👉ఆ ఘాటు విమర్శలు..పవన్ ని చుట్టుముడుతున్నాయా ?.. అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటింట వచ్చాయి. జనసేనాని గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో చాలా విమర్శలు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటింట వచ్చాయి. అవి వివాదాస్పదం అయ్యాయి కూడా. అందులో ప్రముఖమైనది ఏపీలో 30 వేలకు పైగా మహిళలు యువతులు మిస్సింగ్ అన్నది ఇది అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వీరంతా కనబడడం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలోనే అతి పెద్ద మిస్సింగ్ కేసులు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. విమెన్ ట్రాఫికింగ్ అని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇదంతా తనకు కేంద్ర నిఘా సంస్థలతో పాటు ఉన్నత స్థాయి వర్గాల నుంచి చాలా విశ్వసనీయమైన సమాచారంగా వచ్చిందని పవన్ చెప్పారు. గత ఏడాది వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో జోరుగా సాగే సమయంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ అధికార వైసీపీని ఒక కుదుపు కుదిపాయి. కేంద్ర ప్రభుత్వంలో పవన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఆయన చెప్పినది నిజం అని నమ్మిన వారూ ఉన్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని నాటి వైసీపీ ప్రభుత్వం కొట్టి పారేసింది. మంత్రులు వరసబెట్టి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు జనసేన కట్టుబడి ఉన్నట్లుగానే తరువాత రోజులలో చేసిన ప్రకటనలు తెలియచేశాయి. మొత్తానికి విపక్షంలో ఉన్నపుడు అనేక రకాలైన ఆరోపణలు వస్తూంటాయి కానీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు మాత్రం అటు ప్రజలకూ ఇటు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికీ గుర్తుండిపోతాయి. ఈ నేపధ్యంలో పవన్ ఇపుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. దాంతో గతంలో పవన్ చేసిన ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ కేసుని బయటకు తీయమని సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు పెడుతున్న జనాలు ఉన్నారు. అలాగే ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ లాంటి వారు ఇప్పటికి అనేక సార్లు ఇదే విషయం ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మిస్సింగ్ కేసులను ఆయన చేదించాలని కోరారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీలో ముప్పై వేల మంది మహిళలు, యువతులకు సంబంధించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరుతున్నారు. నిజంగా ఈ కేసులు చూడాల్సింది హోం శాఖ. పవన్ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకం కాబట్టి ఆయనే చొరవ తీసుకుంటే ఈ భారీ మిస్సింగ్ కేసుల వ్యవహారం వెలుగు చూస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా విమెన్ ట్రాఫికింగ్ ఏపీలో పెద్ద ఎత్తున గత అయిదేళ్ళుగా సాగింది అని జనసేన ఆనాడు చేసిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో కనుక పవన్ చొరవ చూపిస్తే కచ్చితంగా ఆయన ఆనాడు చేసిన ఆరోపణలకు విలువ ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఏపీలో మిస్సింగ్ కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. పవన్ అయితే తనకు అప్పగించిన శాఖల పట్లనే పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. ఆయన వాటి లోతుల్లోకి వెళ్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఆ శాఖకు మంత్రి ఉన్నారు కాబట్టి ఆమె ఆ బాధ్యతలను చూస్తారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ తాను స్వయంగా చేసిన ఆరోపణల నిగ్గు తీసి అసలు నిజాలు జనాల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. మరి దీని మీద పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
👉విద్యార్థులకు శుభవార్త.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు..అమరావతి.. విద్యా దీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘ఈ పథకాలకు YCP ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించి.. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని ఆయన వెల్లడించారు.
👉ఎల్లుండి నుంచి ఏపీలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ..పెన్షనర్లకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ*జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లు ఇంటి దగ్గర అందిస్తాం. చెప్పినట్టుగా పెన్షన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచాం. పెన్షన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు రూ.819కోట్ల భారం.ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం – చంద్రబాబు..గత ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టింది.మండుటెండల్లో పెన్షన్‌దారుల అగచాట్లు చూశా, ఇకపై ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్ల పంపిణీ..ప్రజలఆకాంక్షలు నెరవర్చడమే ప్రథమ కర్తవ్యం-చంద్రబాబు..
