👉ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు …
ఈ కాళ్లకు దండం పెట్టే సంస్కృతిపై స్పందించారు. ఈ సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… రాజకీయాల్లో పాదాభివందనాలు చేస్తూ అడుగులకు మడుగులొత్తే సంస్కృతికి తెరదించాలని నిర్ణయించారు.ఈ మేరకు పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. ఇదే సమయంలో తాను కూడా ఇకపై దీన్ని పాటిస్తానని ప్రకటించారు. అవును… శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని నేతలకు సూచించారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే.. వారి కాళ్లకు తాను కూడా దండం పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన బాబు…జన్మనిచ్చిన తల్లితండ్రులు, భగవంతుడి కాళ్లకు మాత్రమే దండం పెట్టాలి తప్ప రాజకీయ నాయకులకు కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నాయకుల కాళ్లకు దండాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని సూచించారు.ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దని ప్రజలు, పార్టీ శ్రేణులకు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు బాబు తెలిపారు.
👉ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిదేవి. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి. చంద్రబాబు తో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
👉ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖలో కొత్త లొల్లి* ..దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై ఆమె భర్త మదన్ మోహన్ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణకు ఫిర్యాదు !!!.తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు.తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్.తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ ను కోరుతూ లేఖ.ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్.దేవదాయ శాఖలో సంచలనంగా మారిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కంప్లైంట్.
👉జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం*జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలోనే ఛేదించింది.ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93*), శుభ్మన్ గిల్ (58*) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డారు.నామమాత్రమైన చివరి మ్యాచ్ రేపు జరగనుంది.
*👉ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’: మంత్రి అచ్చెన్నాయుడు…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంత్రి శనివారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ వారం బుధవారంలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.
👉ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా..
గనుల శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్న ఎంకే మీనా. నిన్ననే ఏపీ సీఈవో బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా ను రిలీవ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
👉 తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు భూస్థాపితం…ఒకప్పుడు టీడీపీ తెరాస వల్ల పతనం… ఇప్పుడు కాంగ్రెస్ వల్ల బి. ఆర్. ఎస్ పతనం… చివరకు మిగిలినవి జాతీయ పార్టీలు… బీజేపీతో దోస్తానా చేసిన ఏ పార్టీ అయిన భూస్థాపితమే… దేశం మొత్తంలో పరిశీలించండి… కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతీయ పార్టీలను అంగదొక్కింది ఎవరో… విధి, విధానాలు, మైత్రి సంభందం, సైద్ధాంతిక దృక్పధం లేని కెసిఆర్ వల్ల అందరు నట్టేట మునిగారు… ఇప్పుడు అయిన కళ్ళు తెరవండి… జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో స్నేహంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ నినాదంకి మద్దతు ఇచ్చిన జాతీయ నాయకులను, ఉద్యమ మేధావులను తులానాడి, తన రాజకీయ లక్ష్యం కోసం ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి, ప్రశ్నించే గొంతుకులను నిర్భందాలకు గురి చేసి, తెలంగాణ తన అబ్బా జాగీర్ అనుకోని పాలించిన నియంత కెసిఆర్ కి తగిన గుణపాఠం జరిగింది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో వెన్నుపోటు దారులే ఇప్పుడు ఆయనను వదిలి కాంగ్రెస్ పంచన చేరుతున్నారు… అయిన మళ్ళీ ఏమి చేస్తారో ఈ వెన్నుపోటు దారులు కాంగ్రెస్ ను…. రేవంత్ రెడ్డి కూడా ఆ జాగ్రత్త వహించాలి.
👉 వారిని వదలవద్దు: రఘురామకృష్ణ రాజు.. తనను కస్టడీలో హింసించిన నిందితులను వదిలిపెట్టవద్దని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు అన్నారు. వారిని అరెస్టు చేసి కస్టడీలో విచారించాలని పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయనీ వాటిని విచారణ అధికారికి అందిస్తానని తెలిపారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు నిందితులను బయటకు వదలవద్దని కోరారు. సాక్షులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు.