👉జగన్ నెత్తిన పాలు పోసిన నవీన్ పట్నాయక్ !
పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్యానక్ విలువలకు నిబద్ధ్తకు పెట్టింది పేరు. పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్యానక్ విలువలకు నిబద్ధ్తకు పెట్టింది పేరు. ఆరు పదులకు పైగా వయసు దాటినా రాజకీయ రంగు రుచి వాసనలు ఎరుగని నవీన్ పట్నాయక్ తన తండ్రి ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్ మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన నేరుగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. అంతే కాదు ఒడిశా వంటి వెనకబడిన రాష్ట్రంతో అక్కడ ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెనవేసుకున్నారు. 24 ఏళ్ల పాటు ఎదురులేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎనభయ్యేళ్ల వయసులో ఆయన మాజీ సీఎం అయ్యారు. ఆయన బీజేపీతో మిత్రుడిగా వ్యవహరించారు. అంతేకాదు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నపుడు కూడా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వారితోనూ సాన్నిహిత్యం నెరిపారు. అయితే ఈసారి మాత్రం ఆయన రాజకీయ పంధా మారింది. పైగా ఆయన్ను సీఎం సీటు లో నుంచి దించిందే బీజేపీ.దాంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది.బిజూ జనతాదళ్ కి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు.వారంతా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నవీన్ పట్నాయక్ సరైన నిర్ణయం తీసుకున్నారు తనను ఓడించిన బీజేపీ తనకు ప్రత్యర్ధి అని నవీన్ పట్నాయక్ గట్టిగా నమ్ముతున్నారు.తన రాజకీయ పంధా ఇదే అని ఆయన విడమరచి చెప్పారు. రానున్న రోజులలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పోరాటం చేయనున్నారు.ఆ విధంగా చేయడం ద్వారా ఆయన తానే అసలైన రాజకీయ ఆల్టరేషన్ అని జనాలకు తెలియచేయడం మరోసారి సీఎం అయ్యేందుకు బాటలు వేసుకోవడం చేస్తారని అంటున్నారు.ఇక నవీన్ ఎలాంటి శషబిషలకు తావులేకుండా బీజేపీతో యుద్ధం ప్రకటించేశారు.అది ఆయాచితంగా ఏపీలో ఉన్న విపక్షం వైసీపీకి వరంగా మారుతోంది.నవీన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.ఎన్డీయేకు ఏ మాత్రం మెజారిటీ లేని చోట పదేళ్ళుగా నవీన్ పట్నాయక్ ఇచ్చిన మద్దతుతో అనేక బిల్లులను సునాయాసంగా మోడీ సర్కార్ ఆమోదించుకుని వచ్చింది. ఇపుడు నవీన్ నో చెప్పేశారు.దాంతో బీజేపీకి 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీ అవసరం మరింత ఎక్కువ కానుంది.2026 వరకూ రాజ్యసభలో ఎన్డీయే బలం ఏ కొంచెం కూడా పెరిగే సూచనలు లేవు. అలాగే ఏపీ నుంచి టీడీపీ ప్రాతినిధ్యం కూడా అపుడే మళ్లీ మొదలవుతుంది.అంటే గట్టిగా రెండేళ్ల దాకా వైసీపీదే రాజ్యసభలో ఏపీ నుంచి ఆధిపత్యం.ఇపుడు నవీన్ తలాఖ్ చెప్పేశాక వైసీపీయే బీజేపీకి దిక్కు కాబోతోంది.👉నిజానికి నవీన్ బాటలోనే వైసీపీ కూడా నడవాలి.తనను ఓడించిన బీజేపీకి దూరంగా నవీన్ జరిగారు.అలాగే ఏపీలో తనను మాజీ సీఎం గా చేసిన బీజేపీకి జగన్ దూరం పాటించాలి.కానీ తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చారు.ఈ నేపధ్యంలో రాజ్యసభలో బీజేపీకి వైసీపీ కచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.బీజేపీ కూడా వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేందుకు ఈ పరస్పర అవగాహన దోహదపడుతుంది అని అంటున్నారు…
👉: మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి!..మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. స్థానిక మీడియా ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. సదరు మంత్రులు షామ్నాజ్ సలీమ్, ఆదాం రమీజ్ ఇద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. వీరితో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
👉 జగన్ చేసిన పాపాలతోనే వైసీపీకి ఈ దుస్థితిః..సీఎం రేవంత్ ..ఏపీ లో టిడిపిని ఖతం చేయాలనుకుని, జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆపార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం..దెబ్బతింది. బాబు ఫోన్ చేస్తే హైదరాబాద్జ లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం” అని ఆయన వెల్లడించారు.
👉డిప్యూటీ సీఎంకు మహిళల ఫిర్యాదు – ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఆవేదన..పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తోన్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పాపం వల్ల వారి కుటుంబాలు ఎంతో వేదనతో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్సార్సీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో లెక్కలు చూస్తుంటే తెలుస్తోందని విమర్శించారు.
👉ఆంద్రప్రదేశ్ మహిళా కమిషన్ మహిళా ఉద్యోగులపై రాజకీయ పెత్తనం తగదు..మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి
👉గోపాలపురం నియోజకవర్గ మాజీ ఉప సర్పంచి బెదిరింపుల ఆడియో కలకలం..అమరావతి:
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల రాజకీయ నేతల పెత్తనం తగదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోపాలపురం నియోజకవర్గం జగన్నాధపురం మాజీ ఉప సర్పంచి స్థానిక సచివాలయ మహిళా ఉద్యోగినిపై ఫోన్ లో బెదిరించిన ఆడియో గురువారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ తీవ్రంగా స్పందించారు. ఉద్యోగినుల పట్ల అమర్యాదగా వ్యవహరించడం రాజకీయ నేతలకు మంచిది కాదన్నారు. పౌరసేవలకు పనిచేసే కార్యాలయ ఉద్యోగినులను నేతల ఇళ్లకు రావాలని కోరడం వంటి కొత్త సాంప్రదాయాలను ప్రోత్సహించరాదన్నారు. జగన్నాధపురం సచివాలయ ఉద్యోగినికి ఎదురైన ఘటనను మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి తెలిపారు. ఇలాంటి బెదిరింపుల సంస్కృతిని సమాజం హర్షించదన్నారు. ప్రభుత్వ శాఖల ఉద్యోగినులకు రాజకీయాలను పులిమి వేధించే నాయకుల వైఖరిని ప్రతీ ఒక్కరూ తప్పుబట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామస్థాయి సచివాలయాల్లోనూ మహిళా ఉద్యోగులపై వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల పెట్టెలు పెడతామన్నారు. వాటి ద్వారా అందే ఫిర్యాదులపై లోకల్ కంప్లైంట్స్ కమిటీ (ఎల్ సీసీ), అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆయా కమిటీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని… ఇకనుంచి కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ మహిళా కమిషన్ తరఫున జిల్లాస్థాయి సమీక్షలు జరపనున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి వెల్లడి చేశారు.
పీఆర్వో, ఏపీ మహిళా కమిషన్ జారీ…
👉 ఢిల్లీ ఎయిర్పోర్టు దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు..
చెక్ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేత..
టెర్మినల్-1లో విమాన రాకపోకలు బంద్..
ఈదురు గాలులకు కూలిన ఎయిర్పోర్టు రూఫ్.. ముగ్గురికి గాయాలు, శిథిలాల కింద మరో వ్యక్తి.. కార్లపై విరిగిపడ్డ రూఫ్ సపోర్టు పిల్లర్..
👉 డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య..డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలని వక్కలిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య సమక్షంలోనే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డీకే కూడా వక్కలిగ వర్గమే. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
👉 జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
జియో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు
ప్రముఖ టెలికాం సంస్థ జియో మొబైల్ రీఛార్జి ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ను జియో రూ.155 నుంచి రూ. 189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్ఠంగా రూ.34 నుంచి గరిష్ఠంగా రూ.600 వరకు ఉంది. మరోవైపు 1 జీబీ డేటా యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జి ధరను రూ.15 నుంచి రూ.19కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.
👉 కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నందు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ ఉయ్యాల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయాలనుకునే వారు 9491229135 ను సంప్రదించాలన్నారు. పట్టణ ప్రజలు త్రాగు నీటి సమస్య, పారిశుధ్య సమస్య, విద్యుత్ దీపాల సమస్య తదితర సమస్యల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని, తద్వారా సమస్యల కూడా త్వరగా పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు.
👉లైంగిక వేధింపులకు పాల్పడిన డిఎల్పిఓ నాగేశ్వరరావు సస్పెండ్..🤔
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తన కార్యాలయంలో పనిచేసే మహిళ ఉద్యోగి పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారించిన విచారణ అధికారులు ఉన్నత అధికారులకు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సిఫారసు మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు డిఎల్పిఓ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
👉 నంద్యాల జిల్లా:గత నెల రోజులుగా పచ్చర్ల గ్రామస్తుల పై దాడికి పాల్పడుతున్న చిరుత..
నాలుగు రోజుల క్రితం మోహరున్నిసాబీ చంపిన చిరుత…మేకను ఎరగా వేసి బోను ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు..మేక కోసం వచ్చి బోనులో చిక్కుకున్న చిరుత పులి..
👉 రూ.1.65 కోట్ల మద్యం ధ్యంసం..వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సెబ్, పోలీసులు..కాకినాడ జిల్లా..
కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ వద్ద రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ రోడ్ కోటి అరవై అయిదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల విలువైన 32వేల లీటర్ల మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో లా అండ్ ఆర్డర్, సెబ్ పోలీసులు రోడ్ రోలర్ తో మద్యం సీసాలను తొక్కించి ధ్వంసం చేసారు. కాకినాడ జిల్లా లో 1406 కేసులకు సంబంధించిన వివిధ రకాల మద్యాన్ని గత రెండు సంవత్సరాల కాలంలో సెబ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 94,737 మద్యం బాటిళ్లు,12,532 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు.