“అటు నితీష్ ఇటు చంద్రబాబు”..తిరుమలలో రాబందుల‌ రాజ్యం”..50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.. పుస్తకాలు పంపిణి చేసిన ఎంఎల్ఏ ముత్తుముల..కంభంలొ మెడికల్ స్టోర్ల తనిఖీలు

👉 “అటు నితీష్ ఇటు చంద్రబాబు”…మోడీకి బడ్జెట్ కత్తి మీద సాము ? కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నారు.ఒక వైపు ప్రత్యేక హోదా ఇవ్వమని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ అల్టిమేటం లాంటిదే జారీ చేశారు. అది కనుక వీలు కాకపోతే ఏకంగా లక్షా పాతిక వేల కోట్ల అతి పెద్ద ఆర్ధిక ప్యాకేజి ఇవ్వమని కూడా మరో షరతు పెట్టారు.జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నా లోక్ జన్ శక్తి పార్టీ మాజీ సీఎం మాజీ పార్టీకి కలుపుకుని మరో అయిదు ఎంపీలు ఉన్నారు. ఇలా చూస్తే 17 మంది ఎంపీలతో జేడీయూ ఎన్డీయే ప్రభుత్వాన్ని పరీక్షిస్తోంది. ఇక మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ వేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా అన్న మాట వాడలేదు కానీ ఆయన కూడా భారీ ఆర్ధిక ప్యాకేజీ ని కేంద్రం నుంచి కోరుతున్నారు అని తెలుస్తోంది.అది అన్నీ కలుపుకుని లక్ష కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు అని అంటున్నారు.ఈమేరకు ఆర్ధిక ప్యాకేజీ ఇస్తే తప్ప ఏపీ అభివృద్ధి పధంలో సాగేలా లేదు అని చంద్రబాబు కేంద్ర పెద్దలకు నివేదించినట్లుగా తెలుస్తోంది.ఇందులో యాభై వేల కోట్ల రూపాయల దాకా అమరావతి రాజధానికే నేరుగా నిధులు కోరినట్లుగా తెలుస్తోంది.అలాగే పోలవరం ప్రాజెక్టుకు అర్జెంటుగా 12 వేల కోట్ల రూపాయలు ఇతర ప్రాజెక్టులకు కూడా భారీ మొత్తాలు కలుపుకుని లక్ష కోట్లు ఉండాలని బాబు సీఎం హోదాలో కేంద్రానికి వినతి చేసినట్లుగా ఉంది.ఇక్కడ తేడా ఏంటి అంటే నితీష్ కుమార్ కాస్తా డిమాండ్ చేసే లెవెల్ లో కోరుతున్నారు. చంద్రబాబు కేంద్ర పెద్దలను స్మూత్ గా కోరుతున్నారు. అంతే మిగిలినది అంతా సేం టూ సీం అని అంటున్నారు.ఈ నిధులు ఇవ్వాలీ అంటే కేంద్రం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్రం వద్దా నిధుల సమస్య ఉంది.ఏకంగా ఒ150 వేల లక్షల కోట్ల దాకా అప్పు కేంద్రం చేసి ఉంది.అందులో లక్ష కోట్ల రూపాయల దగ్గరగా పదేళ్లలోనే చేసిన అప్పుగా ప్రచారం లో ఉంది .ఇక కేంద్ర బడ్జెట్ అయితే ఇరవై లక్షల దాకా ఉంటుంది.అందులో బీహార్ కి లక్షా పాతిక వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఏపీకి లక్ష కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలంటే కేంద్ర బడ్జెట్ ఏ మాత్రం అవకాశం ఇస్తుందో తెలియదు.ఒకవేళ అనుకున్న విధంగా ఆర్ధిక ప్యాకేజి ఇవ్వకపోతే జేడీయూ టీడీపీ ఏమి చేస్తాయన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ని ఈ నెల 22 లేదా 23వ తేదీలలో ప్రవేశపెడతారని అంటున్నారు. ఈ బడ్జెట్ లో బీజేపీ ప్రయార్టీలు వేరేగా ఉన్నాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వానికి ప్రాణ వాయువుని ఇస్తున్న టీడీపీ జేడీయూ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుకోక పోతే ఆగస్ట్ సంక్షోభం కేంద్రంలో తప్పేట్లు లేదని అంటున్నారు. ఇవన్నీ గమనించిన మీదటనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.మరో వైపు చూస్తే ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఉదారంగా నిధులను కేటాయిస్తే దానిని బట్టి రాష్ట్ర బడ్జెట్ సంగతి ఒక కొలిక్కి తేవాలనుకుంటోంది.మొత్తానికి మోడీకి ఈసారి బడ్జెట్ కత్తి మీద సాముగా మారుతోంది అని అంటున్నారు.

