పార్లమెంటు స్పీకర్ పై అనుమానాలు.. పోలిస్ స్టేషన్లో బీజేపీ నేత జన్మదిన వేడుక!!!..ఎమర్జెన్సీపై మోదీపోరాడలేదు..సుబ్రమణ్యస్వామి:”టిడిపిలో చేరిన గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్!..”SMS ద్వారా మోసం:”స్మిషింగ్” ద్వారా ట్రాకింగ్!.. Lic కి మరో అరుదైన ఘనత..మన పాలమూరు వాసి SBI ఛైర్మన్ !.

👉పోలీస్ స్టేషన్లో బిజెపి నేత జన్మదిన వేడుకలు.. గుజరాత్ లో అలాగే ఉంటుంది బాస్ !!!..🤭

ఆయన పేరు హిమాన్షు చౌహాన్.అర్హత బీజేపీ నేత.రాష్ట్రం:గుజరాత్.. ..అంతకుమించి ఆయనకు ఏ అర్హతా ఆయనకు లేదు. అయితేనేం ఆయన జన్మదిన వేడుకలు పోలీసులు అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వేడుకలకు డీసీపీ కనన్ దేశాయి హాజరై ఇతర పోలీసుల సమక్షంలో కేక్ కట్‌చేసి చౌహాన్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ కేక్ తినిపించడం విశేషం. కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్లో నిర్వహించడం ఏంటని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ‘బీజేపీ కార్యాలయంగా మారిన పోలీస్ స్టేషన్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. అయితే అది బర్త్ డే సెలబ్రేషన్ కాదని, హిందూ-ముస్లిం ఐక్యతకు సంబంధించిన బ్లడ్ డొనేషన్ డే అని వివరణ ఇచ్చారు. అయితే వీడియోలో మాత్రం పోలీసులు అందరూ బీజేపీ నేత హిమాన్షుకు ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అని గట్టిగా చెప్పడం గమనార్హం. పోలీసులు గుజరాత్‌లోని బీజేపీ కార్యాలయంలో ఉద్యోగుల్లా మారిపోయారని కాంగ్రెస్ నేత అమిత్ చావ్లా విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*పార్లమెంటులో స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై పెద్ద ఆరోపణలు,

దేశం మొత్తంలో *UPSC NEET JEE* లాంటి పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థ *NTA* పై ఈ దేశ ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారా??గత పదేళ్లుగా ఎన్నో ఉద్యోగ నివాకాల్లో అవకతవకలు జరిగినట్టు కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి,*ఆగస్టు 2019లో ప్రచురించబడిన 2019 UPSC పరీక్షా ఫలితాలలో పాసైన అభ్యర్థుల అసలు జాబితాలో స్పీకరు ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా పేరు లేదు.*నాలుగు నెలల తర్వాత జనవరి 2020లో సీరియల్ నంబర్ 69 లేదా 67లో ఆమె పేరుతో ‘రిజర్వ్ లిస్ట్’ తీసి గ్రూప్ A సర్వీస్‌లో నియమించినట్టు తెలుస్తోంది*అంతకు ముందు మోడలింగ్ రంగంలో రావడానికి కష్టపడిన అంజలి బిర్లా మొదటి ప్రయత్నంలో UPSC పరీక్షలో నెగ్గుకు రావడం కూడా అనుమానాలకు దారి తీస్తున్నాయి..*UPSC పరీక్ష రాసే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఢిల్లీలో ఉండి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని మాత్రమే UPSC పరీక్షలో అధ్వత సాధించడానికి చాలా కష్టం అవుతుంది అలాంటిది ఎలాంటి కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే సాధించడం అసాధ్యం అన్న విషయాలు చర్చనీయం.

