపించుకున్నాడని బాధిత యువకుడు నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. మొదట కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సీఐడీ అధికారులకు ఆ బాధాకర సందర్భాన్ని వివరించాడని సమాచారం. సూరజ్ రేవణ్ణ చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్లో ఉన్నాయని బాధిత యువకుడు సీఐడీ అధికారులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో సూరజ్ ఫోన్ ను జప్తు చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా సూరజ్ రేవణ్ణ స్వలింగ సంపర్కుడు అని తెలియడంతోపాటు తనతో అసహజ ప్రక్రియల్లో శృంగారానికి బలవంతం చేస్తుండటంతో అతడి భార్య వారి పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుందని బాధిత యువకుడు సీఐడీ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. కాగా 2018 మార్చిలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో సూరజ్– సాగరిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇలా దేవగౌడ మనుమళ్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త అంశం బయటకు వస్తూ క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రానున్న రోజుల్లో సీఐడీ విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయోనని కర్ణాటక అంతటా చర్చ జరుగుతోంది.
👉 సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..
స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయంపై రెండు నెలల్లో మరో మారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురందేశ్వరికి హామీ ఇచ్చినట్టు సమాచా
👉: లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్..హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ బఫర్ జోన్‌లో నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్.బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం.చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు.
👉రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ అవసరం ఉంది..పోలీస్ శాఖలో ప్రత్యేక రిక్రూట్‌మెంట్ విధానం ఉండాలి..హోం మంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసులపై కమిటీ వేసి విచారణ చేస్తాం..*రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు.రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకు వస్తా..రాజకీయాలు చేసేట్టయితే ఖాకీ వదిలి ఖద్దరు వేసుకోవాలి**-విశాఖ పోలీసుల్ని హెచ్చరించిన హోంమంత్రి_*
👉అమరావతి నిర్మాణానికి 10 కోట్ల విరాళం..ఈనాడు ఎండి కిరణ్ ..నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతి పేరును స్వర్గీయ రామోజీరావు సూచించారని ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్ తెలిపారు. పెనమలూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలన్నారు. రామోజీరావు సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ కుటుంబం తరుఫున అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్లు సభా ముఖంగా ప్రకటించారు.
👉 ఆస్ట్రేలియన్ హై కమీషనర్ ఫిలిప్ గ్రీన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
👉 బావి తవ్వుతుండగా మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి.*
ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామంలో చోటు చేసుకుంది. జేసిబి సాయంతో బావిని తవ్వుతున్నారు. ఓ వ్యక్తి బావిలో దిగి పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో దిగిన ఆయనపై మట్టి దిబ్బలు పడటంతో పీకల్లోతు వరకు మట్టిలో చిక్కుకపోయాడు. హిటాచీ సహాయంతో సుమారు రెండు గంటల నుంచి శ్రమించి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇంకా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఆచూకి లభ్యం కాకపోవడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.*
👉ప్రకాశం జిల్లా గిద్దలూరు టు నంద్యాల అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్ లో అదుపుతప్పి బోర్ బండి లోయలో పడటంతో 6 మందికి గాయాలు…
వారిలో 4 గురికి తీవ్రగాయాలు…వెంటనే స్పందించిన హైవే పోలీసులు
👉 ప్రకాశం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా పొదిలి పట్టణ ఎస్ఐ జి కోటయ్య గురువారం రెండు ప్రశంసా పత్రాలను మరియు రివార్డులు అందుకోవడం జరిగింది. మొదట 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ విధులలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు శాంతి భద్రతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు పలు సూచనలు చేస్తూ పొదిలి మండలంలో ఎలక్షన్ ప్రక్రియను ప్రశాంతంగా జరిగే విధంగా చూసినందుకు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2017 వ సంవత్సరంలో అర్ధవీడు పోలీస్ స్టేషన్లో పాపినేని పల్లి గ్రామంలో జరిగిన మర్డర్ కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారికి సహకరించిన విషయంలో ఆ కేసులో ముద్దాయికి జీవిత ఖైదు పడినది.ఆ కేసులో దర్యాప్తు అధికారికి సహకరించి ముద్దాయికి జీవిత ఖైదీపడటం లో ముఖ్య పాత్ర పోషించిన అప్పటి అర్థవీడు ఎస్ఐ జి. కోటయ్యకు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది.
: నేను పోలీస్ అవుతా ఆశీర్వదించండి…!!ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆసక్తికర ఘటన…!!సీఐ ముత్యాల సత్యనారాయణ దగ్గరకు పాపను తీసుకొచ్చిన తండ్రి…!!తన కూతురు పోలీస్ అవుతానని ఆశపడుతుందని దీవించాలి అంటూ పోలీసులకు వినతి…!!
ఎన్టీ ఆర్ జిల్లా, మైలవరం:- చిన్న పిల్లలు సహజంగా పోలీసులను చూస్తే బయపడుతుండటం చూస్తుంటాం. మాట వినకపోతే పోలీసులకు అప్పజెబుతా అంటుంటాం. ఈ క్రమంలో పోలీసులను చూసిన ,వారు కనిపించినా పిల్లలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా పోలీసు ఉద్యోగం వైపు రావడానికి కూడా జంకుతూ ఉంటారు.. కానీ ఒక చిట్టి తల్లి మాత్రం నేను పోలీసు అవుతా నన్ను దీవించండి అంటూ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్ లో నివాసం ఉంటున్న అక్కిరెడ్డి పురుషోత్తం రెడ్డికి రెండేళ్ల పాప ఉంది. పాప పేరు అక్కిరెడ్డి జేష్వికా శ్రీ.. పాపకు పోలీసులు అంటే అమితమైన ఇష్టం అట. పోలీసులు కనిపిస్తే బుడి బుడి అడుగులు వేస్తూ సెల్యూట్ చేయడం చేస్తూ ఉంటుందట. అయితే గురువారం తన మూడవ పుట్టిన రోజు కావడం తో తండ్రి వినూత్నంగా ఆలోచన చేశారు. కూతురి పుట్టిన రోజు సందర్భంగా తనకు అత్యంత ఇష్టమైన పోలీసుల చేత ఆశీర్వచనాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ కు పోలీసు డ్రెస్ లో వచ్చి సీఐ ముత్యాల సత్యనారాయణ కు తన కూతురి కోరిక మేరకు తనను ఆశీర్వదించాలని కోరారు. తండ్రి కోరిన మేరకు స్పందించిన సీఐ ముత్యాల సత్యనారాయణ పాపను ఎత్తుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అవ్వాలని పాప కోరుకుంటున్న నేపథ్యంలో పోలీసు కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ ఐ అనూష సైతం పాపకు దీర్ఘాయుష్షు ఆశీర్వచనాలు అందించారు. పాప పోలీస్ స్టేషన్ కు రావడం పోలీసులు దీవించడం తో తండ్రి కోరిక తీరినట్లు అయింది. పాప పుట్టిన రోజు సందర్భంగా స్టేషన్ లో సిబ్బందికి మిఠాయిలు, కేక్ పంచిపెట్టారు. పాప పోలీసు అవ్వాలని కోరుకుంటుంది అని తెలియడం తో అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు..