అయోధ్య అతలాకుతలం!..ఆఫ్రికన్ దేశాలకు ఆంధ్రా బియ్యం.. మాట తప్పని చంద్రబాబు.. తాళాల ఆట ఆడుకుంటున్న”ఆ ముగ్గురు”..అవార్డు అందుకున్న గిద్దలూరు ఎస్సై.. నకిలీ విలేఖరి అరెస్టు కంభం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా బైసాని…

👉అయోధ్య అతలాకుతలం ! అయోధ్య రామాలయం కోసం రూ. 311 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రామ్‌పథ్’ కుంగిపోయింది.

చిన్న వర్షానికే అయోధ్య బాలరాముడి గర్భాలయంలోకి వర్షపునీళ్లు వచ్చిన విషయం మరిచిపోకముందే మరో వర్షానికి అయోధ్య అతలాకుతలం అయింది. ఇటీవల కురిసిన వర్షాలకు అయోధ్య దాదాపు నీట మునిగి పోయింది. అయోధ్య రామాలయం కోసం రూ. 311 కోట్ల వ్యయంతో నిర్మించిన ‘రామ్‌పథ్’ కుంగిపోయింది. రామమందిరానికి దారితీసే 14 కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు అర కిలోమీటరు దూరంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆలయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి. అయోధ్యధామ్ రైల్వే స్టేషన్‌లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహరీ కుప్పకూలింది. అయోధ్య వీధులు కాలువలను తలపిస్తున్నాయి. రామాలయానికి వెళ్లేందుకు భక్తులు నానా అవస్థలు పడ్డారు. మోకాలి లోతు నీరు, బురదలో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. రోడ్లు కుంగిపోయి, వీధులు అస్తవ్యస్తంగా మారడంతో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. అయోధ్యలో వర్ష భీభత్సం నేపథ్యంలో యోగి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరుగురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది. ఈ పనుల కోసం రోడ్లను దిగ్బంధించడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. పలు ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను వాన నీరు ముంచెత్తింది. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైందని, ఆలయ నిర్మాణానికి ముందు ఇలాంటి సమస్యలు ఎన్నడూ లేవని స్థానికులు చెబుతున్నారు.రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు పూర్తిచేయడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు.

👉ఆఫ్రికన్ దేశాలకు “ఆంధ్రా బియ్యం”..ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, పాలసీలపై పరిశీలన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే లిక్కర్ పాలసీ, ఇసుక విధానాలపై పరిశీలన జరుగుతుండగా.. తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా… ఏపీలోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలో విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎగుమతి చేసిందని అంటున్నారు! అవును… ఏపీలోని రేషన్ బియాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని.. కాకినాడ పోర్టును కూడా ద్వారంపూడి కుటుంబం కబ్జా చేసింద్ని.. ఈ మేరకు రేషన్ మాఫియా అక్రమాలపై సమగ్ర నివేదిక తయారుచేసి ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీంతో… ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా కాకినాడ జిల్లాలో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు మంత్రి నాదేండ్ల మనోహర్. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. మొత్తం ఎనిమిది గోదాముల్లో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ఉన్నట్లు ఆధారాలతో సహా దొరికాయని.. ఈ క్రమంలోనే సుమారు 12,915 టన్నుల బియ్యం నిల్వలను సీజ్ చేశామని మంత్రి వెల్లడింఆరు. ఈ సందర్భంగా గోడౌన్స్ లో ఎవరు ఏ స్టాక్ నిల్వ చేశారో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నిస్తే కొంతమంది తమిళనాడు పౌరసరఫరాల శాఖకు, ఇతర ప్రాంతాలకూ పంపుతున్నట్లు చెబుతున్నారని.. పీడీఎస్ బియ్యం దారిమళ్లించినట్లు తేలిందని.. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని, నూటికీ నూరుశాతం క్రిమినల్ కేసులు పెడతామని అన్నారు. అసలు కాకినాడ పోర్టులో సొంతంగా నౌక ఏర్పాటు చేసుకునే స్థాయికి అక్రమార్కులు ఎదిగారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని.. ఆఫ్రికన్ దేశాలకు ఎంత బియ్యం ఎగుమతి చేశారో గ్రహించొచ్చని మంత్రి తెలిపారు.

