👉భాగ్యనగరంలో బాబుకు షాకిచ్చేలా ఫ్లెక్సీలు..
చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ లో ఇంకా పదిలంగా ఉంది అనడానికి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు హైదరాబాద్ లొ గ్రాండ్ వెల్ కం లభిస్తోంది. ఆయన అరెస్ట్ అయినపుడు కూడా హైదరాబాద్ లోనే నిరసనలు చేస్తూ రీ సౌండ్ చేసారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ లో ఇంకా పదిలంగా ఉంది అనడానికి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 6న ప్రజా భవన్ లో ఏపీ తెలంగాణా సీఎం ల తొలి భేటీ జరగబోతోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూంటే చంద్రబాబుకు గ్రాండ్ లెవెల్ లో వెల్ కం చెబుతూ ఫ్లెక్సీలు బ్యానర్లు హైదరాబాద్ అంతటా ఏర్పాటు కావడం విశేషం. ఎక్కడ చూసినా బాబు ఫ్లెక్సీలు బ్యానర్లతో భాగ్యనగరం హోరెత్తుతోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ పోలీసులే కడుతున్నారు అని ప్రచారం సాగింది. అయితే పోలీసు శాఖ దానిని ఖండించింది. ఫ్లెక్సీల వద్ద ప్రమాదాలు జరుగుతాయని భావించి దానిని పక్కకు పెట్టే ప్రయత్నం చేశామని తప్పించి తాము కట్టడం లేదని వివరణ ఇచ్చింది. అయితే ఏపీ సీఎం గా చంద్రబాబు హైదరాబాద్ లో పాల్గొనబోయే తొలి అధికారిక కార్యక్రమం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆయనకు ఎన్నడూ లేని విధంగా స్వాగతం లభిస్తోంది. అంతే కాదు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంకో వైపు చూస్తే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కి చేరుకున్న చంద్రబాబుకు బేగం పేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఒక వైపు వర్షం కురుస్తున్నా పెద్ద సంఖ్యలో తెలంగాణా టీడీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు ఏపీ సీఎం అయిన తరువాత తొలిసారి హైదారాబాద్ వచ్చారని తెలంగాణా టీడీపీ భారీ స్వాగత ఏర్పాట్లను చేసింది.అంతే కాదు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో బాబు ఉప్పొంగిపోయారు. దాంతో చంద్రబాబు వాహనం ఎక్కి అక్కడ నుంచి అభిమానులకు పార్టీ వాదులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.బేగం పేట నుంచి బాబు నివాసం ఉండే జూబ్లీ హిల్స్ దాకా ఈ భారీ ర్యాలీ సాగడం విశేషం. మొత్తం మీద చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో హైదరాబాద్ లో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే తెలంగాణా టీడీపీ రీ యాక్టివ్ అవుతోంది. ఈ పరిణామాలు తెలంగాణాలో పార్టీకి శుభ సూచకమంగా చెబుతున్నారు.
👉 దిల్లీ: ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
రెండ్రోజుల దిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల జగన్ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. ‘‘దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వొచ్చు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదు. వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదు. ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ కోరినా అంగీకరించలేదు. ఎన్డీయే ఉన్నందున అప్పుడు స్పీకర్ పదవి తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఎన్డీయే ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నాం. జగన్ పాలనతో అమరావతిపై జనాకర్షణ కొంత తగ్గింది. రాజధానికి పూర్వ వైభవం తేవడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అక్కడ 135 ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. రాజధానికి అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ సహా అన్నీ పూర్తి చేస్తాం. తొలుత నిర్మాణంలో ఉన్నవాటికి ప్రాధాన్యత ఇస్తాం. రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేస్తాం. నైపుణ్య గణనకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం. మానవ వనరులే పెట్టుబడిగా సంపద సృష్టిస్తాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి కల్పిస్తాం. పీపీపీ నమూనా స్థానంలో పీ-4 విధానం తెస్తాం. దావోస్ పెట్టుబడుల సదస్సుకు తప్పకుండా హాజరవుతా. మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలూ అడుగుతున్నాయి. డెవిల్‌ను నియంత్రించాం.. ఇకపై ఎవరీ ఇబ్బంది ఉండదు’’ అని చంద్రబాబు తెలిపారు.
👉 అమరావతి: అరుదైన ఎర్రచందనాన్ని విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 158 దుంగలు దొరికాయని, వాటి విలువ రూ.1.6కోట్లు ఉంటుందని అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. శేషాచలం అడవుల్లో నరికేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడెక్కడ దాచారో గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న సూత్రధారులను పట్టుకోవాలని నిర్దేశించారు. రవాణా దశలో, దాచి ఉంచిన దగ్గరో పట్టుకోవడంతో పాటు ఎర్రచందనం కూలీలు, రవాణా దారులను తెరవెనుక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలపై చర్చించారు. నమోదైన కేసుల్లో ఎన్నింటిలో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్‌లో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా దృష్టి పెట్టాలన్నారు.
👉డాక్యుమెంట్లు తగలబెట్టడంపై పవన్ ఫైర్…కాలుష్య మండలి సంబంధించిన దస్త్రాలు, నివేదికలను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే పీసీబీ కార్యాలయాల్లో దస్త్రాలు, నివేదికలను ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. వాటిని భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు.
👉 నిర్మాణ సామగ్రిని కూడా దొంగలించారు: అయ్యన్నపాత్రుడు..అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మీడియా హాల్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని తెలిపారు. నిర్మాణానికి సంబంధించిన సామగ్రి కూడా దొంగలించారన్నారు. 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణాలు పూర్తి చేయాలని CRDA అధికారులను ఆదేశించారు.
👉భారీగా రేషన్ బియ్యం పట్టివేత…ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి సమీపంలో పొలాల్లో ఓ రేకుల షెడ్డు అక్రమంగా నిలువ చేసిన 👉121 క్వింటాల రేషన్ బియ్యాన్ని* స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారు బాల వెంకటరెడ్డి పై కేసు నమోదు చేసిన అధికారులు.
👉విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ..విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భరత్ కలిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టి.జి భరత్ చెప్పారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఏడాదిలోపు రాత్రి సమయాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తానని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. కర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని టి.జి భరత్ పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టి.జి భరత్ తెలిపారు.
👉సీఐ రామనాయక్ పేరిట ఫేస్బుక్ ఫేక్ అకౌంట్.. గతంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్సైగా పనిచేసిన ప్రస్తుత పామూరు సీఐ విధులలో ఉన్న రామానాయక్ పేరిట ఫేస్బుక్ లో ఫె్క్ మెసేజ్లు వస్తున్నాయి. ప్రజలు గుర్తించి జాగ్రత్త వహించగలరు.:
👉 మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులను అత్యధిక ప్రాధాన్యతతో విచారణ వేగవంతం చేయాలి..రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలి..అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రిమాండ్ కు తరలించాలి..గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా..కడప జిల్లా.. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్థులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీముల ఏర్పాటు..నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్..కడప జులై 5: మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అత్యధిక ప్రాధాన్యత తో వాటిని విచారించి అదృశ్యమైన వారి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలని జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పోలీస్ అధికారుల ను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ అదృశ్యమైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక టీమ్ లు రాష్ట్ర, దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి విచారించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మేరకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
👉 విశాఖలో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి కిడ్నీ రాకెట్ కేసులో బిగుస్తున్న ఉచ్చు. డీసీపీ-1తో స్పెషల్ టీం వేసిన సీపీ శంఖబ్రత బాగ్చీ. సమగ్ర విచారణ జరిపాలని ఆదేశాలు. నిందితులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం.
👉 భారీ కుంభకోణం….కిడ్నీ మార్పిడి చేస్తామంటూ రూ. 10లక్షలు వసూలు.. తీరా చూస్తే జంప్..! విశాఖలో అవయవ మార్పిడి పేరుతో భారీ మోసం బయటపడింది. అనారోగ్యానికి గురైన తన భార్య కోసం ఆశ్రయించిన వ్యక్తిని నిండా ముంచారు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు తీసుకుని మోసగించినట్టు పోలీసులకు పిర్యాదు చేశాడు బాధితుడు.దీంతో మహిళ డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.పురుషోత్త పురం ప్రాంతానికి చెందిన గోపి భార్య శారద అనారోగ్యానికి గురైంది. మెడికల్ టెస్టులు చేయించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో డయాలసిస్ కూడా చేయిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయాల్సి రావడంతో.. కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదు. తన బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కాకపోవడంతో, సీతమ్మధారలోని ఎన్నారై ఆసుపత్రి డాక్టర్ వాణిని సంప్రదించాడు గోపి. కిడ్నీ మార్పిడి చేయాలని అందుకు అనిల్ అనే ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ తన సిబ్బందికి ఆ కేసును అప్పగించింది. కిడ్నీ ఆర్గాన్ డోనర్లు సిద్ధంగా ఉన్నారని, 27 లక్షల రూపాయల ఖర్చవుతుందని అందుకు అడ్వాన్స్‌గా పది లక్షల రూపాయలు చెల్లించాలని సూచించారు.
👉 చిత్తూరు జిల్లా, పలమనేరు..పెద్ద పంజాని మండలం, బసవరాజు కండ్రిగ వద్ద బస్సు బోల్తా..హిందూపురం నుండి ఐదు రోజుల తీర్థయాత్రకు బయలుదేరినారు.. వయా ..పలమనేరు పెద్దపంజాణి బసవరాజు కండ్రికి వద్ద ఆక్సిడెంట్..ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు.. క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలింపు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
👉డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కు అవమానం ..దళిత జాతి బిడ్డ పై జరిగిన అవమానం యావత్ ప్రపంచం చూస్తుంది ..భారత రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా ..భావితరాలుకు ఇలాంటి ఘటనలుతో ఎమ్ చెప్పాలనుకుంటున్నారు ..రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి ..దళిత, ప్రజా సంఘాలు ఆందోళన..అంబేద్కర్ విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులను వారం రోజులు లోపు అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన రామచంద్రపురం డీ.ఎస్ పి . రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామ స్థానిక అరుంధతి పేట,జగనన్న లేఅవుట్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళితులు 9 సంవత్సరాల క్రితం అంబేద్కర్ మరియు బాబు జగ్గజీవన్ రాయ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.అప్పటి నుండి ఇద్దరు నాయకులకు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.నిన్న రాత్రి గుర్తు దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని గునపం తో పగలకొట్టి విగ్రహాన్ని తల,మెండం న్ని ధ్వంసం చేశారు.ఈ విషయం తెలుసుకున్న దళిత,ప్రజా సంఘాల నాయకులు విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారును అరెస్టు చేయాలని,దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని, అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, రామచంద్ర పురం ఎస్.సి, ఎస్.టీ ఫెడరేషన్ అధ్యక్షులు పొలినాటి ప్రసాద్,బుంగా రాజు,ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర సలహాదారుడు మోర్త దొరబాబు,ఎం.ఆర్.పి.ఏస్ నియోజక కన్వీనర్ చిర్రా సురేష్,అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వి. భీమ శంకరం,ప్రజా సేన అధ్యక్షడు కాటే సుబ్రహ్మణ్యం తదిరులు మాట్లాడుతూ వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దళితులు మీద,దళిత జాతిపై దాడి చేయడమే అన్నారు. అంబేద్కర్ ను అవమాన పర్చడం అంటే దళిత జాతి ఆత్మ గౌరవాన్ని అవమాన పర్చడం అన్నారు.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరైనా పోలీస్ లు తక్షణమే అరెస్టు చేయాలని , కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రామచంద్ర పురం డీఎస్పీ,సీఐ,ఎస్.ఐ లు దళిత, ప్రజా సంఘాల నాయకులు కు వారం రోజులు లోపు అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత,ప్రజా సంఘాలు వారం రోజులు లోపు అరెస్టు చేయకపోతే రామచంద్ర పురం నియోజక వర్గం లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పోలీస్ లను ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు,పి రాజు,ఏపి రైతు కూలీ సంఘం నాయకులు కొండ దుర్గా రావు,ఎం ఎస్ ఎఫ్ నాయకులు మహేష్,పి . వినయ్ కుమార్,వి.రామకృష్ణ, గుబ్బల శ్రీను తదితర దళిత,ప్రజా సంఘాల నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు.