👉 బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా❓బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డట్లు తెలిసింది.గత కొన్ని రోజుల నుంచి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఐసొలేషన్‌లో ఉన్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి కూడా ఆయన పాల్గొనలేదని సమాచారం. కాగా అక్షయ్ నటించిన ‘సర్ఫిరా’ ఇవాళ థియేటర్ల లో విడుదలైంది.
👉చెల్లెలి మృతదేహాన్ని 5 కి.మీ. భుజంపై మోసు కెళ్లిన అన్నలు..
ఉత్తరప్రదేశ్ లోని లఖీం పూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచే సుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజీ బాలిక మెరుగైన వైద్యం అందక కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోద రులు భుజంపై మోసుకుం టూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం తాజాగా వెలుగు లోకి వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. రెండు రోజుల కిందట శివానీ టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు.కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపి స్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది.
👉అచ్చెన్నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ముత్తుముల…ఈ రోజు ఏపీ సచివాలయంలోని మినిస్టర్స్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమలు, మార్కెటింగ్, సహకార మరియు మత్స్యశాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడుని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు
👉కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు.ప్రకాశం జిల్లా…సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. అభినందించిన జిల్లా ఎస్పీ..గరుడ్ సుమిత్..
దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్‌లు రిసీవర్లను పట్టుకోడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 8 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు విశేష ప్రయత్నాలు చేసి తక్కువ వ్యవధిలో (1 వారంలోపు) 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను గుర్తించారు. ఇద్దరు మొబైల్ దొంగతనాల నేరస్థులను వాటిని కొనే 5 మొబైల్ షాప్ యజమానులను అరెస్టు చేయటం జరిగింది. సాంకేతికత ఇతర ఆధారాలను ఉపయోగించి దొంగిలించబడిన మొబైల్‌లను సేకరించటం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి..
👉బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు!*బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు.జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులను SDRF, NDRF బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
👉తన కూతురిని అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు .. ఏడాది గడిచినా ఇప్పటికీ కేసు ఫైల్ చేయలేదు.. నంద్యాల పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయం కోసం తిరుగుతున్న ఓ తల్లి ఆవేదన..
మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ మౌలాలి,ఖాసీంబి దంపతులకు ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. భర్త మౌలాలి చిన్న చికెన్ కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసేవాడు. అతనికి వచ్చే ఆదాయంతో కాసింబి కూడా పలకల ఫ్యాక్టరీలో కూలీ పనిచేస్తూ పిల్లలను పోషించుకునేవారు . ఒక్కగానొక్క కూతురైన మున్నీని ఎంతో గారాబంగా చూసుకునే వారు. ఆమెను బీకాం కంప్యూటర్స్ మరియు టిటిసి వరకు చదివించారు.👉 2018లో తమ సమీప బంధువు అయిన గిద్దలూరు మండలం, కొమ్మునూరు గ్రామానికి చెందిన షేక్ ఖాసీం కుమారుడు కరీముల్లా కు రెండు లక్షలు నగదు మూడున్నర తులాల బంగారు, ఒక బంగారుఉంగరం తదితరాలు కట్న కానుకలుగా ఇచ్చి ఇస్లాం సంప్రదాయం ప్రకారం వివాహం జరిపారు. కరీముల్లా నంద్యాలలోనే వికాస్ ప్రింటర్స్ లో పనిచేసేవాడు.వారికి ఇద్దరు కుమారులు కలిగారు. కరిముల్లాకు వివాహానికి ముందే తన సమీప బంధువైన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని,వివాహమైనప్పటికీ వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుండడంతో, కరీముల్లా మా భూమి దంపతులు మధ్య అనేకమార్లు వివాదాలు జరిగేవని, మాబున్ని అంటే తనకు ఇష్టం లేదని,మీ కుటుంబం అంతా దరిద్రులని,ఆమెను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, కరీముల్లా అనేక సూటి పోటి మాటలతో ఆమెను అసభ్యకరంగా తిట్టి కొట్టేవాడని మున్ని తల్లి కాసింబి ఆమె మామ, చిన్న కాసిం తెలిపారు. దీంతో మాబుని తనంటే ఇష్టం లేకుంటే తనను తన పిల్లలను తన పుట్టింట్లో వదిలేస్తే తమ బతుకుతామని పలుమార్లు చెప్పి ఏడ్చేదని వారు తెలిపారు . తాము సముదాయించి పంపే వారం అన్నారు.