👉కృష్ణా జిల్లా*మాజీ మంత్రి, మాజీ పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ పరార్…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పై దాడికి ప్రయత్నించిన కేసులో జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం…జోగి రమేష్ ను అరెస్టు కు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముందుస్తూ సమాచారంతో పరారైన జోగి రమేష్…ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్టణం లో ఇసుక స్కామ్ ను బయటికి తీయాలని డిమాండ్ చేస్తున్న మైలవరం నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు.

👉ఒంగోలు::మద్యం మత్తులో అర్థరాత్రి మహిళా ఉద్యోగినికి ఫోన్ చేసిన ఓ సిఐ..మీరు భలే సెక్సీగా ఉంటారు.. అంటూ అసభ్య సంభాషణ*కాల్ రికార్డ్ తో సహా ఆధారాలు ఎస్పీ సునీల్ కు అందించిన బాధిత మహిళ..తక్షణమే జిల్లా నుంచి రిలీవ్ అయి వెళ్లిపోవాలని ఆదేశించిన ఎస్పి

👉”తట్టల పేరుతో లక్షలు తినేశారు.టీటీడీ రెవెన్యూలో రాబందుల‌ రాజ్యం”.తిరుమల అంతటా ఆక్రమణలకు ఆజ్యం..తిరుమలలో అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. అధర్మ పాలనలో అధికారులు అందిన కాడికి దోచుకున్నారు. ఆ పాపపు పరిపాలన ప్రభావం ఇప్పుడు తిరుమలలో స్పష్టంగా కనిపిస్తోంది. భక్తుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇష్టానుసారం తిరుమల కొండపై అడుగడుగునా తట్టలు వెలిసిపోయాయి. కనీసం యాత్రికులు రోడ్డుపై నడిచే అవకాశం కూడా ఇవ్వకుండా దారికి అడ్డదిడ్డంగా తట్టలు తిష్ట వేశాయి. వైసీపీ అనుచరులకు తిరుమల కొండ ఒక వరంలా తయారయింది. అధికారులు వారందరికీ కోరినచోట కోరినంత స్థలం కేటాయించి తట్టలు (చిన్నపాటి దుకాణం) ఎటువంటి అనుమతులు లేకుండానే కొనసాగించారు. జగన్ పాలన చేపట్టగానే టీటీడీకి ధర్మారెడ్డి అడుగుపెట్టగానే కొండపై దళారులను తరిమేస్తానని, ఆక్రమణలను అనధికారిక తట్టలను తొలగిస్తానని వీర ప్రగల్బాలు పలికారు. పాత అన్నదానం సత్రం వద్ద అప్పటికే కొంతమంది ఆనదికారిక వ్యక్తులు తట్టలు ఏర్పాటు చేసుకొని ఉండడంతో మంది మార్బలంతో వచ్చి వాటిని తొలగించి ఆరంభ శూరత్వాన్ని చూపించారు.‌ ఇక అటు తర్వాత మొత్తం తిరుమల వైసీపీ సానుభూతిపరులతో తట్టలు ఇచ్చి ఎటువంటి లైసెన్సులు లేకుండా ఆక్రమణలకు ఆనధికారిక వ్యాపారాలకు ధర్మారెడ్డి పరోక్షంగా అనుమతులు ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు కొండపై వద్దంటే దాదాపు 1300 మంది అనధికారిక తట్టలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇవన్నీ స్థానిక డి ఎం బి రోడ్డు, షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, వైకుంఠం కు వెళ్లే దారి, అన్నదానం సత్రం, ఉచిత వసతి సముదాయాలు, స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న వేడి ఆంజనేయస్వామి సన్నిధి పరిసరాలు, అఖిలాండడం పరిసరాలు, మఠాలు ఆశ్రమాలు, నందకం, వకులా నిలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ల చుట్టుపక్కల పరిసరాలు, శిలా తోరణం, పాప వినాశనం ఆకాశగంగా, ఇలా అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడపడితే అక్కడ తట్టలు వందలాదిగా తెలిసిపోయాయి. వీటితోపాటు ఒకప్పుడు కేవలం 28 మంది మాత్రమే నడుపుతున్న టీ స్టాల్స్ ఇప్పుడు అడుగడుగునా వందల సంఖ్యలో ఏర్పడ్డాయి. టీటీడీ ఆరోగ్య శాఖ అసలు ఇంతమందికి టీ కాఫీలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఎలా మంజూరు చేసిందో, దానికి ప్రామాణికం ఏమిటో ఎవరికి అర్థం కాదు.  అసలు ఇంత స్థాయిలో ఇంత సంఖ్యలో కొండపై దుకాణాలు భక్తులకు అవసరమా అనే ప్రశ్నలు అందరిలోనూ రాక మానదు.‌అంతకంటే దారుణమైన నిజం చూస్తే…ఎక్కడపడితే అక్కడ తిరుమల నిబంధనలను పట్టించుకోకుండా సాక్షాత్తు టీటీడీ రెవెన్యూ అధికారులే దగ్గరుండి వాటిని ఏర్పాటు చేయించారు. ఇలా అనధికారికంగా తట్టలను రెవెన్యూ అధికారులు స్వయంగా ఉండి ఏర్పాటు చేయించేందుకు ఒక్కో అనధికారిక వ్యక్తి నుండి మూడు లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు రెవెన్యూ కార్యాలయం లో అధికారులు సిబ్బంది కుమ్ముకై మామూళ్లు వసూలు చేశారు.‌ ఇలా ఏర్పడిన అక్రమ తట్టలు ఇప్పుడు తిరుమలలో భక్తులకు కనీసం నడిచేందుకు దారి కూడా లేకుండా చేశాయి.‌ తిరుమల ఆలయ అభివృద్ధి కోసం స్థానికంగా నివాసం ఉంటున్న వారందరికీ జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయంగా 1993లో హాఖరు లైసెన్స్ లు కేటాయించిన టిటిడి వాటిని 360 మందికి మాత్రమే పరిమితం చేసింది. మిగిలిన వారికి దుకాణాలు లైసెన్సులు కేటాయించింది. 2002లో అప్పటి జేఈవో బాలసుబ్రమణ్యం స్వయంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతి హాకరును క్షుణ్ణంగా పరిశీలించి వారికి లైసెన్సులను రెన్యువల్ చేసారు. వాటి నుండి నేటికీ ప్రతినెలా అద్దెలు వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి దుకాణాల తరహాలో రేకుల షెడ్డు నిర్మించుకునేలా అనుమతులు కూడా ఇచ్చారు.ఆఖరి లైసెన్సులు 360, దుకాణాలు 800 దాకా మొత్తం కలిపి 1200 సంఖ్యకు లోపు గానే కొండపై దుకాణాలు, హాఖరు లైసెన్స్ లు ఉండేవి. కానీ నేడు ఇవన్నీ అధికారికంగా ఆఖరు లైసెన్సులు 760, దుకాణాలు 1200 మొత్తం కలిపి 2 వేలకు చేరుకున్నాయి. ఇది కాదని అనధికారికంగా దాదాపు 1000 మంది కి పైగా తట్టలు ఆక్రమణలను నిర్వహించుకుంటున్నారు. ఒకే పేరుతో అనేక చోట్ల కలర్ జిరాక్స్ తో లైసెన్స్ లు చూపించుకుంటూ (తట్టలు) అనధికారిక తట్టలు, వ్యాపారాలు యదేచ్చగా కొనసాగుతోంది. తిరుమల కొండపై ఈ స్థాయిలో అక్రమ దుకాణాలు, తట్టలు పెరిగిపోవడానికి ప్రధానంగా టిటిడి రెవెన్యూ అధికారుల అవినీతే కారణంగా కనిపిస్తోంది. అనధికారికంగా స్థానికేతరులకు కొండపై హాకర్ లైసెన్సుల పేరుతో ఎప్పుడు ఎప్పుడో పాత కాగితాలు ఉంటే తీసుకు రమ్మని చెప్పి వాటిని తెలివిగా బోర్డు తీర్మానాలను అడ్డం పెట్టుకొని ఆ పాత కాయితాలపైనే ఇప్పటిదాకా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నామని వారి చేత చెప్పించి, అప్పటినుంచి ఇప్పటిదాకా హాకరు లైసెన్స్ లు పేరుతో వేలాది రూపాయలు టీటీడీకి చెల్లించేలా బ్యాంకు రసీదులను సృష్టించి, మళ్లీ వాటిని అధికారులకు ఫైల్ రూపంలో పెట్టి, ఇంత డబ్బు అద్దెలు రూపంలో చెల్లించారు కాబట్టి, సాకు చూపుతూ,వీరంతా అప్పటినుండి హాకరులుగా చెలామణీ అవుతున్నారని, వారి జీవనోపాధి కోసం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఉన్నతాధికారులను మభ్యపెట్టి వారి హాకర్ లైసెన్సులను క్రమబద్ధీకరించారు. తప్పు అని తెలిసినప్పటికీ రెవెన్యూ సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి, ఒక విధమైన పకడ్బందీ ప్లాన్ తో అక్రమాలకు అండగా నిలిచి కోట్లాది రూపాయల అక్రమ సంపాదన కోసం అనధికారిక హాకర్లను కొండపై క్రమబద్ధీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక సంస్థకు కార్యనిర్వహణాధికారిగా గత వైసిపి ప్రభుత్వం అండతో అంతా తానై ఐదేళ్లు పనిచేసిన ఏవి ధర్మారెడ్డి అటు ముఖ్యమంత్రికి విధేయుడు గానే కాకుండా ఇటు తన సామాజిక వర్గానికి కూడా అన్ని విధాలుగా సహకరించారు. పుణ్యక్షేత్రం పవిత్రత, భక్తుల మనోభావాలు మంట కలిసిపోయిన పరవాలేదు కానీ తనను నమ్ముకున్న వారు మాత్రం ఆర్థికంగా భవిష్యత్తులో స్థిరంగా నిలిచిపోయేలా అక్రమ అనుమతులు ఇచ్చేస్తూ అడ్డదిడ్డమైన పరిపాలన సాగించారు.‌కొండపై భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాల్సిన టిటిడి విజిలెన్స్ విభాగం కూడా రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై చోద్యం చూస్తోంది.‌ ఎప్పుడైనా ఆరోపణలు, పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ పేరుతో జెన్యూన్ గా టిటిడి అనుమతితో వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణాలు, లైసెన్సులు హాకరు లైసెన్సులపై పడి దాడులు నిర్వహించి, షాపు కంటే ముందు రెండు అడుగుల స్థలం క్రమించుకున్నారు అంటూ వస్తువులను తొలగించి డ్యూటీ చేశామని అనిపించుకుంటున్నారు. అంతేకానీ అసలు భక్తులకు సమస్యగా తయారైన, అసాంఘిక కార్యక్రమాలకు కారణమవుతున్న, అనధికారిక వ్యాపారాలపై, అక్రమ తట్టలపై వాటి తొలగింపు పై మాత్రం దృష్టి సారించకుండా వెళ్ళిపోతున్నారు. రాజకీయ ఒత్తిడితోనే ఈ విధంగా విజిలెన్స్ విభాగం రెవెన్యూ విభాగం వ్యవహరిస్తోందన్న విషయం బహిరంగ సత్యం. కాగా తాజాగా ఈవో శ్యామలరావు రెవెన్యూ విభాగం పై సమీక్ష జరిపారు. విశ్రాంత అధికారి మల్లికార్జున్ ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను అక్కడినుండి తప్పించి పరకామణి విధుల కోసం నియమించినట్లు తెలుస్తోంది. ఎస్టేట్ అధికారిగా తిరుపతి శ్వేతాలో విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి అనే అధికారిణి ని నియమించ నున్నట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి.

👉 “మాజి మంత్రి రజని” నా పొలాన్ని కబ్జా చేశారు. నా పొలం నాకు ఇప్పించండి..పల్నాడు జిల్లా శ్రీరామ్ వెంకటేశ్వరరావు..చిలకలూరిపేట పట్టణంలోని పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పసుమర్తి గ్రామశివారు లో వున్న తనకు చెందిన ఒక ఎకరం పొలాన్ని.. మాజీమంత్రి రజని, వారి అనుచరులతో తన పొలం కబ్జా చేశారని, తన పొలం తనకు ఇప్పించాలని బాధితుడు చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు…బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం తన తండ్రి 1987 వ సంవత్సరంలో పసుమర్తి గ్రామ శివారులో ఒక ఎకరం పొలం కొన్నారని, అప్పటి నుండి ఆ పొలం తమ ఆధీనంలో వుందని పేర్కొన్నారు…ఆ పొలం అప్పటి నుండి నేటి వరకు యూనియన్ బ్యాంకులో తనఖాలో వుందని వివరించారు…అయితే మాజీమంత్రి విడదల రజని మద్దినగర్ లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ ముందు ఎన్క్రొచ్మెంట్లో 34 కుటుంబాలు వున్నాయని వారు ఖాళీ చేయకపోవటంతో తనపొలంలో ఒక్కొక్కరికి సెంటుంపాతిక (1.25సెంటు) చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్ల ను చేసిందని అన్నారు…దీని తాలూకు తనకు ఏటువంటి డబ్బు చెల్లించలేదని తెలిపారు…అంతే కాక ఈ విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించినట్లు ఆయన తెలిపారు…తన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయకుండా తను హైకోర్టు నుండి స్టే కూడా తెచ్చుకున్నాను అని తెలిపారు…అయితే తమ గ్రామంలో రైతుల వద్ద లంచంగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వటంతో తాను కూడా స్థానిక ఎమ్మెల్యే పుల్లారావు, ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ను కలువ గా వారు చిలకలూరిపేట రూరల్ సీఐ ని కలవమని చెప్పటంతో నేడు పిర్యాదు చేసానని అన్నారు…సీఐ తనకు న్యాయం చేస్తారని తెలిపారని అన్నారు.

👉సైబరాబాద్ లో డ్రగ్స్ కలకలం..ఖాజాగూడ లోని ది కేవ్ పబ్ లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో దాడులు…కోకైన్ తీసుకుంటు పట్టుబడ్డ డీజే గౌరవ్…మొత్తం 54మందికి టెస్ట్ లు చేయగా 24మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తింపు…సైబరాబాద్, ఎస్ఓటి, నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్….

👉గుంటూరులో ఘరానా మోసగాడు..!!వెలుగు లోకి గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరుడు వనమ వజ్రబాబు (ప్రభుత్వ ఉద్యోగి) అక్రమాలు..?*గత ప్రభుత్వం లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకు కుచ్చుటోపీ..తన దగ్గరకు వచ్చిన ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు, కార్లు తీసుకొని వెనకి ఇవ్వని వైనం..న్యాయం కోసం సిద్ధమౌతున్న బాధితులు..

👉 ఇంటర్నెట్ లో ఒన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వారికి షాకింగ్ నిజాలు.995 కోట్ల పాస్‌వర్డ్స్ లీక్.. ప్రపంచంలోని ఇంటర్నెట్ యూజర్లకు సెక్యూరిటీ రిసెర్చర్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో ఆన్‌లైన్ అకౌంట్ల పాస్‌వర్డ్స్ దొంగతానానికి గురైనట్లు తెలిపారు. 994, 85, 75, 739 యూనిక్ పాస్‌వర్డ్స్ రాక్‌యూ 2024 డేటాబేస్‌లో ఉన్నట్లు చెప్పారు. ‘ఒబామాకేర్’ పేరుతో ఓ హ్యాకర్ వీటిని పోస్ట్ చేసినట్లు వివరించారు. పాస్‌వర్డ్‌తో పాటు వెరిఫికేషన్ కోసం టెక్స్ మెసేజ్ కోడ్ లేదా బయోమెట్రిక్ స్కాన్ వంటివాటిని డిజెబుల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

👉 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.. నగలు, డబ్బులే లక్ష్యం…!!!సంధ్య వలల్లో చిక్కుకున్న ఒక డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులతో సహా 50 మంది.తమిళనాడు – తిరుపూర్‌కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.పెళ్ళైన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పుతో అనుమానం వచ్చి తన ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది.. దీంతో అతను అడగగా సంధ్య చంపేస్తానని బెదిరించింది.దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించగా సంధ్యను అదుపులో తీసుకొని విచారిస్తే అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకుందని తెలిసింది…

👉 *గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ముత్తుముల*..

పాఠశాలలో మంచినీటి బోరు వేయించాలని కోరిన విద్యార్థినిలు.. బోరు వేయించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే..కంభం లోని గురుకుల బాలికల పాఠశాలలో ఆదివారం గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచినీటి కొరత ఉందని తెలియచేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సరియా కి ఫోన్ చేసి పాఠశాలలో ఒక మంచినీటి బోరు వేయించాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పాఠశాలలో వెంటనే బోరు వేయించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. విద్యార్థులకు విద్యా పరంగా గానీ, మౌలిక వసతుల విషయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.*

👉మెడికల్ షాపులు తనిఖీ.. గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు..ప్రకాశం జిల్లా కంభం .. డ్రగ్స్ మరియు పోలీస్ అధికారులు ఆదివారం కంభం పట్టణంలోని మెడికల్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్హులైన డాక్టర్ ప్రిస్స్క్రిప్షన్ లేకుండా, రసీదులు ఇవ్వకుండా మత్తును కలిగించే టాబ్లెట్లను విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై కంభం లోని షాపులలో తనిఖీలు చేసి రెండు షాపులపై కేసులు నమోదు చేశారు.ఐదు మంది గంజాయి తాగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కంభం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో మార్కాపురం డి.ఎస్.పి బాలసుందర్రావు, మార్కాపురం ఇన్స్పెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం