👉షర్మిలమ్మా జాగ్రత్తగా ఉండు.. నారాయణ సంచలన వ్యాఖ్యలు! వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ జీవించి ఉంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కమ్యూనిస్టులపై వైఎస్‌కు మంచి అభిప్రాయం ఉండేదని నారాయణ గుర్తు చేసుకున్నారు.దాన్ని ఆయన నిరూపించుకున్నారన్నారు. కొందరు నేతలు మనం బాగుంటే పలకరిస్తారని.. లేకపోతే పక్కకు పోతారన్నారు.కానీ, వైఎస్ అలాంటి వ్యక్తి కాదన్నారు. ఎవరైనా కలిస్తే.. పరిస్థితి ఏంటి? అని ఆరా తీసి.. సహాయం చేసేవారని గుర్తు చేసుకున్నారు.వైఎస్సార్ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తెలంగాణ ఏర్పడినా.. టీఆర్‌ఎస్ మాత్రం ఉండేది కాదన్నారు. రాజకీయాల్లో వైఎస్సార్ జెమ్ పర్సనాలిటీ అని నారాయణ తెలిపారు. రాజకీయాల్లో ఆయన ఒక విలక్షణ వ్యక్తి అని కొనియాడారు. ఆయనకు ఈ గుర్తింపు ఊరకే రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్ ను చాలామంది ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా వైఎస్సార్ కు ఇబ్బందులు తప్పలేదన్నారు. సొంత పార్టీ వ్యక్తుల నుంచే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా వైఎస్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని నారాయణ గుర్తు చేశారు. అయినప్పటికీ ఆ కష్టాలన్నింటిని ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టే వైఎస్సార్ రాజకీయాల్లో జెమ్ పర్సనాలిటీ అయ్యారని కొనియాడారు. రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారని నారాయణ మండిపడ్డారు. కానీ, వైఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీలోనే అనేక ఇబ్బందులు వచ్చినా అందులోనే ఉన్నారని గుర్తు చేశారు. అందుకే రాజకీయాల్లో వైఎస్సార్ ఒక విలక్షణ వ్యక్తి అని తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపైన నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదన్నారు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’అంటూ నారాయణ ఆమెకు హితబోధ చేశారు.రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ పై మరింత పోరాటం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే నష్టం జరుగుతుందన్నారు. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
👉 మహరాజ్ సినిమా!!!చరణసేవ పేరుతో మహిళలని వంచించే దురాచారంకి వ్యతిరేకంగా సంఘ సంస్కర్త కర్సన్ దాస్ చేసిన పోరాటమే మహరాజ్ సినిమా!చాలా మంచి సినిమా ! తప్పక చూడవలసిన— రేకా చంద్ర శేఖర రావు.
మహరాజ్ సినిమా హిందీ నుండి తెలుగు డబ్బింగ్ చేయబడిన సినిమా. 1860 ల కాలంలో ముంబయి ప్రాంతంలో జరిగిన కథ.దేవాలయ ప్రధాన పూజారి మహరాజ్ అంటే విపరీతమైన ఆరాధన, భక్తి కలిగి ప్రజలు ఉండేవారు. వారి అజ్ఞానాన్ని ఆసరా చేసుకుని యువతులలో తనకు నచ్చిన వారిని చరణ సేవకు ( పాద సేవకు) ఆహ్వానించే వాడు మహరాజ్. ఆహ్వానించిన స్త్రీలను మాయమాటలు చెప్పి వంచించి అనుభవించే వాడు. తాను చేసే చరణ సేవను చూడడం కూడా పుణ్యకార్యంగా ప్రజలు భావించి డబ్బులు చెల్లించి, అక్కడ మహరాజ్ చేసే శృంగార చర్యలను తన్మయత్వంతో చూసే వారు. తమ కుటుంబ యువతులను చరణ సేవకు పిలిచినందుకు ఆ కుటుంబ సభ్యులు పాయసం వండుకుని సంతోషంగా తినే వారు.👉కర్సన్ దాస్ అనే యువకుడు చిన్నప్పటి నుండి ప్రతిదీ ప్రశ్నించే స్వభావంతో ఎదుగుతాడు. అందరినీ మనుషులుగా చూస్తాడు. దళితుల పట్ల అనుసరిస్తున్న అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు.
ఆ కర్సన్ దాస్ కిషోరి అనే యువతి ఇద్దరూ ప్రేమించు కుంటారు. కిషోరికి దైవ భక్తి చాలా ఎక్కువ. తన దైవ భక్తి కర్సన్ దాస్ మీద ప్రేమ కన్నా ఎక్కువ అని కూడా చెబుతుంది.
👉మహరాజ్ ఒక రోజు కిషోరి అందాన్ని చూసి మోజు పడి తన చరణ సేవకు ఆహ్వానిస్తాడు.ఆ విషయం ఎంతో సంతోషంగా
ఆ కుటుంబం అతని చరణ సేవకు కిషోరిని పంపుతుంది, వారు పాయసం వండుకుంటారు.
ఈ సంగతి తెలిసిన కర్సన్ దాస్ మహరాజ్ మందిరానికి వెళతాడు,అక్కడ మహరాజ్ చేస్తున్న శృంగార చేష్టలు చూసి ,కిషోరిని హెచ్చరించి బయటకు రమ్మని అరుస్తాడు కర్సన్ దాస్.కిషోరి తల ఎక్కిన మత పిచ్చితో నేను రాను , నువ్వు వెళ్ళు అంటుంది. కర్సన్ దాస్ కోపంతో , బాధతో వెళ్ళి పోతాడు.మహారాజ్ కిషోరిని నా ఇష్ట సఖిగా వుంటావా! అంటే కిషోరి ఎంతో సంతోష పడుతుంది.కర్సన్ దాస్ నీతో నాకు ఏమీ సంబంధం లేదు, అప్పటికే పెద్దలు వారి ఇద్దరికీ కుదిర్చిన జరగవలసిన పెళ్ళిని రద్దు చేసుకుంటున్నాను అంటాడు . ఆ విషయం కర్సన్ దాసు ఇంట్లో – తన సంరక్షకుడు అయిన మేన మామతో వాగ్వాదానికి దారి తీస్తుంది.పెళ్ళి ఎందుకు రద్దు చేసుకుంటావు, ఈ ఆచారం తరతరాలుగా జరుగుతున్నదే, మీ అత్త , మీ పెద్దమ్మ అందరూ అలా మహరాజ్ చరణ సేవ చేసిన వారే అంటాడు.ఈ విషయమై జరిగిన వాద వివాదాల ఫలితంగా కర్సన్ దాస్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి పోతాడు.ఒక రోజు కిషోరి మహరాజ్ ఇంటికి వెళుతుంది,తలుపుల దగ్గర ఉండగానే మహరాజ్ మాటలు వినపడతాయి. “ నువ్వు నా ఇష్ట సఖిగా వుంటావా !”అన్న మాటలు విన పడతాయి. ఆశ్చర్యంగా లోపలకు తొంగి చూస్తుంది కిషోరి. అక్కడ ఆ మాటలు మహరాజ్ అంటున్నది తన సొంత చెల్లెలుతో అని తెలిసి , కిషోరి తీవ్ర ఆగ్రహంతో తన చెల్లెలు చేయి పట్టుకుని ఈడ్చుకుని ఇంటికి తీసుకెళుతుంది.
అక్కా! నేను తప్పు ఏమి చేశానని అడుగుతుంది. మహరాజ్ ఎంత మోసం చేస్తున్నాడో నీకు తెలియడం లేదు అని కిషోరి అంటుంది.
చెల్లెలుకు జరుగుతున్న మోసాన్ని అర్ధం చేయించుతుంది. ఆ తర్వాత కర్సన్ దాస్ తిరస్కృతికి గురయిన కిషోరి ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటికే కిషోరిలో పొరపాటు లేదు మహరాజ్ వంచనకు గురయిందని అర్ధం చేసుకుని ఆమెను స్వీకరించాలి అని కర్సన్ దాస్ ఆలోచిస్తుంటాడు , అప్పుడు జరిగిన కిషోరి ఆత్మహత్య సంఘటన కర్సన్ దాస్ జీవితాన్ని మార్చేసింది.
తాను మహారాజ్ మోసాలను ప్రజలకు చెప్పి చైతన్య పరచాలి అనే దృఢమైన నిర్ణయానికి కర్సన్ దాస్ వస్తాడు.👉అక్కడ నుండి కర్సన్ దాస్ మహరాజ్ కి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మహరాజ్ పెట్టిన ఎన్నో ఇబ్బందులు , కష్టాలు ఎదుర్కుని చివరకు విజయం సాధించాడు అన్న కధ సినిమాలో చూడవలసిందే! ఆనాటి బ్రిటీషు జడ్జీలు ఎంత న్యాయబద్దంగా ఉండే వారు అనేది కూడా మనకు అర్ధం అవుతుంది. ఈ నాటి మన న్యాయ వ్యవస్త ఎంత డొల్లగా ఉంటున్నదో మనకు తెలిసినదే! కోర్టులో మహరాజ్ తరతరాలుగా మా దగ్గరకు కన్యలను పంపడం దైవ కార్యంగా ప్రజలు భావిస్తారని, పెళ్ళయిన మొదటి మూడు రోజులు వధువులను మేము అనుభవించి పంపాలని ప్రజలు కోరుకుంటారు అని చెప్పిన విషయాలు ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉన్నారో మనకు అర్ధం అవుతుంది. ఇది దురాచారం అని కర్సన్ దాస్ ఎలుగెత్తి చాటి తన మీద మోపిన పరువు నష్టం దావాలో గెలుస్తాడు.
జడ్జీలు ఇది చాలా దురాచారం అని ఖండిస్తారు. తర్వాత కాలంలో ఇలాటిదురాచారాన్ని రద్దు చేస్తూ చట్టం చేస్తారు.
కోర్టు విచారణలో విశృంఖల వ్యభిచారి అయిన కారణంగా ప్రధాన పూజారి మహరాజ్ కి సిఫిలిస్ వ్యాధి అని బయటపడుతుంది. ఈ సినిమా చిత్రీకరణ చాలా సహజంగా ఉంది. 150 సంవత్సరాల నాటి ముంబయి వాతావరణాన్ని సినిమాలో చూపించారు. మహరాజ్, కర్సన్ దాస్, కిషోరిల పాత్రలు చేసిన వారి నటన చాలా బావుంది. తక్కువ పాత్రలతో మంచి సినిమా తీశారు.
దీనిని Net flix లో చూడవచ్చును.150 సంవత్సరాల నాడు ఎలాటి దురాచారాలు ఉండేవి, వాటిని రూపుమాపటానికి సంఘ సంస్కర్తలు ఎంత శ్రమకోర్చి కష్టపడ్డారు అనే విషయాలు ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తాయి.
* కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య హత్య జరిగి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు దోషులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు అనగా 8వ తేదీన వెలగపూడి లోని సచివాలయంలో హోమ్ మినిస్టర్ అనితను దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక కలసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది .ఈ సందర్భంగా హోంమినిస్టర్ అనిత మాట్లాడుతూ దోషులను తక్షణమే అరెస్టు చేసే వైపుగా చర్యలు తీసుకుంటామని ఐక్యవేదికకు హామీ ఇవ్వడం జరిగినది.కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులైన బహుజన డెమొక్రటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు డెన్నిస్ రాయ, భీమ్ భారత్ రాష్ట్ర కార్యదర్శి పాగళ్ల ప్రకాష్ ,భారత్ బచావో రాష్ట్ర నాయకులు సమతా సిపిఐ ఎంఎల్ ప్రజా పోరు రాష్ట్ర నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు బీసీ నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర నాయకులు తాడికొండ నరసింహారావు బీసీ మహిళా సంఘం నాయకురాలు విజయలక్ష్మి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వేల్పురి నరసింహ రావు చారువాక యూత్ రాష్ట్ర నాయకులు డేవిడ్ విలియమ్స్ తోపుడుబండ్ల సంఘ నాయకులు తన్నీరు సాంబయ్య బహుజన సామాజిక విశ్లేషకులు సాగు మాల్యాద్రి నాదెండ్ల బ్రహ్మయ్య సతీమణి సామ్రాజ్యం గారు భీమ్ సేన రాష్ట్ర నాయకులు నీలాంబరం అలాగే దళిత బహుజన ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ న్యాయవాది సికా సురేష్ బీసీ మహాజన సభ నాయకులు ఉగ్గం సాంబశివరావు ప్రజా పోరు నాయకులు దేవా తదితర నాయకులు పాల్గొనడం జరిగినది.
👉ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ తొక్కిసలాటలో చనిపోయిన హిందూ భక్తుల కుటుంబాలకు 10000,గాయపడిన వారికి 5000 ఆర్థికసహాయం చేసిన జామియత్ ఉలమాయే హింద్.
ఈ కార్యక్రమాన్ని మనసులను కలిపే కార్యక్రమంగా మౌలానా అర్షద్ మదని తెలిపారు.
* ఆన్లైన్ లో భారతి సేవా ట్రస్ట్ పేరిట ఒక వ్యక్తి అందరికీ ఫోన్లు చేసి తము అద్భుతమైన వెబ్సైట్లు తయ్యారు చేసే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము అని తమ వ్యాపారానికి అనుగుణంగా తమకు ఒక మంచి వెబ్సైట్ చేసి ఇస్తామని నమ్మబలికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి నెలల తరుబడి తమ పని చేయకపోగా తిరిగి వారినే దుర్భాషలాడి దౌర్జన్యం చేస్తున్నాడు.. అతను మాట్లాడిన మాటలకు కోపంతో తిరిగి తిట్టిన మాటలను మాత్రమే రికార్డు చేసుకొని ఇంకో సారి డబ్బు తిరిగి అడిగినా లేదా తమ పని చేయమని బలవంత పెట్టినా నువ్వు తిట్టిన రికార్డులను కమిషనర్ కి ఇస్తాను అని చెప్పి వెంటనే తన భార్యతో సైతం వీడియో కాల్స్ చేయించి చెప్పుకోలేని రీతిలో యువకులను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.. ఇతని గురించి మా విలేకరులు తెలుసుకోవడానికి ప్రయత్నించగా “లైవ్ తిరుపతి” అనే ఒక వెబ్సైట్ పెట్టుకొని సేవల పేరిట డబ్బు వసూలు చేసి తన భార్య చేత ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా చేసి చానల్స్ లో కనిపించడమే ఎజెండా గా వీరు వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని ఏమైనా అంటే నేను వెళ్లి ట్రాఫిక్ లో కూర్చొని ధర్నా చేస్తా మిమ్మల్ని రోడ్డుకు లాగుతా అని తన భార్య దేవిరెడ్డి పద్మా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.వీరు ఇంకా చాలా మందితో వెబ్సైట్ పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేశారు అని తెలుస్తోంది.. ఇలా వీరి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే 9000560939 ఈ నంబర్ కి సంప్రదించండి. వీరు మాట్లాడిన ప్రతి ఆడియోతో పాటు వీరికి పేమెంట్ చేసి మోసపోయిన పూర్తి వివారలతో మరియు వీరు పాల్పడుతున్న అన్యాయాలు అన్నీ సాక్షాధారలతో సహా రేపు జనం న్యూస్ ఛానల్.. మరియు “PSN NEWS” “i dreams” sumantv” లొ స్పెషల్ వీడియో స్టోరీ ఇవ్వబోతున్నాము అందరు చూసి మీకు తెల్సిన ప్రతి పోలీసు అధికారికి ఈ విషయం చెరవేయవలసిందిగా కోరుతున్నాము.