👉మోడీకి కేసీఆర్ కి ఎమోషనల్ ఓటు పోయిందా???
ఇక ఎమోషనల్ కనెక్షన్ తోనే మోడీ అయినా కేసీఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారని అంటారు.ఒకే సమయంలో కేంద్రంలో మోడీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు.ఇద్దరూ రెండు సార్లు గెలిచారు.అయితే మూడవసారి కేసీఆర్ ఓటమి చెంది ప్రతిపక్షానికి పరిమితం అయితే బీజేపీ మాత్రం సొంతంగా మెజారిటీ రాని నేపధ్యంలో మిత్రుల మీద ఆధారపడి అధికారాన్ని దక్కించుకున్నది.ఇక ఎమోషనల్ కనెక్షన్ తోనే మోడీ అయినా కేసీఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారని అంటారు. ప్రజలతో ఆ విధమైన బాండింగ్ కానీ ఎమోషనల్ టచ్ కానీ వారు ఏర్పాటు చేసుకుని వరస విజయాలను అందుకున్నారు అన్నది ఒక విశ్లేషణ.అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ అయితే ఓటమి చెంది విపక్ష నేతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని నడిపిస్తున్న మోడీకి మాత్రం అపజయాలు ఎదురవున్నాయి.తాజాగా జరిగిన 13 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీ దక్కించుకుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న చర్చ అయితే తీవ్ర స్థాయిలో జరుగుతోంది.దీని కంటే ముందే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే నరేంద్ర మోడీకి కన్ను లొట్టబోయిన చందంగా రిజల్ట్ దక్కింది. సింపుల్ మెజారిటీని సైతం అందుకోలేని విధంగా బీజేపీ పరిస్థితి తయారైంది.దాంతో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు, బీహార్ కి చెందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ ల సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.👉ఇదే తెలంగాణాలో చూసుకుంటే కేసీఆర్ కి రెండు సార్లు కలసివచ్చిన తెలంగాణా వాదం భావ జాలం సెంటిమెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది. అందుకే 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలు అయ్యారని అంటారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ సెంటిమెంట్ గట్టిగా పని చేయబట్టే జగన్ ఏపీకి ఒకసారి సీఎం అయ్యారు అని అంటున్నారు.అది కాస్తా 2024 ఎన్నికల్లో గాయబ్ కావడంతో జగన్ సైతం మాజీ సీఎం కావాల్సి వచ్చిందని అంటున్నారు.ఇక ఇపుడు జాతీయ స్థాయిలో ఉప ఎన్నికల ఫలితాలు చూసినా సెంటిమెంట్లు ఏవీ లేవు కేవలం అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేస్తున్నారని అర్ధం అవుతోంది.ఈ నేపధ్యంలో ప్రజలకు హిందూత్వ సెంటిమెంట్ తో టచ్ లోకి వచ్చిన బీజేపీకి 2024 ఎన్నికల ఫలితాలు కానీ తాజా ఉప ఎన్నికల రిజల్ట్స్ కానీ శరాఘాతమే అని అంటున్నారు.బీజేపీ నమ్ముకున్న సెంటిమెంట్ అలాగే ఆ పార్టీ మొదటి నుంచి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న అమ్ములపోదిలోని అస్త్రం కానీ ఈసారి ఎందుకో పనిచేయడం మానేసింది.దేశంలో మెజారిటీ ప్రజలు మైనారిటీలు అంటూ ఎంతగా గొంతు చించుకున్నా కూడా ఓట్లు రాలడం లేదు. అదే సమయంలో రామాలయం నిర్మాణం జరిపిన అయోధ్యలోనూ బీజేపీ ఓటమి పాలు కావడం కొత్త్త ఆలోచనలను రేపుతోంది. ఇక తెలంగాణాలో చూస్తే తెలంగాణా వాదం ముందు ఏది అయిన బలాదూర్ అన్న అంచనా ఉండేది.దాని ముందు ఎంతటి బడా పార్టీలు వచ్చినా ఓటమి చెందేవి. మన తెలంగాణా అంటూ జనంలో ఎమోషన్స్ ని రగిలించి సొమ్ము చేసుకున్న తీరు కూడా బీఆర్ఎస్ ఎదుగుదలలో స్పష్టంగా కనిపించింది. ఇక ఎదురు లేదు అన్న పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఓడి ఎక్కడో దూరంగా ఉండడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని కూడా చర్చ సాగుతోంది.ఏపీలో చూస్తే వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు సెంటిమెంట్ గా మారి వైసీపీ రాజకీయ ప్రయాణానికి కావాల్సినంత ఇంధనాన్ని సమకూర్చి పెట్టాయి దాంతోనే ఇంతింతై అన్నట్లుగా ఎదిగి వైసీపీ 151 సీట్లతో అధికారం చేపట్టింది.అయితే 2024లో చూస్తే కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం అంటే సెంటిమెంట్ అన్నది పూర్తిగా కరిగిపోయిందని అంటున్నారు. సహజంగా ఈ దేశ వాసులు సెంటిమెంట్ కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అది రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా ఉంటూ వస్తోంది.అయితే దానినే పదే పదే ప్రయోగిస్తే వికటిస్తుందన్న సత్యాన్ని 2024 ఫలితాలు దేశ వ్యాప్తంగా చాటి చెప్పాయని అంటున్నారు.👉పైగా ఎంతసేపూ సెంటిమెంట్ అంటూ పోతే డెవలప్మెంట్ అవసరం కూడా లేదా అన్నది జనం నుంచి వస్తున్న జవాబుగా ఉందని అంటున్నారు.అందుకే ఈసారి జనాలు ఎమోషన్స్ కి అసలు ఏ మాత్రం పడిపోలేదు. వాస్తవిక దృక్పథంతో అన్నీ ఆలోచించి ఓట్లు వేశారు. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం దేశంలో సెంటిమెంట్లకు ఎమోషన్లకు కాలం చెల్లినట్లే అంటున్నారు. నిజంగా అలాంటి రోజులు వస్తేనే అభివృద్ధి అజెండాతో పార్టీలూ ముందుకు వస్తాయని అంటున్నారు.
👉 నారా చంద్రబాబు నాయుడు సారద్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే గుంటూరు నుండి శ్రీశైలం నడిచి వస్తామని మొక్కుకొని, ఆ మొక్కు తీర్చుకోడానికి బయలుదేరిన లాం శ్రీధర్, గోరంట్ల సాంబశివరావు, కాపు నాగేశ్వరరావు, ఘంటా నాగేశ్వరరావులను వినుకొండ సమీపంలోని నడిగడ్డ గ్రామంలో మహానాడు మీడియా అధినేత బోడెపూడి వెంకట సుబ్బారావు (BSR) సారథ్యంలో TDP నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి వారు యాత్ర శుభప్రదంగా సాగాలని ఆకాక్షించారు…
👉 మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపణలపై
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి వివరణ..
మదన్ మోహన్ అనే వ్యక్తి నా మాజీ భర్త..
అతని నుంచి నేను విడిపోయి 2020సంవత్సరంలో నేను సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నాను.మా వివాహం తరువాత నాకు బాబు పుట్టాడు..నాకు విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.ఆయన కూతురు వయస్సు ఉన్న నాపై నా మాజీ భర్త అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి..నేను, నా మాజీ భర్త మదన్ మోహన్ విడాకులపై ఒప్పంద పత్రం చేసుకున్నాం.
నా ప్రస్తుత భర్త గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌కు కూడా ఇది రెండో వివాహం..నాకు, నా మాజీ భర్తకు మధ్య ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉన్నాయి.వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.అదే ఇతర కుల అమ్మాయిలు అయితే వ్యవహారం అయితే మీడియా స్పందన ఇలా ఉంటుందా? ఆలోచించండి అనే ప్రశ్నించారు.
👉👉ఒక సాధారణ వ్యక్తి ఫొటో గ్రాఫర్ ఎంపి అయ్యాక (12) కోట్ల రూపాయలతో కృష్ణా నది ఒడ్డున విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం ఎలా సాధ్యం? ఒక సాధారణ ఇసుక పనికి పోయిన వ్యక్తి ఎంపి అయ్యాక (40) కోట్లతో బాపట్ల MP అనే బయోపిక్ సినిమా ఎలా తీయగలిగాడు?ఒక సాధారణ అరిటాకులు అమ్ముకున్న వ్యక్తి ఎంపి అయ్యాక (4) అడి కార్లు (3) రేంజ్ రోవర్ కార్లు (3) BMW కార్లు ఎలా వచ్చాయి ఎలా సాధ్యం? ఒక సాధారణ ఎంపి వ్యక్తికి విజయవాడ గురునానక్ కాలనీ లో డూప్లెఎక్స (4)కోట్లు రూపాయలతో ఎలా వచ్చాయి?..ఒక సాధారణ ఎంపి హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ORR పరిదిలో ఎకరం 9 కోట్లతో (15) ఎకరాలు ఎలా సాధ్యం* *ఎలా సాధ్యం అయింది అంటే అక్రమంగా ప్రజల నుండి అమరావతి లో ఇసుక సెట్టిల్ మెంట్స్ ప్రజల దగ్గర దోచుకొన్న పాపపు సొమ్ముతో కులుకుతున్న పంది కొక్కు ఈ (పందిగామ సురేష్) వీడి మీద CID enquiry జరిపించాలి.. ప్రస్తుతం ఇది వార్త నెట్టింట్లో హల్ చల్ సృష్టిస్తుంది.
👉బిగ్ బ్రేకింగ్ న్యూస్. …. గోవిందా గోవిందా.. తిరుమలలో. దర్శనాలలో భారీ కుంభకోణం. రోజు పదివేల మందికి శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లు జారీ..??? పదివేల రూపాయలు ఒక్క భక్తుని దర్శనానికి దాంట్లో కేవలం 500 రూపాయలు మాత్రమే టీటీడీకి …?? మిగతా అమౌంట్ “””శ్రీవాణి ట్రస్ట్ పేరుతో భారీ మోసం. “” గత ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు కోటి రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధులు వీటికీ లెక్కలు చెప్పరు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు మొత్తం తాడేపల్లి జగన్ ప్యాలెస్ కి … శ్రీవాణి ట్రస్ట్ నుండి ఇప్పటివరకు ఇరవై వేల* *కోట్లు దోపిడి* *కలియుగ దైవం వెంకటేశ్వరుడికి శఠగోపం* . తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఈ మోసాన్ని తెలుసుకోండి.. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో సంచలనం సృష్టిస్తుంది.
👉GPS రద్దు చేసి OPS అమలు చేయాలి : ఉద్యోగ సంఘాలు..గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS)ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు GPSను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్(OPS)ను తీసుకురావాలని SGTF, PRTU, UTF, సీపీఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..గెజిట్ పత్రాలను దహనం చేశాయి..ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు APTF వెల్లడించింది.
👉 మాజీ మంత్రి స్వర్గీయ కీర్తి శేషులు దామచర్ల ఆంజనేయులు 95 వ జయంతి వేడుకలు.. తుర్పునాయుడుపాలెం లో సోమవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యా పాల్గొని ఆంజనేయులు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
👉మర్రిపూడి లో ఘనంగా దామచర్ల జయంతి వేడుకలు..
మండల కేంద్రంలో మర్రిపూడిలో సోమవారం *స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,సందర్భంగా మర్రిపూడి బస్టాండ్ సెంటర్ లోని స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు,కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాలకు మండల టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు,ఈసందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేరెడ్డి నర్సారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు తుళ్లూరి నరసింహారావు, టిడిపి సీనియర్ నాయకులు రేగుల వీరనారాయణ, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గొంటు హనుమారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు యర్రoరెడ్డి వెంకటరెడ్డి టిడిపి నాయకులు చేరెడ్డి నరసారెడ్డి, బీసీ నాయకులు కొనిదెన మోహన్ రావు, చిలంకూర్ శ్రీను, అంకేపల్లి రమణారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గురిజాల పోలయ్య ఎస్సీ నాయకులు గురిజాల రాజేష్, గురిజాల రాజు, గురిజాల కాటయ్య, రమణయ్య, ఏడుకొండలు పాల్గొన్నారు.
👉ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ సమావేశానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ… బెస్తవారిపేట మండల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. బేస్తవారిపేట మండల అభివృద్ధికి కట్టుబడి అధికారులు అందుకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓ సూరారెడ్డి స్థానిక సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.