👉 తిరుమల: తిరుమలలో గత కొంతకాలంగా పులుల సంచారం భక్తుల్ని భయాందోళనలకు గురిచేయగా.. తాజాగా ఏనుగులు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం తిరుమలలోని మొదటి ఘాట్‌రోడ్డు ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు సంచరించింది. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది.. వాటిని అడవుల్లోకి పంపించారు.
👉’అవమానకర రీతిలో నిష్క్రమించిన సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి’ ..దివంగత ఎస్ ఆర్ శంకరన్ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరు చెబితే అప్రయత్నంగా ప్రజల చేతులు జోడించబడతాయి.నిరాడంబరతకు, నిస్వార్థానికి చిరునామాగా ఆయన జీవితం సాగింది. పేదలకు ఇచ్చే అసైన్డ్ భూములు అమ్మటానికి కానీ, కొనటానికి కానీ ఎవరికీ అధికారం ఉండకూడదని చట్టం చేయించిన వ్యక్తి ఎస్ ఆర్ శంకరన్. ఆ చట్టానికి తూట్లు పొడిచిన వ్యక్తి జవహర్ రెడ్డి.మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పేరు చెబితే దళిత సమస్యలపై ఆయన చేసిన కృషి కళ్ల ముందు కదలాడుతుంది. కొప్పుల రాజు పేరు గుర్తొస్తే నెల్లూరు జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక పోరాటం గుర్తుకొస్తాయి. మరో ఐఏఎస్ అధికారి గోపాలరావు పేరు వినిపిస్తే ఎస్ సి, ఎస్ టి సబ్ ప్లాన్ గుర్తుకొస్తుంది. జవహర్ రెడ్డి పేరు చెబితే లక్షల ఎకరాల అసైన్డ్ భూములు అధికార పార్టీ నాయకులకు అక్రమంగా కట్టబెట్టిన తీరు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం అత్యంత శక్తివంతులైన, నిజాయితీపరులైన అధికారుల్ని చూసింది. ఇదే సమయంలో జవహర్ రెడ్డి లాంటి అత్యంత వివాదాస్పదులు కూడా ఉండటాన్ని ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేకున్నారు.ఐఏఎస్ అన్నది కొందరి ‘డ్రీమ్’ ఎన్నో అద్భుతాలు చేయవచ్చని, ప్రజలకు సాయం చేయడానికి ఇది ఓ సాధనమని భావించి లక్షల మంది ఐఏఎస్ లుగా కావటానికి ఎంతో కృషి చేస్తున్నారు. జవహర్ రెడ్డి లాంటి అధికారుల తీరు కారణంగా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. స్వతంత్రంగా వ్యవహరించడానికి అవకాశాలు ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలో కొందరు అధికార పార్టీలకి ‘చెంచాలు’గా తయారై వారి అడుగులకు మడుగులు వత్తుతూ దిగజారి వ్యవహరించటం దారుణం. గతంలో పలు సందర్భాలలో సీనియర్ అధికారులుగా పనిచేసి రిటైరైన వారు ముఖ్యమంత్రుల నిర్ణయాలు సైతం సరైనవి కావని మార్చుకోమని సలహాలు ఇచ్చిన ఘటనలు తెలుగు ప్రజలకు తెలుసు. శక్తివంతమైన స్థానంలో ఉండి పాలకులు చేస్తున్నది తీవ్రమైన తప్పులు, నేరాలు అని తెలిసినా వాటికి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న తీరు అమానుషం. సాధారణ ప్రజలు, కూలీ, నాలి చేసుకుని బ్రతికే వారు ఇచ్చే పన్నుల నుంచి లక్షల రూపాయలు వెచ్చిస్తుంటేనే వీరు ఐఎఎస్ లుగా తయారు అవుతున్నారు. ప్రజలకు వీరు తిరిగి ఇస్తున్నది ఏమిటి? ఈ వాస్తవాన్ని ఇలాంటి అధికారులు విస్మరించి ప్రజా వ్యతిరేకులుగా మారిపోవడమే నేడు తీవ్ర విషాదం. వాస్తవంగా జవహర్ రెడ్డి టీటీడీ ఇఓ అయ్యేంతవరకు వివాదాలకు అతీతంగా ప్రజానుకూల అధికారి గానే కనబడ్డారు. 2021 వ సంవత్సరంలో టీటీడీ ఇఓ గా ఉన్న జవహర్ రెడ్డి …. అప్పటివరకు కరోనా తో అల్లాడిపోయిన జనం అప్పుడప్పుడే సాధారణ స్థితికి రావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వరదలు, భారీ వర్షాలు వచ్చి పడ్డాయి. ఊరంతా బురదమయం అయింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో తిరుమల కొండని పరిశుభ్రంగా, పచ్చదనంతో కాపాడుతున్న కాంట్రాక్టు కార్మికులు తమకు సాయం చేయమని కోరుతూ జవహర్ రెడ్డిని అర్థించారు.