👉ప్రధానిపై సోనియాగాంధీ విమర్శలు..ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వ్యక్తిగత, రాజకీయ, నైతిక పరాజయాన్ని సూచించినప్పటికీ.. అసలేం జరగనట్లుగానే ప్రధాని వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని, లోక్‌సభ స్పీకర్, బీజేపీ నేతలు ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించడాన్ని.. రాజ్యాంగంపై దాడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించే యత్నంగా పేర్కొన్నారు.

👉ఖ‌జానా ఖాళీ అయినా…ఇచ్చిన మాట త‌ప్ప‌లేదు* రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ధ‌న్య‌వాదాలు  జులై 1వ‌తేదీ 65 ల‌క్ష‌ల మంది ఫించ‌న్లు పంపిణీ- రాష్ట్ర‌మంతా ఫించ‌న్ల పండుగ – ఫించ‌న్ల పంపిణీ కోసం 8వేల మంది ఉద్యోగులు సిద్ధం- అన్నీ ఏర్పాట్లు పూర్తి- పాల‌న చేత‌కాని జ‌గ‌న్‌ ..అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం- గాడిలో పెట్టే స‌త్తా ఒక్క చంద్ర‌బాబుకే ఉంది..*రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌..ఫించ‌న్ల పంపిణీపై నెల్లూరు కార్పొరేష‌న్లో… అధికారుల‌తో తొలి సారి స‌మీక్షించిన నారాయ‌ణ‌, ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ ..రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయిపోయినా…ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తున్న ఏకైక నాయ‌కుడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌శంసించారు. జులై 1వ‌తేదీ ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంపై… నెల్లూరు న‌గ‌రంలోని కార్పొరేష‌న్ కార్యాల‌యంలో… అధికారుల‌తో… నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి నారాయ‌ణ స‌మీక్షించారు. ఫించ‌న్ల పంపిణీ ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా… కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని…అధికారుల‌కి నారాయ‌ణ సూచించారు. ఈ సంద‌ర్భండా మంత్రి డాక్ట‌ర్ నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ… ఎన్నిక‌లకు ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు 3వేల ఫించ‌నుని రూ. 4వేలు…అలాగే దివ్యాంగుల‌కి 3వేలు నుంచి 6వేలు చేస్తామ‌ని…హామీ ఇచ్చార‌న్నారు. సీఎం అయిన త‌రువాత దానిపైనే మొద‌టి సంత‌కం చేశార‌ని…కేబినెట్‌లో కూడా దీనిని ఆమోదించార‌న్నారు. దానిని జులై 1వ‌తేదీన ల‌బ్ధిదారులంద‌రికి ఫించ‌ను ఇవ్వాల‌ని ఆదేశించార‌న్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించి అన్నీ జిల్లాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశార‌న్నారు. నెల్లూరు జిల్లాలో కూడా పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశార‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఈ కార్య‌క్ర‌మంపైన నేను, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిలు క‌లిసి కార్పొరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షించామ‌న్నారు. ఫించ‌న్ల కోసం సుమారు 8వేల మంది ఉద్యోగుల్ని నియ‌మించామ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్…ఫించ‌న్ల‌ను వాలంటీర్లు పంపిణీ చేయ కూడ‌ద‌ని ఆదేశిస్తే…దానిని కూడా టీడీపీ చేయించింద‌ని ఆరోపించార‌న్నారు. ఫించ‌న్లు పంపిణీ చేసేందుకు సెక్ర‌టేరియ‌ట్‌ ఉంద‌ని…చాలా మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఉన్నార‌ని వారి చేత ఇప్పించ‌మ‌ని తెలిపార‌న్నారు. దానిని వైసీపీ ప్ర‌భుత్వం పాటించ‌క‌పోవ‌డంతో ఎంతో మంది ల‌బ్ధిదారులు చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ రేపు సెక్రటేరియ‌ట్ ఎంప్లాయిస్‌, మిగ‌తా ఎంప్లాయిస్ అంద‌రూ క‌లిసి ఒకే రోజు ఫించ‌న్లు పంపిణీ పూర్తి చేయాల‌ని…కానీ ప‌క్షంలో రెండో రోజు లోపే పూర్తి చేయాల‌న్నారు. దీని కోసం అధికారులంద‌రూ చ‌క్క‌గా ఏర్పాట్లు పూర్తి చేశార‌ని…ఇందుకు అధికారులంద‌రిని ఆయ‌న అభినందించారు. రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయిపోయినా…ఎన్నో ఇబ్బందులు ఉన్నా…ఇచ్చిన మాట ప్ర‌కారం…అవ్వా తాత‌లు, దివ్యాంగుల ల‌బ్ధిదారులంద‌రికి ఫించ‌న్లు అంద‌చేస్తున్నార‌న్నారు. ఇందుకు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని చెప్పారు. 2019లో నేను మంత్రిగా ఉన్న‌ప్పుడు రూ. 5300 కోట్ల‌తో కొన్ని ప్రాజెక్టుల‌ను తీసుకువ‌చ్చాన‌న్నారు. కానీ గ‌త ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం ఆ ప్రాజెక్టుల‌న్నీ ప‌క్క‌న పెట్టేసింద‌న్నారు. అవ‌న్నీ పూర్త‌యి ఉంటే… రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేద‌న్నారు. అయితే వైసీపీ ప్ర‌భుత్వం కేవ‌లం రూ. 240 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర‌రాష్ట్రంలో ఆర్ధిక ప‌రిస్థితి అధ్వానంగా ఉంద‌న్నారు. రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే…ముఖ్యంగా ఆదాయం పెర‌గాల‌ని…ప‌రిశ్ర‌మ‌లు రావాల‌ని…రియ‌ల్ ఎస్టేట్ పెర‌గాల‌ని…ఇలాంటి ఆలోచ‌ల్ని జ‌గ‌న్ చేయ‌లేద‌న్నారు. అనంత‌రం ఎంపీ వేమిరెడ్డితోపాటు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్ తోపాటు…కార్పొరేష‌న్ అధికారులు, టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

👉 వైసీపీ ఎంపీ హౌస్ అరెస్ట్..వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హౌస్అరెస్ట్ అయ్యారు. ఈరోజు చిత్తూరు జిల్లా పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు మిథున్ రెడ్డి సిద్ధమయ్యారు.ఈ పర్యటనకు మిథున్ రెడ్డి వెళ్తే గొడవలుజరిగే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో ఆయనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మిథున్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

👉వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కు కేటాయించాలి’ ..వైసీపీ కార్యాలయాలను ప్రజల అవసరాల కోసం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల్లేకుండా రూ. కోట్ల ఖర్చు చేసి కార్యాలయాలను నిర్మించించారని దుయ్యబట్టారు.

👉 రోజా సెల్వమణి ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ఉన్నప్పుడు ఒకే లెటర్ పై 20మందికి దర్శనాలు.కనీసం 20 మంది పేర్లు కూడా రాయలేదు. అయినా అధర్మారెడ్డి వివిఐపి బ్రేకులు సాంక్షన్ చేస్తాడు. అదే మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని మనకున్న రికమండేషన్తో పట్టుకొని సక్రమంగా పేర్లతో ఆధార్ నంబర్లతో పెట్టిన లెటర్ కి యాక్సెప్ట్ చేయడానికి అన్ని అర్హతలున్నా రిజెక్ట్ చేసేవాడు.ఎందుకంటే వాడికి ముడుపులు చెల్లించము కదా?అందుకే చాలా మంది దేవుడికి చెల్లించాల్సిన ముడుపులు వాడికే చెల్లించారు. అదంతా వాడు తిరిగి ఆ దేవదేవుడికి చెల్లించినా పాప పరిహారం కాదు.

