👉లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్‌గాంధీ తొలి ప్రసంగం.. రాజ్యాంగానికి మేం రక్షణగా నిలబడతాం.. విపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో వేధిస్తున్నారు.. ఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నా.. అధికారం కంటే నిజం గొప్పది.. ప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నా-రాహుల్ గాంధీ
రాజ్యాంగంపై దాడి జరుగుతోంది-రాహుల్‌గాంధీ
ఇండి కూటమి నేతలను ఈడీ, సీబీఐ వేధిస్తోంది
తప్పుడు కేసులతో విపక్ష నేతలను జైల్లో పెడుతున్నారు
రాజ్యాంగాన్ని రక్షించేందుకు మేము పోరాడుతున్నాం
శివుడి ఫొటో, రాజ్యాంగాన్ని చూపిస్తే తప్పవుతుందా
శివుడి నుంచి నేను ప్రేరణ పొందా-రాహుల్‌గాంధీ
నా ఎంపీ పదవి, ఇంటిని కూడా లాక్కున్నారు
విపక్షంలో ఉన్నందుకు గర్వపడుతున్నాం
👉గుజరాత్‌లో బీజేపీని ఓడిస్తాం: రాహుల్ గాంధీ..పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. మణిపూర్ పరిస్థితిపై, నీట్ పరీక్షపై, రైతుల సమస్యలపై మోదీ సర్కారును విమర్శించారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న, మధ్యతరగతి పరిశ్రమలే వేధిస్తున్నాయని ఫైర్ అయ్యారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కార్ పని చేస్తోందని ధ్వజమెత్తారు.
👉ఈనెల 4న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకానున్నారు.కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వస్తే ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై ఏపీ ప్రభు త్వం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రతిపా దనలు కేంద్రం ముందు ఉంచేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు విభజన హామీల పైనా కేంద్ర పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చించను న్నట్టు సమాచారం. మోదీ ప్రమాణస్వీకారం తరువాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.దీంతో ఆయన టూర్‌పై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువ డనుంది, ఎన్ని నిధులు వస్తాయన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.
👉పిఠాపురం..అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకున్నాం,ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇంత తక్కువ సమయంలో 4 వేల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం కారణం :పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
👉వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగాయా?: పవన్ కళ్యాణ్ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని YCP నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘ఇవాళ వాలంటీర్లు లేరు. పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షన్ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి, రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తాం’ అని పిఠాపురం సభలో వ్యాఖ్యా నించారు.
👉ప్రత్యేక హోదా ఎక్కడ? : షర్మిల!..ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
👉*కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి FIR నమోదు అయ్యింది.దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 👉ఈ చట్టాల కింద తొలి FIR ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.
👉 మూడున్నర కేజీల గంజాయి పట్టివేత..మంగళగిరి ఎయిమ్స్ రోడ్లో ఓ యువకుని వద్ద మూడున్నర కేజీల గంజాయిని మంగళగిరి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు.
👉ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు:ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి*👉ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సోమవారం ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగల నిర్వహించారు.ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు.గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్,మే,జూన్ నెలలకు1,000 రూపాయల చొప్పున పెరిగిన పెన్షన్ 4,000 రూపాయలతో కలిపి 7 వేల రూపాయలు పెన్షన్ ముత్తుముల అశోక్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ…ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పెన్షన్ తో పాటు ఇంటికె పెన్షన్లు అందించామన్నారు.అలానే పెరిగిన పెన్షన్ల వివరాలు వెల్లడించారు.ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అశోక్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.పెన్షన్ తీసుకునే పెన్షన్ దారులు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లతో చాలా ఆనందంగా ఉన్నారని మేము ఎంతో గౌరవంగా జీవిస్తామని పెన్షన్ దారులు చెబుతున్నట్లుగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు.
👉ఇది ప్రజా ప్రభుత్వమని రానున్న రోజుల్లో 18 సంవత్సరాల దాటిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, సంవత్సరానికి మూడు సిలిండర్లు, తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 వేల రూపాయలు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 20వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేపట్టబోతున్నారని అన్నారు. పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ చార్జ్ బెల్లంకొండ సాయిబాబు, బిజెపి నాయకులు జే.వీ నారాయణ, అప్పిశెట్టి ఉదయ శంకర్ పాలాభిషేకం చేశారు.
👉 రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం..
నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి, యువజన ఐక్య కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించడంతో రాజ్‌భవన్ ముట్టడికి నేతలు బయలు దేరారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీపుల్స్ ప్లాజా నుంచి రాజభవన్ వరకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు.
👉 తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- తుడా ఛైర్మన్ గా జనసేనా పార్టీ నాయకురాలు చైతన్య ఆదికేశవులు పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గానూ జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో శ్రీమతి చైతన్య ఆదికేశవులు పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి తుడా ఛైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయానా ఆదికేశవులు నాయుడు మనుమరాలైన శ్రీమతి చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్రనాయకులు మొగ్గుచూపుతున్నారు.
మాచర్ల : పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. సచివాలయ ఉద్యోగి సస్పెండ్..
ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. మాట ఇచ్చిన ప్రకారం బకాయిలతో కలిపి పెంచిన పెన్షన్ అందజేస్తున్న చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు లబ్ధిదారులు. అయితే పెన్షన్ల పంపిణీ విషయంలో సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే వెంటనే వేటు పడుతుందని ప్రభుత్వం ప్రత్యక్ష వార్నింగ్ ఇచ్చింది.
ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఓ ఉద్యోగి బుద్ధి మారలేదు. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ.. వృద్ధుల దగ్గర నుంచి 500 చొప్పున వసూలు చేశాడు. ఇప్పుడా విషయం బయటపడడంతో చివరికి సస్పెన్షన్‌కి గురయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిందీ ఘటన. ఓ సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడని ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు. బాలునాయక్‌పై బాధితులు ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేసినట్టు చెప్పారు మున్సిపల్ కమిషనర్. మాచర్లలోని 9వ వార్డు సచివాలయంలో ఈ ఘటన జరిగింది. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడవత్ బాలు నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నారు.
👉పిఠాపురం..అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకున్నాం,ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇంత తక్కువ సమయంలో 4 వేల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం కారణం :పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
👉 కొత్త చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఎస్సై. కొనకనమిట్ల మండలంలోని చింతకుంట గ్రామంలో మండల ఎస్సై మాధవరావు గ్రామంలోని ప్రజలకు కొత్త చట్టం గురించి తెలియజేశారు
👉 అత్తను హత్య చేసిన అల్లుడు..మార్కాపురం మండలం వేములకోట అత్తను హత్య చేసిన అల్లుడు.రాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి హత్య చేసిన నిందితుడు శ్రీను.గతంలో భార్యను చంపిన కేసులో ఇతనే నిందితుడు.
👉కొత్త చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్ఐ నరసింహారావు..
ప్రకాశం జిల్లా బెస్తవారపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు జూలై 1 నుంచి మార్పులు చేసుకున్న కొత్త చట్టాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించి చెప్పారు. ఎటువంటి నేరాలు చేస్తే నేరాలు చేసిన వారికి ఎటువంటి శిక్షలు పడతాయో విద్యార్థులకు ఎస్ఐ నరసింహారావు వివరించి చెప్పారు. విద్యార్థులు చక్కటి నడవడిక కలిగి ఉండాలని బాగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.