వస్తున్న జీతం సరిపోవటం లేదని ధరలు విపరీతంగా పెరిగాయని, కాంట్రాక్టర్ల వేధింపులు భరించలేకున్నామని తమకు సాయం చేయమని కోరుతూ బోరున విలపించారు.జవహర్ రెడ్డి కానీ, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం స్పందించలేదు.విధి లేని పరిస్థితుల్లో తిరుమల కొండ మీద పనిచేసే కార్మికులు 2021 అక్టోబర్ నెల చివరి నుంచి నవంబర్ వరకు 14 రోజులపాటు నిరంతరాయంగా వర్షంలో, బురదలో తడుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా ఐదు వేల మందికి పైగా కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా తమకు న్యాయం చేయమని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. వీరి పట్ల జవహర్ రెడ్డి ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారు.14 రోజుల తరువాత కనీసం వీరితో సంప్రదింపులు కూడా జరపకుండా, వారి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకుండా, పోలీసులను ఉసిగొల్పి, భారీ లాఠీచార్జి చేయించారు. కార్మిక నాయకులు, కార్మికులపై కేసులు బనాయించి పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఈ నిరసనకు నాయకత్వం వహించిన ఒక్కో కార్మికుడి పై రోజుకు ఒక కేసు చొప్పున 14 కేసులు పెట్టి, అదనంగా ‘టిటిడి పై కుట్ర’ చేశారని మరో కేసు పెట్టారు. నోరులేని కూలీలపై 15 కేసులు పెట్టి నేటికీ కోర్టుల చుట్టూ తిరగటానికి జవహర్ రెడ్డి కారకులయ్యారు.టీటీడీ అటవీ విభాగంలో 362 మంది కార్మికులు పనిచేస్తుంటే నాటి ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారని 162 మంది జూనియర్లను పర్మినెంట్ చేసి రెండు వందల మంది సీనియర్లకు ద్రోహం చేశారు. అప్పటికే వీరికి ఉన్న ‘టైం స్కేల్’ వేతనాలను కూడా తొలగించి ‘లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్’ లో కలిపి వేధింపులకు గురి చేశారు. ‘సిఐటియు’ ఆధ్వర్యంలో యూనియన్ కలిగి ఉండటమే వీరు చేసిన నేరం. 58 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో 38 నెలల పాటు ఈ రెండు వందల మంది కార్మికులు టిటిడి కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేశారంటే ఎంతటి తీవ్రమైన ద్రోహానికి జవహర్ రెడ్డి పాల్పడ్డారో అర్థం అవుతుంది. చివరకు టిటిడి ఛైర్మన్ గా భాధ్యతలు చేపట్టిన తరువాత కరుణాకర్ రెడ్డి జోక్యంతో వీరి సమస్య పరిష్కరించబడింది. అయినప్పటికీ వీరికి సంపూర్ణ న్యాయం నేటికీ జరగలేదు. ప్రస్తుతం ఈ సమస్య కోర్టుల్లో నలుగుతోంది. శక్తివంతమైన స్థానాల్లో ఉన్న ఐఏఎస్ లు జవహర్ రెడ్డిలా అయ్యా… ఎస్ లుగా మారకుండా, బంధుప్రీతిని చూపకుండా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది. జవహర్ రెడ్డి తనకున్న అధికారాలతో ఈ ఐదేళ్లలో చెలరేగిపోయారు. అనేక వివాదాలకు కేంద్రంగా మారారు. మన్యంలో కుమారుడు మైనింగ్ దందా చేయడానికి తోడ్పడ్డారని, విశాఖ భూముల స్కామ్ లో వీరి హస్తం ఉందని, జిఓ 596 కింద నిషేధిత భూముల జాబితా నుంచి నాలుగు లక్షల ఎకరాలు తొలగించి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టారని, ఎన్నికల సమయంలో అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించారని తీవ్రమైన ఆరోపణలను మూటగట్టుకున్నారు. అత్యంత అవమానకర రీతిలో ఆఖరికి నూతన ప్రభుత్వ పెద్దలు జవహర్ రెడ్డి మొహం కూడా చూడటానికి ఇష్టపడక, బలవంతంగా ఇంటికి పంపి, సెలవులోనే ఉంటూ ఈరోజు రిటైర్ అవుతున్న జవహర్ రెడ్డి … ఇక శేష జీవితాన్నయినా ప్రజానుకూలంగా మార్చుకోమని సలహా ఇవ్వటం తప్ప ఏం చేయగలం ….కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.