దీంతో తన కూతురి పీడ వదిలించుకోవాలనే దురుద్దేశంతో కరిముల్లా 2023 జూన్ 29 రాత్రి తమ కూతురు అకస్మాత్తుగా కింద పడిపోయిందని తమకు ఫోన్ చేయగా తాము వెళ్లేసరికి తమ కూతురు విగత జీవురాలై పోస్టుమార్టం గదిలో కనిపించిందని కాసింబి కన్నీరు మున్నీరుగా గుండె లవిసేలా రోదిస్తూ ఆరోపించింది . తన కూతురు పొట్ట ఎంతో ఉబ్బి పోయి ఉందని ఛాతీ పై కమిలిన గాయాలు ఉన్నాయని,తన అల్లుడు కరీముల్లా ఆమెను తీవ్రంగా కొట్టడం వలన గాని లేదంటే ఏదైనా మందు తాగించి హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో నంద్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .👉 ఐతే ఏడాది దాటిన నేటికీ చార్జి సీటు దాఖలు చేయకపోవడంపై అనుమానాలు ..2023 జూన్ 30వ తేదీన కేసు నమోదు అయితే నేరం మోపబడిన ముద్దాయి పై పోలీస్ శాఖ వారు కేసు ఫైల్ చేయక పోవడం,సంబంధిత కోర్టులో ఇప్పటి వరకు దాఖలు చేయకపోవడంపై, అలాగే పోస్టు మార్టం రిపోర్ట్ లో మృతురాలు ఒంటి పై గాయాలు లేవన్న అంశాల పై 2023 ఆగస్టు 1వ తేదీన ల్యాబ్ నుండి ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు వచ్చిన కోర్టులో సబ్మిట్ చేయకపోవడంపై మున్ని బందువులు అనుమానాలు వ్యక్తం చేశారు. సంబంధితపోలీసు శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కేసుపై సమగ్రమైన విచారణ జరిపి మున్ని మృతికి కారకులైన వాడిని కఠినంగా శిక్షించాలని ,లేని పక్షంలో న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేపడతామని మున్ని తల్లి బంధువులు హెచ్చరించారు.
👉స్కూల్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ అమూల్య..ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బోడ్డువానిపల్లి గ్రామంలోని ఎంపీ యూపీ పాఠశాలలో శుక్రవారం ఎంపీపీ కామూరి అమూల్య విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు బాగా వినియోగించుకొని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. తల్లితండ్రులు గురువులు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి,సూరవారి పల్లి సర్పంచ్ కాశమ్మ, మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారులు వెంకటరత్నం,వెంకటేశ్వర్లు మరియు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
👉 విద్యార్థినిపై లైంగిక వేదింపులు చేసిన హెడ్ మాస్టర్.. విషయం బయటకి రాకుండా రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చిన పోలీస్ అధికారి, విద్యాశాఖ అధికారి..కామారెడ్డి – బాన్సువాడ మండలంలోని దేశాయిపేట జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నరేందర్ తన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, శనివారం ఒక స్కూల్ రూంలో లైంగికంగా వేధించాడు.. ఇది చూసిన విద్యార్థులు ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు.దీంతో వాళ్లు సోమవారం పాఠశాలకు రాగ నరేందర్ గైర్హాజరయ్యాడు.. ఈ విషయం బయటకి వెళ్లకుండా ఓ పోలీస్ అధికారి, ఓ విద్యాశాఖ అధికారి, పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిసి ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి రూ. 1.5 లక్షలకు రాజీ కుదిర్చారు.ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి, హెడ్ మాస్టర్ నరేందర్ మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
👉 రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం గా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారం గా వారిని 7 ఏళ్ల జైలు* శిక్ష కు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు… ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వారు కూడా ఈ శిక్షనే వేస్తారు. హైకోర్టు సుప్రీంకోర్టు, GO, తీర్పులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అవినీతి అధికారులు నాయకులు, మరి ఈ అవినీతి నీచ అధికారులు పైన నాయకుల పైన ఆదాయ పన్ను శాఖ వారు మరియు, ED, IT, CB,CiD శాఖలు ఏం చేస్తున్నాయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటూ కళ్ళు ఉండి గుడ్డివాడిలా నటిస్తున్నారా మీ నుండి తప్పించుకున్న ఈ అవినీతిపరులను పంచభూతాలు ప్రకృతి విడిచిపెట్టదు ఘోరమైన శిక్షలు తప్పవు ఈఅవినీతిపరులకు, స్థానిక సంబంధిత ఉద్యోగస్తులకు శిక్షణ తప్పవు, రండి చేయి చేయి కలపండి భావితరాల భవిష్యత్తు కోసం అవినీతి అంతం వైపు అడుగులు వేయండి.