👉అర్జునుడి పాశుపతాస్రానికి ఎంతటి శక్తీ ఉందో, మనం మాట్లేడే మాటకి అంతే శక్తీ ఉంటుంది. ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నా, అధం పాతాళానికి పడిపోవాలన్నా మాటే ప్రధాన ఆదాయ వనరు. అందుకే అంటారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రతగా మాట్లాడాలని..మాట అదుపు తప్పితే ఏం జరుగుతుందో గతంలో చాలా సార్లు చాలా మంది నిరూపించారు. తాజాగా ఇంకో ముగ్గురు నిరూపిస్తున్నారు.పోసాని కృష్ణ మురళి ,అలీ ,యాంకర్ శ్యామల ఈ ముగ్గురు కూడా తెలుగు సినిమా బిడ్డలని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగానే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని బతుకుతున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇంటి లోపలే ఉండి. బయట తాళాలు వేసుకుంటున్నారు. కనీసం పాల వాళ్ళు వచ్చి పిలిచినా తలుపు తియ్యటం లేదు. అలీ అయితే ఏటో వెళ్లిపోయాడనే వార్తలు వస్తున్నాయి.ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు నట్టి కుమార్ ఈ విషయాన్నీ వెల్లడించాడు.ఇక అదంతా ఆ ముగ్గురు కావాలని చేసుకుందే. ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కి వకాల్తా పుచ్చుకొని టిడిపి,జనసేన అధినేతలైన చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ని నానా దుర్భాషలు ఆడారు. సభ్యసమాజం మొత్తం ఆ ముగ్గురు మాట్లాడిన మాటలకి తలదించుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన అధికారంలోకి రావడంతో భయంతో తాళాల ఆట ఆడుకుంటూ కర్మ అనుభవిస్తున్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో నట్టి కుమార్ మాట్లాడుతు ప్రజలే మీకు గుణపాఠం చెప్పారు. కాబట్టి మా గవర్నమెంట్ ఏమి చెయ్యదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు జగన్ కూడా సపోర్ట్ గా రాడు. ఎందుకంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులని డబ్బిచ్చిన జగన్ కి బాగా తెలుసనీ చెప్పాడు.

👉అవార్డు అందుకున్న S I తోట  వెంకటేశ్వరరావు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించి విధి నిర్వహణలో తనదైన శైలిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసినందుకు జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ చేతుల మీదుగా ఎస్సై తోట వెంకటేశ్వరరావు ప్రశంసా పత్రం అందుకున్నారు.

👉గిద్దలూరు తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా వైపి రంగయ్య ఎన్నిక*ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గిద్దలూరు తాలూకా యూనిట్ అధ్యక్షులుగా వైపి రంగయ్య కార్యదర్శిగా సంధాని జానీ భాషా సహా అధ్యక్షులుగా విజయభాస్కర్ రెడ్డి కోశాధికారిగా రానా ప్రతాప్ మరియు మిగిలిన 17 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ ఆఫీసర్ గా ఎస్వీ రమణారెడ్డి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఏపీ రంగారెడ్డి మరియు అబ్జర్వర్ గా సయ్యద్ మసుద్ అలీ వ్యవహరించారు.ఈ సందర్భంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి మరియు కార్యదర్శి వరకుమార్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ అభినందనలు తెలియజేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో పింఛనుదారుల అధ్యక్షులు జి రవీంద్రనాథ్ రెడ్డి మరియు మెడికల్ సూపర్నెంట్ ఆదాం సాహెబ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో మూడు మండలాలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు అనంతరం ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు అశోక్ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించినారు.

👉లయన్స్ క్లబ్, కంభం నూతన అధ్యక్షుడిగా డా. బైసాని రామకృష్ణ.

కంభం లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లయన్ డాక్టర్ బైసాని రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఆయన ప్రస్తుతం ఎల్.కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా సేవలందిస్తున్నారు.లయన్స్ ఇంటర్నేషనల్ రాజ్యాంగం ప్రకారం 2024-25 లయన్ స్టిక్ సంవత్సరానికి గాను జులై 1వ తేదీ నుండి అధ్యక్షునిగా బైసాని రామకృష్ణతో పాటు నూతన కార్యవర్గంలో కార్యదర్శిగా పేర్లి గుండయ్య, కోశాధికారిగా సిరిగిరి వెంకట్రావులను ఎన్నుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం సామాజిక స్పృహతో పలు సేవా కార్యక్రమాలతో రాణించిన కంభం లయన్స్ క్లబ్, రాబోవు కార్యవర్గం ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్ళగలదని ఆశాభావం వ్యక్తం చేసిన లయన్స్ పెద్దలు డా. బైసాని రామకృష్ణ బృందాన్ని అభినందించారు.