👉సెల్ ఫోన్ సిం రీఛార్జి పేరుతో 100 కోట్ల జనం జేబుకు చిల్లు..దేశంలో ఇప్పటికే అధిక ధరలతో అల్లాడుతోన్న ప్రజలపై తాజాగా మొబైల్ కంపెనీలు ఛార్జీల బాదుడును ప్రారంభించాయి. రిలయన్స్ జియో తమ వినియోగదారులపై 25 శాతం వరకు అదనపు భారం మోపగా…..అదే బాటలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకున్నాయి. దిగ్గజ మూడు టెల్కోల నిర్ణయాలతో దాదాపు 100 కోట్ల మంది వినియోగదారుల జేబులకు చిల్లు పడనుంది ..వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ధరల పెంపులో తొలి గిఫ్ట్ ఇదే కావడం గమనార్హం. దీనిపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం..
👉 చెన్నై:పలు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ.. నీట్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరిన స్టాలిన్.. ఢిల్లీ, హిమాచల్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, బెంగాల్, కేరళ సీఎంలకు స్టాలిన్ లేఖ.. తమిళనాడులో నీట్ మినహాయింపుపై ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్..
👉దళితున్ని హత్య చేసిన అనంతబాబుని ఆ కేసు నుంచి తప్పించడానికి కుట్ర చేసింది జగన్ ప్రభుత్వం!!! తిరుమల..ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి..విశాఖ శారదా పీఠం ఆక్రమణలను పరిశీలించిన ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం..తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు.. విశాఖ శారదా పీఠంలో ఒక్కరికి కూడా అన్నం పెట్టడం లేదు, పూజలు చేయడం లేదు..*4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తులు కట్టారు..5 వేల చ.గజాలకు అనుమతి ఇస్తే 10వేల చ.గజాల్లో అక్రమ కట్టడాలు కట్టారు..శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణం త్యాగాలకైనా సిద్ధం అన్నారు.
👉అంబేద్కర్ కోనసీమజిల్లా..అమలాపురం.. అమలాపురం 132/33 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ లో ప్రమాదం..ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు…ఉప్పలగుప్తం పీటర్ మెయింటెనెన్స్ వర్క నిమిత్తం ఎల్.సి తీసుకుంటున్న సమయంలో ప్రమాదం..ఎలక్ట్రికల్ ఏడిఈ..భగవాన్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బాధ్యత కార్మికులు చెప్తున్నారు..పూర్తిగా క్లియరెన్స్ తీసుకోకుండా జంపర్ కి ఎత్తలు వేయించడం వల్ల ప్రమాదం..పూర్తిగా కాలిన ఇద్దరు ఉద్యోగులను పట్టించుకోని ఏడిఇ భగవాన్.. తనకు ఈ విధమైన సంబంధం లేదంటున్నారు.. సంబంధిత అధికారి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదంటూ యూనియన్ నాయకులు ఆవేదన..ఏడిఈ భగవాన్ యూనియన్ నాయకులు కుటుంబ సభ్యులు అడగ్గా తనకు ఏ విధమైన సంబంధం లేదని. వాళ్లు కాంట్రాక్ట్ కార్మికులని .. వాళ్ల కాంట్రాక్టర్ అడగాలంటూ తప్పించుకున్నారు..దీనిపై యూనియన్ నాయకులు ఆందోళనకి సిద్ధమైనట్లు తెలుస్తుంది..న్యాయం జరిగే వరకు పోరాడుతామంటూ యూనియన్ సభ్యులు తెలిపారు..ప్రమాదాలు గురైన ఇద్దరు ఉద్యోగులను అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..విద్యుత్ సబ్స్టేషన్ లో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులకు సరేనా రక్షణ లేకుండా పోయిందంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారు…వెంటనే ప్రభుత్వం కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు…
👉 అమరావతి…జులై 1 నుంచి 3 వరకు కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. 1న గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ, పిఠాపురంలో జనసేన నేతలతో సమావేశం.. 2న కాకినాడ కలెక్టరేట్ లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష.. 2న సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశంకానున్న పవన్.. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్..
👉 ఎన్టీఆర్ భరోసా ఫించన్ పథకం కింద జులై 1వ తేదీన ఫించన్ లబ్దిదారులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేయాలని రాష్ట్రా సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్దుల సంక్షేమ, సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అధికారులను ఆదేశించారు.శనివారం ఉదయం కొండపి నియోజక వర్గ పరిధిలోని కొండపి మండల కేంద్రంలో గల గుడిపల్లి చందు కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కొండపి నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశానికి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్., వ్యవసాయ, పశు సంవర్ధక, విద్య, వైద్య ఆరోగ్య శాఖ,జల వనరులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్యుత్ తదితర శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల తీరుపై నియోజక వర్గ, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షనర్లు అందరికీ జులై మాసం నుంచి రు. 4 వేల రూపాయలు, గత ఏప్రిల్ నుండి మూడు మాసములకు ఒక్కొక్క వెయ్యి చొప్పున మొత్తం రు. 7 వేల రూపాయలు జులై 1వ తేదీన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగులు జులై 1వ తేదీన లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి 100 శాతం పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. అత్యంత పక్కాగా పెన్షన్ల పంపిణీ జరిగేలా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శనివారం రోజు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన నగదును బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలని, నగదును బ్యాంకుల నుంచి తీసుకెళ్లేటప్పుడు బందోబస్తు ఉండాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడైనా నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.👉రక్షిత మంచినీటి సరపరా పధకాల అమలుపై మంత్రి సమీక్షిస్తూ, ప్రస్తుత సీజన్లో డయేరియా, సీజనల్ వ్యాధులను దృష్టిలో వుంచుకొని నీటి సరపరా పధకాల వద్ద కచ్చితంగా బ్యాక్టీరియా ఇండెక్స్ ను పరిశీలించాలన్నారు. ముఖ్యంగా స్కూల్స్, వసతి గృహాలు రీ ఓపెన్ అయినందున సంబంధిత స్కూల్స్, వసతి గృహాల ఓవర్ హెడ్ ట్యాంక్ లను కచ్చితంగా క్లీన్ చేయడంతో పాటు ప్రతి నెలా బ్యాక్టీరియా ఇండెక్స్ రిపోర్ట్ ను పంపాలని మంత్రి, ఆర్.డబ్ల్యూ.ఎస్., విద్యా శాఖాధికారులను ఆదేశించారు. ప్రజల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ లో వున్న మంచి నీటి సరఫరా పధకాల పనులను త్వరితగతిన పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను ఆదేశించారు………… 👉వర్షాకాలం ప్రారంభమగుచున్నందున రైతాంగ అవసరాలను దృష్టిలో వుంచుకొని వారికి అవసరమైన విత్తనాలు,సలహాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని మంత్రి, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకొని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. డ్రాప్ అవుట్స్ లేకుండా, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాశాఖ పనిచేయాలన్నారు. బాలికా విద్య పై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు.మంత్రి ఇరిగేషన్ శాఖ పై సమీక్షిస్తూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గండ్లు పడిన మరియు బలహీన పడిన చెరువు కట్టలను గుర్తించి వాటికి తక్షణమే మరమ్మత్తులు చేపట్టేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే ఇరిగేషన్ కెనాల్స్ పూడికతీతపనుల పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో సైడ్ కాలువల పూడికతీతపనులపై పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ ను అందించాలని మంత్రి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ స్థంబాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ పార్మర్స్ మార్చవలసివుంటే వెంటనే మార్చాలని మంత్రి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 👉క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను అందించవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజా స్వామ్యయుతంగా పారదర్శకతతో,సీబాధ్యతతో ప్రజలకు సేవలందించాలని ఈ సందర్భంగా మంత్రి డా.బాల వీరాంజనేయులు, అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్.డి.ఓ లు సుబ్బారెడ్డి, జాన్ ఎర్విన్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, నియోజక వర్గ పరితిలోని కొండపి, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండ, మర్రిపూడి, పొన్నలూరు మండలాలకు సంబంధించి తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
👉పశ్చిమగోదావరి..,భీమవరం.పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాద్యతలు స్వీకరించిన సి. నాగరాణి , IAS ని మర్యాదపూర్వకంగా కలిసిన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్. అజిత, ఐపీఎస్..సాదారణ IAS ల బదిలీలలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలువురు IAS లను బదిలీ చేయగా పశ్చిమగోదావరి జిల్లా కు సి. నాగరాణి, IASని నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ ని జిల్లా ఎస్పీ కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపుర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సంధర్బంగా జిల్లాలో శాంతి భధ్రతలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురూ చర్చించడం జరిగింది.
👉చీమకుర్తి CI సస్పెండ్…. జనరల్ ఎలక్షన్ లో బాగంగా చీమకుర్తి కి వచ్చిన CI దుర్గాప్రసాద్ సస్పెండ్.*ఇటీవల చీమకుర్తి MRO ఆఫీస్ వద్ద భారీ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్ పై వచ్చి పలు సార్లు అనుమానాస్పదంగా బయట తిరుగుతు…పట్టణాలలో దొంగతనాలు చేస్తున్న పట్టించుకోకుండా అతని దగ్గర లంచం తీసుకొని వదిలేసాడు అనే అభియోగం పై సస్పెండ్.చేసారు ..
👉 ఒంగోలు. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తమిమ్ అన్సారీ యాని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలియజేసిన రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా శంషీర్ ఆలీ బేగ్ …
👉ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన ఆసుపత్రి నిర్మాణాలను పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని 50 పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలుగా అప్గ్రేట్ చేయవలసి ఉండగా 40 పడకల ఆసుపత్రిగా మార్చడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014,19 హయాంలో ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేట్ చేయడం కోసం చర్యలు తీసుకున్నామని అన్నారు.
👉వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు 40 పడకల ఆసుపత్రిగా గత ప్రభుత్వం ప్రారంభించడంపై ప్రశ్నించారు.ఆస్పత్రి నిర్మాణాలపై మరియు ఆస్పత్రి అప్గ్రేడ్ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు.అలానే ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు.అతి త్వరలో ఆసుపత్రి అభివృద్ధికై కమిటీ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మరియు వైద్య సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు.ఆసుపత్రిలో ఉన్న రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
👉దాతల సహకారం అభినందనీయం..కంభం: దాతల సహకారం అభినందనీయమనీ, విద్యాభివృద్ధికి గ్రామస్థుల చేయూత ఆవశ్యకమని లక్ష్మీకోట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వేణుగోపాలచారి పేర్కొన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీకోట ప్రాథమిక పాఠశాలలో దాత తాటికొండ.వెంకట్రావు సహకారంతో విద్యార్థులకు పలకలు, రాతపుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు దాతను అభినందిస్తూ దాతృత్వం విద్యార్థులకు ఉపయుక్తమేగాక స్పూర్తినిస్తుందన్నారు. సేవా సహకారాలపై ప్రాథమిక దశలోనే అవగాహన కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. వేణుగోపాలచారి, ఉపాధ్యాయిని అభిగైల్ పాల్గొన్నారు.