ప్రజల సొమ్ముతో సీసీ రోడ్డు.. ప్రైవేటు గేటు.బిహార్ లో పేకమేడల్లా కూలుతున్న వంతెనలు..కంగనాను కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు వేధింపులు..!!కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ!.. చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్..ఎర్రగొండపాలెం ఎస్సై సస్పెండ్.పెండింగ్లో ఉన్న హాస్టళ్ల మెస్ చార్జీలు విడుదల చేయండి…

👉ప్రజల సొమ్ముతో సీసీ రోడ్డు.. ప్రైవేటు గేటు.. పెద్దిరెడ్డా మజాకానా?

ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వెలిగిపోయిన అత్యంత ముఖ్యుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వెలిగిపోయిన అత్యంత ముఖ్యుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమలో అందునా చిత్తూరు జిల్లాలో ఆయనేం చెబితే అదే నడిచేది. అందుకు మాట కూడా పక్కకు పొర్లేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయన తీరు.. చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎయిర్ పోర్ట్ బైపాస్ రోడ్డు సమీపంలో ప్రజల సొమ్ముతో వేయించుకున్న సీసీ రోడ్డును ఆయనెంత విలాసంగా వాడుకున్నారో ఇట్టే అర్థమయ్యే ఉదంతమిది. ఇక్కడ పెద్దిరెడ్డి గారి వైభోగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. రాయల్ నగర్ లోఆయనకు మూడు ఎకరాల విస్తీర్ణంలో పెద్దిరెడ్డి వారికి ఇల్లు ఉంది. ఈ భూమిపైనా వివాదం ఉంది. బుగ్గమఠం భూముల్ని అక్రమించారని స్థానికులు ఆరోపిస్తుంటారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. పంచాయితీగా ఉన్న వేళలో ఒక మట్టి రోడ్డు ఉండేది.కార్పొరేషన్ లో కలిసిపోయిన తర్వాత గ్రావెల్ రోడ్డు నిర్మించారు. వెస్ట్ చర్చితో పాటు.. ఎమ్మార్ పల్లి వైపు నుంచి ఈ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగేవి. జగన్ ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేయించుకున్నారు. ఇలాంటివి చాలామంది చేసే పనే కదా? అనుకోవచ్చు. అందరిలా చేస్తే ఆయన పెద్దిరెడ్డి ఎందుకు అవుతారు? తనకంటూ ఒక మార్కు ఉండాలి కదా? అందుకే ఆయన.. సీసీ రోడ్డు వేయించుకోవటమే కాదు.. ఆ రోడ్డును మరెవరూ వాడకుండా ఉండేందుకు ఏకంగా గేటు ఏర్పాటు చేయించుకున్నారు. దీని కారణంగా అక్కడి స్థానికులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నా.. పెద్దిరెడ్డి వారు మాత్రం కుదరదంటే.. కుదరదని ఫర్మానా జారీ చేశారు. రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన నేపథ్యంలో జనసేన నేతలు ధర్నాకు దిగారు. అయితే.. వారిని అక్కడి నుంచి జనసైనికుల్ని పంపించే విషయంలో పోలీసులు శ్రద్ధ చూపుతున్నారే కానీ.. దారి తెరిచే విషయంలో ఇప్పటికి చట్టబద్ధంగా వ్యవహరించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాలు మారిన తర్వాత పెద్దిరెడ్డి హవా కొనసాగుతుందన్న విమర్శ జనసైనికుల నుంచి వస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

👉17 రోజుల్లో 12: బిహార్ లో పేకమేడల్లా కూలుతున్న వంతెనలు కేవలం మూడు వారాల కంటే తక్కువ సమయం..

మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 17 రోజుల్లో బిహార్ లోని పన్నెండు వంతెనలు కూలిపోతున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. బిహార్ లో ఏం జరుగుతోంది? దేశంలో ప్రధానమంత్రి పదవికి అర్హుడుగా భావించే అధినేతల్లో నితీశ్ కుమార్ ఒకరు.అలాంటి ఆయన ఏలుబడిలో బిహార్ కొన్నేళ్లుగా తరిస్తోంది. అవినీతికి అస్కారం లేదని ఆయన గురించి చెబుతుంటారు.ఆ మాటకు వస్తే.. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఎంతో డెవలప్ మెంట్ ను తీసుకొచ్చారన్నప్రచారం జరిగింది.అలాంటి బిహార్ లో గడిచిన కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది? కేవలం మూడు వారాల కంటే తక్కువ సమయం.. మరింత కచ్ఛితంగా చెప్పాలంటే 17 రోజుల్లో బిహార్ లోని పన్నెండు వంతెనలు కూలిపోతున్న వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా కూలుతున్న వంతెనలతో సమాధానం చెప్పలేక నితీశ్ సర్కారు సతమతమవుతోంది. తాజా పరిణామాలతో బిహార్ రాష్ట్ర ఇమేజ్ మరింత డ్యామేజ్ కావటమే కాదు నితీశ్ సమర్థతపైనా.. ఆయన పాలన మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది బిహార్ ప్రభుత్వం. అదేమంటే.. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు..నిర్వాహణ పనులను పర్యవేక్షించే అధికారుల కారణంగానే వంతెనలు కూలుతున్నట్లుగా చెబుతోంది. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్ని సరిగా నిర్వర్తించలేదని.. ఇంజినీర్లు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో వంతెనలు కూలుతున్నట్లుగా పేర్కొంది. ఇటీవల కూలిపోయిన వంతెనలన్నీ కూడా దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించారని.. వాటి పునాదులు లోతుగా ఉండకపోవటం..తాజాగా ప్రభుత్వం చేపట్టిన పూడికతీత పనుల వేళ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో అన్ని వంతెనలు కూలుతున్నట్లుగా చెబుతున్నారు. వరుస పెట్టి కూలుతున్న వంతెనల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. నితీశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి నితీశ్ పెదవి విప్పటం లేదన్న ఆర్జేడీ.. “ఈ అవినీతి రహిత ప్రభుత్వానికి ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి ఎంతలా రాజ్యమేలుతుందో చెప్పటానికి ఈ ఘటనలే కారణం” అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. జూన్ 18 నుంచి ఇప్పటివరకు 12 వంతనెలు కూలిపోయినా సీఎం నితీశ్ ఒక్క ప్రకటన చేయలేదన్న విమర్శకు అక్కడి అధికార పక్షం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. పూడికతీత పనులు చేస్తున్నప్పుడు అజాగ్రత్తగా వ్యవహరించిన అధికారుల్ని.. కాంట్రాక్టర్లను బాధ్యుల్ని చేస్తామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కూలిన వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తామని.. ఆ భారాన్ని పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల మీదనే బాధ్యత మోపుతామని పేర్కొన్నారు. మొత్తంగా పేకమేడల్లా కూలుతున్న వంతెనల ఇష్యూ మీద బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ నోరు విప్పాల్సిన అవసరం ఉంది.లేదంటే.. కూలుతున్న వంతెనల మాదిరే ఆయన ఇమేజ్ సైతం కూలిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.

👉👉👉*ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ…?

జగన్ మోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్స్ కి దొరకని అమ్మ చెల్లి గారు..వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు.ఈ నెల 8న వైఎస్సార్ జయంతి.ఆయన 75వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహలు చేస్తున్నారు.ఆమె ఏకంగా సోనియా గాంధీ రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు.విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి విజయమ్మ పాల్గొంటారని వార్తలు వస్తూండటం విశేషం..*జగన్ ని కలవని తల్లి వైఎస్ విజయమ్మ*

👉చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్….మోసం చేసాడు అంటూ పీస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ ..హీరోయిన్ లావణ్య*హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది.  3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య చెబుతోంది.లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్రా. ఆమె రాజ్‌తరుణ్‌తో కలిసి తిరగబడరా సామీ అనే సినిమాలో నటించారు. అయితే మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్‌ జీవితంలోంచి వెళ్లిపోకపోతే చంపుతామంటూ వాళ్లిద్దరూ బెదిరించారని నార్సింగి పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది.అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తమ నాన్నకు ఫ్రెండ్‌ అనీ, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మాయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది. మాల్వీ ట్రాప్‌లో పడి, రాజ్‌తరుణ్‌ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది. కానీ తాను రాజ్‌తరుణ్‌ లేకపోతే ఉండలేనంటోంది. తాను రాజ్‌తరుణ్‌తో కలసి ఉండాలని కోరుకుంటోంది.

👉కంగనాను కొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కు వేధింపులు..!!!గత నెలలో చండీగఢ్‌ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కుల్విందన్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాను కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ వెల్లిడించింది. బీజేపి ఎంపీ ఫిర్యాదుతో కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు కుల్విందర్ కు మద్దతు తెలుపగా.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆమెకు ఏకంగా ఉద్యోగం ఇస్తామంటూ ఇన్ స్టా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. దీంతో తనకు సపోర్ట్ చేయని వారిపై మండిపడింది కంగనా.ఇదంతా పక్కన పెడితే కంగనాపై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెషన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమెపై బదిలీ వేటు వేశారు. కుల్విందర్ ను చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలోని డాబస్ టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సుకు ఆమెను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కుల్విందర్ సస్పెన్షన్ లో ఉన్నారు.👉బీజేపీ ఎంపీ కంగనాను చెంప దెబ్బ కొట్టిన ఆరోపణలపై సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌పై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. దేశంలో రైతులు చేసిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా మాట్లాడారని.. ఆ రైతులలో తన తల్లి కూడా ఉన్నారని.. అందుకే కంగనాపై చేయి చేసుకున్నానంటూ కుల్విందర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రెటీస్ కుల్వింద్ కు మద్దతు తెలిపారు.

*టీడీపీ కార్యకర్త దారుణ హత్య* పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం మిట్టమీద పల్లె గ్రామం లో దారుణం*టీడీపీ కార్యకర్త హనీమిరెడ్డి దారుణ హత్య…*హనీమిరెడ్డిని దారుణంగా హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు…హనీమీరెడ్డి మెడ పై తీవ్ర గాయాలు

👉 *ఇంట్లోదూరిన పాము*ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోమీదేవిపల్లి లో ఇంట్లో దూరిన నాగుపామును పట్టుకున్న ఫారెస్ట్ రిస్క్యూ సిబ్బంది

👉యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్.ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ.దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులకు నివేదించిన మార్కాపురం డిఎస్పీ బాలసుందరావు.ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.

👉9 నెలలుగా పెండింగ్లో ఉన్న హాస్టళ్ల మెస్ చార్జీలు విడుదల చేయండి..*ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి chవినోద్, ఒంగోలు నగర కార్యదర్శి బి.వీరాస్వామి*9 నెలలుగా హాస్టళ్లకు ఇచ్చే మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో హాస్టళ్ళు అప్పుల సంక్షోభంలో కూరుకుపోయాయి.తక్షణమే విడుదల చేసి ఉపశమనం కల్పించాలని కోరడం జరిగింది.కాస్మోటిక్ చార్జీలు కూడా 3నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి.హాస్టల్లకి టూటర్లు లేని కారణంగా 10వ తరగతి విద్యార్థులు సైతం రాత్రి వేళల్లో హాస్టల్ బయటికి ట్యూషన్ కు వెళ్లాల్సి వస్తుంది,హాస్టల్లో శాశ్వత ట్యూటర్లను ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.గతంలో నిర్ణయించిన మెనూకు రేట్లను సక్రమంగా నిర్ణయించని కారణంగా మెనూ అమలులో సమస్యలు వస్తున్నాయని, మెనూ అమలకు నిర్ణయించిన మెనూ చార్జీలకు వ్యత్యాసం ఉందని తెలపడం జరిగింది.హాస్టళ్లకు సరిపడా వర్కర్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి హాస్టల్ కు ముగ్గురు వర్కర్లను నియమించండి అని కోరడం జరిగింది.*మంత్రి మాట్లాడుతూ…* సమస్యలను పరిశీలించి పరిష్కారం చేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలను నా దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అని హామీ ఇచ్చారు.

👉👉👉 అమరావతి..*పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా సిద్ధం**సీఎం చంద్రబాబుతో సమావేశమైన క్లబ్ మహీంద్రా ఛైర్మన్‌ గుర్నాని‌*రాష్ట్రంలో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్లబ్ మహీంద్రా’ సంస్థ ఆసక్తి చూపడం సంతోషాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సంస్థ చైర్మన్ సీపీ గుర్నానీ, ఆయన బృందంతో భేటీ అయినట్లు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భేటీ ఫొటోల్ని పోస్టు చేశారు. క్లబ్ మహీంద్రా సంస్థ దేశ, విదేశాల్లో ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థకు 140కి పైగా రిసార్టులు ఉన్నాయి.

👉 గంజాయి అమ్మే కొడుకును పట్టించిన తల్లి..!!గంజాయికి అలవాటుపడి ఇతరులకు కూడా అమ్ముతున్న కొడుకును ఓ తల్లి పోలీసులకు పట్టించింది. చెన్నైలో లారీ డ్రైవర్గా పని చేస్తున్న శ్రీరామ్ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. అతని ఫ్రెండ్ అరుణో కలిసి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ కూడా సప్లైయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అతని తల్లి భాగ్యలక్ష్మీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త