👉గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవనిగడ్డ డిపో RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, దాడిచేసిన కేసులో నకిలీ విలేఖరి అరెస్ట్.మోపిదేవి మండలం, ఉత్తర చిరువోలు గ్రామానికి చెందిన సిరివెళ్ళ రాకేష్ అనే అతను అవనిగడ్డ RTC డిపో లో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు ది.28.06.2024 వ తేదీన సాయంత్రం అవనిగడ్డ నుండి గుడివాడ వస్తుండగా సుమారు 6.25 గంటల సమయంలో బస్ గుడివాడ అతిది హోటల్ దగ్గరికి వచ్చేసరికి, తన బస్ ముందుకు వెళ్లకుండా గుడివాడ కి చెందిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ అనే అతను తన కారుని రోడ్డుకి అడ్డం పెట్టినట్లు, కారు పోనివ్వమని RTC డ్రైవర్ హారన్ కొట్టగా, కారు తీయకపోయే సరికి బస్ డ్రైవర్ మళ్ళీ హారన్ కొట్టగా, కారు డ్రైవర్ బాగా మధ్యం సేవించి వుండి RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, చేతుల్తో దాడి చేసి విధులకు ఆటంక పరిచినట్లు, తదుపరి మళ్ళీ బస్ తో సహా బస్ స్టాండ్ కి వెళ్ళిన RTC డ్రైవర్ ని ముందుగా అతిది హోటల్ దగ్గర దాడిచేసిన వ్యక్తి మరొక వ్యక్తి వ్యక్తితో కలసి దుర్భాషలాడి, దాడి చేసినట్లు, RTC డ్రైవర్ పై దాడిచేసిన సమయంలో ఇద్దరు వ్యక్తులలో రెండో వ్యక్తి తాను విలేఖరి అని చెప్పినట్లుగా, RTC డ్రైవర్ సిరివెళ్ళ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడ II టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిన తదుపరి, గుడివాడ II టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన M.నాగ దుర్గారావు గారి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ పి.నాగరాజు గారు RTC డ్రైవర్ ని బస్ ని దుర్భాషలాడి, దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను బేతవోలు కు చెందిన పంచకర్ల శ్రీనివాస్ @ వాసు, ముభారక్ సెంటర్ కి చెందిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ గా గుర్తించడమైనది. విలేఖరి అని చెప్పిన పంచకర్ల శ్రీనివాస్ @ వాసు ను క్షుణ్ణంగా విచారించగా అతనికి ఏవిధమైన దినపత్రికలో గానీ, ఎలక్టానిక్ మీడియాలో అక్రిడిటేషన్ లేకుండా విలేఖరి అని చెప్పుకుని చెలామణి అవుతున్నట్లుగా నిర్ధారణ అయింది. సదరు పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ ని ఈరోజు అనగా ది.30.06.2024 వ తేదీ ఉదయం RTC డ్రైవర్ ని దుర్భాషలాడి, తన విధులకు ఆటంకపరిచి, దాడిచేసిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవనీయులైన జుడీషియల్ ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్, గుడివాడ వారి కోర్టుకు పంపడమైనది. ఇదే కేసులో మరొక ముద్దాయి అయిన పట్టపు శివ వెంకట నాగేంద్ర @ శివ పరారీలో వున్నాడు అతని గురించి పోలీస్ టీం పంపడం జరిగింది.

👉 ప్రకాశంజిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లి సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.కారు ద్విచక్ర వాహనం ఢీ, ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి. మృతుడు బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు గురవయ్య(60)గా పోలీసులు గుర్తింపు.

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం