చంద్రబాబు, రేవంత్ భేటీ !.మంత్రి కింజరావును కలిసిన ఎమ్మెల్యే ముత్తుముల..రీఛార్జిల భారంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..ఈనెల 10న డిమాండ్స్ డే జయప్రదం చేయాలి-సిఐటియు..

👉అప్పుల్లో కూరుకుపోయాం ఆర్థికంగా ఆదుకోండి.. ఆర్థిక మంత్రి నిర్మలకు ఏపీ సీఎం వినతి..గత ప్రభుత్వ నిర్ణయాలు, పనుల కారణంగా రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వివరించారు. ఆర్థికంగా తమ రాష్ట్రాన్ని ఆదుకోవలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వివిధ మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి తగినంత సహాయం చేయాలని కోరారు. నిర్మలతో జరిగిన భేటీలో పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలు ఉన్నారు. అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. సాయంత్రంలోగా మరికొందరుకేంద్రమంత్రులతోనూ చంద్రబాబునాయుడు సమావేశమై.. రాష్ట్రపరిస్థితుల గురించి వివరించనున్నారు. జపాన్ రాయబారితోనూ చర్చలు జరుపనున్నారు. సాయంత్రానికి ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం భాగ్యనగరంలో చంద్రబాబు భారీ ర్యాలీలో పాల్గొంటారు. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో పలువురు కేంద్రమంత్రులతో సమావేశమైన చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనందించాలని ప్రధానిని కోరారు. అలాగే ఈ నెల నాలుగో వారంలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. అందులో ఏపీకి ఇచ్చే ప్రాధాన్యతపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని విరాళంగా ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడికి రూ.1.57 లక్షల చెక్కును అందజేశారు. రాజధాని నిర్మాణానికి విరాళమిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.

👉తన మొదటి జీతాన్ని అమరావతికి విరాళం ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు..న్యూ ఢిల్లీ : విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళం అందజేశారు. ఎంపీగా అందుకున్న తొలి జీతం రూ.1.57 లక్షల చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీలందరి సమక్షంలో ఈ చెక్కును అందజేశారు. దీంతో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.

👉 చంద్రబాబు, రేవంత్ భేటీ.. ముహూర్తం ఫిక్స్..తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనుంది.

👉రీఛార్జి భారం..కేంద్రంలో మోడీ మూడోసారి పీఠం మీద కుదురుకున్న కొద్దిరోజులకే ప్రయివేటు టెలికం కంపెనీలు మొబైల్‌ రీఛార్జి ధరలను భారీగా పెంచి, ప్రజలపై రూ.20 వేల కోట్ల భారాన్ని మోపాయి.ఈ భారాల మోతకు తొలుత జియో ఉపక్రమించగా, ఎయిర్‌టెల్‌, వోడా దానిని అనుసరించాయి.నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలను పెంచటం అనివార్యమైందని అవి బయటికి ప్రకటించినా – జనం మొబైల్‌ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవటమే వాటి అసలు ఉద్దేశం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ జియో రూ.20,607 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఎయిర్‌టెల్‌ రూ.7,467 కోట్ల లాభాన్ని వెనకేసుకొంది. అయినా, ఈ కంపెనీల ధనదాహం తీరలేదు. దేశంలో మొబైల్‌ ఫోన్లను వాడుతున్న కోట్లమంది నుంచి తలో కొంత అదనంగా పిండుకున్నా – వేల కోట్లను సులభంగానే గడించవచ్చునని గట్టిగా నిర్ణయించుకున్నాయి. బయటికి పరస్పరం పోటీదారులమన్నట్టు పోజులిస్తూ- ఛార్జీల వడ్డనలో మాత్రం కూడబలుక్కునే వ్యవహరించాయి. ఒకే తరహాలో టారిఫులను పెంచి, వినియోగదారుల నెత్తిన భారాలు మోపాయి. రిలయన్స్‌ జియో తన టారిఫ్‌ను 12 – 25 శాతం మధ్య పెంచగా, ఎయిర్‌టెల్‌ 11 – 21 శాతం మేర హెచ్చించింది. ఎక్కువమంది అనివార్యంగా వాడే ప్లాన్ల మీద తెలివిగా భారాలను వడ్డించాయి. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత వైఖరి, కార్పొరేట్లకు దోచిపెట్టే ధోరణీ ఈ ప్రొవైడర్ల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నాయి.ప్రయివేటు టెలికం కంపెనీలు రంగంలోకి రాకముందే దేశంలో మూలమూలకీ విస్తరించిన ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌). బిజెపి ప్రభుత్వం దాని కాళ్లకు బంధనాలు వేసి, కుట్రపూరితంగా కూలదోసి, కార్పొరేటు కంపెనీలకు రకరకాల రాయితీలతో, అవకాశాలతో విస్తరించే భూమికను ఏర్పరిచింది.▪️బిఎస్‌ఎన్‌ఎల్‌ తన సేవలను విస్తరించటానికి, సాంకేతిక శక్తిసామర్థ్యాలను పెంచుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డంకులు కల్పించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌ అనేది ఒక అసమర్థ సంస్థగా చిత్రీకరించే పనిని బిజెపి నాయకులే స్వయంగా చేపట్టి, ప్రచారం చేశారు. ఊరూరా నెట్‌వర్కు ఉన్న సంస్థను, సాంకేతిక నిపుణులు ఉన్న సంస్థను అడుగడుగునా అవహేళన చేశారు.▪️వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 3జి, 4జి, 5జి సేవల్లోకి వెళతామన్న ప్రతిసారీ అనుమతి నిరాకరించారు. 2016లో మోడీ నోట్ల రద్దు ప్రకటించి, డిజిటల్‌ చెల్లింపుల ప్రస్తావనను చర్చలోకి తెచ్చిన కొద్దిరోజులకే అంబానీ గారి జియో వ్యూహాత్మకంగా రంగప్రవేశం చేసింది. ▪️ఆకర్షణీయమైన తక్కువ టారిఫ్‌ ప్రకటించి,కొద్దిరోజు ల్లోనే లక్షలాది మంది వినియోగదారులను గుప్పిట పట్టింది. జియో విస్తరణకు ఇంతగా సేవలందిస్తున్న మోడీ ప్రభుత్వం… బిఎస్‌ఎన్‌ఎల్‌ సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడు తుంటే – కర్కశంగా కత్తి ఝళిపిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ హైస్పీడు డేటాను తన వినియోగదారులకు అందివ్వాలని ప్రణాళికలు వేసుకుంటే- అందుకు అనేక విధాలుగా మోకాలడ్డింది. ▪️ప్రయివేటు ప్రొవైడర్లు రెండు,మూడు దశలు ముందుకెళ్లిన తరువాతనే ఈ సంస్థకు మొదటి దశ సేవలకు అంగీకారం తెలిపే వైఖరిని అవలంబిస్తోంది. నాణ్యమైన సంస్థల నుంచి 4జి, 5జి నిర్వహణా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ అభ్యర్థిస్తే – ఏళ్ల తరబడి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అతీగతీ లేదు. ▪️ఈ ద్రోహపూరిత నిర్లక్ష్యం కారణంగా 2023-24లోనే, బిఎస్‌ఎన్‌ఎల్‌ 1.8 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఒక్క గత మార్చిలోనే 23.54 లక్షల మంది వైదొలిగారు. అదే నెలలో జియో 21.43 లక్షల మందిని, ఎయిర్‌టెల్‌ 17.5 లక్షల మందిని కొత్త కస్టమర్లుగా పొందాయి. ▪️బిఎస్‌ఎన్‌ఎల్‌ బలంగా ఉన్నప్పుడు నిజమైన రెగ్యులేటర్‌గా వ్యవహరించి, ప్రయివేటు ప్రొవైడర్ల ధరలు అదుపులో ఉండటానికి కారణమైంది.క్రమేణా విస్తరణ కుంటుపడి, ప్రయివేటు కంపెనీల విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.▪️ప్రజలకు ఈ భారాల మోత లేకుండా ఉండాలీ అంటే బిఎస్‌ఎన్‌ఎల్‌ 5జి సేవలతో బలంగా విస్తరించాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులూ, సహాయ సహకారాలూ అందించాలి. ప్రయివేటు టెలికం కంపెనీల ధరల దూకుడుకు కళ్లెం వేయటం బిఎస్‌ఎన్‌ఎల్‌ బలోపేతం కావటం ద్వారానే సాధ్యం..

👉ఈరోజు బాపట్ల జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ వెంకట్ మురళి ని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిచడం జరిగింది ఇలాగే ముందు కు సాగుతూ మరి కొన్ని కార్యక్రమలు చేయాలని ప్రోత్సహించిడం జరిగింది.. కార్యక్రమం లో స్టేట్ కో ఆర్డినేటర్ నరేంద్ర గుప్తా,జిల్లా sc వింగ్ నిలంబరం ,జిల్లా యూత్ ఇంచార్జి ధోని రాజు తదితరులు పాల్గొన్నారు.

👉జాతీయ మానవ హక్కుల సంఘం న్యాయ సేవ (National Human Rights & justice Movement) ఆధ్వర్యంలో దేశాయిపేట జగ్జీవన్ రావ్ కూడలిలో ఇద్దరు పేద చిన్నారులకు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం మరియు దుస్తులు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఇంతేజరగంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, మరియు NHR&JM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాకుబ్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలేపాక మధు , వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోలేపాక రాణి , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సౌరం అభిలాష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ కొగిల సుధాకర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేకల కమలాకర్,జిల్లా కోఆర్డినేటర్ సౌరం చిన్నయ్య,జిల్లా మహిళ జనరల్ సెక్రెటరీ బాకారం శోభ,జిల్లా వైస్ ప్రెసిడెంట్ పద్మ,సెక్రెటరీ కవిత,పాల్గొన్నారు

👉 *ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మరియు పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు .

👉 రద్దయిన స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ శానిటైజర్ వర్కర్ ని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. గిద్దలూరు మండలం ప్రభుత్వం పాఠశాల కళాశాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల మండల సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం నందు ఎస్ కే సమీరా అధ్యక్షతన జరిగింది.సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య సిఐటియు మండల కార్యదర్శి బి నర్సింలు పాల్గొని మాట్లాడుతూ ముళ్లపాడు గ్రామంలోని డీఎన్ టి స్కూలు ఎన్రోల్మెంట్ లేకపోవడంతో ఆ స్కూల్ ను రద్దు చేయడం జరిగిందని అందులో పని చేసే ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయడం జరిగిందని కానీ అదే స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ పారిశుద్ధ్య కార్మికురాలు ,మధ్యాహ్నం భోజనం పథకం కార్మికురాలను ముళ్లపాడు లోని హైస్కూల్లో ప్రత్యామ్నాయంగా చేర్చాలని అన్నారు.ఈనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరుగుతుందని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు.సమావేశంలో స్కూల్ శానిటైజర్ వర్కర్స్ యూనియన్ నాయకులు పుష్ప ,ఎస్.కె జహీరా వై రాధా తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..

👉పులివెందుల డీఎస్పీ ని బహిరంగంగా బెదిరించిన జగన్ !*.. *నెల్లూరు జిల్లాలో నకిలీ సిగరెట్ల ముఠా గుట్టురట్టు,సుమారు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే డూప్లికేట్ బ్రాండ్ సిగరెట్లు సీజ్*.. *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి పర్యటన .. *దర్శనం టికెట్లు అమ్ముకుని బెంజి కారు: రోజాపై జెసి ఫైర్* ..*టీటీడి ఇన్‌ఛార్జ్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ *…*కలెక్టరేట్ లో ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం (జగిత్యాల). .. *మగాడైతే రాజీనామా చేసి గెలిచి రావాలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. *మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ..*మరోసారి ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు.. *ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి!

👉 కేరళలో అమానవీయ ఘటన… 18 ఏళ్ల అథ్లెట్ పై 60 మంది దారుణం! ..యూఎస్ లో కార్చిచ్చు… భారతీయుల పాట్లు ..*ఫ్యూచర్ సిటీపై సిఎం రేవంత్ ఫోకస్ …*టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..* *తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం..*.. *5 కోట్ల విలువైన బంగారంతో కారు డ్రైవర్ పరారీ..* .. సింగరాయకొండలో ట్రావెల్స్‌ బస్సుకు ప్రమాదం ..ఘరానా మోసగాడు అరెస్ట్ (మంగళగిరి)..👉అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త