👉ఎమర్జెన్సీపైమోదీపోరాడలేదు..సుబ్రమణ్యస్వామి : ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ గురించి మోదీ మాట్లాడటంపై ఆయన స్పందించారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మోదీ పోరాడలేదు. ఆ సమయంలో ఆయన గుజరాత్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్నారు. బాబుభాయ్ నేతృత్వంలోని జనతా మోర్చా సర్కార్ గుజరాత్లో ఉన్న కారణంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు రాలేదు. ఇలాంటి అంశాల్లో క్రెడిట్ కొట్టేయాలనే ఓ చెడ్డ అలవాటు మోదీకి ఉంది’ అని సుబ్రహ్మణ్య స్వామి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ సంచలనం సృష్టిస్తున్న వేళ సుబ్రమణ్య స్వామి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘పార్లమెంటులో మెజారిటీ లేని ప్రభుత్వం ఉంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఎవరు గెలిచినా విద్యార్థుల కష్టాలు పట్టించుకోరు. పిల్లల జీవితాలతో ఆడుకోవడం, వారి కలలు నాశనం చేయడమే వారి పని’ అని సుబ్రమణ్య స్వామి తీవ్రంగా స్పందించారు.మోడీ కంటే ఇందిరాగాంధీయే బెటర్ వాజ్ పేయి మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసినా ఎక్కువ కాలం పాలించలేదు.నరేంద్ర మోడీకి ఇందిరాగాంధీకి ఒక విషయంలో పోలిక ఉంది. ఇద్దరూ ముమ్మారు ప్రధానులుగా దేశాన్ని పాలించారు.👉బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మోడీకి ఇందిరాగాంధీకి అసలు పోలిక ఎక్కడా లేనేలేదు అని విమర్శించారు.ఆయన తాజాగా ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టింగ్ రాజకీయ దుమారం రేపుతోంది.ఆనాడు ఎమర్జెన్సీకి ఎదురొడ్డి పోరాడింది మేము అని ఆయన అన్నారు. మమ్మల్ని భద్రతా చట్టం కింద ఇందిరాగాంధీ అరెస్ట్ చేసి పదిహేను నెలల పాటు జైల్లో ఉంచారు అని ఆయన చెప్పుకొచ్చారు.ఆనాడు ఇందిరిగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీకి తాను కన్వీనర్‌గా ఉన్నానని లాలూ గుర్తు చేసుకున్నారు.అయితే ఎమర్జెన్సీ సమయంలో సంఘపరివార్‌ చాలా సైలెంట్ గా ఉందని నళిన్‌ వర్మ అనే జర్నలిస్టు రాసిన కథనాన్ని కూడా లాలూ ఈ సందర్బంగా గుర్తు చేశారు.ఈ కథనాన్ని కూడా ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ విధంగా ఎమెర్జెన్సీ గురించి తెలియని బీజేపీ మంత్రులు అంతా ఈ రోజు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎమెర్జెన్సీ అని ఇందిరాగాంధీ పెట్టినా విపక్ష నేతలను గౌరవించారని ఆయన గుర్తు చేసుకున్నారు.అంతే కాదు మమ్మల్ని ఎవరినీ దేశ భక్తులు కాదని అనలేదని ఆయన బీజేపీ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు.అలా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సైతం గౌరవించే ఇందిరాగాంధీ ఒక వైపు ఉంటే ప్రతిపక్షాలను గొంతు నొక్కిన మోడీ ఆయన మంత్రి వర్గ సహచరులను 2024లో చూస్తున్నామని లాలూ అన్నారు. ఎమెర్జెన్సీ గురించి తెలియని వారు ఇపుడు మాట్లాడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. ఎమెర్జెన్సీ విధింపు ముమ్మాటికీ తప్పే అది ప్రజాస్వామ్యానికి మచ్చే అంత మాత్రం చేత దాని కంటే కూడా ఎక్కువ నిర్బంధాలను పెట్టే వారిని ఏమనాలని ఆయన బీజేపీ పాలకులను సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి మాట్లాడితే చాలు ఎమెర్జెన్సీ అని ఇందిరమ్మ పాలన మీద విమర్శలు చేస్తున్న మోడీ అండ్ టీం కి లాలూ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు.

👉 చెన్నై:పలు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ.. నీట్ రద్దుకు అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరిన స్టాలిన్..ఢిల్లీ, హిమాచల్, జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, బెంగాల్, కేరళ సీఎంలకు స్టాలిన్ లేఖ..తమిళనాడులో నీట్ మినహాయింపుపై ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్..

👉SMS ద్వారా మోసం: “స్మిషింగ్” ద్వారా ట్రాకింగ్!….SMS ఫిషింగ్ (స్మిషింగ్) అనేది బ్యాంకు ఖాతాదారులను మోసం చేయడానికి ఉపయోగించే ఒక కొత్త పద్ధతి. ఈ పద్ధతిలో, బ్యాంకు ఖాతాదారులకు తప్పుడు SMS సందేశాలు పంపబడతాయి, వాటి ద్వారా వారి వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకు ఖాతా వివరాలు దొంగిలించబడతాయి.మీరు మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు: బ్యాంకులు పంపే SMS సందేశాలకు, ప్రైవేటు వ్యక్తులు పంపే SMS సందేశాలకు మధ్య తేడాను గుర్తించండి. బ్యాంకులు పంపే SMS సందేశాలు సాధారణంగా ఒక నిర్దిష్ట షార్ట్‌కోడ్ నుండి పంపబడతాయి, అయితే ప్రైవేటు వ్యక్తుల నుండి వచ్చే SMS సందేశాలు వారి మొబైల్ నంబర్ నుండి పంపబడతాయి.*బ్యాంకులు పంపించే SMS సందేశాలు సాధారణంగా 6-అంకెల అంకెల కోడ్‌ను కలిగి ఉండవు, బదులుగా ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను కలిగి ఉంటాయి.* మీకు ఏదైనా SMS సందేశం గురించి అనుమానం ఉంటే, మీ బ్యాంకును నేరుగా సంప్రదించండి మరియు దాని గురించి వారిని అడగండి.* మీ బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు, ముఖ్యంగా SMS ద్వారా.* మీ బ్యాంకు ఖాతా లావాదేవీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే మీ బ్యాంకుకు నివేదించండి.స్మిషింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు ఈ క్రింది వనరులను సందర్శించవచ్చు:* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: https://www.rbi.org.in/* సైబర్‌క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/* ఆర్థిక నేరాల నివేదిక కేంద్రం:..మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. స్మిషింగ్ బాధితులైన చాలా మంది ఉన్నారు. మీరు బాధితులైతే, వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి మరియు పోలీసులకు ఫిర్యాదు చేయండి.

👉మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న LIC
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం LIC మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశీయంగా ఉన్న కార్పొరేట్ బ్రాండ్లలో అత్యంత విలువైన నాలుగో సంస్థగా అవతరించింది. కంపెనీ బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్లతో ఈ స్థానం దక్కించుకున్నదని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. AAA బ్రాండ్ రేటింగ్‌తో సంస్థకు 88 స్కోర్ సాధించినట్లు తెలిపింది. అలాగే టాప్-10 దేశీయ బ్రాండ్లలో మూడో స్థానంలో నిలిచింది.ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం…ప్రభుత్వ కార్లపై చట్ట పరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు…ప్రతి వాహనాలపై ప్రభుత్వ వాహనం, పోలీస్ అంటూ రాస్తున్నారు…ప్రభుత్వ వాహనం స్టిక్కర్ తొలగించేందుకు అధికారులకు సూచించారు…ప్రభుత్వం ఏర్పాటు చేసిన AP 18 పోలీస్ వాహనాల మినహా పోలీస్ అని రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు …5వ తేదీ లోపు ప్రభుత్వ వాహనం, పోలీసులు, స్టిక్కర్స్ సూచించారు.

👉టిడిపిలో చేరిన గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు..ప్రకాశం జిల్లా గిద్దలూరు.. గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టిడిపిలో చేరారు. వారిని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టిడిపి కండువాలు కప్పి సాదరగా ఆహ్వానించారు…

👉పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు..పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వారు అక్కడే ఉంటారు. రెండు రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని ఆమూలాగ్రం పరిశీలించేలా పర్యటన షెడ్యూల్‌ సిద్ధమైంది.

👉మన పాలమూరు వాసి SBI ఛైర్మన్ !.. SBI కొత్త ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని FSIB సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం SBI ఎండీగా ఉన్న ఆయన గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. ఆయన ఇంటర్ వరకు ఆలంపూర్, గద్వాలలో చదివారు. రాజేంద్రనగర్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన శెట్టి.. ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్గా 1988లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరడంతో గ్రేడ్. అయితే ఛైర్మన్ ఎన్నికపై కేంద్రానిదే తుది నిర్ణయం…

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త