👉చట్టాలు ఉల్లంఘన చేస్తే సహించేది లేదు….మంత్రికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు*
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవుల్లో ఉన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన రవాణా శాఖా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి భార్య వివాదంలో చిక్కుకున్నారు.మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు.
ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదురు మంత్రికి సీఎం ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
👉 సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సీబీఐకి తాజాగా నోటీసులిచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్ వేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను జులై 17కు వాయిదా వేసింది. కాగా, గతేడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.
👉 ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: అఖిలేశ్ యాదవ్..NDA ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది: అఖిలేశ్ యాదవ్ ఎన్డీయే ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో నైతిక విజయం భారత కూటమిదే.. ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలు ఓడిపోయాయి.. బీజేపీ 400 సీట్ల ఎజెండా విఫలమైంది.. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం ఇష్టం లేదు.. అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. ఇప్పటికీ నమ్మడం లేదు. ఈవీఎంలను తొలగించే వరకు మా పోరాటం ఆగదని లోక్‌సభలో అన్నారు.
👉లోకేశ్‌కు క్యాబ్ డ్రైవర్ల వినతి.. మంత్రి లోకేశ్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న APక్యాబ్ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్‌ట్యాక్స్ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 6న జరగనున్న ఇరురాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
👉 యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నగర పోలీసు కమిషనర్.దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ..తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేసిన భీమవరంకు చెందిన శివ కుమారి ..యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్..విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్న స్పెషల్ టీం.
👉ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగనున్నాయి. YSRకి ఘనంగా నివాళులు అర్పించడానికి, ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలు, ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు,ప్రముఖులు రానున్నారు.ఇందులో భాగంగానే ఇవ్వాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క lని, ఇతర క్యాబినెట్ మంత్రులను కలిసి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి ఆహ్వానాలు అందించడం జరిగింది.
అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో YSRకి అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇతర పార్టీ నాయకులను సైతం 75 వ జయంతి వేడుకలకు ఆహ్వానించనున్నట్లు వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై, మహానేత జ్ఞాపకాలను స్మరించుకోవాలని, అలాగే అయన బిడ్డగా, అయన అహర్నిశలూ ప్రేమించి, శ్రమించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ వేడుకలు జరిపించే అవకాశం రావటం తనకు గొప్ప వరం, అని వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు.
👉అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందించిన మానవత మరియు చిన్ననాటి స్నేహితుల బృందం..
పొదిలి నగర పంచాయితీ లోని నవాబ్ మిట్ట లో స్వర్గస్తులైన షేక్ అర్షియా భాతిక కాయన్ని సందర్శించిన మానవతా స్వచ్చంద సేవా సంస్థ మరియు చిన్ననాటి స్నేహతుల బృందం.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రఘడ సానుభూతి ని తెలిపి అంత్యక్రియలకు మానవత సంస్థ తరపున 5000 రూపాయలు,చిన్ననాటి స్నేహతుల టీమ్ తరపున 6000 కలిపి మొత్తం 11000 వేల రూపాయలను ఆర్ధిక సహాయంగా అందించారు.ఈ కార్యక్రమంలో మానవత సంస్థ డైరెక్టర్ కాటూరి పెదబాబు,కన్వీనర్ కె. యల్ల మంద రెడ్డి,తానికొండ వెంకట్రావు,సామంతపూడి నాగేశ్వరారావు,షేక్ బాజీ కరీముల్లా,షేక్ మహమ్మద్ రఫీ,షేక్ రసూల్ మహమ్మద్,షేక్ యాసిన్, షేక్ యస్ధన్(రోటి),డాక్టర్ నారాయణ,అశోక్ బండి తదితరులు పాల్గొన్నారు.
👉 కొమరోలు మండలం కొమరోలు గ్రామపంచాయతీలో స్వచ్ఛభారత్ ఉద్యోగస్తులకు గత మూడు సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో ఆ గ్రామపంచాయతీలోని స్వచ్ఛభారత్ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించారు.మా బకాయిలు ఇచ్చేంతవరకు మేము విధులకు హాజరు కామని వారు ఆందోళన వ్యక్తం చేసి ధర్నా చేస్తున్నారు
👉. మార్కాపురం పట్టణం.. జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి..మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను ,వెలుగొండ ప్రాజెక్ట్ గురించి కలెక్టర్ తో చర్చించారు.శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవడం జరిగిందని నియోజకవర్గంలోని మార్కాపురం పట్టణ, పొదిలి పట్టణ,మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ,పశువులకు మంచినీరు అందటం లేదని కలెక్టర్ కి తెలియజేశారు. గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును మూలన పడేసింది అని ప్రాజెక్టులో భాగమైన డ్యాం లకు కొంత నీటితో నింపే అవకాశం ఉన్న గత ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోలేదని మొదటిగా డ్యాముల్లో కనీసం ఐదు టీఎంసీల నీటిని నింపాలని కలెక్టర్ కి విన్నవించామని, ముంపు నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరానని దానికి గౌరవ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పాల్గొన్నారు.
👉కీచక ఉపాధ్యాయుడికి బడితిపూజ మగ పిల్లలతో లైంగిక వేధింపులు*
పల్నాడు జిల్లా కారంపూడి మండలం లోని పెద్ద కొదమ గుండ్ల పెద్ద హై స్కూల్ నందు ( సోషల్ ) సాంఘిక శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విద్యార్థుల (మగ పిల్లలు) పట్ల అసభ్య ప్రవర్తన (సెక్స్ వేధింపులు) విద్యార్థులు తల్లిదండ్రులచే బడిత పూజ దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పూర్తి ?
👉 మచిలీపట్నంలో నాలుగేళ్ల బాలిక అదృశ్యం.
*మచిలీపట్నం భాస్కర్ పురం లోని శ్రీ చైతన్య ప్లే స్కూల్లో చదువుతున్న చిన్నారి.మధ్యాహ్నం నాలుగు గంటల నుండి కనిపించకుండా పోయిన చిన్నారి. తప్పి పోయిందని కొందరు… కిడ్నాప్ జరిగి ఉంటుందని మరి కొందరు గుసగుసలాడుతుండడంతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఆచూకీ కనుగొనాలని కోరుతున్న పిల్లల తల్లిదండ్రులు.
*చిన్నారి తల్లి అదే స్కూల్లో టీచర్గా పని చేస్తున్నట్లు సమాచారం.*చిన్నారి కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న తల్లి… దిక్కు తోచని స్థితిలో దిక్కులు చూస్తున్న తండ్రి.వివరాలు తెలియాల్సి ఉంది.
👉: *చామంతి పువ్వా సాంగ్ ఇంత పని చేస్తుందని అనుకోలా…కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ ఐ*ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్(వీఆర్)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది.
👉 విద్యుత్ ప్రమాదానికి గురైన జూనియర్ లైన్మెన్ సురేష్ నాయక్ సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కర్నూల్ వైద్యశాలలో మృతి చెందాడు రాచర్ల మండలం అనుముల వీడు సచివాలయ జూనియర్ లైన్మెన్ గా పనిచేస్తున్న సురేష్ నాయక్ గత నెల 19వ తేదీ విద్యుత్ షాక్ కు గురైన సంగతి తెలిసింది 19వ తేదీ నుండి ఒకటో తేదీ వరకు మృత్యువుతో పోరాడిన సురేష్ నాయక్ ఒకటో తేదీ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు..
👉ఆర్మీ జవానుకు నివాళులు అర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..రాచర్ల మండలం, కాల్వపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లడ్హఖ్ లోని ఎల్.ఎ.సి సమీపంలో నదిని దాటుతున్న సమయంలో యుద్ధట్యాంక్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన “జె.సి.ఓ ముత్తుముల రామకృష్ణ రెడ్డి (47) మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ,వారి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, మాజీ సైనికులు,గ్రామ ప్రజలు పాల్గోన్నారు.*
👉 *పరువు కోసం పోయి నెత్తి మీదకు తెచ్చుకున్న కొత్త తిప్పలు..*సీజ్ చేసిన మూడంతస్తుల భవనం కూల్చి వేయడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్*
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని కాశిరెడ్డి కుంట సమీపంలో గల మీనిగా శివ రంగారెడ్డి పై వచ్చిన ఫిర్యాదు మేరకు గిద్దలూరు మున్సిపల్ అధికారులు పలు మార్లు విచారించి ఈ కాశిరెడ్డి కుంట మున్సిపాలిటీ భూమి అని తేల్చి శివ రంగారెడ్డి నిర్మించిన మూడంతస్తుల భవనంకు తన దగ్గర ఉన్న సరైన పత్రాలను మున్సిపల్ అధికారులకు చూపించాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు.
మూడంతస్తుల భవనం నిర్మించుటకు మున్సిపల్ అధికారుల నుండి ఎటువంటి ప్లాన్ అప్రూవల్సు మరియు పర్మిషన్లు లేవని కాశిరెడ్డి కుంట ప్రభుత్వ భూమి అని మున్సిపల్ అధికారులు తెలిపారు.
కానీ శివ రంగారెడ్డి నుండి ఎటువంటి సరైన పత్రములు మరియు జవాబు లేకపోవడం వల్ల ఇంటి పన్ను మరియు కొళాయిపన్ను రద్దు చేశారు
కొన్ని రోజుల క్రిందట శివ రంగారెడ్డి నిర్మించిన మూడు అంతస్తుల భవనంను మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు
ఈ విషయం తెలుసుకున్న శివ రంగారెడ్డి పరువు నష్టంగా భావించి గత రాత్రి సీజ్ చేసిన మూడంతస్తుల భవనంను హిటాచి ద్వారా పగలగొట్టే ప్రయత్నం చేశారు మరియు భవనంను స్వల్పంగా కూల్చివేశారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చి వేసే పనులను నిలిపివేసి గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్యకు ఫిర్యాదు చేశారు.మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీజ్ చేసిన మూడంతస్తుల భవనంను మరియు సీజ్ చేసిన భవనమును అధికారుల ప్రమేయం లేకుండా కూల్చి వేసే ప్రయత్నం చేసిన శివ రంగారెడ్డి పై గిద్దలూరు సీఐకి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివ రంగారెడ్డి మరియు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.